అగ్ని మహా పురాణము

130 - అథ మణ్డలవర్ణనమ్

ఈశ్వర ఉవాచః

మణ్డలాని ప్రవక్ష్యామి చతుర్ధా విజయాయ హి

కృత్తికా చ మఘా పుష్యం పూర్వా చైవ తు ఫాల్గునీ.

విశాఖాభరణే చైవ పూర్వభాద్ర పదాతథా

ఆగ్నేయమణ్డలం భద్రే తస్య వక్ష్యామి లక్షణమ్.

యద్యత్ర చలతే వాయుర్వేష్టనం శశిసూర్యయోః

భూమికమ్పోఽథ నిర్ఘాతో గ్రహణం చన్ద్రసూర్యయో.

ధూమజ్వాలా దిశాం దాహః కేతోశ్చైవ ప్రదర్శనమ్

రక్తవృష్టితోపతాపః పాషాణపతనం తథా.

నేత్రరోగోఽతిసారశ్చ అగ్నిశ్చ ప్రబలో భవేత్

స్వల్పక్షీరా స్తథా గావః స్వల్పపుష్పఫలాద్రుమాః.

వినాశశ్చైవ సస్యానాం స్వల్పవృష్టిం వినిర్దిశేత్

చాతుర్వర్ణ్యాః ప్రపీడ్యన్తే క్షుధార్తా అఖిలా నరాః.

సైన్దవా యామునాశ్చైవ గుర్జరా భోజదాహ్లికాః

జాలన్దరం చ కాశ్మీరం సప్తమం చోత్తరాపథమ్.

దేశాశ్చైతే వినశ్యని తస్మిన్నుత్పాతదర్శనే

హస్తచిత్రా మఘా స్వాతి మృగో వాథ పునర్వసుః.

ఉత్తరా ఫల్గునీ చైవ అశ్వినీ చ తథైవ చ

యదాత్ర భవతీ కిఞ్చిద్వాయవ్యం తం వినిర్ధిశేత్.

నష్టధర్మాః ప్రజాః సర్వాహాహాభూతా విచేతసః

డాహలః కామరూపం చ కలింగః కోసల స్తథా.

అయోధ్యా చ హ్యవన్తీ చ నశ్యన్తే కోఙ్కణాస్ట్రకాః

ఆశ్లేషా చైవ మూలం తు పూర్వాషాఢా తథైవ చ.

రేవతీ వారుణం హృక్షం తథా భాద్రపదోత్తరా

యదాత్ర చలతే కిఞ్చిద్దారుణం తం వినిర్ధిశేత్.

బహుక్షీరమృతా గావో బహుపుష్పఫలా ద్రుమాః

ఆరోగ్యం తత్ర జాయేత బహుసస్యా చ మేదినీ.

పరమేశ్వరుడు చెప్పెను : ఇపుడు నేను విజయమునకై నాలుగు విధము లగు మండలములను గూర్చి చెప్పే దను. కృత్తికా-మఘా-పుష్య-పూర్వఫల్గునీ-విశాఖా-భరణీ-పూర్వభాద్రపదల మండలము ఆగ్నేయ, మండలము. దాని లక్షణము చేప్పెదను. ఈ మండలమునందు వాయుప్రకోపము వచ్చినను, నూర్యచంద్రపరివేషము కలిగినను, భూమి కంపిం చినను, దేశమునకు వివాము కలుగును. సూర్య చంద్రగ్రహణములు వచ్చినను, ధూమజ్వాల కనబడినను, దిక్కులు దహించుకొని పోవుచున్నట్లు కనబడినను, ధూమకేతువు కనబడికను, రక్తవృత్తి వచ్చినను, ఎక్కవ వేడిగా నున్నను, రాళ్ళు కురిసిన జనులక నేత్రరోగము, ఆతీసారము, ఆగ్ని భయము కలుగును. ఆవు పాలు తక్కువ ఇచ్చుడు. వృక్షములండు నలపుష్పమాలు తక్కువగా ఉండును. పంట తక్కువగును. వృక్షములు కూడ తక్కువగా ఉండును. నాల్గ వర్ణముల వారును దుఃఖితు లగుదురు. మనుష్యు లండరను ఆకలితో బాధపడుదురు, ఇట్టి ఉత్పాతములు కలిగినపుడు సింధుయమువప్రాంతములు, గుజరాతు, భోజ-బాహ్లిక-జాలంధర-కాశ్మిర-ఉత్తరాపథములు నశించిపోవును. హస్త-చిత్రా-మఘా-స్వాతి-మృగశీర్ష-పునర్వసు-ఉత్తర-ఫల్గునీ-అశ్వినీ నక్షత్రముల మండలము వాయవ్యమండలము. ఈ మండ లమునందు వెనుక చెప్పిన ఉత్పాతములు కలిగినచో ప్రజ లందరును, హాహాకారము చేయుచు, నష్ట ప్రాయు లగుదురు. డ్రాహల (త్రిపుర)-కామరూపకలింగ కోసల-అయోధ్యా-ఉజ్జయినీ-కోంక-ఆంధ్రదేశములు నష్టమగును. ఆశ్లేషా-మూల-పూర్వాషాఢా-రేవతీ-శతభిషా-ఉత్తరాభాద్రపదానక్షత్రముల మండలము వారుణమండలము. పైన చెప్పిన ఉత్పాతములు ఈ మండలమునందు ఉత్పన్న మైనచో ఆవుల పాలు, నెయ్యి వృద్ధిపొందును. వృక్షములందు ఫలపుష్పములు అధికముగా నుండును. . ప్రజలు ఆరోగ్యవంతులగుదురు. భూమి సస్యసమృద్ధముగా నుండును.

