అగ్ని మహా పురాణము

113 - అధ నర్మదాదిమాహాత్మ్యమ్

ఆగ్ని రువాచః-

నర్మదాదిక మాహాత్మ్యం వక్ష్యేఒహం నర్మదాం పరాఒ

సద్యః పునాతి గాజ్గేయం దర్శనాద్వారీ నార్మదష్.

విస్తరాద్యోజనశతం యోజనద్వయ మాయతా

షష్టిస్టీర్త సహస్రాణి షష్టికోట స్తథాపరా.

పర్వతస్య సమక్షాత్తు తిష్ఠన్యమరకంట కే

కావేరీ సంగమం పుణ్యం శ్రీపర్వతమతః శృణు.

గౌరీ శ్రీరూపిణీ చేపే తపస్తామబ్రవీద్దరిః

అవాప్స్యసి త్వమధ్యాత్మ నామ్నా శ్రీ పర్వతస్తవ.

సమన్తోద్యోజనళతం మహాపుణ్యం భవిష్యతి

ఆత్ర దానం తపో జప్యం శ్రాద్ధం సర్వమథాక్షయమ్.

మరణం శివలోకాయ సర్వదం తీర్థముత్తమమ్

హరోత్ర క్రీడతే దేవ్యా హిరణ్యకశిపు స్తదా.

తపస్తప్త్వా బలీ చాభూన్మునయః సిద్ధిమాప్నువన్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నర్మదాశ్రీపర్వతాదిమాహాత్మ్యం నామ త్రయోదశాధిక శతతమోఽధ్యాయః.

అగ్ని దేవుడు పలికేను : ఇపుడు నర్మదాదిమాహార్మ్యమును చేప్పెదను. నర్మద శ్రేష్ట మైన తీర్థము. గంగా జలము స్పర్శచే వెంటనే పవిత్రింపచేయును. కాని నర్మద డర్శనమాత్రము చేతనే పవిత్రింపచేయును. నర్మదాతీర్థము నూరు యోజనముల పొడవు, రెండు యోజనముల వెడల్పు ఉన్నది. అమరకంటతక పర్వతము నలువైపుల నర్మదానదికి సంబంధించిన ఆరువదికోట్ల అరువదివేల తీర్థములున్నవి. కావేరీసంగమతీర్థము చాల పవిత్ర మైనది. ఇపుడు శ్రీపర్వత మాహాత్మ్యమును చెప్పెదను. ఒకమారు గౌరి శ్రీదేవిరూపమ ధరించి గొప్పతపస్సు చేసెను. దానిచే ప్రసన్ను డైన శ్రీహరి ఆమెకు వరము లిచ్చుచు ఇట్లుచేప్పెను. దేవీ! నీకు ఆధ్యాత్మజ్ఞానము లభించును. ఈ పర్వతము శ్రీపర్వతమను పేర విఖ్యాతి నొందును. దీని నలువైపుల నాలుగు వేల యోజనముల ప్రదేశము చాల పవిత్రమగును. ఇచట చేసిన దాన తపో-జవ-శ్రాద్దములు అక్షయఫలము లగును. ఈ ఉత్తమతీర్థము అన్ని యు ఇచ్చును. ఇచట మరణించువారికి శివలోక ప్రాప్తి కలుగును. ఈ పర్వతముపై శివుడు సర్వదా పార్వతితో క్రీడించుచుండును, హిరణ్యకశిపుడు ఇచటనే తపస్సు చేసి చాల బలవంతుడయ్యెను. మునులు గూడ ఇచట తపస్సు చేసి సిద్ధి పొందిరి.

అగ్ని మహాపురాణమునందు నర్మదాదిమాహాత్మ్యవర్ణన మన నూటపదమూడవ అధ్యాయము సమాప్తము.