శ్రీరామ ఉవాచః
షడ్విధంతు బలంప్యూహ్యదేవాన్ ప్రార్చ్యరిపుం వ్రజేత్ ।
మౌలభూతం శ్రేణి సుహృద్ద్విషదాటవికం బలమ్.
పూర్వం పూర్వం గరీయస్తు బలానాం వ్యసనం తథా ।
షడఙ్గం మంత్రకోశాభ్యాం పదాత్యశ్వరథద్వివైః.
నద్యద్రివనదుర్గేషు యత్ర యత్ర భయం భవేత్ ।
సేనాపతిస్తత్ర తత్ర గచ్ఛేద్వ్యూహికృతైర్బలైః.
నాయకఃపురతోయాయాత్ప్రవీర పురుషావృతః ।
మద్యేకశత్రం స్వామీ చ కోశః ఫల్గుచయద్బలమ్.
పార్శ్వయోరుభయోరశ్వావాజినాం పార్శ్వయోరథాః ।
రథానాం పార్శ్వయోర్నాగా నాగానాం చాటపీబలమ్.
పశ్చాత్సేనాపతిః సర్వం పురస్కృత్య కృతీస్వయమ్ ।
యాయాత్సన్నద్ధసైన్యౌఘః భిన్నానాశ్వాసయఞ్ఛనైః.
యాయాద్వ్యూహేన మహతా మకరేణ పురోభయే ।
శ్యేనేనోద్దృత పక్షేణ సూచ్యావా వీరవక్రయా.
పశ్చాద్భయే తు శకటం పార్శ్వయోర్వజ్ర సంజ్ఞితమ్ ।
సర్వతః సర్వతోభద్రం భయేవ్యూహంతుకల్పయేత్.
శ్రీ రాముడు పలికెను. షడ్విధమగు సేనను కవచాదులతో సన్నద్ధము చేసి, వ్యూహము ఏర్పరచి, ఇష్ట దేవత లను, యుద్ధ సంబంధి దుర్గాది దేవతలను పూజించి, శత్రువు పై ఆక్రమణము చేయవలెను. మూల - భృతి - శ్రేణి - మిత్ర - శత్రు - ఆటవికముని సేనలు ఆరువిధములు. వీటిలో పూర్వపూర్వ సేనలు శ్రేష్ఠములు, వీటివ్యసనములు కూడ ఈ విధముగనే గరిష్టములు పదాతి - ఆశ్వ - రథ - గజములు సేనకు నాలుగు అంగములు. మంత్రము, కోశము ఆను రెండు అంగములు కూడ కలిసి ఆరు అంగములు నదీదుర్గ - పర్వతదుర్గ - వనదుర్గములలో, భయకారణము లున్న చోట, సేవాపతి సంనద్ధములై, వ్యూహబద్ధములైన స్యైములతో వెళ్ళవలెను. అధిక వీరులైన యోధులతో కలిసి ఒక సేనానాయ కుడు ముందుగా వెళ్ళవలెను. విజిగీషరాజు, వాని ఆంతఃపురము సేనామధ్వలోనుండి యాత్ర సాగించవలెను. స్వామికి ఇరువై పుల ఆశ్విక సైన్యమ, దాని ఇరుప్రక్కల రథ సేన, దానికి ఇరుప్రక్కల గజ సేన, దాని రెండుప్రక్క ఆటవిక సేన ఉండవలెను. కుశ లడగు ప్రధాన సేనాపతి, యాత్రా సమయమున తాను స్వామికి వెనుక నుండి, ఇతరులనందరిని ముందు ఉంచి నడువవలెను. హతోత్సాహలగు సైనికులకు మెల్ల మెల్లగ ఆళ్వాసనమిచ్చుచుపోవలెను. సైన్యమంతయు యుద్ధసన్నద్ధమై యుండవలెను. ఎదుటినుండి శత్రువుల ఆక్రమణము జరుగు భయమున్నచో గొప్పమకర వ్యూహమేర్పరచి ముందుకు సాగవలెను. అడ్డముగా ఆక్రమణము జరుగునను భయమున్నచో రెక్కలు చాపిన శ్యేనపక్షి ఆకారముగల వ్యూహమును, సన్నని మార్గమునుండి ఆక్రమణము జరుగునను భయమున్నపుడు వీరులు అగ్రమునందున్న సూచీముఖ వ్యూహమును, వెనుకనుండి భయమున్న చో శకట వ్యూహమును, ప్రక్కలనుండి భయమున్న చో వజవ్యూహమును, నలు మూలలనుండి భయమున్నచో సర్వతో భద్ర వ్యూహమును నిర్మించుకొని ముందుకు వెళ్ళవలెను.
