అగ్ని రువాచః-
రక్షాం స్వస్య పరేషాం చ వక్ష్యేతాం మార్జనాహ్వయామ్ ।
యయా విముచ్యతే దుఃఖై సుఖం చ ప్రాప్నుయాన్నరః.
ఓం నమః పరమార్థాయ పురుషాయ పరమాత్మనే।
అరూపబహురూపాయ వ్యాపినే పరమాత్మనే.
నిష్కల్మషాయ శుద్దాయ ధ్యానయోగరతాయ చ।
నమస్కృత్య ప్రవక్ష్యామి యత్త త్సిధ్యతు మే వచః.
కి వరాహాయ నృసింహాయ వామనాయ మహాత్మనే ।
సమస్కృత్య ప్రవక్ష్యామి యత్త త్సిద్యతు మే వచః.
త్రివిక్రమాయ రామాయ వై కుణ్ఠాయ నరాయ చ
నమస్కృత్య ప్రవక్ష్యామి యత్త త్సిధ్యతు మేవచః.
ఆగ్ని దేవుడు చెప్పెను : ఓ మునీ! ఇపుడు నేను ఆత్మరక్షను, ఇతరుల రక్షను చేయు విధానమును చెప్పుచున్నాను. దీనికి “మార్జనము” లేదా “అపామార్జనము” అని పేరు. ఈ రక్ష చేసికొనుటచే మానవుడు దుఃఖములు తొలగి సుఖము పొందును. సచ్చిదానందస్వరూపుడును, పరమార్థభూతుడును, సర్వాంతర్యామియు, మహాత్ముడును, నిరాకారుడును, సహస్రాకారములు ధరించినవాడును, సర్వవ్యాపకుడును కగు పరమాత్మకు నమస్కరించుచున్నాను. కల్మషరహితుడును, పరమశుద్దుడును, నిత్యధ్యానయోగ నిరతుడును అగు పరమాత్మకు నమస్కరించి విషయమును చెప్పుచున్నాను. నా వాక్కు సత్య మగు గాక. భగవంతు డైన వరాహమూర్తికిని, నృసింహునకును, వామనునకును నమస్కరించి రషావిషయమున చేప్పెదను. నా వాక్యము సిద్ధించుగాక. భగవంతు డైన త్రివిక్రమునకును, శ్రీరామునకును, శ్రీమహావిష్ణువునకును, నరునకును నమస్కరించి నేను రషావిషయమున చెప్పుచున్నాను. అది సత్యమగు గాక.
వరాహనరసిం హేశ వామనేశ త్రివిక్రమ।
హయగ్రీవేశ సర్వేశ హృషీ కేశ హరాశుభమ్.
అపరాజితచక్రా ద్యేశ్చతుర్భిః పరమాయుధైః।
అఖణ్డితానుభావే స్త్వం సర్వదుఃఖహరో భవ.
హరాముక స్య దురితం సర్వం చ కుశలం కురు।
మృత్యుబన్గార్తిభయదం దురితస్య చ యత్ఫలమ్.
ఓ వరాహస్వామీ! నృసింహేశ్వరా! త్రివిక్రమా! హయగ్రీవేశా! సర్వేశా! హృషీ కేశా! నా సమస్త అశుభములను హరింపుము. ఎవ్వనిచేతను ఓడింపరాని ఓ పరమేశ్వరా! అకుంఠితశక్తి గల నీ, చక్రాద్యాయుధములు నాలిగింటిచే సమ స్తదుష్టుల నంహారము చేయుము. ఓ ప్రభూ! ఫలానా వాని సంపూర్ణపాపములను హరించి ఆతనికి పూర్తిగ కుశ లవేమము. ను ప్రసాదించుము. పాపము వలన కలుగు -మృత్యు, బంధన, రోగ, పీడా, భయాదులను తొలగింపుము.
పరాభిధ్యానసహితైః ప్రయుక్తం చాభిచారికమ్।
గర స్పర్శమహారోగప్రయోగం జర యా జర.
