అగ్ని రువాచః
చతుః శతముత్కృతిః స్యాదుత్క్రుతేశ్చతుర స్త్యజేత్ ।
అభిసంఖ్యా ప్రత్యకృతిస్తాని ఛందాంసివై పృథక్ .
కృపాశ్చాతి ధృతిర్ధాత్రీ ఆత్యష్టి శ్చాష్టిరిత్యతః ।
అతిశక్వరీ శక్వరీతి ఆతిజగతీ జగత్యపి.
ఛందోఽత్ర లౌకికం స్యాచ్చ ఆర్షమాత్రైష్టు భాత్ స్స్మృతం।
త్రిష్టప్పంక్తిర్బృహతీ అనుష్టుభుష్ణి గీరితమ్ .
గాయత్రీ స్యాత్సు ప్రతిష్ఠా ప్రతిష్ఠా మధ్యయాసహ ।
అత్యుక్తాత్యుక్త ఆదిశ్చ ఏకై కాక్షర వర్జితమ్.
చతుర్బాగో భవేత్పాదో గణచ్ఛందః ప్రదర్శ్యతే ।
తావన్తః సముద్రగణాహ్యాది మధ్యా న్తసర్వగాః.
చతుర్వర్ణాః పంచగణా ఆర్యాలక్షణ ముచ్యతే ।
స్వరార్దం చార్యార్ధం స్యాదార్యాయాం విషమేణజః.
షష్ఠోజో నలపూర్వాస్యాద్ద్వితీయాది పదంనలే ।
సప్తమేఽన్తే ప్రథమాచ ద్వితీయే పంచమేనలే.
అర్ధేపదం ప్రథమాది షష్ఠపకోలఘర్భవేత్ ।
త్రిష గణేషు పాదః స్యాదార్యా పంచార్ధ కే స్మృతా.
విపులావ్యథ చపలా గురుమధ్యగతౌచ జౌ ।
ద్వితీయ చతుర్థౌ పూర్వేద చపలా ముఖపూర్వికా.
ద్వితీయే జఘన పూర్వా చపలార్యా ప్రకీర్తితా ।
ఉభయోర్మహా చపలా గీత విద్యార్ధ తుల్యకా.
అంత్యేనార్ధే నోపగితి రుద్గీతిశ్చోత్ర్కమాత్స్మృతా ।
అర్థేరక్ష గణా ఆర్యాగీతచ్ఛందోఽథ మాత్రయా.
వైతాళీయం ద్విస్వరాస్యాదాయుష్పాదే సమేనలః ।
వసవోఽన్తే వునగాశ్చ గోపుచ్చం దశకం భవేత్.
భగణాన్తా పాటలికా శేషేపరే చ పూర్వవత్ ।
సాకం షడ్ వా మిశ్రాయుక్ప్రాచ్యవృత్తిః ప్రదర్శ్యతే.
పంచమేన పూర్వసాకం తృతీయేన సహస్రయుక్ ।
ఉదీచ్యవృత్తిర్వాచ్యం స్యాద్యుగపచ్చ ప్రవర్తకమ్.
ఆయుక్చారుహాసినీ స్యాద్యుగ పచ్చాన్తికా భవేత్ ।
సప్తార్చిర్వ సవశ్చైవ మాత్రా సమక మీరితమ్.
భవేన్నల రమౌలశ్చ ద్వాదశో వనవాసికా ।
విశ్లోకః పంచమాష్టౌమో చిత్రనవమ కశ్చలః.
పరయు క్తేనోప చిత్రా పాదా కులక మిత్యుత ।
గీత్యార్యా లోప శ్చేత్సౌమ్యాలః పూర్వాజ్యోతిరీరితా.
స్యాచ్ఛిఖా విపర్యస్తార్ధా తూలికా సముదాహృతా ।
ఏకోన త్రింశద న్తేగః స్యాజ్ జ్ఞేజన సమావలా.
