అగ్ని మహా పురాణము

341 - అధ నృత్యాదావంగకర్మ నిరూపణమ్

అగ్ని రువాచః

చేష్టావిశేష మప్యంగ ప్రత్యంగే కర్మ చానయోః

శరీరారంభ మిచ్చన్తి ప్రాయః పూర్వోఽబలాశ్రయః.

లీలావిలాసో విచ్చి త్తిర్విభ్రమం కిలకించితమ్

 మోట్టాయితం కుట్టమితం బిబ్బోకోలలితం తథా.

వికృతం క్రీడితం కేళిరితి ద్వాదశ ధై వసః

లీలేష్టజన చేష్టాను కరణం సంవృతక్షయే.

విశేషం ధర్మయనించి ద్విలాసః సద్బిరిష్యతే

హసితక్రంది తాదీనాం సంకరః కిలకించితమ్.

వికార కోఽపి బిబ్బోకో లలితం సౌకుమార్యతః

శిరః పాణిరురః పార్శ్వం కటిరంఘ్రిరి తిక్రమాత్.

అంగాని భూతలాదీని ప్రత్యంగాన్యభి జానతే

అంగ ప్రత్యంగయోః కర్మప్రయత్న జనతం వినా.

న ప్రయోగం క్వచిన్ముఖ్యం తిరశ్చీనంచ తత్క్వచిత్

ఆ కంపితం కంపితంచ ధూతం విధూత మేవచ.

పరివాహిత మాధూత మవధూత మథాఽఽచితమ్

నికుంచితం పరావృత్త ముత్క్షి ప్తం చావ్యధోగతమ్.

లలితం చేతివిజ్ఞేయం త్రయోదశ విధంశిరః

భ్రూకర్మ సప్తధాజ్ఞేయం పాతనే భ్రూకుటీ ముఖమ్.

దృష్టిస్త్రిధా రసస్థాయి సంచారి ప్రతిబంధనా

షట్ త్రింశ ద్భేద విధురా రసజాతత్ర చాష్టదా.

నవధా తారకాకర్మ భ్రమణం చలనాదికమ్

షోడా చ నాసికాజ్ఞేయానిః శ్వాసో నవధామతః.

షోడౌష్ఠకర్మకం పావం సప్తధా చిబుక క్రియా

కలుషాది సుఖం షోడా గ్రీవానవవిధాస్మతా.

అసంయుతః సంయుతశ్చ భూమ్నాహస్తః ప్రముచ్యతే

పతాక స్త్రీపతాకశ్చ తథావై కర్తరీ ముఖః.

అర్ధచందోత్క రాలశ్చ శుక తుండ స్తథైవచ

 ముష్టిశ్చ శిఖర శ్చైవ కపిత్థః ఖేటకాముఖః.

సూచ్యాస్యః వద్మకోశో హిశిరాః సమృగశీర్షగాః

కాంబూలకాల పద్మౌచ చతురభ్రమరౌ తథా.

హంసాస్య హంసపక్షౌచ సన్దంశ ముకులౌ తథా

ఊర్ణనాభస్తామ్ర చూడశ్చతుర్వింశతిరిత్యమీ.

అసంయుతకరాః ప్రోక్తాః సంయుతాస్తు త్రయోదశ

అంజలిశ్చ కపోతశ్చ కర్కటః స్వస్తికా స్తథా.

కటకోవర్ధమానశ్చా ప్యసంగో నిషధ స్తథా

దోలః పుష్పపుట శ్చైవ తథా మకర ఏవచ.

గజదంతో బహిః స్తంభో వర్ధమానోఽపరే కరాః

ఉరః పంచవిధం స్యాత్తు ఆభుగ్న నర్తనాదికమ్.

ఉదరం దురరి క్షామం ఖండం పూర్ణమితి త్రిధా

పార్శ్వయోః పంచకర్మాణి జంఘాకర్మచ పంచధా.

అనేకధా పాదకర్మ నృత్యాదౌ నాట కే స్మృతమ్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నృత్యాదావంగ కర్మ నిరూపణం

నామైక చత్వారింశ దధిక త్రిశతతమోఽధ్యాయః. 

