అగ్ని మహా పురాణము

337- అథ కావ్యాది లక్షణమ్

అగ్నిగువాచః

కావ్యస్య నాటకా దేశ్చ ఆలంకారాన్వదామ్యఽథ

ధ్వనిర్వర్ణాః పదం వాక్యమిత్యేతద్వాజ్మయం మతమ్.

శాస్త్రేతిహాస వాక్యానాం త్రయంయత్ర సమాప్యతే

శాస్త్రేశబ్ద ప్రధాన త్వమితాహా సేషు నిష్ఠతా.

 అభిదాయః ప్రధానత్వాత్కావ్యం తాభ్యాం విభిద్యతే

నరత్వం దుర్లభం లోకే విద్యాతత్ర సుదుర్లభా.

కవిత్వం దుర్లభం తత్ర శ క్తిస్తత్ర చ దుర్లభా

వ్యుత్ప త్తిర్దుర్ల భాతత్ర వివేక స్తత్ర దుర్లభః.

సర్వంశాస్త్ర మవిద్వద్బిర్మృగ్యమాణం నసిధ్యతి

ఆదివర్ణా ద్వితీయాశ్చ మహాప్రాణాస్తు రీయకః

వర్గేషు వర్ణబృందం స్యాత్పదం సు ప్తిజ్ప్రభేదతః

సంక్షేపాద్వాక్య మిష్టార్థ వ్యవచ్చిన్నా పదావళీ.

ఆగ్ని దేవుడు పలికెను. కావ్య నాటక ఆలంకారాదుల స్వరూపమును చెప్పెదమ. ధ్వని, వర్ణము, పదము, వాక్యము. ఇవియే సకల పోజ్మయము. శాస్త్ర ఇతి హాస కావ్యములు ఈ వాజ్మయములో అంతర్గతములు. శాస్త్రము నందు శబ్దమునకు ప్రాధాన్యము. ఇతిహాసము లందు ఆర్డము నకు ప్రాధాన్యము. వీటిలో ఆభిధకే ప్రాధాన్యము. అందుచే కావ్యము ఈ రెండింటి కంటెను భిన్నమైనది. లోకములో నర త్వము దుర్లభము, విద్యను ఇంకను దుర్లభము. కవిత్వము ఇంకను దుర్లభం, శక్తి ఇంకను దుర్లభము. వ్యుత్పత్తి ఇంకను దుర్లభము వివేకము అన్నిటి కంటెను. దుర్లభము. ఆ విద్వాంసులు ఎంత ప్రయత్నించినను శాస్త్రము సిద్ధించదు. శాది వర్ణములు, వర్గ, ద్వితీయ చతుర్ధాక్షరములు మహా ప్రాణములు వర్ణ సము దాయము పదము సుబంతము తీజంతము యని, ఇది రెండు విధములు. ఇష్టార్థమును బోధించు పద పంక్తి వాక్యము.

కావ్యం స్పుటదలంకారం గుణవద్దోష వర్జితమ్

యోనిర్వేదశ్చ లోకశ్చ సిద్దమన్నా దయానిజమ్.

 దేవాదీనా సంస్కృతం స్యాత్ప్రాకృతం త్రివిధం నృణామ్

గద్యం పద్యంచ మిశ్రంచ కావ్యాది త్రివిధం స్మృతమ్.

అపదః పదసన్తానోగద్యం తదపిగద్యతే

చూర్ణకోత్కలికా గ్రంథివృత్త భేదాత్రి రూపకమ్.

 అల్పాల్ప విగ్రహం నాతిమృదు సందర్భనిర్బరమ్

చూర్ణకం నామతో దీర్ఘసమాసాత్కలికా భవేత్.

 భవేన్మధ్య మనందర్భం నాతికుత్సిత విగ్రహమ్

వృత్తచ్ఛాయాహరం వృత్తసంధినైత త్కిలోత్కటమ్.

అఖ్యాయికాక కథాఖండ కథాం పరికథా తథా

 కథాని కేతి మన్యన్తే గద్యకావ్యం చ పంచధా.

 కర్తృవంశ ప్రశంసా స్యాద్యత్ర గద్యేన విస్తరాత్

కన్యాహరణ సంగ్రామ విప్రలంభ విపత్తయః.

 భవ న్తియత్ర దీప్తాశ్చరితి వృత్తిప్రవృత్తయః

 ఉచ్ఛా సైశ్చ పరిచ్ఛేదో యత్రయా చూర్ణకో త్తరా.

