అగ్ని రువాచః
హరివంశం ప్రవక్ష్యామి విష్ణునాభ్యముజాదజః ।
బ్రహ్మణోఽత్రిస్తతః సోమః సోమాజ్ఞాతః పురూరవాః.
తస్మాదాయురభూ త్తస్మాన్న హుషోఽతో యయాతికః ।
యదుం చ తుర్వసుం తస్మాద్దేవయానాప్యజాయత.
ద్రుహ్యుం చానుం చ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణీ ।
యదోః కులే యాదవాశ్చ వాసుదేవ స్తదుత్తమః.
అగ్ని పలికెను- హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను బ్రహ్మకు అత్రి, అతనికి సోముడు, ఆతనికి పురూరవుడు, అతనికి ఆయువు, ఆతనికి. నహుషుడు, ఆతనికి యయాతి పుట్టిరి. అతనినుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషపర్వుని కుమార్తె యేన శర్మిష్ట ద్రుహ్యు-ఆను పూరులు అనేడు కుమారులను కనిరి. యదువు కులమునందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు.
భువో భారావతారార్థం దేవక్యాం వసుదేవతః ।
హిరణ్యకశిఫోః పుత్రాః షడ్ గర్భా యోగనిద్రయా.
విష్ణుప్రయుక్తయా నీలో దేవకీజఠరం పురా ।
అభూచ్చ సప్తమో గర్భో దేవక్యా జఠరాద్బలః.
సంక్రామితోఽభూద్రోహిణ్యం రౌహిణేయ స్తతో హరిః ।
కృష్ణాష్టమ్యాం చ నభసి అర్ధరాత్రే చతుర్భుజః.
భూ భారమును తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకశిపుని ఆరుగురు పుత్రులు దేవకి యందు వసుదేవుని వలన, విష్ణు పేరిత యైన యోగమాయ ప్రభావముచే పుట్టిరి. బలరాముడు దేవకి నప్త మ. గర్భముగా ఆయెను. ఆతడు రోహిణి యందు సంక్రమింపచేయబడి రొహిణేయుడాయెను. పిమ్మట చతుర్భుజుడైన హరి. శ్రావణ కృష్ణపష్టమి యందు అర్ధరాత్రమున జనించెను.
దేవక్యా వసుదేవేన స్తుతో బాలో ద్విబాహుకః ।
వసుదేవః కంసభయాద్యశోదాశయనేఽనయత్.
యశోదాబాలికాం గృహ్య దేవకీ శయనేఽనయత్ ।
కంసో బాలధ్వనిం శ్రుత్వా తాం చిక్షేప శిలాతలే.
రెండు ఖాహువులు గల బాలుడుగా మారిన ఆ చతుర్బుజుని దేవకి వసుదేవులు స్తుతించిరి. వసుదేవుడు కంసునికి భయపడి ఆ పిల్లవానిని తీసికొని వెళ్లి యశోద వక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసికొని వచ్చి దేవకి పక్కలో వరుండ బెట్టెను. కంసుడు పిల్ల ఏడ్చిన ధ్వని విని ఆ శిశువును శిలపై వేసి కొట్టెను.
వారితోఽపి స దేవక్యా మృత్యుర్గర్భోష్టమో మమ ।
శ్రుత్వాశరీరిణీం వాచం మత్తో గర్భాః సుమారితాః.
సమర్పితాస్తు దేవక్యా వివాహసమయేరితాః ।
సా క్షిప్తా బాలికా కంసమాకాశస్థాఽబ్రవీదిదమ్.
దేవకి వారించినను “నీ అష్టమగర్భము నాకు మృత్యు హేతువు” అని పలుకుచు అట్లు చేసెను. ఆకాశవాణిని విని ఆతడు దేవకి వివాహసమయమున చెప్పిన ప్రకారము తన కిచ్చిన శిశువులనందరిని పూర్వము చంపివే నేను. క్రిందికి విసరి వేయబడిన ఆ బాలిక ఆకాశము పైకి ఎగిరి కంసునిలో ఇట్లు పలికెను.
బాలికోవాచః
కిం మయా క్షి ప్తయా కంస జాతో యస్త్వాం వధిష్యతి ।
సర్వస్వభూతో దేవానాం భూభారహరణాయ సః.
బాలిక పలికెను. కంసా; నన్ను విసరివేసి ఏమి ప్రయోజనము? దేవతలకు నర్వస్వము వంటివాడు ఒకడు భూభారమును తొలగించుటకై పుట్టినాడు. అతడు నిన్ను చంపివేయగలడు.