ఓం నమో వాసుదేవాయ నమః కృష్ణాయ ఖడ్గినే।
నమః పుష్కరనేత్రాయ కేశ వాయాదిచక్రిణే.
నమః కమలకిజ్ఞుల్కపీతనిర్మలవాస సే।
మహాహవరిపుస్కనఘృష్టచక్రాయ చక్రిణే.
దంష్ణోద్ధృతడి తిభృతే త్రయీమూర్తి మతే నమః।
మహాయజ్ఞవరాహాయ శేషభోగాజ్కుశాయినే.
తప్త హాటక కేళాన జ్వలత్పావక లోచన।
వడ్రాధిక నఖస్పర్శ దివ్యసింహ నమోస్తు తే.
కాశ్యపాయాతిహ్రస్వాయ ఋగ్యజుఃసామభూషిణే।
తుభ్యం వామనరూపాయాక్రమతే గాం నమో నమః.
ఇతరుల వినాశమును కోరువారు చేసిన అభిచారిక ప్రయోగములను, వారిచ్చిన విషమితాన్నపానములను, వారు కల్పించిన మహారోగమును జరా జీర్ణముగ చేసి వాటి నన్నింటిని నశింపచేయుము. ఓం భగ వంతు డైన వాసుదేవునకు నమస్కారము. ఖడ్గధారియైన కృష్ణునకు నమస్కారము. కమలనేత్రుడును, ఆది చక్రధారియు అగు కేశవునకు నమస్కారము. పద్మము కింజల్కము వలే పసుపు రంగు గల నిర్మలవస్త్రములు ధరించిన, భగవంతు డైన పీతాంబరునకు నమస్కారము. ఘోర సంగ్రామములో శత్రువుల కంఠములతో రాచుకొను చక్రమును ధరించిన చక్రపాణికి నమస్కారము. కోర పై రేవదీయబడిన భూమిని ధరించినవాడును, వేదవిగ్రహుడును శేషశయ్యపై శయనించువాడును అగు మహాయజ్ఞవరాహమూర్తికి నమస్కారము. ఓ! దివ్యసింహమూర్తి! నీ కేశాంతములు కరిగించిన బంగారము వలె ప్రకాశించు చున్నవి. నేత్రములు అగ్ని వలె ప్రజ్వంచుచున్నవి. నీ నఖముల స్పర్శ వజస్పర్శకంది గూడ ఎక్కువ తీక్షమైనది. నీకు నమస్కారము. చాల చిన్న శరీరము కలిగి, ఋగ్యజుఃసామవేదములచే అలంకృతుడ వై న కాశ్యపకుమారా! వామనా! నమస్కారము. పిమ్మట విరాడ్రూపము ధరించి భూమిని ఆక్రమించిన త్రివిక్రమునకు నమస్కారము. .
వరాహా శేషదుష్టాని సర్వపాపఫలాని వై।
మర్ద మర్ద మహాదంష్ట్ర మర్ద మర్గ చ తత్పలమ్.
నారసింహ కరాలాస్య ధనప్రాన్రానలోజ్జ్వల।
భఞ్జ భఞ్జ నినాదేన దుష్టాన్ పశ్యార్తి నాశన.
ఋగ్యజుః సామగర్బాభిర్వాగ్భిర్వామనరూపధృక్ ।
ప్రశమం సర్వదుఃఖాని నయత్వస్య జనార్ధన .
ఐకాహికం ద్వ్యాపాకం చ తథా త్రిదివసం జ్వరమ్।
చాతుర్దికం తథాత్యుగ్రం తథైవ సతతం జ్వరమ్.
దోషోత్తం సంనితోత్తం తథై వాగత్తుకం జ్వరమ్।
శమం నయాశు గోవిన్ద చ్ఛిన్ది చ్ఛిన్త్యస్య వేదనామ్.