కందరే శైలగహనే నిమ్నగావనసంకటే ।
దీర్ఘాధ్వని పరిశ్రాంతం క్షుత్పిపాసాహితక్లమమ్.
వ్యాధిదుర్భిక్ష మారక పీడితం దస్యు విద్రుతమ్ ।
పంకపాంసు జలస్కంధం వ్యస్తం పుంజీకృతం పథి.
ప్రసుప్తం భోజనవ్యగ్ర మభూమిష్ఠ మసుస్థితమ్ ।
చౌరాగ్నిభయ విత్రస్త వృష్టివాత సమాపతమ్.
ఇత్యాదౌ స్వచమూం రక్షేత్పరసైన్యం చ పతయేత్ ।
విశిష్టో దేశకాలాభ్యాం భిన్న విప్రకృతిర్బలీ.
కుర్యాత్ప్రకాశ యుద్ధంహి కూటయుద్ధం విపర్యయే ।
తేష్వవస్కందకాలేషు పరం హన్యాత్సమాకులమ్.
అభూమిష్ఠం స్వభూమిష్ఠః స్వభూమౌచోపజాయతః ।
పర్వత గుహలందును, దుర్గమపర్వతమార్గమునందును, దీర్ఘప్రయాణముచే అలసిపోయినదియు, ఆకలిదప్పులచే పీడింపబడినదియు, రోగ-దుర్భిక్ష-మహామారులతో బాధపడుచున్నదియు, దోపిడి దొంగలచే చెల్లా చెదరు చేయబడినదియు, బురద, ధూళి, నీళ్ళు వీటిలో చిక్కుకొన్నదియు, వ్యాకులముగానున్నదియు, ఒక వ్యక్తిమాత్రమేనడచుటకు తగిన మార్గముండుటచే ముందుకు నడవక ఒకేచోట నిలచిపోయినదియు, భోజనపానములు చేయుచున్నవియు, ఆయోగ్యమైన ప్రదేశ్ మునందున్నదియు, కూర్చుండిపోయినదియు, చోరాగ్ని భయవ్యాకులమైనవియు, వరములచేతను, తుపానుచేతను పీడితమైనదియు, ఇట్టి ఇతర సంకటములలో చిక్కుకొనినదియు అగు తన సేనను ఆన్ని వే పులనుండి రక్షించుకొనుచు, శత్రు సైన్యముపై దెబ్బతీయుటకై వేచి యుండవలెను. శత్రువుకంటే తనకు దేశ కాలములు ఎక్కువ అనుకూలముగ నున్నపడును. శత్రు ప్రకృతులలో పరస్పర వైషమ్యము ఏర్పడినప్పుడును, తన బలము అధికముగా నున్నపుడును, శత్రువుతో ప్రత్యక్షముగ యుద్ధమునకు దిగవలెను. పరిస్థితి ఇందుకు విరుద్ధముగా నున్నపుడు కూటయుద్ధమున కుపక్రమించవలెను. శత్రుసైన్యము పైన చెప్పిన వ్యసనములలో చిక్కుకొని యుద్ధాయోగ్యమైన ప్రదేశమునందున్న పుడు, విజిగీషవు, అనుకూల ప్రదేశమునందుండి, శత్రువుపై ఆక్రమణముచేసి, నశింప చేయవలెను. శత్రు సైన్యము అనుకూలప్రదేశమునందున్న పుడు, వారి ప్రకృతునిలో భేదము కల్పించి, సమయము చూచుకొని శత్రువులను నశింపచేయవలెను.
ప్రకృతి ప్రగ్రహాకృష్టం పాశైర్వనచరాదిభిః.
హన్యాత్ప్రవీర పురుషైర్భఙ్గదానాపకర్షణెః ।
పురస్తాద్దర్శనం దత్త్వా తల్లక్ష కృతనిశ్చయాన్.
హన్యాత్పశ్చాత్ప్రవీరేణ బలేనోపేత్య వేగినా ।
పశ్చాద్వా సంకులీకృత్య హన్యాచ్ఛూరేణ పూర్వతః.
