అగ్ని రువాచః
చతుర్విదస్తు ప్రలయోనిత్యోయః ప్రాణినాంలయతః ।
సదావినాశో జాతానాం బ్రహ్మోనిమిత్తికో లయః.
చతుర్యుగ సహస్రాన్తే ప్రాకృతః ప్రాకృతోలయః ।
లయ ఆత్య న్తికోజ్ఞానా దాత్మనః పరమాత్మని.
నైమిత్తికస్య కల్పా న్తేవక్ష్యే రూపం లయస్యతే ।
చతుర్యుగసహస్రాంతే క్షీణప్రాయే మహీతలే.
ఆనావృష్టిరతి వోగ్రాజాయతే శతవార్షికీ ।
తతః తత్త్వక్షయః స్యాచ్చతతో విష్ణుర్జగత్పతిః.
స్థితో జలాని పిబతిలానో సప్తసురశ్మిము ।
భూపాతాల సముద్రాదితోయం నయతిసంక్షయమ్.
తతస్తస్యానుభావేన తోయాహారోప బృంహితాః ।
తపవరశ్మయః సప్తజాయన్తే సప్తభాస్కరాః.
దహన్ త్య శేషం త్రైలోక్యం సపాతాల తలంద్విజ ।
కూర్మపృష్ఠ సమాభూః స్యా త్తతః కాలాగ్ని రుద్రకః.
శేషాహిశ్వాస సంపాతాత్పాతాలాని దహత్యధః ।
పాతాలేభ్యో భువం విష్ణుర్భువః స్వర్గం దహత్యతః.
ఆంబరీష మీవాభాతి త్రైలోక్య మఖిలం తథా ।
తతస్తాప పరీతాస్తు లోకద్వయ నివాసిను.
గచ్ఛనితే మహర్లోకం మహర్లో కాజ్జనం తతః ।
రుద్రరూపీ జగద్దగ్ధ్వాముఖనిః శ్వానతో హరేః.
ఉత్తిష్ఠంతి తతో మేఘనానా రూపాః సవిద్యుతః ।
శతంవర్షాణి వర్ష నః శమయంత్యగ్ని ముత్థితమ్.
సప్తర్షస్థానమాక్రమ్య స్థితేఽమసి శతం మరుత్ ।
ముఖనిః శ్వాసతో విష్ణోర్నాశం నయతితాంఘనాన్.
వాయుం పీత్వా హరిః శేషే శేతే చై కార్ణవే ప్రభుః ।
బ్రహ్మరూపధరః సిద్ధైర్ణలగై ర్ము నిభిః స్తుతః.
ఆత్మమాయామయీం దివ్యాం యోగనిద్రాం సమాస్థితః ।
ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్మధుసూదనః.
కల్పం శేతే ప్రబుద్ధోఽథ బ్రహ్మరూపీ సృజత్యఽసౌ ।
ద్విపరార్ధం తతోఽవ్యక్తం ప్రకృతౌ లీయతే ద్విజ.
అగ్ని పలికెను ప్రళయము నాలుగు విధముల. నిత్యము జరుగుచున్న ప్రాణుల మృత్యువు నిత్య ప్రళయము. ప్రాణులందరును పూర్తిగా నశించుట బ్రాహ్మలయము లేదా నైమిత్తిక లయము. చెయ్యి చతుర్యుగములు గడచిన పిమ్మట పచభూతములు ప్రకృతిలో లీనమైనపుడు అది ప్రాకృతలయము. జ్ఞానము వలన జీవాత్మ పరమాత్మలో లీనుడగుట ఆత్యంతిక లయము. కల్పాంతమున జరుగు నైమిత్తి కలయమును గూర్చి చెప్పెదను, చతుర్యుగ సహస్రాంతమున భూమి చాలా వరకు క్షీణమై పోవును. నూరు సంవత్సరములు భయంకరములైన అనావృష్టి ఏర్పడును. ప్రాణులఁదరువు నశింతురు. అపుడు జగత్పతియైన విష్ణువు సూర్యుని ఏడు కిరణముల ద్వారా భూపాతాళ - సముద్రాదులలో వున్న జల మును నశింపచేయును. పిదప ఆయన ప్రభావముచే ఆ జలమును పీల్చటచే పుష్టి చెందిన ఆ ఏడు రశ్ములు ఏడుగురు భాస్కరులుగా ఏర్పడి పాతాళ తల శీతమగు