అగ్ని మహా పురాణము

171 - అథ పునః ప్రాయశ్చిత్తాని

పుష్కర ఉవాచః-

ప్రాయశ్చిత్తం రహస్యాది వత్యే శుద్ధికరం పరమ్

పౌరుషే తు సూ క్రేన మాసం జప్యాది నామహా.

ముచ్యతే పాతకైః సర్వైర్జప్త్వా త్రిర ఘమర్షణమ్

వేదజ్యద్వాయువయాద్గాయత్ర్యా వ్రతతోఒఘహా.

 ముచ్యతే పాతకై సర్వెర్జప్త్వా తీరఘమర్షణమ్

 వేదజప్యాద్వాయు యమద్గాయత్ర్యా వ్రతతోఒఘహా.

ముణనం సర్వకృచ్ఛేషు స్నానం హోమో హరేర్యజికి

ఉల్డితస్తు దివా తి షేదుపవిష్ట స్తథా నిశి.

 ఏతద్వీరాసనం ప్రోక్తం కృచ్ఛకృత్తేన పాపహా

 అష్టభిః ప్రత్యహం గా సైర్యతి చాబ్ధాయణం స్మృతమ్.

ప్రాతశ్చతుర్భిః సాయం చ శిశు చాబ్ధాయణం స్మృతమ్

యథాకథశ్చాత్పిణానాం చత్వారిం శచ్ఛతద్వయమ్.

మా సేన భక్షయేదేతత్పురచాబ్ధాయణం చరేత్

త్యహముష్ణం పిబేదాపగ్రహముష్ణం పయః పిబేత్.

త్ర్యహ ముష్ణం ఘృతం పీల్వా వాయుభక్ష భవేత్యహమ్

 త ప్రకృచ్ఛమిదం ప్రోక్తం శీతై  శీతం ప్రకీర్తితమ్.

కృ చ్చాతీకృచ్చం పయసా దివసానేకవింశతిమ్

గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పికి కుశోదకమ్.

ఏక రాత్రోపవాసశ్చ కృచ్ఛం సా నపనం స్మృతమ్

ఏతచ్చ ప్రత్యహాభ్య స్తం మహాసా స్తపనం స్మృతమ్.

త్ర్యహాభ్య సమథై కైక మతిసాన్లపనం స్మృతమ్

కృచ్ఛం పరాక సంజ్ఞం స్యాద్ద్వాదశాహ మభోజనమ్.

 ఏక భ క్తం త్ర్యహాభ్య స్తం క్రమాన్ని క్షమయాచితమ్

ప్రాజాపత్యముపోష్యా నే పాదః స్యాత్ కృచ్ఛపాదకః. 

ఫలై ర్మాసం ఫలం కృచ్ఛం బిల్వైః శ్రీకృచ్ఛ ఈరితః

పద్మా వైః స్యాదామల కైః పుష్పకృచ్చం తు పుష్పకైః.

పత్రకృచ్ఛం తథా పత్రాస్తోయకృచ్ఛం జలేన తు

మూలకృచ్ఛం తథా మూలైర్దధ్నా ఓ రేణ తక్రత.

మాసం వాయవ్యకృచ్ఛం స్యాత్పాణిపూరాన్న భోజనాత్

తిలైర్ద్వాదశరాత్రేణ కృచ్ఛమాగ్నేయమార్తెనుత్.

 పక్షం ప్రసృత్యా లాజానాం బ్రహ్మ కూర్చం తథా భవేత్

ఉపోషితశ్చతుర్ధశ్యాం పజ్ఞ్చదశ్యామన న్తరమ్.

పశ్చిగవ్యం సమళ్నీ యాద్ద విష్యాశీత్వన నరమ్

మా సేన ద్విర్నరః కృత్వా సర్వపాపైః ప్రముచ్యతే.

 శ్రీకామః సష్టికామశ్చ స్వర్గకామోఘనష్టయే

 దేవతారాధనపర కృచ్ఛకారీ స సర్వభాక్ .

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే రహస్యాదిప్రాయశ్చిత్తం నామ ఏక సప్తత్యధిక శతతమోధ్యాయః.