గుఇత్యేక గురుం సంఖ్యా వర్ణాద్దశ విపర్యయాత్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే ఛందః సారే ఏకత్రింశదధిక త్రిశతతమోఽధ్యాయః.
ఆగ్నిదేవుడు చెప్పెను. ఉత్కృతి ఛందస్సునందు నూట నాలుగు అక్షరము లుండును. ఉత్కృతి మండి నాలుగేసి అక్షరములు తగ్గించుచు పోయినచో వేరు వేరు ఛందస్సులు ఏర్పడును. అవి వేదిక ఛందసులు గాయత్రి మొదలు త్రిష్టప్ వరకువున్నవి లౌకిక ఛందస్సులు కూడ వాటి పేర్లు త్రిష్టప్ పంక్తి బృహతీ, అనుష్టప్, ఉప్టిక్, గాయత్రి యన నవి. గాయత్రిలో ఒక్కొక్క అక్షరము తగ్గినచో సుప్రతిషా ప్రతిష్టా మధ్యా, అత్యుక్తాత్యుక్తి మొదలగు ఛందస్సు లేర్పడును. ఛందస్సులో నాల్గవ భాగమునకు పాదమని పేరు. ముందు గణ ఛందస్సు చెప్పబడుచున్నది. నాలుగు లఘు అక్షరములు ఒక గణము. ఇవియైదు కొన్ని చోట్ల ఆది గురువు - మధ్య గురువు - అంత్య గురవు సర్వ గురువు - నాల్గు అక్షరములును లఘువులు వుండవచ్చును. ఇపుడు ఆర్యా లక్షణము చెప్పబడుచున్నది. ఏడున్నర గణములతో ఆర్య ఏర్పడును విషమ గణము జగణము కాకూడదు. ఆరవ గణము జగణము కావలెను. లేదా సర్వలఘువు కావలెను. సర్వ లఘువై నిపుడు ఆగణము యొక్క ద్వితీయాక్షరము నుండి పదసంజ్ఞ ఏర్పడును. ఆరవ గణము మధ్యగురువు గాని, సర్వ లఘువు కాని అయినచో, ఏడవ గణము కూడ సర్వ లఘువై వచో దాని ప్రథమాక్షరము నుండి పద సంజ్ఞా ప్రవర్తిం చును. ఉత్తరార్ధమున ఐదవ గణము సర్వ లఘువే నచో దాని ప్రథమాక్షరము నుడి పద ప్రారంభమగును. ఉత్తరార్ధ మున ఏడవ గణము ఏక మాత్ర లఘువగును పూర్వార్ధ ఉత్తరార్ధములందు మూడేసి గణములుండి వాటి తరువాత పాద విరామమైనచో ఆ ఆర్యకు పథ్యాయని పేరు. పూర్వార్ధము నందు కాని ఉత్తరార్ధమునందు కాని రెండింటి యందుకాని మూడు గణముల తరువాత పాద విరామము లేకున్నచో దానికి విపులయని పేరు. ద్వితీయ చతుర్థ గణములు గుర్వక్షర ముల మధ్య నుండి జగణము కూడ వున్నచో దానికి చపలయని పేరు. పూర్వార్ధమున చపలా లక్షణమున్నదీ ముఖ చపలా, ఉత్తరార్థమున చపలా లక్షణమున్నది జఘన చపలా, రెండింటి యందును. చపలా లక్షణమున్నది మహా చపలా ! పూర్వార్ధము వలే ఉత్తరార్ధమున్న చోగీతి ఉత్తరార్ధము పఠి పూర్వార్ధమున్న చో ఉపగీతి. పూర్వోక్త క్రమమువకు విపరీత ముగ నున్నచో ఉధ్ధతి. ఇపుడు మాత్రా ఛందస్సు చెప్పబడు చున్నది. ప్రథమ తృతీయ చరణము లంద పదునాలుగు లఘువులు, గ్వితీయ చతుర్థ చరణములందు పదహారు లఘువులు, అన్ని చరణముల అంతమునందు రగణ లఘువు, గురువు లున్నచో వైతాళీయ ఛందస్సు. దీని అంతమున ఒక గురువు అధికముగ నున్నచో యది ఔపచ్చందసిక వ. దీని చరణముల ఆంతములందు భగణము, రెండు గురువులు వున్నచో “ఆపాతాలికా” ఈ వై లాఠీ ఛందస్సు నందు చెప్పబడిన తగణాదులతో