ఆగ్ని రువాచః-
విశేదనేన మనేణ యాగస్థానం భూషయేత్।
నమో బ్రహ్మణ్య దేవాయ శ్రీధరాయావ్యయాత్మనే.
ఋగ్యజుః సామరూపాయ శబ్దదేహాయ విష్ణవే.
విలిఖ్య మణ్డలం సాయం యాగద్రవ్యాది చాహరేత్ .
ప్రక్షాళితక రాః సన్విన్యస్యార్యకరో నరః।
అర్ఘ్యాదిభిస్తు శిరః ప్రోక్ష్య ద్వార దేశాదికం తథా.
ఆరభేద్ద్వారయాగం చ తోరణేశాన్ ప్రపూజయేత్।
ఆశ్వత్థాదుమ్బరవటవృక్షాః పూర్వాదిగా నగాః.
ఋగిన్దశోభనం ప్రాచ్యాం యజుర్యమసుభద్రకమ్।
సామాపశ్చ సుధన్వాఖ్యం సోమాథర్వసుహోత్రకమ్.
అగ్ని దేవుడు పలికేను : సాధకుడు ఈ “ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః” అను మంత్రము చదువుచు యాగమండపమును ప్రవేశింపపలేను. యజ్ఞశాలను అలంకరింపవలెను. (ఈ క్రింది శ్లోకమును చదువుచు భగవంతునకు నమస్కారము చేయవలెను). “వేద ములకును బ్రాహ్మణులకును హితమును చేయు, అవ్యయ స్వరూపుడగు శ్రీధరునకు నమస్కారము. ఋగ్యజుః సామాథర్వవేదములు విష్ణుస్వరూప మైనవి. శబ్దము లన్నియు విష్ణుస్వరూపమే. అట్టి, భగవంతు డైన విష్ణువునకు నమస్కారము” సాయంకాలము సర్వతోభద్రము మొదలగు మండలముల రచన చేసి పూజాద్యుపయుక్తము లగు ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. కాళ్లు చేతులు కడుగుకొనవలెను. ఆ యా ద్రవ్యములను తగు స్థానములం దుంచి, చేతితో అర్ఘ్యము గ్రహించి, ఆ జలముతో తన శిరముపై ప్రోడించుకొన. వలెను. ద్వారాదిప్రదేశములందు నీళ్లు చల్లవలెను. ద్వారయాగ (ద్వారస్థదేవతాపూజాప్రారంభము చేయవలెను. మొదటగా తోరణాధిపతులను బాగుగా పూజింపవలెను. తూర్పు మొద లగు దిక్కులలో అశ్వత్థా-ఉదుమ్బర - వటప్లక్షవృస్త్రములను పూజింపవలెను. ఇవి కాక, తూర్పున ఋగ్వేదమును, ఇంద్రుని, శోభనుని, దక్షిణమున యజుర్వేదమును, యముని, సుభద్రుని, పశ్చిమమున సామవేదమును, వరుణుని, సుధన్వుని, ఉత్తరమున ఆథర్వవేదమును, సోముని, సుహోత్రుని పూజింపవలెను.
తోరణాన్తాః పతాకాశ్చ కుముదాద్యా ఘటద్వయమ్ ।
ద్వారి ద్వారా స్వనామ్నా ర్చ్యాః పూర్వే పూర్ణశ్చ పుష్కరః.
ఆనన్దనన్దనో దక్షో వీరసేనః సు షేణకః ।
సంభవప్రభవో సౌమ్యే ద్వారపాంశ్చైవ పూజయేత్.
అస్త్రజప్తపుష్ప క్షేపాద్విఘ్నా నుత్సార్య సంవిశేత్ ।
భూతశుద్ధిం విధాయాథ విన్యస్య కృతముద్రకః.
ఫట్ కారాన్తం శిఖాం జప్త్వా సర్వపాన్ దీక్షు నిక్షి పేత్ ।
వాసుదేవేన గోమూత్రం సజ్కర్షణేన గోమయమ్.
