అగ్ని మహా పురాణము

133 - అథ నానాబలాని.

ఈశ్వర ఉవాచః-

గర్భజాతస్య వక్ష్యామి క్షేత్రాధిపస్వరూపకమ్

నాతిదీర్ఘః కృశః స్థూలఃక సమాంగో గౌర వైత్తి కః.

 రక్తాక్షో గుణవాఞ్చారో గృహే సూర్యస్య జాయతే

 సౌభాగ్యో మృదుసారశ్చ జాతశ్చన్దృగ్రహోదయే.

 దాతాధికోతిలుద్దాదీర్జాతో భూమిభువో గృహే

బుద్ధిమాన్సుభగో మానీ జాతః సౌమ్యగ్రహోదయే.

 బృహత్క్రోధశ్చ సుభగో జాతో గురుగృహే నరః

 త్యాగీ భోగీ చ సుభగో జాతో భృగుగ్రహోదయే.

 బుద్ధిమాన్సుభగో మానీ జాతశ్చార్కిగృహే నరః

సౌమ్యలగ్నే ఈ సౌమ్యః స్యాత్క్రూరః స్యాత్క్రూరలగ్న కే.

దశాఫలం గౌరి వక్ష్యే నామరాశౌ తు సంస్థితమ్

గవాళ్వధనధాన్యాని రాజ్యశ్రీర్విపులా భవేత్.

పునర్ధనాగమశ్చాపి దళాయాం భాస్కరస్య తు

 దివ్యస్త్రీదా చన్దృదళ భూమిలాథః సుఖం కుజే.

 భూమిర్డాన్యం ధనం బౌధే గజాళ్వాదిధనం గురౌ

ఖాద్యపానధనం శుక్రే శనౌ వ్యాధ్యాధిసంయుతః.

 స్నాన సేవాదినా ధ్యానం వాణిజ్యం రాహుదర్శనే

వామనాడీ ప్రవాహే స్యాన్నామ చేద్విషమాక్షరమ్.

 తదా జయతి సంగ్రామేశ నిభౌమస సైంహికాః

దక్షనాడీ ప్రవా హేర్కే వాణిజ్యేచైవ నిష్పలా.

 సంగ్రామే జయమాప్నోతి సమనామా నరో ధ్రువమ్

అధశ్చారే జయం విద్యా దూర్ధ్వచారే రణే మృతిమ్.

పరమేశ్వరుడు చెప్పెను : సూర్యాదిగ్రహముల రాశులందు జన్మించిన శిశువునకు క్షేత్రాధిపతిని పట్టి కలుగు ఫలము చెప్పెదను. సింహలగ్నమునందు పుట్టిన వాడు సమకాయుడు, ఒకప్పుడు కృశాంగుడు, ఒకప్పుడు స్థూలశరీరము కలవాడు, గౌరవర్ణుడు,పిత్తప్రకృతి, రక్తనేత్రుడు, గుణవంతుడు, వీర్యవంతుడు ఆగును. కర్కటలగ్నమున వుట్టినవాడు భాగ్యవంతుడు, కోమలశరీరముకలవాడు అగును. మేష వృశ్చిక జాతుడు వాతరోగి, ఆత్మంతలుబ్ధుడు అగును. మిధున-కన్యాలగ్న జాతుడు బుద్ధిమంతుడు, సుందరుడు అగును. ధను-ర్మీనలగ్న జాతుడు సుందరుడు, ఆధిక కోపవంతుడును ఆగును. మకరకుంభలగ్నజాతుడు బుద్ధిమంతుడు, సుందరుడు, మానవంతుడు అగును, సౌమ్యలగ్నమందు పుట్టినవాడు సౌమ్యస్వభావవంతు డగును. క్రూరలగ్న జాతుడు క్రూరస్వభావు డగును. గౌరీ! ఇపుడు నామరాశులనుబట్టి సూర్యాది గ్రహదశాపలము చెప్పెదను-సూర్యదశ యందు గజములు, అశ్వములు, ప్రబలరాజ్యలక్ష్మి లభించును. ధవవాప్తి కలు గును. చంద్రదశలో దివ్యస్త్రీప్రాప్తి, కుజదశలో భూమిలాభము, సుఖము కలుగును. బుధదశలో భూమిలాభముతో పాటు ధనధాన్యప్రాప్తి కూడ కలుగును. గురుదశ లో గజాశ్వధనప్రాప్తి కలుగును. శుక్రదశలో ఖాద్యాన్నము, గోదుగ్దాదిపానము ధనలాభము ఉండును. శనిదశలో నానావిధము లగు రోగములు కలుగును. రాహుదర్శనమున, అనగా గ్రహణసమయ మున స్నానాదులాచరించి ధ్యానము చేయవలెను. వాణిజ్యము చేయవలెను. ఎడమ శ్వాస ఉన్నపుడు నామాక్షరమ సంఖ్య విషమ మైనచో ఆ సమయము కుజ-శని-రాహువులకు సంబంధించినది. అపుడు యుద్ధము చేయుటచే విజయము లభిం చును. కుడి శ్వాస ఆడు నపుడు నామాక్షరసంఖ్య సమసంఖ్యయైనచో అది సూర్యుని సమయము. ఆ సమయమున వర్త కము చేయుట నిష్ఫలము. కాని ఆ సమయమున పదాతి యై యుద్ధము చేసినచో విజయము లభించును. ఏదైన వాహ నముపై ఎక్కి యుద్ధము చేసినచో మృత్యువు కలుగును.