ఇత్యుక్త్వా సా చ శుమ్బాదీన్ హత్వేన్ద్రేణ చ సంస్తుతా ।
ఆర్యా దుర్గా వేదగర్భా ఆమ్బికా భద్రకాల్యపి.
భద్రా క్షేమ్యా క్షేమకరీ నైకబాహుర్నమామి తామ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నామ సర్వాన్కామానవాప్నుయాత్.
ఇట్లు పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే “ఆర్యా! దుర్గా, వేదగర్భా, అంబికా, భద్రకాళి, భద్రా, జేమ్యా జేమకర్, నైకబాహుః అను పేర్లు గల నిన్ను నమన రించుచున్నాను.” అని స్తుతించబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమస్త కామములను పొందును.
కంసోఽపి పూతనాదీంశ్చ వ్రైషయద్బాలనాశనే ।
యశోదాపతినన్దాయ వసుదేవేన చార్పితౌ.
రక్షణాయ చ కంసాదేర్బీతేనేవ హి గోకులే ।
రామకృష్ణౌ చేరతుస్తౌ గోభిర్గోపాలకైః సహ.
నర్వస్య జగతః పాలౌ గోపాలౌ తౌ బభూవతుః ।
ఆ బాలుని చంపుటకై, కంసుడు, పతన మొదలగు వారిని పం పెను. కంసునినుండి భయపడినవాడు వలె వసుదేవునిచే యశోదావతియైన నందునికి రక్షణార్థమె ఈయబడిన రామకృష్ణులు గోకులము నందు గోవులతోడను, గోపాలకులతోడనుకలిసి నంచరించిరి. జగత్తునకు పాలకులైన వారు గోపాలులైరి.
కృష్ణశ్చోలూఖలే బద్ధో దామ్నా వ్యగ్రయశోదయా.
యమలార్జునమధ్యేఽగాద్భగ్నౌ చ యమలార్జునౌ ।
విసుగు చెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు ఆర్జునవృక్షముల మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.
పరివృత్తశ్చ శకటః పాదక్షేపాత్త్సనార్థినా.
పూతనా స్తనపానేన సా హతా హన్తుముద్యతా ।
వృన్దావనగతః కృష్ణః కాలియం యమునాహ్రదాత్.
జిత్వా నిఃస్సార్య చాబ్ధస్థం చకార బలసంస్తుతః ।
క్షేమం తాలవనం చక్రే హత్వా ధేనుకగర్దభమ్.
బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యమును కోరుచు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివేసెను. కాలియుని జయించి ఆతనిని యమునాప్రదము నుండి వెడలగొట్టి సముద్రమునందు నివసించునట్లు చేసెను. బలముచే స్తుతింపబడిన ఆతడు గర్దభరూపమున నున్న ధేనుకాసురుని చంపి అలవనమును క్షేమకరమైన దానినిగా చేసెను.
అరిష్టవృషభం హత్వా కేశినం హయరూపిణమ్ ।
శక్రోత్సవం వరిత్యజ్య కారితో గోత్రయజ్ఞకః.
వృషభ రూపముననున్న అరిషాసురుని వంపి హయరూపములో ఉన్న కేశిని సంహరించెను. శకోత్సవమును మాన్ని పర్వతపూజ చేయిందెను.
పర్వతం ధారయిత్వా చ శక్రాద్వృష్టిర్ని వారితా ।
నమస్కృతో మహేన్ద్రేణ గోవిన్దోఽథార్జునోఽర్పితః.
ఇన్ద్రోత్సవస్తు తుష్టేన భూయః కృష్ణేన కారితః ।
పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపించిన వర్షము నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి అర్జునుని సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.
రథస్థో మథురాం చాగాత్కంసోక్తాక్రూరసంస్తుతః.
గోపీభిరనురక్తాభిః క్రీడితాభిర్నిరీక్షితః ।
రజకం చాప్రయచ్ఛన్తం హత్వా వస్త్రాణి చాగ్రహీత్.
సహ రామేణ మాలాభృన్మాలాకారే వరం దదౌ ।
దత్తానులేపనాం కుబ్జామృజుం చ క్రేఽహనద్గజమ్.
మత్తం కువలయాపీడం ద్వారి రఙ్గం ప్రవిశ్య చ ।
కంసాదీనాం పశ్యతాం చ మఞ్చస్థానాం నియుద్దకమ్.
