పుష్కర ఉవాచః
భృత్యః కుర్యాత్తు రాజాజ్ఞాం శిష్యవత్సచ్ఛ్రియః పతేః ।
నక్షిపేద్వచనం రాజ్ఞోహ్యనుకూలం ప్రియంవదేత్.
రహోగతస్య వక్తవ్యమప్రియం యద్ధితం భవేత్ ।
ననియుక్తో హరేద్విత్తం నో పేక్షేత్రస్యమానకమ్.
రాజ్ఞశ్చ న తథా కార్యం దేశ భాషావిచేష్టితమ్ ।
అంతఃపుర చరాధ్యక్షో వైరభూతైర్నిరాకృతైః .
సంసర్గం న వ్రజేద్భృత్యోరాజ్ఞో గుహ్యం చగోపయేత్ ।
ప్రదర్శ్య కౌశలం కించిద్రాజానం తు విషయేత్ .
రాజ్ఞా యచ్ఛ్రావితం గుహ్యం న తల్లకే ప్రకాశ యేత్ ।
ఆజ్ఞాప్యమానే వాన్యస్మిన్ కింక రోమీతివావదేత్.
వస్త్రం రత్నమలంకారం రాజ్ఞాదత్తం చధారయేత్ ।
నానిర్దిష్టోద్వారివి శేన్నాయోగ్యే భువిరాజదృక్.
జృంభాం నిష్ఠీవనం కాసం కోపం పర్యన్తికాశ్రయమ్।
భ్రుకుటీం వాత ముద్గారం తత్సమీపే వివర్జయేత్.
స్వగుణాభ్యాపనేయుక్త్యా పరానేవ నియోజయేత్ ।
శాఠ్యం లౌల్యం సవైశున్యం నాస్తిక్యం క్షుద్రతాం తతా.
చాపల్యం చ పరిర్యాజ్యం నిత్యం రాజానుజీవినా ।
శ్రుతేన విద్యాశిల్పైశ్చ సంయోజ్యాత్మానమాత్మనా.
రాజసేవాం తతః కుర్యాద్భూతయే భూతివర్ధనః ।
నమస్కార్యాః సదా చాస్య పుత్రవల్లభ మంత్రికాః.
సచివై ర్నాస్య విశ్వాసో రాజచిత్త ప్రియఞ్చరేత్ ।
త్యజేద్విరక్తంరక్తాత్తు వృత్తిమీ హేతరాజవిత్.
అపృష్టశ్చాస్య న బ్రూయాత్కామం కుర్యా త్తథాపది ।
ప్రసన్నో వాక్యసంగ్రాహీ రహస్యే నచ శఙ్గతే.
కుశలాది పరిప్రశ్నం సంప్రయచ్ఛతి చాసనమ్ ।
తత్కథా శ్రవణాద్ధృష్టో హ్యప్రియాణ్యపినన్దతే.
అల్పం దత్తం ప్రగృహ్ణాతి న్మ రేత్కథా న్తరేష్వపి ।
ఇతి రక్తస్య కర్తవ్యం సేవా మన్యస్య వర్జయేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అనుజీవివృత్తం నామైక వింశత్యధిక ద్విశతతమోధ్యాయః.