ఆభ్యాం పార్శ్వాభిఘాతౌతు వ్యాఖ్యాతౌ కూటయోధనే ।
పురస్తా ద్విషమే దేశే వశ్చాద్దన్యాత్తు వేగవాన్.
పురః పశ్చాత్తువిషమే హ్యేవమేవతు పార్శ్వయోః ।
ప్రథమం యోధయిత్వాతు దూష్యామిత్రాటవీబలైః.
శ్రాంతం మందం నిరాక్రందం హన్యాదశ్రాంతవాహనమ్ ।
దూష్యామిత్ర బలైర్వాపి భంగం దత్త్వా ప్రయత్నవాన్.
జితమిత్యేవ విశ్వస్తం హన్యాన్మంత్ర వ్యపాశ్రయః ।
స్కంధావార పురగ్రామ సస్యస్వామి ప్రజాదిషు.
విశ్రభ్యంతం పరానీకమప్రమత్తో వినాశయేత్ ।
అథవా గోగ్రహాకృష్టం తల్లక్ష్యం మార్గబంధనాత్.
అవస్కంద భయాద్రాత్రి ప్రజాగర కృత శ్రమమ్ ।
దివాసుప్తం సమాహన్యాన్నిద్రా వ్యాకుల సైనికమ్.
నిశి విస్రబ్దసంసుప్తం నాగైర్వా ఖడ్గపాణిభిః.
యుద్దమునుండి వెనుక వైపు పరుగెత్తుకొని వెళ్ళి శత్రువులను ఆతని భూమినుండి బైటకు లాగికొనివచ్చు, ఆటవికల చేత గాని, ఆమిత్ర సైనికులచే గానీ లాగికొనిరాబడిన శత్రువులను వీరులగు యోధులచే చంపించవలేను. అల్పసంఖ్యాకులగు సైనికులను ఎదుట నిలబెట్టి శత్రువుతో అడ్డముచేయుచు, వారేమరియుండగా, ఉత్తమవీరులుగల సైన్యముతో వెనుక నుండి శత్రు సైన్యమును ప్రవేశించి నశింప చేయవలెను. లేదా వెనుక వైస సైన్యమును సమీకరించి, శత్రువుల దృష్టి అటువైపున నున్నపుడు ముందునుండి ప్రవేశించి వారిని చంపవలెను. వెనుకనుండియు, ముందునుండియు ఆక్రమణము చేసిన విధముననే పార్శ్వములనుండి కూడ చేయవలెను. ఇది కబయుద్ధమునందు ఆవలంబించవలసిన పద్ధతి. ముందుగా దూష్య బలముతోను, ఆమిత్రబలముతోను, ఆటవిక బలముతోను యుద్ధముచేసిన శత్రుసేన అలసిపోయిన పిమ్మట, తన సేన ఆలసిపోకపూర్వము, శత్రుసేనపై ఆక్రమణము చేసి నశింపచేయవలెను. లేదా దూష్యబలమును, ఆమిత్రసేనను యుద్ధభూమి మండి పారిపోవునట్లు ఆజ్ఞాపించి, నేను జయించితిని అని శత్రువునకు విశ్వాసము కలిగిన పిమ్మట, మంత్రబలము నాశ్రయించి, ప్రయత్నపూర్వకముగ ఆ మించి శత్రువును నశింపచేయవలెను స్కంధారమును, పురములను, గ్రామములను, సస్యములను, గోష్టములను దోచుకొనుటకు శత్రువుల మనస్సులో లోభము కలిగించి, వారు ఆపనిలో నిమగ్నులై యున్న పుడు తానుమాత్రము సావధానుడై వారినందరిని సంహరించవలెను. లేదా శత్రురాజుల గోవులను అపహరించి, వారి దృష్టిని వాటిని విడిపించుకొనుటయందు మర లునట్లు చేసి, వాళ్లను మర్గ మధ్యమునందే ఆపి సంహరించ వలెను. తమపై ఆక్రమణము జరుగునను భయముచే రాత్రియంతయు మేల్కొనియున్న శత్రు సైనికులు నిద్రాలసురై యున్నపుడు వారి నాక్రమించి సంహరించవలెను. లేదా రాత్రి నిశ్చింతగా నిద్రించుచున్న సైనికులను ఖడ్గధాదులచే చంపించవలెను.
ప్రయాణే పూర్వయాయిత్వం వనదుర్గప్రవేశనమ్.