ప్రద్యుమ్నేన పయస్తజ్జ్దాదధి నారాయణాద్ఘృతమ్ ।
ఏకద్విత్ర్యాదివారేణ ఘృతాద్వై భాగతోఽధికమ్.
ఘృతపాత్రే తదేకత్ర పఞ్చగవ్యముదాహృతమ్ ।
మణ్డపప్రోక్షణాయైకం చాపరం ప్రాశనాయ చ.
ఆనీయ దశకుమ్భేషు ఇన్ద్రాద్యాన్ లోకపాన్యజేత్ ।
పూజ్యాజ్ఞాం శ్రావయేత్తాంశ్చ స్థాతవ్యం చాజ్ఞయా హరేః.
తోరణము (ద్వారము) లోపల పతాకలు కట్టి రెండేసి కలశములను స్థాపింపవలెను. కుముదము మొదలగు దిగ్గజములను పూజింపవలెను. ఒక్కొక్క గుమ్మమువద్దను ఇద్ద రిద్దరు ద్వారపాలకులను, వారి నామముత్రము చదువుచు పూజింపవలెను. తూర్పున పూర్ణ పుష్కరులు, దక్షిణమున అనందనందనులు, పశ్చిమమున వీర సేన. సుషేణులు, ఉత్తరమున సంభవ-ప్రభవులు అను ద్వారపాలులను పూజింపవలెను. ‘ఫట్’ అను అస్త్రమంత్రమును ఉచ్చరించుచు పుష్పములు చల్లి విఘ్నములను తొలగించిన పిదప మండలములోనికి ప్రవేశించవలెను. భూతశుద్ది, న్యాసము, ముద్రలు చేసి’ శిఖకు (‘వషట్’కు) చివర ‘ఫట్’ చేర్చి జపించుచు నాలుగు దిక్కులందును ఆవాలు చల్లవలేను. పిమ్మట వాసుదేవమంత్రముతో గోమూత్రమును, సంకర్షణమంత్రముతో గోమయమును, ప్రద్యుమ్న మంత్రముతో గోదుగ్గమును, అనిరుద్దమంత్రముతో పెరుగును, సొరాయణమంత్రముతో మృతమును గ్రహించి, వాటినన్నింటిని మృతపాత్రమునందు కలపవలెను. ఇతర వస్తువుల భాగములు నేతికంటే ఎక్కువ ఉండవలెను. వీటి నన్నింటిని కలుపగా పంచగవ్య మేర్పడును. పంచగవ్యమును ఒక పర్యాయము, రెండు పర్యాయములు, లేదా మూడు పర్యాయములు వేరు వేరుగ చేయవలెను. వీటిలో ఒకటి మండపప్రోక్షణమున కుపయోగింపవలెను. రెండవది తినుటకును, మూడవది స్నానమునందును ఉపయోగింపవలెను. పది కలశలను స్థాపించి వాటి పై ఇంద్రాదీలోకపాలులను పూజింపవలెను. పూజ చేసి వారికి శ్రీహరి ఆజ్ఞను వినిపింపవలేను. “ఓ లోకపాలులారా! శ్రీహరి ఆజ్ఞ ప్రకారము మీరు ఈ యజ్ఞమును రక్షించుటకై ఎల్లపుడును ఇచట నుండవలెను.”
యాగద్రవ్యాది సంరక్ష్య వికిరాన్వికిరేత్తతః ।
మూలాష్టశతసంజప్తాన్ కుశకూర్చాన్ హరేచ్చ తాన్.
ఐశాన్యాం దిశి తత్రస్థం స్థాప్యం కుమ్భం చ వర్దనీమ్ ।
కుమ్ఖే సాఙ్గం హరిం ప్రార్చ్య వర్ధన్యామస్త్రమర్చయేత్.
ప్రదక్షిణం యాగగృహం వర్ధన్యాఽచ్ఛిన్న ధారయా ।
సిఞ్చన్న యే త్తతః కుమ్భం పూజయేచ్చ స్థిరాసనే.
సపఞ్చరత్నవస్త్రాఢ్యకుమ్భే గన్ధాదిభిర్హరిమ్ ।
వర్ధన్యాం హేమగర్బాయాం యజేదస్త్రం చ వామతః.
