అగ్ని మహా పురాణము

359 - అథ కృత్సిద్ధరూపమ్ 

అగ్నిరువాచః

 కృతస్త్రిష్వని విజ్ఞేయాభావే కర్మణీ కర్తరి

 ఆజ్ఞ్యుట్ క్తింఘజోభావే యజకారత ఏవచ.

ఆచిధర్మన్యవినయ ఉత్కరః ప్రకర స్తథా

దేవోభద్రః శ్రీకరశల్యుటి రూపస్తు శోభనమ్.

క్తినివృద్ధిస్తుతిమతీ ఘఞిభావోఽథ యుచ్యపి

కారణభావనేత్యాది ఆకారేచ చికిత్సయా.

తథాతవ్యో హ్యనీయశ్చ కర్తవ్యం కరణీయకమ్

దేయం ధ్యేయంచైవ యతిణ్యతికార్యంచ కృత్యకాః.

కర్తరికాదయోజ్ఞేయా భావేకర్మణిచ క్వచిత్

గతో గ్రామ గతో గ్రామమాశ్లిష్టశ్చ గురు స్త్వయా.

శతృశానచౌ భవన్నే ధమానో భవన్త్యపి

ణ్వుల్తుఋచౌ సర్వధాతుభ్యో భావకోభ వితాతథ.

క్విబంతశ్చ స్వయంభూశ్చ భూతేలిటః క్వసుః కానచ్

బభూవివాన్సే చివాంశ్చ పేచానః శ్రద్ధధానకః.

ఆణిస్యుః కుంభకారాద్యా భూతేఽప్యుణాదయః స్మృతాః

 వాయుః పాయుశ్చ కారు: న్యహులం ఛందసిరితమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే కృదంతనీరూపణం నా మైకోన షష్ట్యధిక త్రిశతతమోఽధ్యాయః.

కుమారస్వామి చెప్పెను. కృత్ప్రత్యయములు భావకర్మ కర్త్రర్థము లందు మూడింటి యందును వచ్చును. అచ్ ల్యుట్, క్తిన్, భావమయ్, యచ్. అ, తవ్య, ఆదులు కృత్ప్రత్యయములు. అచ్ ప్రత్యయము చేర్చగా వినయః, ఉత్కరః, ప్రకరః, దేవః, భద్రః, శ్రీకరః మొదలగు రూపము సిద్ధించును. ల్యుట్ - శోభనమ్. క్తిన్ . వృద్ధి, స్తుతిః మతీ: - ఘయ్ - భావః, యుచ్ - కారణా భావనా మొదలగునవి. అ . చికిత్సా, తవ్య - కర్తవ్యమ్. ఉదాహరణము. అనీయ - కరణీయకమ్. యత్ - దేయం ధ్యేయమ్. ణ్యత్ . కార్యమ్, ఇవన్నియు కృత్య ప్రత్యయములు; క్తాదులు, క ర్థము నందు కొన్ని చోట్ల భావ కర్మార్థవం లందును చేర్చబడును. ఉదాహరణ- గ్రామః గతః, గ్రామం గతః త్వయా గురు ఆళ్లీష్ట మొదలగునవి. శతృ భవన్, కౌనచ్ - ఏధమాన, భవన్ స్త్రీ లింగములో భవ స్త్రీ అగును. అన్ని రాతువులకోశేషు స్వర్గ పాతాలాదివర్గాఃకంపెను నువుల్, తృచ్, ప్రత్యయములు వచ్చును, ఉదా: భావనః, థవితా మొదలగునవి క్విప్ - స్వయంభూః, ల్యుట్ కు భూతార్థ మున క్వసు, కొనచ్ ప్రత్యయములు చేర్చగ. బభూవివాన్, పేచిహన్ పేదాన, శ్రద్దదానక : ఇల్యాది రూపములగును, అణ్ చేర్చగా కుంభకార: మొదలగునవి సిద్ధించును. ఉనాదులు భూతార్థ ముందు కూడ వచ్చును. ఉదా:- కారః, పాయుః వాయుః ఇత్యాదులు ఛందందు ఇవి బహుళ ముగా వచ్చును.

అగ్ని మహాపురాణమున కృదంతనిరూపణమను మూడువందల యేబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.