ఓ వరాహమూర్తీ! సమ స్తపాపప :రూపమున వచ్చిన సకలదుష్టరోగములను ఆణచివేయుము; అణచివేయుము. గొప్ప కోరలు గల మహావరాహా! పాపమువలన కలిగిన ఫలమును అణచివేయుము; అణచివేయుము. వికట మైన ముఖము గల నీ దుతాగ్రములు ఆగ్ని వలె ప్రకాశించుచున్నవి. ఓ ఆర్తివినాశనా! ఆక్రమణము చేయు దుష్టుల వైపు చూడుము; నీ గర్ణనముచే వారినందరిని నశింపచేయుము; నశింపచేయుము. ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూడతత్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖమును శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియు, ఆగంతుక మునుగు. ఐకాహిక జ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము), ద్వ్యాహిక జ్వరమును (రెండు రోజులకు వచ్చునది), త్ర్యాహిక జ్వరమును, ఆత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.
నేత్రదుఃఖం శిరోదుఃఖం దుఃఖంచౌరగసంభవమ్।
అనిశ్వాసమతిశ్వాసం పరితాపం సవేపథమ్.
గుదఘ్రాణాజ్ఘ్రిరోగాంశ్చ కుష్ఠరోగాం స్తథా క్షయమ్।
కామలాదీంస్తథా రోగాన్ ప్రమేహాంతా౦తిదారుణాన్.
భగన్దరాతిసారాంశ్చ ముఖరోగాంశ్చ వల్గులీమ్ ।
అశ్మరీం మూత్రకృచాంశ్చ రోగానన్యాంశ్చ దారుణాన్.
యే వాతప్రథవా రోగా యే చ పిత్త సముద్భవాః
కథోద్భవాశ్చ యే కేచిద్యే చాన్యే సాంనిపాతికాః.
ఆగనుకాశ్చ యే రోగాలూతావిస్పోటకాదయః ।
తే సర్వే ప్రశమం యాను వాసుదేవస్య కీర్తనాత్.
విలయం యాంతు తే సర్వే విష్ణోరుచ్చారణేన
చ క్షయం గచ్ఛంతు చా శేషిస్తే చక్రాభిహతా హరేః.
అచ్యుతాన నగోవిన్దనామోచ్చరణభేషజాత్।
నశ్యని సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్.
నేత్రరోగమును, శిరోరోగ మును, ఉదరరోగమును, శ్వాసావరోధమును; అతిశ్వాసమును, పరితాపమును,శ్రీమదగ్ని మహాపురాణము కంపనమును. గుదరోగమును, నాసికారోగమును, పాదరోగ మును, కుష్ఠరోగములను, క్షయరోగమును, కామలాట రోగములను, అత్యంతముదారుణమైన ప్రమేహమును, భగందర . అతిసారములను, ముఖరోగమును, వల్గులీరోగమును, ఆశరీరోగమును, ఇతర మూత్రకృచ్ఛరోగమును, ఇతర ము లైన భయంకరరోగమును తొలగింపుము. వాత-పిత్తకఫములవలన కలిగిన రోగములును, సంనిపాతమువలన కలిగిన రోగములును, ఆగంతుక రోగములును, లూతా-విస్ఫోటాది రోగములను భగవంతు డగు వాసు దేవుని నామసంకీర్తనమాత్రముననే తొలగిపోవుగాక. ఆ రోగము లన్నియు శ్రీ మహావిష్ణు నామోచ్చరణమాత్రముననే నశించి పోవుగాక. అవి అన్నియు శ్రీమహావిష్ణువు చక్రముచే కొట్టబడి తొలగిపోవుగాక. ‘అచ్యుత’, 'అనంత' 'గోవిన్ద' అను నామములను ఉచ్చరించుట అనేడు ఔషధముచే సకలరోగ ములును నశించును. నేను చెప్పునది సత్యముః సత్యము.
