ఆగ్నీరువాచః-
జమ్బూష్ణహ్వయా ద్వీపౌ శాల్మల్చిపరో మహాన్ ।
కుశః క్రౌఞ్చ స్తథాశాకః పుష్కరశ్చేతి సప్తమః.
ఏతే ద్వీపా సముద్రిస్తు నప్త సప్తభిరావృతాః ।
లవణేశుసురాసర్ఫిర్గధీదుగ్గజలై సమమ్.
జమ్బూద్వీపో ద్వీపమధ్యే తన్మధ్యే మేరురుచితః ।
చతురశీతి సాహసో భూయిష్ఠ షోడశాద్రిరాట్.
శి ద్వాత్రింశన్మూథ్నీ విస్తారాతోడశాధఃసహస్రవాన్ ।
భూయ స్తస్యాస్య శైలోసా కర్ణికాకారసంగ్జితః.
పామవాన్ హేమకూటశ్చ నిషదళ్చాస్య దక్షిణే ।
నీలః శ్వేతశ్చ శృణ్ణి చ ఉత్తరే వర్షపర్వతా.
లక్షప్రమాణో ద్వౌ మద్యే దశ హీనా స్త్రథాపరే ।
సహ సద్వితయోచ్ఛాయాస్తావద్విస్తారిణశ్చ తే.
భారత ప్రథమం వర్షం తతః కింపురుషం స్మృతమ్।
హరివర్షం త థైవాన్యనేరోర్ధక్షిణతో ద్విజ.
రవ్యుకం చోత్తరే వరం తథైవాన్యద్ధిరణ్యకమ్ ।
ఉత్తరా కురవశ్చైవ యథా వై భారతం తథా.
నవసాహసమే కై కమేతేషాం మునిసత్తమ ।
ఇలావృతం చ తన్మధ్యే సౌవర్లో మేరురుచితః.
మేరోశ్చతుర్దశం తత్ర నవసాహస్రవిస్తృతమ్ ।
ఇలావృతం మహాభాగ చత్వారశ్చాత్ర పర్వతాః.
విష్కమ్బారచితా మేరోరార్యజనాయుతవి సృతాః ।
పూర్వేణ మనరో నామ దక్ష్మిడే గనమాదన.
విపులు పశ్చిమే పార్వే సుషార్శ్వశోత్తరే స్మృతః ।
కదమ్బ స్తేషు జమ్భూశ్చ పిప్పలో వట. ఏవ చ.
ఏకాదశ శతాయామాః పాదప్టా గిరి కేతవః ।
జమ్బూద్వీ పేతి సంజ్ఞాస్యాత్ఫలం జమ్వా గజోపమమ్.
జమ్బూనదీర సేనాస్యా స్వీదం జామ్బూనదం పరమ్।
సుపార్శ్వః పూర్వతోమేరోః కేతుమాలస్తు పశ్చిమే.
వనం చైత్రరథం పూర్వే దక్షిణే గన్ధమాదనః ।
వైథాజం పశ్చిమే సౌమ్యే నన్దనం చ సరాంస్యథ.
ఆరుణోదం మహాభద్రం శీతోదం మానసం తధా ।
సితామ్బశ్చక్రముధ్యాః పూర్వతః కేశరాచలాః.
దక్షిణే దేస్త్రికూటాద్యాః శిశివాసముఖా జలే ।
శ జ్ఖకూటాదయః సౌమ్యే మేరౌ చ బ్రహ్మణః పురీ.
