అగ్ని మహా పురాణము

16 - అథ బుద్ధాద్యవతార కథనమ్.

అగ్ని రువాచః-

వజ్యేబుద్ధావతారం చ పఠతః శృణ్వతోర్ధదమ్

పురా దై వాసు యుద్ధే దైత్యైర్దేవాః పరాజితాః.

రక్ష రమేతి శరణం వదన్తో జగ్ము రీశ్వరమ్

మాయామోహస్వరూపో సౌ శుద్దోదనసుతోభవత్.

మోహయామాస దైత్యాంస్తాంస్త్యాజితా వేదధర్మకమ్

తే చ బౌద్దా బభూవుకి తేభ్యోన్యే వేద వర్జితాః.

ఆర్హత సోభవత్ప్చ దాక్షతానక రోత్పరాన్

ఏవం పాషణ్డినో జాతా వేదధర్మాదివర్జితాః.

అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్దము జరిగెను. ఆ యుద్దమున పరాజితు లైన దేవతలు ఊరడింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. అపుడు మాయా మోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్దోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచు నట్లు చేసెను. వారందరును బౌద్దు లైరి. ఆ పరమేశ్వరుడే అర్హ తుడై , మిగిలిన వేద వర్ణితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.

 నారకార్హం కర్మ చక్రుర్గ్రహిష్య న్యధమాదపి

సర్వే కలియుగా నే తు భవిష్యత్తి చ సజ్కరా:.

దస్యవః శీలహీనాశ్చ వేదో వాజసనేయకః

దశ పఞ్చ చ శాఖా వై ప్రమాణంను భవిష్యతి.

వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును ఆధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునై దు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు.

ధర్మకఞ్చుకసంవీతా ఆధర్మరుచయ స్తథా

మానుషాన్ భక్షయిష్య ని మ్లేచ్చా పార్థివరూపిణః.

ధర్మమను చొక్కా తొడిగికొనిన మ్లేచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను లంచగలరు. (పీడించగలరు.)

కల్కీ విష్ణుయశఃపుత్రో యాజ్ఞవల్క్యపురోహితః

ఉత్సాదయిష్యతి మ్లేచ్ఛాన్ గృహీతాస్త్రః కృతాయుధః.

విష్ణుయరని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు వురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి మ్లేచ్ఛులను నశింపజేయును.

స్థాయిష్యతి మర్యాదాం చాతుర్వర్ణో యథోచితామ్

 ఆ శ్రమేషు చ సర్వేషు ప్రజాః సద్ధర్మవర్త్మని.

నాలుగు వర్ణములందు తగిన కట్టుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆక్రమములందును, నద్ధర్మమార్గము నందును నిలుపగలడు.

కల్కిరూపం పరిత్యజ్య హరికి స్వర్గం గమిష్యతి

తతః కృతయుగం నామ పురావత్సంభవిష్యతీ.

విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లెను. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును.

వర్ణాశ్రమాశ్చ ధర్మేషు స్వేషు స్థాస్య ని స త్తమ

ఏవం సర్వేషు కల్పేషు సర్వమన్వన్తరేమ చ.

ఆవతారా అసంఖ్యా తో అతీతాసాగరాదయః

విష్ణోర్దశావతారాఖాన్యః పఠేచ్ఛృణుయాన్నరు.

సోవాప్తకామో విమలకి సకులః స్వర్గమాప్నుయాత్

ధర్మాధర్మవ్యవస్థాన మేవం వై కురుతే హరిః.

అవతీర్ణశ్చ స గతః సర్గాదే కారణం హరిః

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే బుద్ధకల్క్యవతారవర్ణనం నామ షోడశోఽధ్యాయః.

ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును. ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. గడచినవి, రానున్న వి అవతారములు ఎన్ని యో లెక్కకు మించి ఉన్న వి. విష్ణు దశావతారములను పఠించినవాడును, వినినవాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మవ్యవస్థ చేయు చుండును. సృష్ట్యాదులకు కారణమైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను.

ఆగ్ని మహాపురాణమున బుద్దకల్క్యవతారవర్ణన మను షోడశోఽధ్యాయము సమాప్తము.