స్థావరం జజ్గమం వాపి కృత్రిమం చాపి యద్విషమ్।
దన్తోద్భవం నఖభవమా కాశప్రభవం విషమ్.
లూతాదిప్రభవం యచ్చ విషమన్యత్తు దుఃఖదమ్।
శమం నయతు తత్సర్వం వాసుదేవస్య కీర్త నమ్.
గ్రహాన్ పేత గ్రహాంశ్చాపి తథా వైకీ డాకినీగ్రహాన్ ।
వేతాలాంశ్చ పిశాచాంశ్చ గశర్వాన్ యక్షరాక్షసాన్.
శకునీపూతనాద్యాంశ్చ తథా వై నాయకాన్ గ్రహాన్ ।
ముఖమణ్డీం తథా క్రూరాం రేవతీం వృద్ద రేవతీమ్.
వృద్ధికాఖ్యాన్ గ్రహాంతోగ్రాంస్తథా మాతృగ్రహానపి।
బాలస్య విష్ణోశ్చరితం హను బాలగ్రహానిమాన్.
వృద్దాశ్చ యే గ్రహాః కేచిత్ యే చ బాలగ్రహాః క్వచిత్ ।
నరసింహస్య తే దృష్ట్యా దగ్గా యే చాపి యౌవనే.
సటాకరాలవదనో నారసింహో మహాబలః1
గ్రహాన శేషాన్ని శేషాన్ కరోతు జగతో హితః.
నరసింహ మహాసింహ జ్వాలామాలోజ్జ్వలానన।
గ్రహాన శేషాన్ సర్వేశ ఖాద ఖాదాగ్ని లోచన.
స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, ఆకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతర విధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక. బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-పేతగ్రహ-డాకినీ పతనాది గ్రహ-వినాయక గ్రహ ముఖమండికా క్రూర రేవతి - వృద్ధి రేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ మాతృగ్రహాదు లగు బాలగ్రహములను నశింపచేయుగాక భగవంతుడవైన నర సింహా! నీ దృష్టిసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహములు దగ్గము లే పోవుగాక! జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమ స్తబాలగ్రహములను నశింపచేయుగాక, ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్నిలోచనా! సర్వేశ్వరా! సమస్త గ్రహములను భక్షించుము! భక్షించుము.
యే రోగా యే మహోత్పాతా యద్విషం యే మహాగ్రహాః।
యాని చ క్రూర భూతాని గ్రహపీడాశ్చ దారుణాః.
శస్త్రక్షతేషు యే దోషా జ్వాలా గర్దభకాదయః।
తాని సర్వాణి సర్వాత్మా పరమాత్మా జనార్దనః.
కించిద్రూపం సమాస్థాయ వాసుదేవస్య నాశయ,
క్షిప్త్వా సుదర్శనం చక్రం జ్వాలామాలాతిభీషణమ్.
సర్వదుషోపశమనం కురు దేవవరాచ్యుత।
సుదర్శన మహాజ్వాల చ్ఛిన్ది చ్ఛిన్ది మహారవ.
సర్వదుష్టాని రక్షాంసి క్షయం యాన్తు విభీషణ।
ప్రాచ్యాం ప్రతీచ్యాం చ దిశి దక్మిణోత్తరతస్తథా.
రక్షాం కరోతు సర్వాత్మా నరసింహః స్వగర్జితై
దివిభువన రిక్షే చ పృష్ఠతః పార్శ్వతోఒగ్రతః.
రవాం కరోతు భగవాన్ బహురూపి జనార్దనః।
యథా విష్ణుర్జగత్సర్వం సదేవాసురమానుషమ్.