పుష్కరుడు పలికెను : భృత్యుడు రాజాజ్ఞను, శీఘ్యడు గుర్వాజ్ఞను పాలించినట్లును. పతివ్రత భర్త ఆజ్ఞ పాలించినట్లును పాలించవలెను. రాజు మాటలను ఎన్నడును వ్యతిరేకించక సర్వదా అతనికి అనుకూలమగు మాటలు చెప్పవలెను. ఏదైన రాజునకు హితకరము. కాని అతనికి ఆప్రియము ఆయిన విషయము చెప్పవలసి వచ్చినపుడు అతనికి రహస్యముగా చెప్పవలెను. ధనాదాయమునకు సంబంధించిన కార్యమునందు నియుక్తుడే నవాడు రాజధనమును అపహరింప కూడదు. రాజసన్మానమును ఉపేక్షింపగూడదు. రాజును మాటలలోగాని, చేష్టలలోగాని, వేషభూషణాదులలో గాని అనుకరింపరాదు. అంతఃపుర సేనాధ్యక్షుడు రాజుతో వైరము కలవారితో కాని, అవమానపూర్వకంగా రాజాస్థానమునుండి వెడలగొట్టబడిన వారితోగాని కలిసిమెలసి ఉండరాదు. రాజరహస్యములను భృత్యుడెన్నడును ఇతరులకు చెప్పరాదు. తనకున్న ఏదోఒక నేర్పును చూపి రాజును సంతుష్టుని చేయవలెను. రాజు తనకేదైన రహస్యవిషయము చెప్పినచో అది ఇతరులకు చెప్పరాదు. రాజు మరెవ్వరికైన పని చెప్పదలచుచున్న పుడు తావే లేచి “మహారాజా! ఏమి చేయవలెనో సెలవిమ్మ, నేను చేసెదను” అని ముందుకు రావలెను. బహూకరించిన వస్త్రాలంకారాదులను సర్వదాధరించు చుండవలెను. రాజాజ్ఞ లేనిదే ద్వాదమునందుగాని, రాజుదృష్టిపడుటకు అవకాశముండు మరొక స్థానమునందుగాని కూర్చుండగూడదు. రాజసమీపమున ఆవులింత, ఉమ్మి వేయుట, దగ్గుట, కోపమప్రకటించుట, మంచముపై కూర్చుండుట, కనుబొమ్మలు విరచుట. ఆపానవాయువు విడచుట, త్రేన్చుట మొదలగు పనులు చేయరాదు. రాజు సమక్షమున తన గుణములను ఇతరుల ద్వారా వర్ణింపచేయవలెను. శఠత్వము (రహస్యముగా అపకారము చేయుట), దూళ, చెవికొరకుట, నాస్తికత్వము, నీచత్వము చాపల్యము మొదలగు దోషములను రాజ సేవకుడు సర్వథా పరిత్య శించవలెను. ప్రయత్నపూర్వకముగా వేద విద్యా శిల్పకలాదులలో ముందుగా ప్రావీణ్యము సంపాదించుకొని, పిమ్మట ధనాభివృద్ధి కొరకై రాజసేవానియుక్తి సంపాదించుకొనవలెను. రాజునకు ఇష్టుడైన వానికిని, అతని పుత్రురునుచు తులమును నమస్కరించుచుండవలెను. మంత్రుల దగ్గర ఉన్నంతమాత్రముచే రాజునకు తన పై విశ్వాసము కలుగదు. అందుచే అతని మనస్సుకు అనుకూలములగ కార్యములు సర్వదా చేయుచుండవలెను. రాజు స్వభావమును బాగుగా గుర్తించి ఆతనికి తనపై సదభిప్రాయము లేనిచో అతనిని విడచి, తనను ఆదరించు మరొక రాజును ఆశ్రయించవలెను. అడగకుండ రాజుకు ఏమియు చెప్పరాదు. కాని ఆపత్సమయమునందు మాత్రము చెప్పవచ్చును. రాజు ప్రసన్నుడై నచో వినీతుడు సేవకుని మాట విని ఆతని ప్రార్థనను అంగీకరించును ప్రేమపాత్రుడైన సేవకు అంతఃపురాని రహస్యస్థానములందు కనబడినను రాజు ఆతని విషయమున శంకించడు. అతడు సభకు వచ్చినపుడు రాజు ఆతనిని కుశలప్రళ్నేలు వేసి ఆసనమిచ్చును. ఆతడు చేయు చర్చలు విని నంతోషించును. ఆతడేదైన ఆప్రియవాక్యము పలికినను దానిని చెడ్డగా తీసుకొనక ప్రసన్నుడు కూడ ఆగును. అతడిచ్చిన చిన్న వస్తువును కూడ ఆవరముతో గ్రహించి, మాటలలో దానిని స్మరించుచుండును. ఈ లక్షణములను బట్టి రాజు తన పై విరక్తుడా అనురక్తుడా అను విషయమును గ్రహించి ఆనురక్తుడగు రాజును సేవించవలెను. విరక్తుడైన వానిని విడువలెను
అగ్ని మహాపురాణమునందు ‘అనుజీవివృత్తకథ’మను రెండువందల ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 221 of the Agni Purāṇa is as follows:
The sacred geography of Bhārata is surveyed, with Agni describing the pre-eminent tīrthas: Prayāga, Kāśī, Gayā, Puṣkara, and Kurukṣetra. The rivers Gaṅgā, Yamunā, Sarasvatī, Godāvarī, Narmadā, Sindhu, and Kāverī are praised as the seven sacred rivers whose mere utterance purifies. Agni teaches that tīrtha-snāna combined with dāna and japa multiplies merit manifold. The chapter emphasizes that the true tīrtha is the heart purified by bhakti and jñāna.