అభిన్నానామనీకానాం భేదనం భిన్న సంగ్రహః ।
విభీషికాద్వారమాతం కోశరక్షేభ కర్మచ.
ఆభిన్న భేదనం, మిత్రసంధానం రథ కర్మచ ।
వనదిఙ్మార్గ విచయే వీవధాసారలక్షణమ్.
అనుయానాపసరణే శీఘ్రకార్యోపవాదనమ్ ।
దీనానుసరణం ఘాతః కోటీనాం జఘనస్యచ.
అశ్వకర్మాథ పత్తేశ్చ సర్వదా శస్త్రధారణమ్ ।
శిబిరస్య చ మార్గాదేః శోధనం బస్తికర్మచ.
సంస్థూలస్థాణు వల్మీక వృక్షగుల్మాపకంటకమ్ ।
సాపసారా పదాతీనాం భూర్నాతి విషమాసమా.
స్వల్ప వృక్షోపలా క్షిప్రలంఘనీయనగాస్థిరా ।
నిఃశర్కరా విపంకా చ సాపసారా చ వాజిభూః.
నిఃస్థాణువృక్షకేదారా రథభూమిరకర్మదా ।
మర్దనీయ తరుచ్ఛేద్య వ్రతతీపంకవర్జితా.
సేన ఒకసారి ముందుకు దుమికిన తరువాత శత్రువులు మార్గమునందు అవరోధములు కల్పించినచో, తన్నివారణార్థమై ఏనుగులను ముందు నడుపవలేను. అశ్వములు కూడా ప్రవేశింపజాలని వనదుర్గమునందు గజములసాహాయ్యముచేతనే సైన్యము ప్రవేశింపగలుగును. గజములు ఎదుటన్ను వృక్షాదులను విరచివేసి సైనికులకు మార్గమును కల్పించును. దృఢముగానున్న సైనిక పంక్తిని భేదింపవలెనన్నచో గజములనే ఉపయోగించవలెను. వ్యూహము భిన్నమగుటచే ఛిద్రము లేర్పడినచోట ఏనుగుల నుంచి ఆ ఛిద్రములు పూర్చవలేను. శత్రువులలో భయము కలిగించుట, శత్రుదుర్గ ద్వారములను శిరస్సుతో పగులగొట్టుట, సైన్యముతో కోశమును తీసుకొని వెళ్ళుట, ఏదైన భయముత్పన్నమైనపుడు రక్షించుకొనుట. ఇదియంతయు గజములద్వారామాత్రమే సాధింపశక్యమగును. ఆభిన్నమగు సైన్యమును భేదించుట, భిన్నమైన దానిని పూడ్చుట అను పనులు రథ సేనాసాహాయ్యముతో కూడ చేయవచ్చును. వనములలో ఎచట ఉపద్రవములున్నవి, ఎచటలేవు అను విషయమును పరిశీలించుట, మార్గమును నిర్ణయించుట, ఇది అశ్వ సేన చేయవలసిన కార్యము. తన పక్షము వారికి ఆహారాది సామగ్రిని అందజేయుట, పారిపోవుచున్న శత్రుసైన్యమును శీఘ్రముగా తరుమట, సంకట సమయములందు శీఘ్రముగా పారిపోవుట. పనులు శీఘ్రముగా చేయుట, తమ సైన్యము కష్టపరిస్థితులలో నున్నపుడు శీఘ్రముగా అచట చేరి సాహాయ్యము అండంచుట, శత్రుసేనాగ్రభాగమున ప్రహారముచేసి వెంటనే వెనుకకుపోయి అక్కడకూడ ప్రహారముచేయుట, అశ్వ సేవాకార్యములు. సర్వదా శస్త్రధారణము చేసియుండుట కాలిబంటుల కార్యము. సైన్యమునకు విడిది ఏర్పరచు స్థానము, మార్గము మొదలగునవి ఆవ్వేషించుట పెట్టి వారి కర్తవ్యము. పెద్ద పెద్ద మోళ్ళు, చెట్లు, పొదలుఉండి ముళ్ళచెట్లు లేనిదియు, పారిపోవుటకు అనువైన మార్గముగలవయు, ఎక్కువ మేరకపల్లములు లేనిదియు అగు భూమి పదాతి సైన్య సంచారయోగ్యము. వృక్షములు శిలలు తక్కు వగా నున్నది, శీఘ్రముగా లుమింపవీలగు భూచ్ఛిద్రమలు, గట్టి నేల గలది రాళ్లు, బురదలేనిది, బైటికిపోవుటకు అనువగు మార్గముకలది అగు భూమి ఆశ్వ సంచార యోగ్యము. పాదాలతో తొక్కివేయుటకు శక్యమైన చెట్లు, ఛేదించవీలైన తీగలు కలదియు, బురదలేనిదియు, గోతులులే నిదియు, గజారోహణ యోగ్యములగు చిన్న పర్వతములు మాత్రమే ఉన్న దియు ఆగు భూమి నిమ్నోన్నతముగా ఉన్నను గజ సేనాగమన యోగ్యము.