ఓం హూం ఓం హ్రం ఓం స్ఫేఅస్త్రం మోటయ చూర్ణయ చూర్ణయ ఓం

సర్వశత్రుం మర్దయ మర్దయ ఓం హ్రూం ఓం హ్రః ఫట్.

సప్తవారం న్యసేన్మస్త్రం ధ్యాత్వాత్మానం తు భైరవమ్

 చతుర్భుజం దశభుజం వింశద్బాహ్వాత్మకం శుభమ్.

శూలఖట్వాఙ్గహ స్తం తు ఖడ్గకట్టారికోద్యతమ్

భక్షణం పర సైన్యానామాత్మ సైన్యపరాజ్ముఖమ్.

 సమ్ముఖం శత్రు సైన్యస్య శతమష్టోత్తరం జ పేత్

జపాడ్డమరుకాచ్ఛభ్డాచ్ఛస్త్రం ముక్త్వా పలాయతే.

పర సైన్యం శృణు భంగప్రయోగేణ పునర్వదే

 శ్మశానాజ్గారమాదాయ విష్ణాం చోలూక కాకయోః.

కర్పటే ప్రతిమాం లిఖ్య సాధ్యస్యైవాక్షరం యథా

 నామాథ నవధా లిఖ్య రిపోశ్చైవ యథాక్రమమ్.

  మూర్ని వక్త్రే లలాటే చ హృదయే గుహ్యపాదయోః

పృష్ఠే చ బాహుమధ్యే తు నామ వై నవధా లిఖేత్.

మోటయేద్యుద్ధకాలే తు ఉచ్చరిత్వా తు విద్యయా

 ‘ఓం హం...’ ఇత్యాది మూలో క్తమంత్రమును ఏడు పర్యాయములు వ్యాసముచేసి, నాలుగు, పది, ఇరువది భుజములు కలవాడును, కటారమును ధరించినవాడును, తన సేవకు విముఖుడై శత్రుసేనను భక్షించుచున్న వాడును, అగు భైరవుని హృదయమునందు ధ్యానించుచు, శత్రుసేన ఎదుట పై మంత్రమును నూటఎనిమిది పర్యాయములు జపించవలెను. పిదప డమరు శబ్దము చేయగా శత్రు సేన శస్త్రములు విడచి పారిపోవును. శత్రుపరాజయము కొరకై మరొక ప్రయోగము చెప్పెదను. శ్మశానమునందలి బొగ్గులను కాకి-గుడ్లగూబ రెట్టలతో కలిపి దానితో బట్టపై శత్రువు చిత్రము వ్రాసి, వాని శిరస్సు, ముఖము, లలాటము, హృదయము, గుహ్యము, పాదములు, పృష్టము, బాహువులు నడుము-వాటిపై వాని పేరు తొమ్మిది పర్యాయములు వ్రాయవలెను. ఆ బట్ట మడచి యుద్ధమునందు తన దగ్గర ఉంచుకొని పూర్వోక్తమంత్రమును జపించుటచే జయము లభించును.

తార్ఘ్యచక్రం ప్రవక్ష్యామి జయార్థం త్రిముఖాక్షరమ్.

క్షిప ఓం స్వాహా తార్ద్యాత్మా శత్రురోగవిషాదినుత్

దుష్టభూత గ్రహార్తస్య వ్యాధితస్యాతురస్య చ.