 వక్రంవా పరవక్రంహ యత్రపాఖ్యాయి కాస్మృతా

శ్లోకైః స్వవంశం సంక్షేపాత్క విర్యత్ర ప్రశంసతి.

 ముఖ్యస్యార్ధావతారాయ భవేద్యత్ర కథా న్తరమ్

పరిచ్చేదో నయత్ర శ్యాద్భవేద్వా లంబకైః క్వచిత్.

 సాకథానామ తద్గర్భే నిబధ్నీ యాచ్చ తుష్పదీమ్

భవేత్ఖండ కథాయాసౌయాసౌ పరికథాతయోః.

 అమాత్యం సార్థకం వాపి ద్విజంవా నాయకం విదుః

స్యా త్తయోకరుణంవిద్ధి విప్రలంబ శ్చతుర్విధః.

 సమాప్యతే, తయోర్నాద్యా సౌకథా మనుధావతి

కథాఖ్యాయిక యోర్మిశ్ర భావాత్పరి కథాస్మృతా.

 భయానకం సుఖపరం గర్భేచ కరుణోరసః

ఆద్బుతోఽన్తే సుక్ ఇఫ్తార్థో నోదాత్తాసా కథానికా.  

స్పష్టమైన అలంకారములు గలది, గుణములు కలది, దోషములు లేనిది యగు వాక్యము కావ్యము. వేదములు, లోకము, కావ్య హేతువులు. సిద్ధ మంత్రముచే నిర్మించబడిన కావ్యము అయోనిజము. దేవతలకు సంస్కృత భాషను, మనుష్యులకు త్రివిధ ప్రాకృత భాషలను ప్రయోగించవలెను. గద్యము పద్యము మిశ్రమ యని, కావ్యము మూడు విధములు. పాదములు లేని పద సముదాయము గద్యము చూర్ణకము ఉత్కలికా వృ త్త గంధి యని గద్యము మూడు విధములు. చిన్నచిన్న మృదువై న మాటలున్నది చూర్ణకము. దీర్ఘ సమాసములు కలది ఉత్కలి, ఈ రెండింటికి నడుమ వున్నదియు, అత్యంత కుత్సిత విగ్రహము కానిదియు వృత్తచ్ఛాయ కలదియు యగు గద్యము వృత్త గంది. ఇది ఉత్కటకముగ నుండదు. ఆఖ్యాయికా, కథ, ఖండ కథ, పరికథ, కథానిక యని గద్య కావ్యము ఐదు విధములు. గ్రంథ కర్త యొక్క వంశ ప్రశస్తి అధికముగ నుండి కన్యాహరణ సంగ్రామ విప్రలంబ విపత్తుల వర్ణన ములతో వై దర్భాందీ రీతులు భారత్యాది వృత్తులు ప్రవృత్తులు వున్నదియు ఉచ్ఛ్వాసములను పేరు గల పరిచ్ఛేదములు కలదియు. చూర్ణక ప్రధానమును వస్త్రము గాని ఆపర వస్త్రము గాని యున్నది యగు గద్య కావ్యము ఆఖ్యాయికా. కవి దేనిలో తన వంశమును శ్లోకములలో సంక్షిప్తముగా చెప్పునో, మఠ్యార్థమును ప్రవేశ పెట్టుటకు మరియొక కథ చేర్చబడునో పరిచ్ఛేదము లుండవో, వున్నను లంబక మును పేర్లతో వుండునో యది కథ. దాని మధ్య భాగమున చతుష్పదితో బంధ రచన చేయవలెను. కథా ఖండము మాత్రమే వుద్నది ఖండ కథ. ఖండ కథా పరికథలలో, మంత్రి లేద వై శ్యుడు లేదా బ్రాహ్మణుడు నాయకుడుగా వుండును. కరుణర సము ప్రధానము. నాలుగు విధములగు విప్రలంబము వర్ణింపబడను. ఈ రెండింటిలో కథ సమాప్తి పొందదు. లేదా ఖండ కథలో కథా  శైలి ఆనుసరించబడదు. కథా ఆఖ్యాయికల లక్షణములు కలిసి యున్నది పరికథా. ప్రారంభమున భయానకము, మధ్య యందు కరుణము, అంతమున ఆద్భుతము వుండునది కథానిక. ఇది ఉదాత్తమైనది కాదు.