చక్రే చాణూరమల్లేన ముష్టి కేన బలోఽకరోత్ ।
చాణూరముష్టికౌ తాభ్యాం హతౌ మల్లౌ తథావరౌ.
కంసుడు వంపిన అక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథము నెక్కి మథురకు వెళ్ళేను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు ఆతనితో క్రీడించిన, అనుర కలైన గోపికలు ఆతనిని చూచుచు నిలబడిపోయిరి. వస్త్రముల నడుగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. ఆంగరాగమునిచ్చిన కుట్టకు గూను పోవునట్లు చేసేను. రాజద్వారమునందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, ఆననముల పై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరమల్లునితో మల్ల యుద్ధము చేనెను. బలరాముడు ముష్టికుడను మల్లునితో చేసెను. వారిరువురు ఆ చాణూరముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.
మథురాధిపతిం కంసం హత్వా తత్పతరం హరిః. ।
చక్రే యాదవరాజానమ స్తిప్రా ప్తీచ కంసగే.
జరాసన్దన్య తే పుత్య్రౌ జరానన్దస్తదీరితః ।
చక్రే స మథురారోధం యాదవై ర్యుయుధే శరైః.
శ్రీకృష్ణుడు మథురావతి యైన కంసుని చంపి ఆతని తండ్రిని రాజుగా చేసెను. కంసుని భార్యలైన అస్తి - ప్రాప్తి అనువారు జరాసంధుని కుమార్తెలు. వారు ప్రేరేపింపగా జరాసంధుడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు బాణములతో అతనితో యుద్ధము చేసిరి.
రామకృష్ణౌ చ మథురాం త్యక్త్వా గోమ న్తమాగతా ।
జరాసన్ధం విజిత్యాజౌ పౌండ్రకం వాసుదేవకమ్.
పురా చ ద్వారకాం కృత్వా న్యవసద్యాదవైర్వృతః ।
రామకృష్ణులు మథురను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్దమున జరాసంధుని జయించి, పౌండ్రక వాసు దేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను.
భౌమం తు నరకం హత్వా తేనానీతాశ్చ కన్యకాః.
దేవగన్దర్వయక్షాణాం తా ఉవాహ జనార్దనః ।
షోడశ స్త్రీసహస్రాణి రుక్మిణ్యాద్యా న్తథాష్ట చ.
జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురిని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్షకన్యలను వివాహ మాడెను. ఈ విధముగ ఆతడు కూడ పదహారువేలమంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండుగురిని వివాహమాడెను.
సత్యభామాసమాయుక్తో గరుడే నరకార్ధనః ।
మణిశైలం సరత్నే చ ఇన్ర్దం జిత్వా హరిర్దివి.
పారిజాతం సమానీయ సత్యభామా గృ హేఽకరోత్ ।
నరకాసురసంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూఢుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణితమును, రెండు రత్నములను, పారిజాతవృక్షమును తీసికొని వచ్చి సత్యభామా గృహమున ఉంచెను.
సాందీపనేశ్చ శస్త్రాస్త్రం జ్ఞాత్వా తద్బాలకం దదౌ.
జిత్వా పఞ్చజనం దైత్యం యమేన చ సుపూజితః ।
అవధీత్కాలయవనం ముచుకున్దేన పూజితః.
వసుదేవం దేవకీం చ భక్తాన్విప్రాంశ్చ సోఽర్చయత్ ।
సాందీపని నుండి శస్త్రాస్త్రముల నభ్యసించి, మరణించిన ఆతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను, పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందునిచే పూజింపబడెను. దేవకీవసుదేవులను, భక్తులను, విప్రులను పూజించెను.
రేవత్యాం బలభద్రాచ్చ జజ్ఞాతే నిశఠోల్ముకౌ.
కృష్ణాత్సామ్బో జామ్బవత్యామన్యాస్వన్యేఽభవన్సుతాః ।
ప్రద్యుమ్నోఽభూచ్చ రుక్మిణ్యం ష్ఠషేహ్ని స హృతో బలాత్.
శమ్బరేణమ్బుదౌ క్షిప్తో మత్స్యో జగ్రాహ ధీవరః ।
తం మత్స్యం శమ్బరాయాధాన్మాయావత్యై చ శమ్బరః.
మాయావతీ మత్స్యమధ్యే దృష్ట్వా స్వం పతిమాదరాత్ ।
పుపోష సా తం చోవాచ రతి స్తేహం పతిర్మమ.