 కరోతి యాదృశం కర్మ తాదృశం సిధ్యతే ఖగాత్

స్థావరం జంగమం చైవ లూతాశ్చ కృత్రిమం విషమ్.

తత్సర్వం నాశమాయాతి సాధక స్వావలోకనాత్

పునర్ద్యాయే న్మహాతార్ష్యం ద్విపక్షం మానుషాకృతిమ్.

 ద్విభుజం వక్రచఞ్చం చ గజకూర్మధరం ప్రభుమ్

అసంఖ్యోరగపాదస్థమాగచ్ఛ న్తం ఖమధ్యతః.

 గ్రసన్తం చైవ ఖాద న్తం తుద న్తం చాహవే రిపూన్

 చంచ్వా హతాశ్చ ద్రష్టవ్యాః కేచిత్పాదైశ్చ చూర్ణితాః.

పక్షపాతైశ్చూర్ణితాశ్చ కేచిన్నష్టా దిశో దశ

 తార్ఘ్యధ్యానాన్వితో యశ్చత్త్రెలోక్యే హ్యజయో భవేత్.

ఇపుడు, విజయప్రాప్తిసాధన మగు త్రిముఖాక్షరమహాతార్ఘ్యచక్రమును చెప్పెదను.”క్షిప ఓం స్వాహా తార్ష్వాత్మా శత్రురోగవిషాదినుత్” ఈ మంత్రము తార్ఘ్యచక్రము. ఈ మంత్రమును ఆనుష్టించుటచే దుష్టబాధ, భూతబాధ, గ్రహబాధ, అనేక విధములగు రోగములును తొలగును. ఈ గరుడమంత్రముచే ఏకార్య మైనమ సిద్ధించును. ఈ మంత్ర సాధకుని దృష్టి ప్రసరించుటచే స్థావర జంగమవిషములు, లూతావిషము, కృత్రిమవిషము అన్నియు నశించును. మహాతార్ఘ్యని ఈ విధముగా ధ్యానించవలెను, మనుష్యాకృతితో రెండు భుజములు, రెండు రెక్కలు కలిగి యుండును.ముక్కు వంక రగా నుండును. మహాబలము గల హస్తములతో ఏనుగను, తాబేలును ధరించి యుండును. పాదములందు అసంఖ్యాకము లగు సర్పములు చుట్టుకొని యుండును. ఆకాశ మార్గమున వచ్చి రణరంగమున శత్రువులను పొడిచి పొడిచి తినుచుండును. కొందరు శత్రువులు ఆతని ముట్టెచే చంపబడి యుందురు. కొందరు పంజాదెబ్బచే మరణింతురు. కొందరు రెక్కల దెబ్బకు చూర్ణము చేయబడుదురు. కొందరు పది దిక్కులకు పారిపోవుచుందురు. ఈ విధముగా ధ్యాననిష్టు డగు సాధకుడు మూడు లోకములందును ఆజేయుడగును.

పిచ్చికాం తు ప్రవక్ష్యామి మన్తృసాధనజాం క్రియామ్.

 ఓం  హ్రూం  పక్షిన్ క్షిప ఓం హూం సః మహాబల పరాక్రమ సర్వ సైన్యం భక్షయ

భక్షయ ఓం మర్ధయ ఓం చూర్ణయ చూర్ణయ ఓం విద్రావయ విద్రావయ

ఓం హూం ఖః ఓం భైరవో జ్ఞాపయతి స్వాహా

మన్తృయేద్బ్రామయేత్సైన్యం సంముఖం గజసింహయోః

 ధ్యానాద్రవాన్మర్ధయేచ్చ సింహారూఢో మృగాదికాన్.

శబ్దాద్యంగం ప్రవక్ష్యామి దూరం మ శ్రేణ బోధయేత్ !

 మాతృణాం చరుకం దద్యాత్కాలరాత్రా విశేషతః.

శ్మశానభస్మ సంయుక్తాం మాలతీచామరీ తథా

కార్పాసమూలమాత్రం తు తేన దూరస్తు బోధయేల్.

ఓం అహే హే మ హేన్ది ఆ హే మ హేన్ది హి ఓం జహీ మసానంది

ఖాహి ఖాహి లిలి కిలి ఓం హుం ఫట్.

అరోర్నాశం దూరశబ్దాజ్ఞ ప్రయా భంగవిద్యయా

అపరాజితా చ దుస్తూరస్తాభ్యాం భజ్ఞతు తీల కేన హి.

