ఈశ్వర ఉవాచః-
సకలం నిష్కలం శూన్యం కాలాఢ్యం స్వమలం కృతమ్ ।
క్షపణం క్షయమన్తః స్థం కంఠోష్ఠం చాష్టమం శివమ్.
ప్రసాదస్య పరాఖ్యసంస్మృతం రూపం గుహాష్టదా ।
సదాశివస్య శబ్దస్వ రూపస్యా ఖిల సిద్దయే.
అమృతర్చాంశు మాం శ్చేన్దు శ్చేశ్వర శ్చోగ్ర ఊహకః ।
ఏకపాదేన ఓజాఖ్య ఔషధశ్చాంతు మాన్వశీ.
ఆకారాదేః క్షకారశ్చ కకారాదేః క్రమాదియే ।
కామదేవః శిఖండీచ గణేశః కాలశంక రౌ.
ఏక నేత్రో ద్వి నేత్రశ్చ త్రిశిఖో దీర్ఘబాహకః ।
ఏకపాదర్ధ చంద్రస్య బలపూయోగినీ ప్రియః.
శక్తీశ్వరో మహాగ్రంథి స్తర్పకః స్థాణుదంతురౌ ।
నిధీశో నందిపద్మశ్చ తథాన్యః శాకినీ ప్రియః.
ముఖి బింబో భీషణశ్చ కృతాంతః ప్రాణ సంజ్ఞకః ।
తేజస్వీ శక్ర ఉదధిః శ్రీ కంఠః సింహ ఏవచ.
శశాంకో విశ్వరూపశ్చ క్షశ్చస్యాన్నర సింహకః ।
సూర్యమాత్రా సమాక్రాంతం విశ్వరూపన్తు కారయేత్.
అంశుమత్సయుతం కృత్వా శశి బీజం వినాయుతమ్ ।
ఈశానమోజసా క్రాంతం ప్రథమంతు సముద్ధరేత్.
తృతీయం పురుషం విద్ది దక్షిణం పంచమం తథా ।
సప్తమం వామదేవన్తు సద్యోజాతం తతః పరమ్,
రసయుక్తన్తు నవమం బ్రహ్మపంచక మీరితమ్ ।
ఓంకారాద్యాశ్చ తుర్థ్యన్తా నమోఽన్తాః సర్వమంత్రకాః.
సద్యోదేవా ద్వితీయస్తు హృదయంచాంగ సంయుతమ్ ।
చతుర్థన్తు శిరోవిద్ధి ఈశ్వరన్నామ నామతః.
ఊహకన్తు శిఖాజ్ఞేయా విశ్వరూప సమన్వితా ।
తన్మంత్ర మష్టమం ఖ్యాతం నేత్రం తు దశమం మతమ్.
అస్త్రం శశీ సమాఖ్యాతం శివసంజ్ఞం శిఖిధ్వజః ।
నమః స్వాహాతథా వౌషట్ హూం చ ఫట్ కక్రమేణతు.
జాతిఫట్కం హృదాదీనాం ప్రాసాదం మంత్రమావదే ।
ఈశానాద్రుద్ర సంఖ్యాతం ప్రోద్ద రేచ్చాంశు రంజితమ్.
ఔషదాక్రాంత శిరసమూహక స్యోపరిస్థితమ్ ।
ఆర్ధచంద్రోర్ధ్వనాదశ్చ బిందు ద్వితయ మధ్యగమ్.
తదన్తే విశ్వరూపన్తు కుటిలన్తు త్రిధాతతః ।
ఏవం ప్రాసాద మంత్రశ్చ సర్వకర్మక రోమనుః.
శిఖాబీజం సముద్ధృత్య ఫట్కారాన్తంతు చై వఫట్ ।
ఆర్ధ చంద్రాసనం జ్ఞేయం కామదేవం ససర్పకమ్.
మహాపాశు పతాస్త్రంతు సర్వదుష్ట ప్రమర్ధనమ్ ।
ప్రాసాదః నకలః ప్రోక్తో నిష్కలః ప్రోచ్యతేఽదునా.