త్రైలోక్యము నంతను భస్మము చేయుము. అపుడు భూమి తాబేలు పైభాగము వలె కనబడును. ఆది శేషుని శ్వాసనుండి కాలాగ్ని రుదుడు ఆవిర్భవించి క్రిందనున్న పాతాళములను భస్మము చేయును. పిదప విష్ణువు భూమిని స్వర్గమును కాల్చివేయును. ఆ సమయమున త్రైలోక్యము ప్రజ్వలించుచున్న మంగలము వలె కన బడును. అపుడు తాపముతో బాధపడుచున్న భువర్లోక స్వర్గలోక వాసులు మహర్లోకమునకు వెళ్ళి అచట నుడి జనలోకము సకు వెళ్ళుదురు. ఇట్లు రుద్రరూపి జగత్తును కాల్చి వేయగ హరి యొక్క శ్వాసము నుండి మెరుపులతో గూడిన వివిధ రూపములు గల మేఘములావిర్భవించును. నూరు సంవత్సరములు వర్షించి ఆ అగ్నిని శమింప చేయును. ఆ ఆలము స పర్షి స్థానము వరకు చేరిన పిమ్మట, విష్ణు ముఖము నుండి బయలుదేరిన నిశ్వాసము వాయురూపమున వంద సంవత్సరములు వీచి ఆమేఘములను చెదర గొట్టును. పిదప ఆహరి హయువును త్రాగివేసి ఏకార్ణవమునందు ఆది శేషుని పై శయనించును. ఆ సమయమున సిద్ధులు, మహర్షులు, బ్రహ్మరూప ధారియగు ఆతనిని స్తుతింతురు. మధుసూదనుడు ఆత్మ మాయా రూప మగు దివ్య యోగ నీ దను అవలంబించి తన వాసు దేవ స్వరూపమును చింతించుచు ఒక కల్పము కొలము శయనించును. పిదపలేచి బ్రహ్మరూపియై మరల సృజించును. ఈ విధముగ బ్రహ్మ యొక్క రెండు పరార్దమాల ఆయుర్దాయము గడచిన పిమ్మట ఈ స్థూల ప్రపంచము ప్రకృతి యందు లీనమగును.
స్థానాత్స్థానం దశగుణమేకస్మాద్గుణ్య స్థలే ।
తతోఽష్టాదశకే భాగే పరార్దమభిధీయతే.
వరార్ధం ద్విగుణం యత్తు ప్రాకృత ప్రలయః స్మృతః ।
ఆనావృష్ట్యాఽగ్ని సంపర్కాత్కృతే నంజ్వలనేద్విజ.
మహదాడేర్వికారస్య విశేషా న్తస్య సంక్షయే ।
కృష్ణే చ్చా కారితే తస్మిన్సంప్రాప్తే ప్రతిసంచరే.
ఆపో గ్రస న్తివై పూర్వం భూ మేర్గంధాదికం గుణమ్ ।
ఆత్మగంధా త్తతో భూమిః ప్రలయత్వాయ కల్పతే.
రసాత్మి కాశ్చ తిష్ఠని హ్యాపస్తాసాం రసో గుణ ।
పీయతే జ్యోతిషా తాసు నిషాస్వగ్నిశ్చ దీప్యతే.
జ్యోతిషోఽపి గుణతి రూపం వాయునతి భాస్కరమ్ ।
నష్టజ్యోతిష వాయుశ్చ బలిదోదూయతే మహాన్.
వాయోరపి గుణం స్పర్శమాకాం గ్రసతేతత ।
వాయౌనషేతు దాకాశం నీరం తిష్ఠతిద్విజ.
ఆకాశ స్యాథవై శబ్దం భూతాదిసలే చఖమ్ ।
అమానాత్మకం ఖంచ భూతాదిసతేమహాన్.
భూమిర్యాతి లయంప్పు ఆపో జ్యోతిషితదజేల్ ।
వాయౌ వాయుశ్చ ఖే, ఖంచ, అహంకారే లయం న చ.
మహత్తత్వే మహా న్ తంచ ప్రకృతిర్గ్రసతేద్విజ ।
వ్యక్తాఽవ్యక్తా చ ప్రకృతి ర్వ్య కస్యావ్యక్తకేలయః.
పుమానేకాక్షరః శుద్ధః సోఽప్యంశః పరమాత్మనః ।
ప్రకృతిః పురుషశ్చైతౌ లీయేతే పరమాత్మని.