నిర్ఘ రాగమ్యశైలాచ విషమా గజమేదినీ ।
ఉరస్యాదీని భిన్నాని ప్రతిగృహ్ణన్బలానిహి.
ప్రతిగ్రహ ఇతిఖ్యాతో రాజకార్యాన్తరక్షమః ।
తేనశూన్యస్తుయో వ్యూహః సభిన్న ఇవలక్ష్యతే.
జయార్థీ నచ యుధ్యేత మతిమానప్రతిగ్రహః ।
యత్ర రాజా తత్రకోశః కోశాధీనాహి రాజతా.
యోధేభ్యస్తు తతో దద్యాత్కించిద్దాతుం నయుజ్యతే ।
ద్రవ్యలక్షం రాజఘాతే తదర్ఠం తత్సుతార్ధనే.
సేనాపతివదే తద్వద్దద్యాద్ధస్త్యాది మర్దనే ।
అథవా ఖలు యుధ్యేరన్పత్త్యశ్వరథదంతినః.
యథా భవేదసమ్బాధో వ్యాయామవినివర్తనే ।
అసంకరేణ యుద్యేరన్సంకరః సంకులావహః.
మహాసంకుల యుద్ధేషు సంశ్రయేరన్మతఙ్గజమ్ ।
అశ్వస్య ప్రతియోద్ధారో భవేయుః పురుషాస్త్రయః.
ఇతి కల్ప్యాస్త్రయశ్చాశ్వా విధేయాః కుంజరస్యతు ।
పాదగోపా భవేయుశ్చ పురుషాదశ పంచ చ.
విధానమితి నాగస్య విహితస్యన్ద నస్య చ ।
అనీకమితి విజ్ఞేయమితి కల్ప్యా నవద్విపాః.
తథానీకస్య రంధ్రంతు పంచధాచ ప్రచక్షతే ।
ఇత్యనీక విభాగేన స్థాపయేద్వ్యూహ సంపదః.
ఆశ్వసైన్యాదులు విచ్ఛిన్నమైనపుడు వాటిని ఆదుకొని ఆలోపమును పూరించు సైన్యమునకు ‘ప్రతిగ్రహము’ అని పేరు. ప్రతిగ్రహమును చక్కగా సంఘటితము చేసికొనవలెను. ఆది భారమును సహింప సమర్థమై యుండును. ప్రతిగ్రహములేని వ్యూహము శూన్యమువలే కనబడును. విజయాభిలాషియైస బుద్ధిమంతుడగు రాజు ప్రతిగ్రహ సైన్యమును కూర్చుకొనకుండ యుద్ధము చేయగూడదు. కోశము రాజు దగ్గరనే ఉండవలెను. రాజత్వము కోశాధీనము. విజయము సాధిచిన యోధులక ఆకోశమును డీయే పారితోషికమీయవలెను. దాతకోసమై యుద్ధము చేయని వాడెవ్వడైన ఉండునా? శత్రురాజును వధించిన యోధునకు ఒక లక్షముద్రలివ్వవలెను రాజకుమారుని చంపిన వానికి దానిలో సగము పారితోషికముగా ఈయవలెను. సేనాపతిని చంపిన దానికి గూడ అంతయే. ఏనుగ రథము మొదలగు వాటిని నశింపచేసి వారికి గూడ ఉచితరీతిని పారితోషికములీయవలెను పదాతులు, అశ్వికులు, రథికులు, హాస్తికులు కూడ తమబడలికకు, విశ్రాంతినిమిత్తమై వెనుకకు వెళ్లుటకు అడ్డుఉండనంత హరమునందుండి యుద్ధము చేయవలెను. యోధులందరును దూర దూరముగా ఉండి యుద్దము చేయవలెను. కలిసిపోయి సుద్దము చేసినచో ఆది సంకులమై పోవును. మహాసంకుల యుద్ధమునుదు ఆలసి పోయిన పదాల్యాదులగు అసహాయసైనికులు పెద్ద పెద్ద ఏనుగుల సాహాయ్యము