శిపుడు చెప్పెను. స్కందా ! సకల నిష్కల శూన్య కాలాఢ్య సమలంకృత క్షణ క్షయ, అంతస్థ కంఠోష్ఠ, శివ, యనునవి ప్రాసాద పరాసంజ్ఞక మగు మంత్రము యొక్క ఎనిమిది స్వరూపము. ఇవి శబ్ద మయములగు సదా శివ రూప ములు. సకల సిద్ధులము యిచ్చునవి. అమృత అంశుమత, ఇంద్ర ఈశ్వర ఉగ్ర ఊహక్ ఏక పాద ఐల, ఓజ, ఔషధ అంశు మల్ తళి యనునవి వరుసగ ఆకారాది ద్వాదశ స్వరములకు వాచక ములు. చెప్పబోవునవి కకారాద్యక్షర సూచకములు. వరుసగా కామ దేవశిఖండి గణేశ, కాల శంకర, ఏక నేత్ర ద్వి నేత్ర, త్రిశిఖ, దీర్ఘ బాహుక, ఏకపాద, ఆర్ధ చంద్ర, వరియ, యోగినీ ప్రియ. శ క్తీశ్వర, పద్మ, కాకినీ ప్రియ, ముఖబిలబ. భీషణ, కృతాంత, ప్రాణ, తేజస్వి, శక్ర ఉదధి శ్రీ కంఠ సింహ శశాంక విశ్వరూప వారసింహములు. విశ్వ రూపమును పండ్రెండు మాత్రలతో కలిపి వ్రాయవలెను. విశ్వ రూప మును (హ) ఆంకముతో (అ) తోను ఓజస్ (ఓ) తోను కలిపి శశి బీజమున (స) కలుపుకొన్నచో (ఓం) యను ప్రథమ బీజము ఉద్దృత మగును. ఇది ఈశాన సంబద్ధము. పైన చెప్పిన పండ్రెండు బీజములలో ఐదు హ్రస్వయుక్త బీజములు ఆరు " దీర్ఘ బీజములు. మొదటి మాత్ర ఉందును పదకొండవ మాత్ర యందున ఒకే ఊహం" యను బీజము ఏర్పడును. తృతీయ బీజము తత్పురుష బీజము ఐదవది. ఆ ఘోర బీజము ఏడవది. వామ దేవము. దాని తరువాతది సద్యోజాతము. ఇది రసయుక్త మగు నవమ బీజము. ఈ విధముగ ఐదు బీజములతో కూడిన ఈశానాదులకు బ్రహ్మ పంచకమని పేర. వీటి ప్రారంభమున ప్రణవము చివర “కమః" చేర్చవలెను. ఈశానాది నామములను చతుర్థ్యంతముగ మార్చివచో పూజోప యుక్త మంత్రములగును. ద్వితీయ చతుర్థాది మాత్రలు దీర్ఘ ములు వాని హృదయాద్యంగ న్యాసము నందు ఉపయోగించ వలేను. చతుర్థము శిరో మంత్రము. ఇది ఈశ్వర నామక ము. హకార మునకు ఊకార అను స్వారము చేర్చగా ఏర్పడినది శిఖా మంత్రము. ఎనిమిదవది విశ్వరూప సమన్వితము. దశ మము నేత్ర మంత్రము. ఆస్త్ర మంత్రము విసర్గ యుక్తము. శివ సంజ్ఞక మని చెప్పబడినది. హృదయాద్యంగముల ఆరు జాతులను క్రమముగా నమః స్వాహా వషట్ హూం, పౌషట్ వట్ యని వుండును. ఇపుడు ప్రాసాద మంత్రమును చెప్పేదను. "హీం, హోం, హూం. ఇది ప్రాసాద మంత్ర బీజములు. వీటికి కుటిలములని పేరు. ఇది సర్వ కార్య సంపాదకము. హృదయ శిఖాది బీజమలను వెనుక చెప్పిన విధమున ఉద్ధారము. చేసి వట్కారము వరకును సకలాంగ న్యాసము చేయవలయును. ఆసనము అర్ధ చంద్రాకారము. శివుడు కామ పూరకుడు. సర్పాలంకృతుడు. మహా పాశుపతాస్త్రము సర్వ దుష్ట వినాశకరము. ఈ విధముగ సకల ప్రాసాదము చెప్పబడినది. ఇపుడు నిష్కర ప్రాసాదమును చెప్పెదను,
ఔషధం విశ్వరూపస్తు రుద్రాఖ్యం సూర్యమండలమ్ ।
చంద్రార్థనాద సంయోగం విసంజ్ఞం కుటిల స్తతః.