నసంతి యత్రసర్వేశ నామజాత్యాది కల్పనాః ।
సత్తామాత్రాత్మ కేజ్ఞేయే జ్ఞానాత్మ న్యాత్మనఃపరే.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే నిత్యనైమిత్తిక ప్రాకృత ప్రలయవర్ణనం నామాష్ట షష్ట్యధిక త్రిశతతమోధ్యాయః.
ఒకటి నించి పదిచొప్పున గుణించుచు పోగ పదునెనిమిదవ స్థాపము చేరునప్పటికి ఎంత సంఖ్య వచ్చునో ఆది పరార్ధము. దానికి రెట్టింపు కాలము గడచిన పిమ్మట ప్రాకృత ప్రళయము ఏర్పడును. వర్షములు లేకపోవుటచే అగ్ని ప్రజ్వలించి అంతయు భస్మమైపోవును. మహత్తత్వము మొదలు విశేషము వరకు ఉప కార్యములన్నియు నశించును. భగవంతుని ఇచ్చను అమసరించీ ఆప్రళయము రాగా జలము భూమిలో వున్న గoధాది గుణములన తనలో లీనము చేసు కొనును. ఆపుడు గంధమానమగు పృథివి నీటిలో లీనమైపోవును. పిదప రసమయమగు జలము మిగులును. రసము జలమున గుణము. ఆగ్ని ఆర సమును త్రాగి వేయగా జలము లీనమైపోవును. ఆగ్ని తత్త్వము ప్రజ్వలించును. పిమ్మట తేజస్సు యొక్క ప్రకాశ గుణమున వాయువు మింగి వేయును. ఈ విధముగా అగ్ని తత్త్వమా లీనమై పోగా గొప్ప వాయువు వీచును. వాయువు యొక్క గుణమగు స్పర్శను ఆకాశము మ్రింగి వేయగా, వాయువు నశించి ఆకాశ ము మాత్రము నిశ్శబ్దముగా మిగులును. రూతములకు కారణమగు అహంకారము ఆకాశ గుణ మగు శబ్దమును మ్రింగి వేయగ తేజసాహంకారము ఇంద్రియములను తనలో లయము చేసుకొనను దానిని మహత్తత్వము తనలోన లీనము చేసుకొనుము. ఈ విధముగా భూమి జలము నందు, జలము అగ్ని యందు, అగ్ని వాయువు నందు, వాయువు ఆకాశము నందు, ఆకాశము ఆహంకారము నందు, అహంకారము మహత్తత్వమునందు లీన మగువ. దానిని ప్రకృతి తనలో లీనము చేసుకొనును. “వ్యక్త, “అవ్య క్ష” అని ప్రకృతి రెండు విధములు. “వ్యక్త” అవ్యక్తములో లీన మగును. ఆవివాళియు, చద్ద స్వరూపుడు అగు ఏకైక పురుషుడు ఎవడున్నాడో అతడు కూడ పరమాత్మ అంశమే. చివరకు ప్రకృతియు పురుషుడును పరమాత్మ యందేలీన మగును. ఆ పరమాత్మ సత్స్వరూపము జ్ఞేయము, జ్ఞాన మయము, బుద్ద్యాదుల కంటే పరమ. ఆ పరమాత్మ యందు నామ, జాత్యాది కల్పనలు వుండవు.
ఆగ్ని మహా పురాణము నిత్య నైమిత్తిక ప్రాకృత - ప్రళయ వర్ణన మను మూడు వందల అరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 369 of the Agni Purāṇa is as follows:
The ātyantika pralaya — final liberation through jñāna — is described: the jñānī whose ignorance is dissolved ceases the cycle of rebirth permanently. The chapter then turns to the suffering that makes liberation desirable: the three types of sorrow — ādhyātmika (arising from one's own body and mind), ādhidaivika (arising from divine causes such as weather and epidemic), and ādhibhautika (arising from other beings). The formation of the embryo (garbha) in the womb is detailed, with the stages of development from the union of śukra and śoṇita through the appearance of the five senses. The three constitutional types (vāta, pitta, kapha), the seven dhātus (rasa, rakta, māṃsa, meda, asthi, majjā, śukra), the six skin layers, the seven kalās (membranes), and the total counts of bones, joints, veins, and muscles are enumerated, showing the elaborate precision of Āyurvedic embryology.