పద్యం చతుష్పదీతచ్చ వృత్తం జాతిరితిత్రిధా

వృత్తమక్షర సంఖ్యే యముక్తం తత్కృతి శేషజమ్.

మాత్రాభిర్గణ నాయత్ర సాజాతిరితి కాశ్యపః

సమమర్ధ సమంవృత్తం విషమం వైంగులంత్రిదా.

సావిద్యానౌ స్తితీర్షూణాం గభీరం కావ్యసాగరమ్

 మహాకావ్యం కలాపశ్చ పర్యాబంధో విశేషకమ్.

కులకం ముక్తకంకేశ ఇతిపద్య కుటుంబకమ్

సర్గ బంధో మహాకావ్య మారబ్దం సంస్కృతేనయత్.

 తాదాత్మ్య మజహత్తత్ర తత్సమం నాతి దుష్యతి

ఇతిహాస కథోద్భూత మీతరద్వా సదాశ్రయమ్.

 మంత్రదూత ప్రయాణాజి నియతం నాతి విస్తరమ్

శక్వర్యాతి జగత్యాతి శక్వర్యాత్రిష్టుభాతథా.

 పుష్పితాగ్రాది భిర్వక్రాభి జనై శ్చారుభిః సమైః

ముక్తాతు భిన్న వృత్తాన్తా నాతి సంక్షిప్తసర్గకమ్.

అతిశర్క రికాష్టిభ్యా మేక సంకీర్ణకైః పరః

మా తయాప్యపరః సర్గః పాళ స్త్యేషుచ పశ్చిమః.

 కల్పోఽతి నిందిత స్తస్మి న్విశేషానాదరః సతామ్

నగరార్ణవ శైలర్తు చంద్రార్కాశ్రమ పాదపైః.

ఉద్యాన సలిలక్రీడా మధుపానరతోత్పవైః

దూతీవచ విన్యా నైరసతీ చరితాద్భుతైః.

తమసా మరుతాప్యన్యై ర్విధావైరతి నిర్భరైః

సర్వవృత్తి ప్రవృత్తంచ సర్వభావ ప్రభావితమ్.

సర్వరీతీర సైః పుష్టం పుష్టం గుణ విభూషణైః

 ఆతఏవ మహాకావ్యం తత్కర్తాచ మహాకవిః.

చతుష్పది యనగా పద్యము. యది వృత్తయు, జాతి యని రెండు విధములు. అక్షర సంఖ్యా నియమము వున్నది వృత్తము. యిది ఉక్థము కృతి శేషజము యని రెండు విధములు. మాత్రాగణన వున్నది జాతీ యని కాశ్యపుడు చెప్పెను. పింగళుని ప్రకారము సమము, అర్ధ సమము, విషమము యని వృత్తము మూడు విధములు. కావ్య సముద్రమును దాట గోరు వారికి ఛందో విద్య నౌక వంటిది. మహా కావ్యము, కలాపము, పర్యాయ బంధము, విశేషకము, కుంకము, ముక్తకము కోశము ఇవన్నియు పద్య సముదాయములే. సర్గలలో విథ కమే సంస్కృతములో రచింపబడినది మహా కావ్యము. మహా కావ్య స్వరూపమును విడువక దాని వలె మరియొక విధమైన రచన చేసినను దోషము లేదు. ఇతిహాస కథను గ్రహించి గాని, మరియొక్క ఉత్తమ కథను గ్రహించి గాని మహా కావ్యము రచింపబడును. మంత్రము దూత ప్రయాణము యుద్ధము మొదలైనవి అచ్చట అచ్చట వర్ణింపబడును. అధిక విసృతము కాకూడదు. శక్వరి అతశక్వరి, అతజగతి, త్రిష్టప్ పుష్పితాగ్ర, వస్త్రము మొదలగు సమవృత్త ఛందస్సులను ప్రయోగించవలెను. సర్గల ఆంతమున ఛందస్సు మార్చవలెను. సర్గలు చాల సంక్షిప్తముగా నుండకూడదు. ఒక సర్గ అతశక్వరి, అష్టి ఛందస్సులతోను, మరియొక సర్గ మాత్రా ఛందస్సు లతోను సంకీర్ణమై యుండవలెను. రాబోవు సర్గ పూర్వ సర్గ కంటే ఉత్తమముగా నుండవలెను. కల్పము చాలా నిందితము సత్పురుషులకు వాని యందు ఆదరము వుండదు. న, గర, సముద్ర పర్వత, ఋతు, చంద్ర సూర్య, ఆశ్రమ, వృక్ష , ఉద్యాద, జలక్రీడ, మధుపాన, రతోత్సవ, దూతి వచన, కులటా చరిత్రాదుల అద్భుత వర్ణనలతో కావ్యము నిండి యుండుమ. అంధకారము వాయువు, ఇతర రతి విభావములు వర్ణింపబడును. అన్ని విధములగు వృత్తులు ప్రయోగింప బడును. అన్ని భావములచే ప్రభావితమై యుండును. సకల రీతులు సకల రసములు గుణములు అలంకారములు. దీనిని పరిపుష్టము చేయును. ఈ విశేషములుండుట చేతనే ఇది మహా కావ్యము. దానిని రచించిన వాడు మహా కవి.