తత్సమీ పే వాస్తులక్ష్మీం భూవినాయకమర్చయేత్ ।
స్నపనం కారయేద్విష్ణోః సంక్రాన్త్యాదౌ తథైవ చ.
పూర్ణరుమ్భానవస్థాప్య నవకోణేషు నిర్ర్వణాన్ ।
పాద్యమ ర్ఘ్యమాచమనీయం పఞ్చగవ్యం చ నిక్షీపేత్.
పూర్వా దికలశేఽగ్న్యాదౌ పఞ్చామృతజలాదికమ్ ।
దధి క్షీరం మదూష్ణోదం పాద్యం స్యాచ్చతురఙ్గకమ్.
యాగద్రవ్యాదులను సంరక్షించుకొని పైకీర ద్రవ్యములను (విఘ్ననివారణముకొరకై నాలుగు వైపులను చల్లు ఆవాలు మొదుగువాటికి విరము లనిపేరు) చల్లవలెను. అస్త్రమూలమంత్రమును (అస్త్రాయ ఫట్) ఏడు సార్లు జపించుచు ఈ విక్రమును చల్లవలెను. మరల అదే విధముగ అస్త్రమంత్రమును జపించుచు కుశ నిర్మితకూర్పమును తీసికొనవలెను. వాటిని ఊశానకోణమునం దుంచి వాటి పైన కలశమును వర్ధనిని ఉంచవలెను. కలశపై సాంగముగ శ్రీహరి పూజ చేసి, వర్ధనిలో అస్త్రపూజ చేయవలెను. ఆచ్ఛిన్నమగు వర్ధనీధార చే యాగమండపమును ప్రదక్షిణక్రమమున తడుపుచు కలశమును దానికి ఉపయుక్త మగు స్థానమున చేర్చి, ఆసనముపై ఉంచి, దాని పూజ చేయవలెను. కలశలో పంచరత్నము లుంచవలెను, దాని పై వస్త్రము చుట్టవలెను. దాని పై గంధాద్యుపచారములతో శ్రీహరిని పూజింపవలెను. వర్దినిలో కూడ బంగారు ముక్క ఉంచవలేను. దానిపై అస్త్రపూజ చేసి, దాని ఎడమ భాగమున, సమీపమునందే వాస్తు లక్ష్మీభూవినాయకులను పూజింపవలెను. సంక్రాంత్యాదికాలములందు ఈ విధముగనే శ్రీమహావిష్ణువు స్నానాభిషేకముల ఏర్పాటు చేయవలెను. మండపముయొక్క కోణములందును, దిక్కులందును ఎనిమిది కలశములను, మధ్యయందు ఒక కలశమును. మొత్తము భద్రములు లేని తొమ్మిది కలశములు-ఉంచి, వాటిలో పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, పంచగవ్యములు వేయవలేమ. పూర్వాదికలశములలో పైన చెప్పిన పస్తువులను, అగ్ని కోణాదులందలి కలశములలో ఆ ద్రవ్యములతో పాటు పంచామృతయుక్త జలమును చేయవలెను, పెరుగు, పాలు, తేనె, వేడినీళ్ళు - ఇవి పాద్యాంగములు.
పద్మశ్యామాకదూర్వాశ్చ విష్ణుపర్ణి చ పాద్యకమ్.
తథాష్టాఙ్గ్ఘార్యమాఖ్యాతం యవగన్దఫలాక్షతమ్.
కుశాః సిద్ధ్థారపుష్పాణి తిలద్రవ్యాణి చౌర్హణమ్ ।
లవఙ్గకఙ్యోలయుతం దద్యాదాచమనీయకమ్.
స్నాపయేన్మూలమన్త్రేణ దేవం పఞ్చామృతైరపి ।
శుద్దోదం మధ్యకుమ్భేన దేవమూర్ధ్ని వినిక్షిపేత్.
కలశాన్నిఃసృతం తోయం కూర్చాగ్రం సంస్పృశేన్నరః ।
శుద్దోదకేన పాద్యం చ అర్ఘ్య మాచమనం దదేత్.