కామస్త్వం శమ్భునానఙ్గః కృతోఽహం శమ్బరేణ చ ।
హృతా న తస్య పత్నీ త్వం మాయాజ్ఞః శమ్బరం జహి.
బలభద్రునకు రేవతియందు నిశతుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి. కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టెను. ఆరవదినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరించి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొనెను (మ్రింగెను). ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరున కిచ్చెను. శంబరుడు మాయావతి కిచ్చెను. మాయావతి మత్స్యగర్భములో నున్న తన పతిని చూచి ఆదరముతో పెంచెను. ఆతనితో ఇట్లనెను. “నేను నీ రతిని. నీవు నాపతి వైన మన్మథుడవు. శివుడు నీకు శరీరము లేకుండు నట్లు చేసెను. నన్ను శంబరుడు హరించేను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.
తచ్ఛ్రుత్వా శమ్బరం హత్వా ప్రద్యుమ్నః సహ భార్యయా ।
మాయావత్యా యయౌ కృష్ణం కృష్ణో హృష్టాథ రుక్మిణి.
ఆ మాట విని ప్రద్యుమ్నుడు శంబరుని చంపి భార్యయైన మాయావతితో కూడ కృష్ణుని వద్దకు వెళ్ళగా రుక్మిణీ కృష్ణులు సంతసించిరి.
ప్రద్యుమ్నాదనిరుద్దోఽభూదుషావతి రుదారధీః ।
బాణో బలిసుతస్తస్య సుతోషా శోణితం పురమ్.
తవసా శివపుత్రోఽభూన్మయూరధ్వజపాతితః ।
యుద్ధం ప్రాప్స్యసి బాణ త్వం బాణం తుష్టః శివోఽభ్యధాత్.
ప్రద్యుమ్నునకు ఉషాపతియు, ఉదార బుద్ధియు ఆగు అనిరుద్దుడు పుట్టెను. బలిపుత్రుడైన బాణుడుండెను. ఆతని కుమార్తె ఉష. ఆతని నగరము శోణితపురము. ఆతడు తపస్సుచే శివునికి పుత్రుడు వంటివాడాయెను. ‘ఓ బాణా! నీ మయూరధ్వజము ఎప్పుడు పడిపోవునో అప్పుడు నీవు యుద్దము పొందగలవు’ అని సంతసించిన శివుడు పలికెను.
శివేన క్రీడతీం గౌరీం దృష్టాషా సస్పృహా పతౌ ।
తామాహ గౌరీం భర్తా తే నిశి స్వప్నేతు దర్శనాత్.
వైశాఖమాసద్వాదశ్యాం పుమాన్ భర్తా భవిష్యతి ।
గౌర్యుక్తా హర్షితా చోషా గృహే సుప్తా దదర్శ తమ్.
ఆత్మనా సఙ్గతం జ్ఞాత్వా తత్సఖ్యా చిత్రలేఖయా ।
లిఖితాద్వై చిత్రపటాదనిరుద్దం సమానయత్.
కృష్ణపౌత్రం ద్వారకాతో దుహిత్రా బాణమన్త్రిణః ।
కుమ్బాణస్యానిరుద్దాఽగాద్రరామ హ్యుషయా సహ.
గౌరీ శివునితో క్రీడించుచుండగా చూచి ఉష భర్త ను గూర్చి అభిలాష కలదాయెను. గౌరి ఆమెతో ఇట్లనెను. వైశాఖమాన ద్వాదశిదివసమున నీకు స్వప్నమునందు కనబడు పురుషుడు నీకు భర్త కాగలడు. గౌరి మాటలు విని సంత సించిన ఉష గృహమునందు నిద్రించి ఆతనిని చూచెను. ఆతడు తనతో నంగము చేసినట్లు తెలిసికొని, చిత్రపటము పై ఆతని మూర్తి వి చిత్రించి దాని సాహాయ్యముతో సఖియైన చిత్రలేఖ ద్వారా కృష్ణుని పౌత్రుడై న అనిరుద్ధుని ద్వారకనుండి తెప్పించికొనెను. ఆ చిత్రలేఖ దాణాసురుని మంత్రియైన కుంభాండుని పుత్రిక. అనిరుద్ధుడు ఉషతో కూడ రమించెను.
బాణధ్వజస్య సంపాతో రక్షిభిః స నివేదితః ।
అనిరుద్ధస్య బాణేన యుద్దమాసిత్సుదారుణమ్.