నిష్కలో ముక్తిముక్తౌ స్యాత్పంచాంగోఽయం సదాశివః ।
అంశుమాన్విశ్వ రూపంచ ఆవృతం శూన్యరంజితమ్.
బ్రహ్మాంగ రహితః శూన్య స్తస్య మూర్తిరస స్తరుః ।
విఘ్న నాశాయ భవతి పూజితో బాలబాలిశైః.
అంశుమాన్విశ్వ రూపాఖ్య మూహకస్యో పరిస్థితమ్ ।
కలాడ్యం సకల స్యైవ పూజాంగాది చ సర్వతః.
నరసింహం కృతాంతస్థ తేజస్వి ప్రాణమూర్ధ్వగమ్ ।
ఆంశుమానూహ కాక్రాంత మథోర్ధ్వం ఖమలం కృతమ్.
చంద్రార్ధనాద నాదాంతం బ్రహ్మ విష్ణ విభూషితమ్ ।
ఉదధిం నరసింహశ్చ సూర్యమాత్రా విభేదితమ్.
యదాకృతం తదాతస్య బ్రహ్మణ్యంగాని పూర్వవత్ ।
ఔషధ (ఔ) విశ్వరూప - (హ) ఏక దశ మాత్ర సూర్యమండల (0) ముంతో కూడిన ఆర్ధ చందము (ఆను నాసిక) నాదము వీటితో కూడినది “హౌం" యను మంత్రం ఇది నిష్కల ప్రాసాద మంత్రము, దీనికి విసంజ్ఞ కుటిలము యని పేరు యిది భుక్తి ముక్తి ప్రదము. ప్రాసాదమంత్రము ఈ శానాది బహ్మ మూర్తి పంచక యుక్తము. ఆందు చేత దీనిని పంచాంగ ము సాంగము యని చెప్పుదురు. ఆశ ముతో (0) విశ్వరూప (హ) అమృత (ఆ) ముల కలయిక చే వ్యక్తమగు హం బీజమునకు శూన్యమని పేరు. ఈ శానాది బహ్మాత్మ కాంకములతో రహితమగుటచే దీనికి శూన్యయని పేరు, ఈశానాది మూర్తులు ఈ బీజముల అమృతతరువులు వీటి పూజనము సమస్త విఘ్నములను తొలగించును. అంకు మాన్ చేర్చిన విశ్వరూపము (హ) ఊహకము (ఊ) పైవ ఆధిష్ఠితమైనచో ఏర్పడిన హరాం బీజమునకు కలాడ్యమని పేరు ఇది సకలాం తర్గతము పూశాంగాది కమలు సకలమునకే వుండును. నరసింహుడు యమరాజు పై కూర్చుండును. యనగా "క్ష" కారము, “మ” కారము పై వుండును. తేజస్వి (ర) ప్రాణ (యా) ములు కూడ కలియును. పైన అంశుమత్ (0) క్రింద ఊహకము (ఊ) వున్న చో (క్ష్మ్య) అను బిజము ఏర్పడును, ఇది పైనను క్రిందను మాత్రలచే ఆలంక రింప బడినది గాన సమలంకృతమని చెప్పబడును. చందాఠాకార బిందు నాదములతో గూడిన బహ్మ విష్ణునామ విభూషితములగు ఉదధి వ) నరసింహ (క్ష) లను పండ్రెండు మాత్రలతో భేదితములు చేయవలయును. హ్రస్వస్వరములతో కూడిన బీజ ములు ఈశానాది బహ్మాత్మ కాది ఆంగములగును. దీర్ఘస్వరయుక్త బీజములు వున్న మంత్రములు హృదయాద్యంగ విన్యా సమునకు ఉపయోగించును.
ఓజాఖ్య మంశుమద్యుక్తం ప్రథమం వర్ణముద్ద రేత్.
అంశుమచ్చాంశు నాక్రాన్తం ద్వితీయం వర్ణనాయకమ్ ।
ఆంశుమానీశ్వర స్తద్వ త్తృతీయం ముక్తిదాయకమ్.
ఊహకం చాంశునాక్రాంతం వరుణ ప్రాణతై జనమ్ ।
పంచమస్తు సమాఖ్వాతం కృతాంతంతు తతః పరమ్.