పరిమృజ్య పటేనాఙ్గం సవస్త్రం మణ్డలమ్ నయేత్ ।
తత్రాభర్చ్యాచరేద్గోమం కుణ్డాదౌ ప్రాణసంయమీ.
ప్రక్షాల్య పాదౌ రేఖాశ్చ తిస్రః పూర్వాగ్రగామినః ।
దక్షిణాదుత్త రాన్తాశ్చ తిస్రశ్చైవౌత్తరాగ్రగాః.
కమలములు, శ్యామాకము, దూర్వాదలములు, విష్ణుక్రాన్తోషధి అను నాలుగు వస్తువులతో కూడిన జలము పాద్య మని చెప్పబడును. ఆర్ఘ్యమునకు కూడ ఎనిమిది అంగములు చెప్పబడినవి. ఆరముకొరకు యవలు, గంధము, ఫలములు, అక్షతలు, కుశలు, ఆవాలు, పుష్పములు, తిలలు సమకూర్చుకొనవలెను. జాతీలమగ-కంకోలములతో కూడిన జలమును ఆచమనీయముగా ఇవ్వవలెను. ఇష్టదేవతకు, మూలమంత్రము చదువుచు, పంచామృతస్నానము చేయించవలెను. మధ్య నున్న కలశమునుండి శుద్దోదకమును గ్రహించి దేవుని శిరము పై చల్లవలెను.కలశనుండి వచ్చు జలమును, కూర్చాగ్రమును స్పృశింపవలెను. పిమ్మట శుద్దోదకముతో పాడ్య-అర్ఘ్య-ఆచమనీయములు సమర్పింపవలెను. వస్త్రముచే దేవతామూర్తిని తుడిచి, వస్త్రధారణము చేయించి, సవస్త్రకముగ మండలముమీదికి దీసికొని వెళ్ళవలెను. అచట బాగుగా పూజ చేసి, ప్రాణాయామపూర్వకముగ కుండాదులలో హోమము చేయవలెను. (హవనవిధానము) రెండు చేతులు కడిగి, అగ్నికుండమునందు గాని, చేది పై గాని మూడు వూర్వాగ్ర రేఖలు గీయవలెను. వాటిని దక్షిణమునుండి ప్రారంభించి, ఉత్తరము వైపు గీయవలెను. మరల వాటిపై మూడు ఉత్తరాగ్ర రేఖలు గీయవలెను. (వీటిని కూడ కుడినుండి ప్రారంభించి ఎడమకు గీయవలెను).
అర్ఘ్యోద కేన సంప్రోక్ష్య యోనిముద్రాం ప్రదర్శయేత్ ।
ధ్యాత్వాత్మరూపం చాగ్నిం తు యోన్యాం కుణ్డే క్షి పేన్నరః.
పాత్రాణ్యాసాదయేత్పశ్చాద్దర్బసృక్ స్రువకాదిభిః ।
బాహుమాత్రాః పరిధయ ఇద్మప్రశ్చనమేవ చ.
ప్రణీతా ప్రోక్షణిపాత్రమాజ్యస్థాలీ ఘృతాదికమ్ ।
ప్రస్థద్వయం తణ్డులానాం యుగ్మం యుగ్మమధోముఖం.
ప్రణీతా ప్రోక్షణీపాత్రే న్యసేత్రాగగ్రం కుశమ్ ।
ఆద్భిః పూర్వప్రణీతాం తు ధ్యాత్వా దేవం ప్రపూజ్య చ.
ప్రణీతాం స్థాపయేదగ్రే ద్రవ్యాణాం చైవ మధ్యతః ।
ప్రోక్షణీమద్భిః సంపూర్య ప్రార్చ్య దక్షే తు విన్యసేత్.
చరుం చ శ్రపయేదగ్నౌ బ్రహ్మానాం దక్షిణే న్యసేత్ ।
కుశానాస్తిర్య పూర్వదౌ పరిధీన్ స్థాపయేత్తతః.