పుష్కరుడు చెప్పేను: మిక్కిలి శుద్దికర మైన రహస్యాది ప్రాయశ్చిత్తమును చేప్పెదను. ఒక మాసము పురుషసూక్తము జపించినచో సర్వపాపములను నశింపచేసికొనును. అఘమర్షణసూక్తము మూడు పర్యాయములు జపించినచో సర్వపాపములనుండియు విముక్తు డగును. వేదమును జపించుటవలనను, ప్రాణాయామమువలనను, గాయత్రీజపముచేతను, వ్రతము వలనను పాపములను తొలగించుకొనును. సర్వకృచ్చములందును ముండనము, స్నానము, హోమము, విష్ణు పూజ చేయవలెను. కృచ్చవ్రతము చేయువాడు పగలు నిలచియు, రాత్రి కూర్చుండియు ఉండవలెను. దీనికి వీరాసన మని పేరు. ఈ విధముగ చేసినచో పాపము లన్నియు తొలగించుకొనును. ప్రతిదినము ఎనిమిది గ్రాసముల చొప్పున తిన్నచో ఆది యతి చాంద్రాయణము. ప్రాతఃకాలము నాలుగు, సాయంకాలము నాలుగు గ్రాసములు తిన్న చో శిశుచాంద్రాయణము. ఎట్లు. తిన్నను మొత్తము మాసములో రెండువందల నలుబది గ్రాసములు తిన్నచో సుర చాంద్రాయణము. మూడు దినములు వేడి ఉదకములు, మూడు దినములు వేడిపాలు, మూడు దినములు వేడి నెయ్యి త్రాగి, మూడు దినములు వాయువును మాత్రము భక్షించవలెను. దీని పేరు “తప్తకృచ్చము”. ఈ పదార్థములనే చల్లనివి తీసికున్న చో అది “శీతకృచ్ఛము”. ఇరువది యొక్క దినములు పాలుమాత్రమే త్రాగి ఉన్న చో కృచ్ఛాతికృచ్ఛము. గోమూత్రము, గోమయము, గోక్షీరము, పెరుగు, నెయ్యి, కుశోదకము, ఒక రాత్రి ఉపవాసము ఇది కృచ్చసాంతపనము. “ఈ విధముగ ప్రతిదినమునను చేసినచో మహా సొంతపనము”. ఒక్కొక్కటి మూడేసి రోజులు చేసినచో ఆతిసాంతపనము. పండ్రెండు దివసములు భోజనము లేకుండ ఉండుట పరాకకృచ్చము. మూడు దినములు ప్రాతఃకాలము, మూడు దినములు సాయంకాలము, మూడు దినములు ఆయాచితాన్నము భుజించి ఉపవాసము చేసినచో ఆతి ప్రాజాపత్యము; దీనిలో నాల్గవ వంతు చేసిన పాపకృచ్ఛము. ఒక మాసము ధ్వములు మాత్రము తిన్నచో అది ఫలకృచ్ఛము; బిల్వఫలములచే శ్రీకృచ్ఛము. తామర గింజలతోను, ఆమలకము లచేతను ఆకృచ్ఛములు. పుష్పములచే పుష్పకృచ్ఛము, పత్రములు తిన్న చో పత్రగృచ్ఛము, ఉదకము చూత్రము త్రాగిన ఉదకకృచ్ఛము, దుంపలు తిన్న చో మూలకృచ్ఛము, దధి క్షీరతక్రముంచే దధికృచ్ఛక్ష్మీరకృచ్ఛతక్రకృచ్ఛములు. యిచేనిండు నంత మాత్రము ఆన్న మే ఒక మాసము తిన్న చో. ఆది వాయవ్యకృచ్చము. పండ్రెండు దినములు తిరిలు మాత్రమే తిన్నచో అది పీడావినాశక మగు ఆగ్నేయకృచ్ఛము. చారేడు లాజలుమాత్రమే తిన్నచో ఆది బ్రహ్మ కూర్చము. చతుర్ధ శియందును, పూర్ణిమ యందును. ఉపవాసము చేసి పిదప పుచగవ్యమును భుజించవలెను. పిదప హవిస్సును భుజించవలెను. ఈ విధముగ మాసమునందు రెండు పర్యాయములు చేయువాడు సర్వపాపవిముక్తు డగును. శ్రీ కాముడును, పుష్టికాముడును, స్వర్గకాముడును పాపవినాళార్థమై దేవతారాధనవరు డై కృచ్ఛములు చేసినచో సర్వ మనోరథములను పొందును.

ఆగ్ని మహాపురాణమునందు రహస్యాది ప్రాయశ్చిత్త కథన మను నూట డెబ్బదియొకటవ అధ్యాయము సమాప్తము.