పరమాత్ము డైన జనార్దనుడు. సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగ మలున్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విష మున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణమైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము. దేవ శ్రేష్ఠుడ పైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకర మైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగముల నన్నింటిని నశింపచేయుము. తీవ్రజ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శనచక్రమా! సమ స్తదుష్టరాసులను సంహరింపుము; సంహరింపుము. నీ ప్రభావముచే ఆ రాక్షసు లందరును నశింతురుగాక. సర్వాత్మకు డగు నృసింహుడు, తన గర్ణనముచే, పూర్వ-పశ్చిమ-ఉత్తర దక్షిణదిశలందు రక్షించుగాక.అ నేక రూపములను ధరించు భగవంతు డైన జనార్దనుడు స్వర్గలోక భూలోక అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక. దేవాసుర మనుష్యసహిత మగు ఈ జగత్తు అంతయు భగవంతుడగు విష్ణువు యొక్క స్వరూపమే. ఈ సత్యముయొక్క ప్రభావముచే ' ఈతని దుష్టరోగము లన్నియు నశించుగాక.
తేన సత్యేన దుష్టాని శమమస్య ప్రజను వైl
యథా విష్ణా స్మృతే సద్యః సంక్షయం యాంతి పొతకాః.
సత్యేన తేన సకలం దుష్టమస్య ప్రశామ్యతు।
యథా యజ్ఞేశ్వరో విష్ణుర్దేవేష్వపి హి గీయతే.
సత్యేన తేన సకలం యన్మయోకం తథాస్తు తత్।
శాన్తిరస్తు శివం చాస్తు దుష్టమస్య ప్రశామ్యతు.
వాసుదేవశరీరోతైః కుతై ర్నిర్ణాశితం మయా।
ఆపామార్జతు గోవినో నరో నారాయణస్త థా.
తథాస్తు సర్వదుఃఖానాం ప్రళయో వచనాద్దరేః।
అపామార్జనకం శస్తం సర్వరోగాదివారణమ్.
అహం హరిః కు విష్ణుతా రోగా మయా తవ.
ఇత్యాగ్నేయే మహాపురాణే కుశాపామార్థనవర్ణనం నామ ఏకత్రింశోధ్యాయః.
“విష్ణువును స్మరింపగనే సర్వపాపములును వెంటనే తొలగిపోవును” అను సత్యముయొక్క ప్రభావముచే వీని దుష్టరోగము లన్ని ము శాంతించుగాక. “యజేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు” అనేడు సత్యముయొక ప్రభావముచే నా మాట సత్య మగుగాక. శాంతి కలుగుగాక. మంగల మగుగాక. ఈతని దుష్టరోగములు నశించుగాక. భగవంతు డైన వాసుదేవుని శరీరమునుండి పుట్టిన కుశ అనే నేను ఈతని రోగములను తొలగించితిని. నరనారాయణులు, గోవిందుడును వీనికి ఆపామార్లనము చేయుగాక. శ్రీహరి వచనము ప్రకారము ఈతని సంపూర్లదూఖములు శపించుగాక. సమస్తరోగాదులను నివారించుటకు ఆపామార్ణనస్తోత్రము ప్రశస్త మైనది. నేను శ్రీహరిని. నేను నీ రోగములను నశింపచేసితిని.
ఆగ్ని మహాపురాణమునందలి కుశాపానూర్జహస్తోత్రవర్ణన మను ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 31 of the Agni Purāṇa is as follows:
This chapter surveys the holiest tīrtha-s of Bhārata and the merit that accrues from visiting them. Prayāga (the confluence of Gaṅgā, Yamunā, and the invisible Sarasvatī) is hailed as the king of tīrtha-s. Vārāṇasī (Kāśī) is described as Śiva's own city where liberation is granted to all who die there through the Tārakamantra whispered by Śiva himself into the dying person's ear. Gayā, Kurukṣetra, Puṣkara, Dvārakā, Ayodhyā, Mathurā, Kāñcī, Avantī, and the banks of sacred rivers — Gaṅgā, Godāvarī, Kṛṣṇā, Kāverī — are praised in turn. The Purāṇa enumerates the specific sins that are cleansed at each tīrtha and the specific boons that are granted to pilgrims who bathe, perform tarpaṇa, and make charitable gifts at these holy places.