వైష్ణవీకరణం కుర్యాద్గర్భాధానాదినా నరః ।
గర్భాధానం పుంసవనం సీమన్తోన్నయనం జనిః.
నామాదిసమావర్తానం జుహుయాదష్టచాహుతీ ।
పూర్ణాహుతిః ప్రతికర్మ సృచా స్రువసుయుక్త యా.
పిమ్మట ఆర్ఘ్యజలముతో ఈ రేఖలను కడిగి యోని ముద్ర చూపవలెను. ఆగ్నిని ఆత్మరూపముగా భావించుచు యోనియుక్త మగు కుండమునందు స్థాపింపవలెను. పిమ్మట దర్బ-సృకో-స్రువాదులతో కూడ పాత్రాసాదనము చేయవలెను. బాహుప్రమాణము గల పరిధులు, ఇద్మ వశ్చనము, ప్రణీతాపాత్రము, ప్రోక్షణీత్రము, ఆట స్థాలి, ఆజ్యము, రెండు రెండు ప్రస్థముల బియ్యము; అధోముఖములుగా నున్న సకసువము. ప్రణీతయందును, ప్రోక్షణియందును పూర్వాగ్రముగ కుశ లుంచవలెను. ప్రణీతను నీటితో నింపి, భగవద్ధ్యానము చేసి, దానిని ఆగ్ని కి పశ్చిమమున, తన ఎదుట, సమకూర్చిన ద్రవ్యముల మధ్య ఉంచవలెను. ప్రేక్షణిని నీటితో నింపి పూజానంతరము కుడి వైపున ఉంచవలెను. చర వును అగ్నిపైఉంచి ఉడికించవలెను. అగ్నికి దక్షిణమున బ్రహ్మను స్థాపింపవలెను. అగ్ని కుండమునకు లేదా వేదికి, నాలుగు ప్రక్కల, పూర్వాది దిక్కులందు బరి స్సు పరిచి పరిధులను ఉంచవలేను. పిమ్మట గర్భాధానాది సంస్కారముల ద్వారా ఆగ్నికి వైష్ణవీకరణము చేయవలెను, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము మొదలు సమావర్తనము వరకు నున్న సంస్కారములు చేసి ఒక్కొక్క కర్మకు ఎనిమిదేసి ఆహుతుల నివ్వవలెను. స్రువతో కూడిన సృక్కుతో పూర్ణాహుతి ఇవ్వనలెను.
కుణ్డమధ్యే ఋతుమతీం లక్ష్మీం సంచిన్త్య హోమయేత్ ।
కుణ్డలక్ష్మీః సమాఖ్యాతా ప్రకృతిస్త్రిగుణాత్మికా.
సా యోనిః సర్వభూతానాం విద్యా మన్త్రగణస్య చ ।
విముక్తేః కారణం వహ్నిః పరమాత్మా చ ముక్తిదః.
ప్రాచ్యాం శిరః సమాఖ్యాతం బాహూ కోణే వ్యవస్థితౌ ।
ఈశానాగ్నేయకోణే తు జజ్ఘే వాయవ్యనైరృతే.
ఉదరం కుణ్డమిత్యుక్తం యోనిర్యోనిర్విధీయతే ।
గుణత్రయం మేఖలాః స్యుర్ధ్యాత్వైవం సమిధో దశ.
పఞ్చాధికాంస్తు జుహుయాత్ప్రణవాన్ముష్టిముద్రయా ।
పునరాఘారౌ జుహుయాద్వాయ్వగ్న్యన్తం తతః శ్రయేత్.
ఈశాన్తం మూలమన్త్రేణ ఆజ్యభాగౌ తు హోమయేత్ ।
ఉత్తరే ద్వాదశాన్తేన దక్షిణేతేన మధ్యతః.
వ్యాహృత్యా పద్మమధ్యస్థం ధ్యాయేద్వహ్నిం తు సంస్కృతమ్ ।
వైష్ణవం సప్తజిహ్వం చ సూర్యకోటిసమప్రభమ్.