అగ్నిదేవుడు పలికెను. వసిష్ఠా! జంబూ - ప్లక్ష - శాల్మలి - కుశ - క్రౌంచ - శాక పుష్కరము లనెడు ఏడు ద్వీపములు నలుమూలల లవణ జల - ఇక్షురస - మద్య - మృత - దధి - క్షీర - మధుర జలములు గల ఏడు సముద్రముచే చట్టబడి యున్నవి. జంబూ ద్వీపము అన్ని ద్వీపముల మధ్యనున్నది. దాని మధ్య ఎత్తైన మేరు పర్వత నున్నది. దీని విస్తారము ఎనుబది నాల్గువేల యోజనములు ఈ పర్వతరాజము పదహారు వేల యోజవములు, భూమిలో డిగి యున్నది. పై భాగమునంద దీని విస్తారము ముప్పది రెండు వేల యోజనములు. క్రింద దీని విస్తారము పదునారువేల యోజనములు, ఇట్లు ఈ పర్వతము ఈ పృథ్వీరూపక మలమునకు కర్ణిక వలె నున్నది. దీని దక్షిణమున హిమవత్ హేమ కూట - నిషధ పర్వతములును, ఉత్తరమున నీల - శ్వేత - శృంగి పర్వతములును వర్ష పర్వతముగా నున్నవి. మధ్య నున్న రెండు పర్వతములు (నిషధ - నీలములు) ఒక్కొక లక్ష యోజనముల వరకు వ్యాపించియున్నవి ఇతర పర్వత మణ వాటికంటె పదేసి వేల యోజనములు తక్కువ. అవి అన్నియు రెండేసి వేల యోజనములు ఉన్న తములు, అతిథైవెడల్పు, ద్వి శ్రేష్టా! దక్ష్మి వరములలో మొదటిది భారతవర్షము, రెండవది కింపురుషవరము. మూడవది హరివర్షము, ఉత్తరము వైపు రమ్యక - హిరణ్మయ - ఉత్తర కురువర్షము లున్నవి. అవి భారతవర్షముతో సమానములు మునివరా! నీటిలో ఒక్కొక్క దాని విస్తారము తొమ్మిదేసి వేల యోజనములు. వీటి అన్నింటి మధ్య ఇలావృతవర్షమున్నది. దాని యందు మేరు పర్వతము నిలచి యున్నది. ఇలావృతవర్షము సుమేరు పర్వతమునకు నలువైపు, తొమ్మిదేవేం యోజన నుల వరకు విస్తరించియున్నది. దీని నాలుగు వైపుల నాలుగు పర్వతము లున్నవి. ఇవి సుమేరు పర్పమును నిల బెట్టుటకై ఈశ్వరుడేర్పరచీన ఆధార స్తంభములా అన్నట్లు ఉన్నవి. వీటిలో మందరాచలము తూర్పునను, గంధమాదనము దక్షిణమునను, విపులము పశ్చిమ పార్శ్వమునందును, సుపార్శ్వము ఉత్తరమునందును ఉన్నవి. ఈ పర్వతముల విస్తా రఘు పదేసి వేల యోజనములు. ఈ పర్వతముల పై నున్న పదకొండేసి యోజనముల విస్తారముగల కదంబి – జంబూ-ఆశ్వత్థ - వటవృక్షములు ధ్వజములవలె ప్రకాశించుచున్నవి. వీటిలో జంబువృక్షము జంబూద్వీపమను పేరునకు కారఇను. దీని పండ్లు ఏనుగంత ప్రమాణములో నుండును వీడి రసము జంబూనదిగా ప్రవహించుచున్నడి. దీది నుండి పాత్ర ఉత్తమమైన జాంబూనదము (బంగారము) ఉత్పన్నమగుచున్నది. మేరువునకు తూర్పున భదానిక ఆవర్షము పశ్చిమమున కేతు మాలము ఉన్నది. దానికి తూర్పున చైతరథమ దక్షిణమున గంధమాదనము, పశ్చిమమున భ్రాజము, ఉత్తరమున నందవము అను వనములు ఉన్నవి. అట్లే దీనికి పూర్వాడి డిక్కులండు ఆరుణోదయ - మహాథీద - శీతోదమానపద లను సరస్సు లున్నవి. సిరాంథస్సు, చకిముంజము మొదలగునవి (భూపద్మ కర్ణిక యగు) మేరువు యొక్క పూర్వదిశ యందున్న కేసరములవంటి పర్వతములు, దక్షిణమున తికూటాదులు, పశ్చిమమున శిఖివాసాదులు ఉత్తర వలన శంఖ కరాటాలును కేసర పర్వతములు. సుమేరవు బ్రహ్మపురి యున్నది.