వాగ్వైదగ్ధ్య ప్రధానేఽపి రసఏవాత్రా జీవితమ్

పృథక్ప్రయత్న నిర్వర్త్యం వాగ్వక్రిమ్ణిరసాద్వపుః.

చతుర్వర్గఫలం విష్వగ్యాఖ్యాతం నాయకాఖ్యయా

 సమానవృత్తి నిర్వ్యూఢః కౌశికీవృత్తి కోమలః.

 కలాపోఽత్ర ప్రవాసః ప్రాగనురాగాహ్వయోరసః

సవి శేషకం చ ప్రాప్త్యాది సంస్కృతేనేత రేణచ.

 శ్లోకైరనేకైః కులకం స్యాత్సం దానితకానితత్

ముక్తకం శ్లోక ఏకైకశ్చ మత్కారక్షమః సతామ్.

 సూక్తిభిః కవిసింహానాం సుందరీభిః సమన్వితః

కోశో బ్రహ్మ పరిచ్చిన్నః సవిదగ్ధాయరోచతే.

 ఆభాసోపమశక్తిశ్చ సర్గే యద్బిన్న వృత్తయా

మిశ్రం వపురితి ఖ్యాతం ప్రకిర్ణమితి చద్విధా.

శ్రవ్యం చైవాభి నేయంచ ప్రకీర్ణం సకలోక్తిభిః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే కావ్యాది లక్షణ వర్ణనం నామ సప్తత్రింశదధిక త్రిశతతమోఽధ్యాయః.

మహా కావ్యమునందు ఉక్తివై చిత్త్ర్యమునకు ప్రాధాన్యమున్న ను రసమే దాని జీవనము కావ్యస్వరూపమువచో వక్రత్వము ఉన్నను ప్రయత్న పూర్వకముగ రసమున పోషించుటచే సిద్ధించును. మహాకావ్య ఫలము చతుర్వర్గ ప్రాప్తి దీనికి నాయకుని పేరుతో పేరు పెట్టవలెను. సమానమైన వృత్తుల, కూర్చవలెను. కైశికి వృత్తిచే కావ్యము కోమల ముగా నుండును. ప్రవాస వర్ణనమున్న కావ్యము కలాపము దానిలో పూర్వానురాగమను శృంగారముండును. సంస్కృతము లేదా ప్రాకృతముతో పాప్త్యాదులను వర్ణించినచో విశేషకము అనేక శ్లోకములకు ఒకే ఆశ్వయమున్న చో కులకము, సందారితకము యని పేరు. ఒక్కొక్క శ్లోకము స్వతంత్రార్థకమైనచో ముక్తకము. యది సత్పురుషులకు చమత్కారము కల్గించవలెను. మహాకవులు ఉత్తమ సూక్తులు కూర్చినది కోశము. యది బ్రహ్మవలె. అపరిచ్చిన్న రసభరితమై సహృదయు లకు రుచికరముగ నుండును. సర్గలో వేరువేరు వృత్తములను ఉపయోగించుట ఆభాసోపమ శక్తి యది మిశ్రమ ప్రకీర్ణము యని రెండు విధములు. శ్రవ్య ఆభినేయముల రెండు లక్షణములును వున్నది మిశ్రము. సకలోక్తుల తో కూడినది ప్రకీర్ణము.

ఆగ్ని మహాపురాణమున కావ్యాది లక్ష్మణ వర్ణనయను మూడువందల ముప్పదియేడవ ఆధ్యాయము సమాప్తము.