ఓం కిలికిలి లికిలి ఇచ్ఛాకిలి భూతహాని శంఖిని

ఉమే దణ్ణహస్తే మా హేశ్వరి ఉల్కాముఖి జ్వాలాముఖి

శ జుకర్ణే శుష్కజజే ఆలమ్బు షే హర ఓం సర్వదుష్టాన్

ఖన ఓం యన్మాం నిరీక్షయేద్దేవి తాంస్తాన్ మోహయ

ఓం రుద్రస్య హృదయే స్థితా రౌద్రి సౌమ్యేన భావేన

ఆత్మరక్షాం తతః కురు స్వాహా.

బాహ్యతో మాతృ సంలిఖ్య సక లాకృతివేష్టితాః

నాగపర్రే లిఖేద్విద్యాం సర్వకామార్థసాధనామ్.

హస్తాద్యైర్గారిలా పూర్వం బ్రహ్మరుదైన విష్ణుభిః

గురుసజ్జామకాలే తు విద్యయా రక్షితాః సురా.

రక్షయా నారసింహ్యా చ భైరవ్యా శ క్తిరూపయా

సర్వే త్రైలోక్యమోహిన్యా గౌర్యా దేవాసురే రణే.

ఇపుడు మంత్రసాధనచే సిద్ధించు పిచ్చికాక్రియను గూర్చి చెప్పెదను. “ఓం హూం పక్షిన్...... స్వాహా” అను (మూలోక) పిచ్ఛికామంత్రమును చంద్రగ్రహణమునందు జపించి సిద్ధింపచేసికొనిన సాధకుడు యుద్ధమునందు “గజమును, సింహమును గూడ ఎదిరించగలడు. మంత్రధ్యానముచే శత్రువులను, లేళ్ళను మేకలను వలె చంపగ లడు. దూరమునుండియే కేవల మంత్రోచ్చారణముచే శత్రువినాశము చేయు ఉపాయము చెప్పబడుచున్నది. కాలరాత్రియదు (ఆశ్విన శుక్లాష్టమినాడు) మాతృకలకు చరుప్రదానము చేసి శ్మశానభస్మము, మాలతీపుష్పములు, చామరి, పత్తి చెట్టువేరు వాటితో దూరమునుండియే శత్రువును సంబోధించవలెను. ఓం ఆహే హుంఫట్” అనునది సంబోధించు మంత్రము. ఈ భంగవిద్యను జపించుటచేతను, దూరమునుండియే ధ్వని చేయుట చేతను, అపరాజిత, ధత్తూరము వీటి రసము కలిపి తిలకము ధరించుట చేతను శత్రువులు నశింతురు. “ఓం కిలి కిలి...... కురుస్వాహా” అను (మూలోక్త మగు) సర్వకార్యార్థసాధకమంత్రమును భూర్జపత్రముపై వృత్తాకారముగ వ్రాసి, బహ్భూగమున మాతృకలను వ్రాయవలెను. ఈ విద్యను మొదట బ్రహ్మ విష్ణుమహేంద్రాదులు హస్తాదులందు ధరించిరి. ఈ విద్య ద్వారా బృహస్పతి దేవాసురసంగ్రామమునందు దేవతలను రక్షించేను. రక్షారూపిణియు, వారసింహియు, శక్తి రూపిణియు, భైరవియు, త్రైలోక్యమోహినియు అగు గౌరి కూడ దేవాసురనంగామమునందు దేవతలను రక్షించేను.

బీజసంపుటితం నామ కర్ణికాయాం దలేషు చ

పూజాక్రమేణ చాడ్డాని రక్షాయ నం స్మృతం శుభే.

మృత్యుజ్ఞయం ప్రవక్ష్యామి నామసంస్కారమధ్యగమ్

కలాభిర్వేషితం పశ్చాత్సకారేణ నిబోధితమ్.

జకారం బిన్దుసంయుక్తం ఓంకా రేణ సమన్వితమ్

ధకారోదర మధ్యస్థం పకారేణ నిబోధితమ్.

చన్దసంపుటమధ్యస్థం సర్వదుష్టవిమర్దకమ్

ఆథవా కర్ణికాయాం చ లిఖేన్నామ చ కారణమ్.

పూర్వే దలే తథోడ్కారం స్వద మే చోత్తరం లిఖేత్

ఆగ్నేయ్యాదౌ చ హూంకారం దలే షోడశ కే స్వరాన్.