చతుర్దశ సహస్రాణి యోజనాసాం చ దిక్షు చ ।
ఇంద్రాదిలోకపాలానాం సమస్తాద్ర్బహ్మణః పురః.
విష్ణుపాదాత్ల్పావయిత్వా చన్దం స్వర్గాత్పత న్యపి ।
పూర్వేణ శీలా భద్రాళ్వాచ్ఛేలాచ్చేలాఢతార్ణవమ్
తథై పోలకనస్ధాపి దక్షిణేనైవ భారతమ్ ।
ప్రయాత సాగరం కృత్వా సప్తభేదాథ పశ్చిమమ్.
అఖిం చ వక్షుః సౌమ్యాబ్ధం భద్రోత్తరకురూనపి ।
ఆనీలనిషదాయామౌ మాల్యవద్దన్దమాదనౌ.
తయోర్మధ్యగతో మేరుః కర్లీకారసంస్థితః ।
భారతాః కేతుమాలాశ్చ భద్రాశ్వాః కురవ స్తథా.
పత్రాణి లోకవద్మస్య మర్యాదా శైలజాహ్యతః ।
జఠరో దేవకూటశ్చ మర్యాదాపర్వతావుభో.
తొ దడితో త్తరాయామావానీలనిషధాయతో ।
గన్ధమాదన కైలాసౌ పూర్వవచ్చాయతావుభౌ.
అశీతియోజనాయామా వర్ణవాన్తర్వ్యవస్థితా ।
నిషధః పారియాత్రశ్చ మర్యాదపర్వతావుభౌ.
మేరోః పశ్చిమదిగ్భాగే యథా పూర్వే తథాస్థితా ।
త్రిశృణో రుధిర శ్చైవ ఉత్తరౌ వర్షపర్వతా.
పూర్వపశ్చాయతావేలా వర్ణవానర్వ్యవస్థితా ।
జాఠరాద్యాశ్చ మర్యాదా శైలా మేరోశ్చతుర్దశమ్.
కేసరాదిషు యా ద్రౌణ్యస్తాసు స ని పురాణి హి ।
లక్ష్మీవిష్ణగ్ని సూర్యాదిదేవానాం మునిసత్తమ.
భౌమానాం స్వర్గధర్మాణాం నపాపా సత్రయా న్తి చ ।
భద్రా శ్వేస్తి హయగ్రీవో వరాహ కేతుమాల కే.
భారతే కూర్మరూపీ చ మత్స్య రూపః కురుష్వపి ।
విశ్వరూ పేణ సర్వత్ర పూజ్యతే భగవాన్ హరిః.
కిమ్పురుషాద్యష్టసువుద్భీతి శోకాదికం న చ ।
చతుర్వింశతి సాహసం ప్రజాజీవ న్మనామయా.
కృతాదికల్పనా నాస్తి కౌమాన్యమాంసి నామ్ముదాః ।
సర్వే ష్వేతేషు వర్ణేషు సప్త సప్త కలాచలా.
మద్యశ్చ శత నేభ్య స్తీర్ణభూతాః ప్రజజ్ఞిరే ।
భార తేయాని తీర్థాని తాని తీర్థాని వచ్మితే.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే భువనకోశనీరూపణం నామాష్టాధిక శతత మోధ్యాయః.