రక్షకులు వెళ్లి బాణుని ధ్వజము పడిపోయినట్లు ఆతనికి తెలిపిరి. అనిరుద్ధునకు బాణునితో సూదారుణమైన యుద్ధము జరిగెను.
శ్రుత్వా తు నారదాత్కృష్ణః ప్రద్యుమ్న బలభద్రవాన్ ।
గరుడస్థోఽథ జిత్వారీన్ జ్వరం మా హేశ్వరంతథా.
కృష్ణుడు నారదునినుండి ఈ విషయము తెలియగా, గరుడారూఢుడై, ప్రద్యుమ్న బలరామసమేతుడై వచ్చి శత్రువులను, మాహేశ్వరజ్వరమును కూడ జయించెను.
హరిశఙ్కరయోర్యుద్ధం బభూవాథశరాశరి ।
నన్దీ వినాయకస్కన్ద ముఖాస్తార్క్ష్యాదిభిర్జితాః.
పిమ్మట హరిశంకరుల మధ్య బాణములతో యుద్ధము జరిగెను. తార్క్ష్యుడు మొదలగు వారు నంది - వినాయక - స్కందాదులను జయించిరి.
జృమితే శఙ్కరేసు ప్తే జృమృణాస్త్రేణ విష్ణునా ।
భిన్నం సహస్రం బాహూనాం రుద్రేణాభయమర్థితమ్.
విష్ణువు ప్రయోగించిన జృంభణాస్త్రముచే శంకరుడు ఆవులించుచు నిద్రపోయెను. అపుడు బాణుని బాహు సహస్రము భేదింపబడెను. రుద్రుడు బాణున కభయ మిమ్మని విష్ణువును కోరెను.
విష్ణునా జీవితో బాణో ద్విబాహుః ప్రాబ్రవీచ్ఛివమ్.
కృష్ణ ఉవాచః
త్వయా యదభయం దత్తం బాణస్యాస్య మయాహి తత్ ।
ఆవయోర్నాస్తి భేదోవై భేదీ నరకమాప్నుయాత్.
విష్ణువు బాణుని రెండు బాహువులతో జీవింపచేసి శివునితో ఇట్లనెను. (కృష్ణుడు పలికెను). “నీవు ఈ, వాణునకు అభయమిచ్చినావు గాన నేనును ఇచ్చుచున్నాను. మన ఇరువురికిని భేదము లేదు. భేదమును చూచువాడు నరకమున పడును”.
అగ్ని రువాచః
శివాద్యైః పూజితో విష్ణుః సానిరుద్ధ ఉషాది యుక్ ।
ద్వారకాం తు గతో రేమే ఉగ్రసేనాదియాదవైః.
విష్ణువు శివాదులచే పూజింపబడి, ఉషానిరుద్దాదులతో కూడి ద్వారకకు వెళ్లి ఉగ్రసేనాదియాదపులతో కలిసి సుఖముగా ఉండెను.
అనిరుద్దాత్మజో వజ్రో మార్కణ్డేయాత్తు సర్వవిత్ ।
బలభద్రః ప్రలమ్బఘ్నో యమునాకర్షణోఽభవత్.
ద్వివిదస్య క పేర్బేత్తా కౌరవోన్మాదనాశనః ।
హరీ రేమేఽనేకమూర్తీ రుక్మిణ్యాదిభిరీశ్వరః.
పుత్రానుత్పాదయామాస త్వసంఖ్యాకాన్స యాదవాన్ ।
హరివంశం పఠేద్యః స ప్రాప్త కామో హరిం వ్రజేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే హరివంశ వర్ణనం నామ ద్వాదశోఽధ్యాయః.
Summary of chapter 12 of the Agni Mahā Purana is as follows:
This chapter narrates Kṛṣṇa's boyhood exploits in Vṛndāvana and Mathurā. His subjugation of the serpent Kāliya in the Yamunā, the lifting of Mount Govardhana to shelter the cowherds from Indra's wrath, and the Rāsalīlā with the gopī-s are summarised as cosmic plays that reveal Bhagavān's sovereignty over all elements, his grace toward his devotees, and the supreme nature of bhakti. Kṛṣṇa and Balarāma are then summoned to Mathurā by Kaṃsa under the pretext of a wrestling match. In Mathurā, Kṛṣṇa breaks Kaṃsa's great bow at the weapons ceremony, kills the elephants and wrestlers set against him, and finally seizes Kaṃsa by the hair and slays him. The imprisoned parents Vasudeva and Devakī are freed.