ఆగ్ని దేవుడు పలికెను. ఇపుడు చేష్టాది విశేషమును ఆంగప్రత్యంగ ములను వాటి కర్మలను చెప్పెదను. దానిని ఆంగిక కర్మయందురు. ఇది సాధారణముగా స్త్రీ సంశ్రితము. లీలా, విలాస, విచ్ఛిత్తి, విశ్రమ, కిలి కించిత, మోట్టా యిత, కుట్టమితా, బిబ్బోక, లలిత, విహృత, క్రీడిత, కేకులుయని ఆది పండ్రెండు విధములు. ఆవృత ప్రదేశమున ఇష్టజన చేష్టను అనుకరించుట లీల. కొంచెము విశేషమును చూపించునది విలాసము. హాఫరో దనాదుల సంకరమణ కిలికిం చితము. వికారము బిబ్బోకము; సుకుమార చేష్టలలితము. శిరస్సు. హస్తములు వక్షము, పార్శ్వము కటి, పాదముయని, ఇవి క్రమముగా యంగములు. కనుబొమలు మొదలగునవి ప్రత్యంగములు. అంగ ప్రత్యంగము ప్రయత్న జనితమగు చేష్టలేకుండ ప్రయోగము ఎచ్చటను కలుగదు. కొన్ని చోట్ల ముఖ్యముగను కొన్ని చోట్ల వక్రరూపమునకు అది సాధింపబడును. ఆకం పిత, కంపిత, ధూత, విధూత పరివాహిత, ఆధూత, అవధూత, ఆచిత, నికుంచిత, పరావృత, ఉత్తిష, ఆధోగత లోలితములని శిరః కర్మ పదమూడు విధములు. కనుబొమ్మల చెష్ట ఏడు విధములు. వీటిలో భ్రుకుటి మొదలగునవి ప్రధాన ములు. రస, స్థాయి, సంచారి భావము, సంబంధమును బట్టి దృష్టి మూడు విధములు, దీనికి ముప్పది ఆరు భేదములు కూడ వుండును. అందుర సజ దృష్టి, యెనిమిది విధములు. భ్రమణ చాలనాదికమగు తార కాకర్మ తొమ్మిది విధములు. వాసికాకర్మ ఆరు విధములు. నిశ్వాసము తొమ్మిది విధములు; ఓష్ణకర్మ అరు విధములు; పాదకర్మ ఆరు విధముక్ష్; చిలుక కర్మ ఏడు విధములు; గ్రీవా కర్మ తొమ్మిది విధములు, హస్తకర్మ సాధారణముగ అసంయుతము సంయుతము, యని రెండు విధముల వుండును. పతాక త్రిపతాక, కర్తరీ ముఖ ఆర్ధ చంద్ర ఉత్కరాళ, శుక్రతుండ, ముష్టి, శిఖర, కపిత్త, కటకా ముఖ సూచ్యాస్య, పద్మకోశ, శిర, మృగ శీర్ష, కాంబోల, కాల పద్మ, చతుర, భ్రమర, హంసాస్య హంస పక్ష, సందంశ, ముకుళ, ఊర్ననాభ తామ్ర చూడములని ఆసంయుత హస్తమునకు ఇరువది నాలుగు భేదములు. అంజలి, కపోత, కర్కట, స్వస్తిక, కటక :ప్తమాన, అసంగ, నిషద, దోల, పుష్పపుట, మకర, గజదంత, భెస్తంభములు యని సంయుత హస్తమునకు పదమూడు భేదముల; సంయుత హస్తమునందు ఇంకను భేదములుండ వచ్చును. వృక్ష స్థల కర్మ ఆభుగ్న నర్త వాది భేదముచే ఐదు విధములు; ఉదరకర్మ దురతి క్షామ ఖండము, పూర్ణము అని మూడు విధ ములు; పార్శ్వకర్మలు ఐదు; జంఘాకర్మలు ఐదు; నాట్యనృత్యాదులందు పాదకర్మ అనేక విధములుగా నుండును.

ఆగ్ని మహాపురాణమున నృత్యాద్యంగకర్మ నిరూపణమను మూడువందల నలుబది ఒకటవ అధ్యాయము సమాప్తము.