చన్ర్దవక్త్రం చ సూర్యాక్షం జుహుయాచ్ఛతమష్ట చ ।
తదర్థం చాష్టమూలేన ఆఙ్గానాం చ దశాంశతః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అగ్నికార్యకథనం నామ చతుస్త్రింశోఽధ్యాయః.
కుండము మధ్య, ఋతుస్నాత యగు, లక్ష్మిని ధ్యానించి హోమము చేయవలెను. కుండములోపల నున్న లక్ష్మికి కుండలక్ష్మీ అని పేరు. త్రిగుణాత్మిక యగు ప్రకృతి ఈ లక్ష్మియే. ఈమెయే సకలభూజములకును, సకలమంత్రము లకును, విద్యలకును ఉత్పత్తిస్థానము, పరమాత్మ స్వరూపు. డగు అగ్ని దేవుడు మోక్షమునకు, కారణ మైనవాడు; ముక్తిదాత. కుండలక్ష్మి శిరస్సు తూర్పుదిక్కు వైవునను, భుజములు ఈశాన్య ఆగ్నేయదిక్కులవై పునను, కాళ్ళు వాయవ్యనై రృతిదిక్కులవై పునకును ఉండును. గుండమే ఉదరము. కుండమునందలి యోనిస్థానము యోని. మూడు మేఖలలు సత్వరజస్తమోగుణములు. ఈ విధముగ ధ్యానించి ముష్టిముద్రతో పదునైదు సమిధలను హోమము చేయవలెను. పిదప వాయవ్యదిక్కు నుండి ఆగ్నేయదిక్కు వరకును ‘ఆధారములు’ అనేడు రెండు ఆహుతుల నివ్వవలెను. ఇదే విధమున ఆగ్నేయముమండి ఈశాన్యము - వరకు ఆజ్యభాగములను ఆహుతులు చేయవలెను. ఆజ్యస్థాలినుండి ఉత్తర దక్షిణ మధ్యభాగములనుండి ఆజ్యము గ్రహించి ద్వాదశాంతముతో, అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి, అగ్నియందు, ఆ దిక్కులందే హోమము చేసి, ఆచటనే త్యాగము చేయవలెను. పిమ్మట “భూః స్వాహా ఇత్యాదిక్రమమున వ్యాహృతిహోమము చేయవలెను. కమలమధ్యభాగమున సంస్కారసంపన్నుడగు. అగ్ని దేవుని ధ్యానింపవలెను. “ఈ ఏడు జహ్వలతో కోట్లకొలది సూర్యుల ప్రకాశముతో ప్రకాశించును. ఆతని ముఖము చంద్ర సదృశము. నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగ నున్నవి”. ఈ విధముగ ధ్యానించి అగ్ని దేవునకు నూటఎనిమిది ఆహుతులు సమర్పింపవలెను. లేదా మూలమూలమంత్రముచే, అందులో సగము సంఖ్యగల ఆహుతులను, మరి యెనిమిది ఆహుతులమ ఇవ్వవలెను. ఆంగములకు కూడ పదేసి ఆహుతులు ఇవ్వవలెను.
ఆగ్ని మహాపురాణమున అగ్ని కార్యకథన మను ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 34 of the Agni Purāṇa is as follows:
The thirty-fourth chapter presents a systematic account of the duties (dharma-s) enjoined upon each of the four varṇa-s (Brāhmaṇa, Kṣatriya, Vaiśya, Śūdra) and the four āśrama-s (Brahmacarya, Gṛhastha, Vānaprastha, Saṃnyāsa). The Purāṇa affirms that varṇāśrama dharma is the very foundation of cosmic order, ordained by Bhagavān himself at the beginning of creation. The brāhmaṇa's duties of study, teaching, performing and officiating at sacrifices, and acceptance of gifts are detailed. The kṣatriya's duty to protect his subjects, govern justly, and sacrifice is described. The vaiśya's dharma of agriculture, cattle-keeping, and trade, and the śūdra's dharma of service to the other three orders are outlined. The āśrama duties — from the celibate student's discipline to the householder's sacrifice and hospitality to the forest-dweller's austerity and the renunciant's non-attachment — are described as successive stages of the soul's purification.