చతుస్రాంశోద్దలే కాద్యాన్ బా హ్యే మనం చ మృత్యుజిత్

లిఖేద్వై భూర్జపత్రే తు రోచనాకుంకు మేన చ

కర్పూర చన్దనాభ్యాం చ శ్వేతసూత్రేణ వేష్టయేత్

సిళ్ల కేన పరిచ్ఛాద్య కలశోపరి పూజయేత్ .

య నస్య ధారణాద్రోగాః శామ్య స్తి రిపవో మృతిః

విద్యాం తు ఖేలలీం వక్ష్యే విప్రయోగమృతేర్ఘ రామ్.

వాతరే వితరే బిడాలముఖి ఇస్త్రాపుత్రి ఉద్బవో వాయుదేవేన లీలి ఆకి హాజా మయి వాహ ఇత్యాది  దుఃఖనిత్యకణోచ్చెర్ముహూర్తాన్వయా అహ మాం యస్మహ ముపాడి ఓం ఖేలఖి స్వాహా నవదుర్గా సప్తజప్తాన్ముఖ స్తమ్భో ముఖస్థితాత్!

ఓం చణ్ణి ఓం హూం ఫట్ స్వాహా

గృహీత్వా సప్త జప్తం తు ఖడ్గయుద్ధోపరాజితః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయ యుద్ధజయార్ణవే నానాబలనిరూపణం నామ త్రయస్త్రింశదధిక శతతమోధ్యాయః.

అష్టదల కమలమా కర్ణికయందును, దలములందును గౌరిబీజమతో (హ్రీం) సంపుటిత మైన తన పేరు వ్రాయ వలెను. పర్వదిక్కునం దున్న ప్రథమాండలములపై పూజానుసారము గౌరి అంగదేవతల న్యాసము చేయవలెను. ఈ విధముగా వ్రాయగా రమంత్రము ఏర్పడును. ఈ సంస్కారముల మధ్య సకలకలాపరివేష్టితము, సకారముచే ప్రబోధితమ అగు మృత్యుంజయమంత్రమును చెప్పెదను. ముందుగా ఓంకారము వ్రాసి, పిదప బిందుయుక్త మగు జకారము, వ్రాయవలెను, పిదప గర్భమున వకారమ వ్రాసి దానిని చంద్రబిందువుచే అంకితము చేయవలెను. అనగా “ఓం జం ధ్వం” అను మంత్రము ఉష్ణు లందరిని నశింపచేయును. గోరోచనా కుంకుమలతో గాని, మలయగిరి చందన- కర్పూరములతో గాని తగ్గ పత్రమపై గీసిన చతుర్థల కమల కర్ణికయందు తన పేరు వ్రాసి, నాలుగు దలముల పై ఓంకారము వ్రాయవలేను. ఆగ్నేయాది కోణములందు హూంకారము వ్రాయవలెను. దాని పై పదునారు దళముల కమలము వ్రాయవలెను. దాని దలములపై అకారాది షోడశస్వరములు వ్రాయవలెను. దాని దలములపై ముప్పదినాల్గు దళముల కమలము నిర్మించవలెను. దాని దలమలపై ‘క నుండి క్ష’ వరకు అక్షరములు వ్రాసి, ఆ యంత్రమును శ్వేతసూత్రముచే చుట్టబెట్టి, పట్టు బట్టతో కప్పి, కలశపై స్థాపించి హజించవలెను. ఈ యంత్రమును ధరించుటచే సకల రోగములు శాంతించును. శత్రువులు నశింతురు. ఇపుడు వియోగమునందు కలుగు మృత్యువును నివారించు 'ఖేలలీకి విద్యను చెప్పెదను. “ఓంవాతరే......ఓంస్వాహా” అను (మూలోక) మంత్రమును నవరాత్రులందు జపించి, సిద్ధి పొంది, యుద్ధమునందు ఏడు పర్యాయములు జపము చేయగా శత్రువులకు ముఖస్తంభన మగును. “ఓం చండి, ఓం హూంఫట్ స్వాహా” అనమంత్రమును యుద్ధసమయమునందు ఏడు పర్యాయములు జపించుటచే ఖడ్గయుద్ధమున విజయము కలుగును.

అగ్నిమహాపురాణమునందు యుద్ధజయార్ణవమున నానాబలవర్ణన మన ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.