ధాన్యాని చ సమార్ఘాణి సుభిక్షం పార్థివం భవేత్

పరస్పరం నరేన్ద్రాణాం సంగ్రామో దారుణో భవేత్.

జ్యేష్ఠా చ రోహిణీ చైవ అనురాధా చ వైష్ణవమ్

ధనిష్ఠా చోత్తరాషాడా అభిజిత్సప్తమం తథా.

యదాత్ర చలతే కిఞ్చిన్మాహేన్ద్రం తం వినిర్దిశేత్

ప్రజాః సముదీతాస్తస్మిన్ సర్వరోగవివర్జితాః.

సన్ధిం కుర్వన్తి రాజానః సుభిక్షం పార్థివం శుభమ్

గ్రామస్తు ద్వివిరో జ్ఞేయో ముఖపుచ్ఛకరో మహాన్.

చన్ద్రో రాహున్తథాదిత్య ఏకరాజౌ యది స్థితః

ముఖగ్రామస్తువిజ్ఞేయో యామిత్రే పుచ్చ ఉచ్యతే.

భానోః పఞ్చదశే హ్యృక్షే యదా చరతి చన్ద్రమాః

తిథిచ్చేదే తు సంప్రాప్తే సోమగ్రామం వినిర్ధిశేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే యుద్ధజయార్జవే మణ్డలవర్ణనం నామ త్రింశదధిక శతతమోఽధ్యాయః

ధాన్యములు చౌకగా నుండును. దేశము సుభిక్షముగా నుండును. కానీ రాజుల మధ్య ఘోర సంగ్రామములు చెలరేగును. జ్యేషా-రోహిణీ.అనురాధా-శ్రవణ-ధనిష్ణా-ఉత్తరాభాద్రపదా-అభిజిత్తుల మండలము మహేంద్రమండలము. ఈ మండలమునందు పై ఉల్పాతములు సంభవించినచో ప్రజలు సౌఖ్యముతో నుందురు. రోగభయ మేమియు ఉండదు. రాజులు తమలో సంధి చేసికొందురు. రాజులకు హితకర మగునటుల సుభిక్ష మేర్పడును. ముజగ్రామ, పుచ్చ గ్రామము అని గ్రామము రెండు విధములు. చంద్ర-రాహు-సూర్యులు ఒకే రాశిలో ఉన్నపుడు ముఖగ్రామము, రాహువునుండి ఏడవ స్థానమునకు పుచ్ఛగ్రామ మని పేరు. చంద్రుడు సూర్యుడున్న నక్షత్రమునుండి పదునై దవ నక్షత్రమునకు వచ్చినపుడు, తిథిసాధనము ననుసరించి సోమగ్రామము, అనగా పూర్ణిమాతిథి అగును.

ఆగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున వివిధమండలవర్ణనమను నూటముప్పదియవ అధ్యాయము సమాప్తము.