అంశుమానుదక ప్రాణః సప్తమం వర్ణముద్దృతమ్ ।
పద్మమిందు సమాక్రాన్తం నందీశ మేక పాదధృక్.
ప్రథమంచా న్తతోయోజ్యం క్షపణం దశ బీజకమ్ ।
అస్యార్థం తృతీయం చైవ పంచమం సప్తమం తథా.
సద్యోజాతంతు నవమం ద్వితీయాద్దృదయాదికమ్ ।
దశార్ణ ప్రణవం యత్తు ఫడన్తం చాస్త్రముద్ద రేత్.
నమస్కార యుతాన్యత్ర బ్రహ్మాంగాని తు నాన్యథా ।
ద్వితీయాదష్టమం యావత్ ఆష్టౌవిద్యేశ్వరామతాః.
అన న్తేశశ్చ సూక్ష్మక్బ తృతీయశ్చ శివోత్తమః ।
ఏక మూర్త్యేక రూపస్తు త్రిమూర్తిరపర స్తథా,
శ్రీకంఠశ్చ శిఖండీచ అష్టావిద్యేశ్వరాః స్మృతాః ।
శిఖండినోఽప్య నన్తాంతం మత్రాంతం మూ ర్తిరీరితాః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే సకలాది మంత్రోద్ధార నిరూపణం నామ సప్త దశాధిక త్రిశతతమోఽధ్యాయః.
ఇవుడు దశ రూప బీజ ప్రణవములను చెప్పెదను. బీజమును ఆవస్వార యుక్తము చేసి "ఓం" యను ప్రథమ వర్ణోద్ధారము చేయవలెను. ఆంశుమత్ ఆంశువుల యోగముచే “ఆం” యను నాయక స్వరూప ద్వితీయ వర్ణము “అంశుమత్" ఈశ్వరులచే ఈ యను ముక్తి ప్రదమగు తృతీయ వర్ణము ఏర్పడును.' అంత ఆక్రాంతమగు ఊహకము (ఊం) చతుర్థ - వర్ణము సానుస్వార వరుణ (వ్) పాణ (వ్య) తేజస్ (ర) (వ్యు) ఇది పంచమ బీజాక్షరము. స్వాను స్వార కృతాంతము (మం) షష్ఠ బీజము. స్వాను స్వార ఉదక ప్రాణములు (వ్యం) సప్తమ బీజము ఇందు యుక్త పద్మము (పం) అష్టమ బీజము ఏకపాద యుక్త నందీశుడు (నేం) నవమ బీజము ఆంతమున హాథమ బీజమును చేర్చవలెను. ఇట్లేర్పడిన దశ బీజాత్మక మంతమునకు క్షపణము యని పేరు దీని ప్రథమ తృతీయ, పంచమ, సప్తమ, నవమ బీజములు కమముగ ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత స్వరూపములు ద్వితీయాది బీజములు హృదయాడ్యంగన్యాసోప యుక్త ములు ఈ పది పణవాత్మక బీజములును ఒక్కసారి ఉచ్చరించుచు "అస్త్రాయ ఫట్" యని అస్త్ర న్యాసము చేయవలెను. ఈశానాది మూర్తుల అంతమున నమః యనునది చేర్చియే చెప్పవలెను. ద్వితీయ బీజము మొదలు నవమ బీజం వరకు వున్న వి విద్యేశ్వర రూపములు. "అవంతేశ " సూక్ష్మ" శివోత్తమ, " ఏకమూర్తి, ఏకరూప త్రిమూర్తి శ్రీకంఠ, శిఖండి, యని వీటి పేర్లు శిఖండి, మొదలు ఆనంతేషుని వరకు విలోమ క్రమముచే బీజమంత్రములను చేర్చవలెను.
అగ్ని మహాపురాణమున సకలాది మఁతోద్దారణమను మూడవందల పదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 318 of the Agni Purāṇa is as follows:
The twelve rāśis (zodiacal signs) are described with their ruling planets, bodily limbs, elemental nature (fire, earth, air, water), and qualities (movable/cara, fixed/sthira, dual/dvisvabhāva). Agni explains how the lagna (ascendant) is determined from the time of birth and how the positions of grahas in the twelve bhāvas (houses) shape the native's life in areas ranging from body, wealth, and siblings to death, gains, and liberation. The strength (bala) of planets — sthānabala, kālabala, ceṣṭābala, naisargikabala — is introduced as the basis for correct prediction.