నారద ఉవాచః
రాజ్యన్థం రాఘవం జగ్మురగస్త్యాద్యః సుపూజితాః ।
ఋషయ ఊచుః :
ధన్యస్త్వం విజయీ యస్మాదీన్ద్రజిద్వినిపాతితః.
నారదుడు పలికెను. రాజ్యము చేయుచున్న రామునివద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్లిరి. ఋషులు ఇట్లు పలికిరి- నీవు ఇంద్రజిత్తును సంహరించితివి. ఈ విధముగ విజయవంతుడవైన నీవు ధన్యుడవు.
బ్రహ్మాత్మజః పులస్త్యోభూద్విశ్రవా స్తస్య కైకసీ ।
పుష్పోత్కటాఽభూత్ప్రథమా తత్పుత్రోఽభూద్దనేశ్వరః.
కై కస్యాం రావణో జజ్ఞే వింశద్బాహుద్దశాననః ।
తవసా బ్రహ్మదత్తేన వరేణ జితదైవతః.
కుమ్భకర్ణః సనిద్రోఽభూర్ధర్మిష్ఠోఽభూద్విభీషణః ।
స్వసా శూర్పణఖా తేషాం రావణాన్మేమనాదకః.
ఇన్ద్రం జిత్వేన్ద్రజిచ్చాభూద్రావణాదధికో బలీ ।
హతన్త్వయా లక్ష్మణేన దేవాదేః క్షేమమిచ్ఛతా.
బ్రహ్మకు పులస్త్యుడను కుమారుడు కలిగెను. ఆతని కుమారుడు విశ్రవసుడు. అతని భార్య కైకసి. ఆతని ప్రథమ భార్య పుష్పోద్భవ. పెద్దదైన పుష్పోదృవకు కుబేరుడు పుత్రుడుగ జనించెను. కైకసికి ఇరువది బాహువులును, పదిముఖము లును గల రావణుడు పుట్టెను. ఆతడు బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతల నందరిని జయించెను. నిద్రపరవశుడైన కుంభకర్ణుడును, ధార్మికుడైన విభీషణుడును పుట్టిరి. వారికి కూర్పణఖ సోదరి. రావణునకు మేమనాదుడను కుమారుడు పుట్టెను. రావణుని కంటే అధిక బలవంతు డైన ఆతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తను పేరు పొందెను. దేవతాదుల షేమమునకై నీవు లక్ష్మణునిచే ఆతనిని చంపించితివి.
నారద ఉవాచః
ఇత్యుక్త్వా తే గతా విప్రా అగస్త్యాద్య నమస్కృతాః ।
దేవప్రార్థిత రామోక్తః శత్రు ఘ్నో లవణార్దనః.
అభూత్పూర్మథురా కాచిద్రమోక్తో భరతోఽవధీత్ ।
కోటిత్రయం చ శైలూషపుత్రాణాం నిశితైః శరైః.
శైలూషం దుష్టగన్దర్వం సిన్దుతీరనివాసినమ్ ।
తక్షం చ పుష్కరం పుత్రం స్థావయిత్వాఽథ దేశ యోః.
భరతోఽగాత్సశత్రు ఘ్నో రాఘవం పూజయన్ స్థితః।
రామో దుష్టాన్నిహత్యాజౌ శిష్టాన్ సంపాల్య మానవః.
ఆ అగస్త్యాదులగు బ్రాహ్మణులు ఈ విధముగ చెప్పి రామునిచే పూజితులై వెళ్లి పోయిరి. దేవతలచేత ప్రార్దింవ బడిన రాముని ఆజ్ఞచే శత్రుఘ్నుడు లవణుడను రాక్షసుని సంహరించెను. పూర్వము మథుర అను వట్టణ, మొకటి ఉండెను. రాముని ఆజ్ఞాపింపబడిన భరతుడు తీన్తములైన బాణములచే మూడు కోట్ల శైలూషపుత్రులను సంహరించెను. సిందుతీరమునందు నివసించు దుష్టగంధర్వుడైన శైలూషని కూడ చంపెను. పిమ్మట ఆ దేశములలో పుత్రులైన తకుని, పుష్కరిని పాలకులనుగా చేసి భరతుడు శత్రుఘ్న సమేతుడై వచ్చి రాముని సేవించెను. ఈ విధముగ మానవరూపుడైన రాముడు దుష్టులను యుద్ధమున సంహరించి శిష్టులను పాలించెను.
పుత్రౌ కుశలవౌ జాతౌ వాల్మీ కే రాశ్రమే వరౌ ।
లోకాపవాదాత్త్యక్తాయాం జ్ఞాతౌ సుచరిత శ్రవాత్.
రాజ్యేఽభిషిద్య బ్రహ్మాహమస్మీతి ధ్యానతత్పరః ।
దశ వర్షససాహ్రణి దశ వర్ష శతానిచ.
సజ్యం కృత్వా క్రతూన్ కృత్వా స్వర్గం దేవార్చితో యయౌ ।
సపౌరః సానుజః సీతాపుత్రో జనపదాన్వితః.
లోతావవాదముచే విడువబడిన సీతకు వాల్మీక్యాశ్రమములో జనించిన కుశలవులను, వారు చేసిన రామాయణ కథా శ్రవణమును బట్టి తెలిసికొని వాళ్ళను రాజ్యమునందు అభిషిక్తులను చేవెను. ఈ విధముగ రాముడు ఆ పరమాత్మనే నేను అను ధ్యానమునందు తత్పరుడై పది వేల సంవత్సరముల కాలము ధనస్సుచే లోకములను రక్షించుచు, అనేక యాగ ములు చేసి, దేవతలు కొనియాడ, పౌరులును, తమ్ములును వెంటరాగా స్వర్గమునకు వెళ్ళెను. సీతా పుత్రుడైన కుశుడు. రాజ్యము పొందెను.
అగ్ని రువాచః
వాల్మీకిర్నారదాచ్ఛ్రుత్వా రామాయణమకారయల్ ।
సవిస్తరం య ఏతచ్చ శృణుయాత్స దివం వ్రజేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రామాయణే ఉత్తరకాణ్డ వర్ణనం నామ ఏకాదశోఽధ్యాయః.
అగ్ని పలికెను. వాల్మీకి నారదుని నుండి విని రామాయణమును సవిస్తరముగ రచించెను. దీనిని విను వాడు న్వర్గమునకు వెళ్లును.
ఆగ్ని మహాపురాణమునందు రామాయణమున ఉత్తర కాండవర్ణనమను ఏకాదశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 11 of the Agni Purāṇa is as follows:
The chapter opens with the divine plan by which Bhagavān Kṛṣṇa descended into the prison of Mathurā as the eighth son of Vasudeva and Devakī, at the midnight hour of the Aṣṭamī tithi. Kaṃsa, the demonic king, had imprisoned the couple after receiving a prophecy that Devakī's eighth child would slay him. Bhagavān's luminous four-armed form appeared first to his parents before assuming the form of an infant. Vasudeva miraculously carried the child across the flooded Yamunā to Gokula, where he was exchanged with the daughter of Yaśodā and Nanda. The chapter describes Kṛṣṇa's childhood in Vṛndāvana — the killing of Pūtanā, Tṛṇāvarta, Śakaṭāsura — and the miracles that revealed his divine nature to those with eyes to see.