ఒక్కొక్క పాదము యొక్క ఆంతమున ఎనిమిది అకారములు, చెప్పబడినవి. వాటిని విడిచి ప్రత్యేక పాదమున మిగిలిన లకారములలో సమ ల కాగములు విషమ లకారములతో కలువకూడదు. ద్వితీయ చతుర్థ పాదము లందు ఆరు లఘువులను వరుసగా ప్రయోగించ కూడదు. తృతీయ చతుర్థ పాదములందు చతుర్థ లకారము, పంచమ లకారముతో సంయుక్తమైనచో యది ప్రాచ్యవృత్తి. ప్రథమ తృతీయ పాదములంను ద్వితీయ తృతీయ రికారములు మిశ్రితములైనచో ఉదీచ్యవృత్తి రెండు లక్షణములును ఒకే పర్యాయము ప్రవర్తించినచో యది ప్రవృత్తి కా. నాల్గు పాదములు విషమ పాదముల ననుసరించియున్నచో యది చారుహాసిని. సమపాద లక్షణమున్నచో ఆపరాంతిక ఒక్కొక్క పాదమున పదునారు లకారములుండి, పాదాంతి మాక్షరములు గురువు లైనచో యది మాత్రా సమకము. దీనిలో పండ్రెండవ లకారము స్వరూపము నందేవున్నచో యద్ వనవాసికా పంచమ అష్టమ లకారములు లఘువు లైవచో శ్లోకము తొమ్మిదది కూడ లఘువైనచో యది చిత్ర. నవమ దశమములు కలిసినచో ఉపవిత్ర మాత్రా సమకాది పంచ ఛందస్సులలో ఒక్కొక్క పాదముతో నాలుగు పాదముల ఛందన్సు ఏర్పరచినచో దానికి పాదారులకము యని పేరు. ఒక్కోక్క పాదమున పదునారేసి లఘువులుండి దేనితోను కలిసి గురువు కానిచో ఆది గీర్యార్య దీనిలోనే ఆర్ధభాగములో అన్ని మాత్రలు గురువులు, రెండవ అర్ధమున లఘువులు ఆయినచో ఆదిశిఖా. దీనికి విపర్యర్ధమైనచో తూలిక. పూర్వార్ధమున ఇరువది తొమ్మిది లకారములు, ఉత్తరార్థమున ముప్పది ఒక్కరికారములు, చివరి రెండు లఘువుల స్థానమున ఒక గురువు వున్న చో అది సమావల. “గు” యనునది ఒక గురువును చెప్పును. అక్షర సంఖ్యలో గురు సంఖ్యను తగ్గించగ మిగిలివేది లము సంఖ్య యగును.
అగ్ని మహా పురాణమున ఛందస్సారమున మూడు వందల ముప్పదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 332 of the Agni Purāṇa is as follows:
The science of giving (dāna) is enumerated, with emphasis on the mahādānas — the great gifts that carry extraordinary merit. Agni lists the canonical sixteen mahādānas: tula-puruṣa (gold equal to one's weight), hiraṇya-garbha (a golden cow), brahmaṇḍa (a golden globe), kalpavṛkṣa (a golden tree), and others. Each mahādāna is associated with a specific purāṇic narrative, a specific deity, and a specific fruit. The qualities required of the giver (śraddhā, purity, proper occasion, suitable recipient) and the disqualifications of the recipient are discussed, and the chapter closes with the principle that jñāna-dāna (gift of spiritual knowledge) surpasses all material gifts.