దాని విస్తారము పదునాలుగు వేల యోజనములు. బ్రహ్మపురికి నాలుగు వైపుల అన్ని దిక్కులందును ఇంద్రాది లోకపాలకుల నగరము లున్నవి. ఈ బ్రహ్మపురినుండియే, విష్ణుపాదోద్ధత యగు గంగానది చంద్రమండలమును నడుపుచు స్వర్గమునుండి క్రిందికి దిగుచున్నది. తూర్పున శీలానది భద్రాశ్వపర్వతమునుండి బయల్వెడలి ఒక పర్వతమునుండి మరొక పర్వతమునకు వెళ్లుచు సముద్రములో కలియుచున్నది. ఇట్లే అలకనంద కూడ దక్షిణము వైపు భారతవర్షమునకు వచ్చి, ఏడు భాగములలో విభక్త యై సముద్రములో కలిసి పోవుచున్నది. వస్తునది వశ్చిమసమద్రమునందును, భద్ర ఉత్తరకురువర్షమును దాటి సముద్రమునందును కలియుచున్నది. మాల్యవల్-గంధమాదనపర్వతములు ఉత్తర దక్షిణముల వైపు నీలాచల-నిషధపర్వతముల వరకును విస్తరించి యున్నవి. ఆ రెండిటి మధ్య కర్ణికాకార మైన మేరుపర్వత మున్నది. మర్యాదా పర్వతమ బైట నున్న భారత.కేతుమాల.భద్రాశ్వ-ఉత్తరకువర్షములు ఈ లోక పద్మము దళములు, జఠర దేవ కూటమలు మర్యాదపర్వతములు. ఇవి ఉత్తర-దక్ష్మి అమల వైపు- నీలనిషధపర్వతముల వరకును వ్యాపించియున్నవి పూర్వ-పశ్చిమమాల వైపు విస్తృతము లైన గంధమాదన-g,లాసములు, ఎనుబది వేల యోజనములు విస్తృత మైనవి. తత్పనందు వలె పశ్చిమము వైపు గూడ నిషధపారియాత్రము లను రెండు మర్యాదపర్వతము లున్నవి. వాటి మూలములు సముద్రము లోపల చొచ్చుకొని యున్నవి. ఉత్తరము వైవున త్రిశృంగము, రుధిరము, వర్షపర్వతములు పూర్వపశ్చిమ సహద్రములంద చొచ్చుకొని యున్నవి. ఈ విధముగ జఠరము మొదలగు మర్యాదపర్వతములు మేరుపర్వతమునకు నలు వైవురి ప్రకాశించుచున్నవి. మునిశ్రేష్ఠా! కేసరపర్వతములమధ్య నున్న శ్రేణులలో లక్ష్మీ-విష్ణు-అగ్ని-హర్యాదిదేవతల వగరు లున్నవి. ఇవి భూలోక సంబద్ధములే యైనను స్వర్గముతో సమానమైనవి. పాపాత్ములు ఈ నగరములలో నివసించజాలరు. శ్రీమహావిష్ణువు భద్రాశ్వవర్షమునందు హయగ్రీవరూపమునను, కేతుమాలవర్షమునందు వరాహరూపమునను, భారతవర్షమునందు కూర్మరూపమునను, ఉత్తరకురువర్షమునందు మత్స్యరూపమునమనివాసము చేయుచున్నాడు. శ్రీమహావిష్ణువు విశ్వరూపముతో సర్వత్ర పూజింపబడుచున్నాడు. కింపురుషాదివర్షములు ఎనిమిదింటియందును ఆకలి భయము శోకము మొదలగునవి ఏమియు ఉండవు. అచటి ప్రజలు ఇరువదినాల్గువేల సంవత్సరముల పాటు రోగశోకాదు లేమియు లేకుండ జీవనము గడుపుచుందురు. అచట కృతవ్రేతాదికల్పవ ఉండదు. వరములు కురియవు. కేవలము పార్థివజలమే లభ్యమగును. ఈ అన్ని వర్షములందును ఏడేసి కుల పర్వతము లున్నవి. వాటినుండి వందలకొలది తీర్థరూపము లగు వదులు ప్రవహించచున్నవి. ఇపుడు భారకపర్షమునందున్న తీర్థములను గూర్చి చెప్పెదను.
ఆగ్ని మహాపురాణమునందు భువనకోశ నిరూపణ మను నూటఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 108 of the Agni Purāṇa is as follows:
The consecration of divine images (pratimā) in temple and domestic shrines is described in liturgical detail. Agni prescribes the adhivāsana ceremonies on the preceding nights followed by the kalaśa-sthāpana, puṇyāhavācana, and the decisive prāṇa-pratiṣṭhā-mantra by which the deity's life-force is installed. Post-consecration rites include mahā-abhiṣeka, mahā-naivedya, and the distribution of prasāda to the assembly. The chapter clarifies the qualifications of the ācārya who performs the pratiṣṭhā and the responsibility of the kāraṇika (patron).