తీసికొనవలెను. ఒక్కొక్క ఆశ్వికుని ఎదుట ముగ్గురు పదాతులు ప్రతియోద్ధలుగా, అనగా అగ్రగాములుగా ఉండవలెను ఒక్కొక్క హస్తి కుని ఎదుట ఐదుగురేసి చొప్పున ఆశ్వికులుండవలెను. వీరు కాక ఏనుగకు సాదరక్షకులు గూడ ఆంతమందియే, అనగా ఐదుగురేసి ఆశ్వికులు, పదునైదుగురు పదాతులు. ప్రతి యోద్దలు ఏనుగులు ముందును, పాదరక్షకులు గజపాడసమీపమునందును ఉందురు. ఇది ఏనుగులకు సంబంధించిన వ్యూహము. రథవ్యూహ విషయమునందుకూడ ఇట్లే తెలియవలెను గజవ్యూహమునకు చెప్పబడిన రీతియందే నవగ జవ్యూహముకూడ ఏర్పరుపవలేను దీనికి ‘అనీకము’ అని పేరు. ఒక అనీకమునకు ఒక ఆనీకమునకును మధ్య అయిదుధనస్సుల దూర ముండవలెను. ఈ విధముగ ఆనేక విభాగానుసారము వ్యూహసంపత్తిని ఏర్పరుచుకొనవలెను.
ఉరస్య కక్షపక్షాంస్తు కల్ప్యానేతాన్ప్ర చక్షతే ।
ఉరః కక్షౌచ పక్షౌచ మధ్యం పృష్ఠ ప్రతిగ్రహః.
కోటీ చ వ్యూహ శాస్త్రజ్ఞైః సప్తాంగో వ్యూహ ఉచ్యతే ।
ఉరస్యకక్షపక్షాస్తు వ్యూహోఽయం సప్రతిగ్రహః.
గురోరేష చ శుక్రస్య కక్షాభ్యాం పరివర్జితః ।
తిష్ఠేయుః సేనాపతయః ప్రవీరైః పురుషైర్వృతాః.
అభేదేన చయుధ్యేరన్రక్షేయుశ్చ పరస్పరమ్ ।
మధ్యవ్యూహే ఫల్గు సైన్యం యుద్ధవస్తు జమన్యతః.
యుద్దం హి నాయకప్రాణం హన్యతే తదనాయకమ్ ।
ఉరసిస్థాపయేన్నాగాన్ప్ర చండాస్కక్షయోరథాన్.
హయాంశ్చ పక్షయోర్వ్యూ హోమధ్య భేదీ ప్రకీర్తితః ।
మధ్యదేశే హయానీకం రథానీకంచ కక్షయోః.
పక్షయోశ్చ గజానీకం వ్యూహోఽన్తర్భేద్యయం స్మృతః ।
రథస్థానే హయాన్దద్యాత్పదాతీంశ్చ హయాశ్చయే.
రథాభావేతు ద్విరదా న్వ్యూహే సర్వత్రదాపయేత్ ।
యదిస్యాద్ధండ బాహుల్యమాబాదః సంప్రకీర్తితః.
మండలా సంహతో భోగోదండస్తే బహూదాశృణు ।
తిర్యగ్వృత్తిస్తు దండః స్యాద్భోగోఽన్యా వృత్తిరేవచ.
మండలః సర్వతోవృత్తిః పృథగ్వృత్తిరసంహతః ।
వ్యూహమునకు ప్రధానముగా మూడు అంగములున్నవి. ‘ఉరస్యము’, ‘కక్షము’, ‘పక్షము’, అను మూడును కల్పింపదగినవి. ఉరస్సు, కృక్షము, పక్షములు, మధ్యము, ప్రతిగ్రహము, కోటి ఆని వ్యూహమునకు ఏడు అంగములు శాస్త్రజ్ఞులచే చెప్పబడినవి. ఉరస్య-కక్షపక-ప్రతిగ్రహాదులతో కూడిన ప్యూహవిభాగము బృహస్పతిచే చెప్పబడినది. శుక్రాచార్యునిమతమున క క్ష-ప్రకక్షములు లేవు. సేనాపతులు ఉత్తమ వీరపరివృతులై యుద్ధరంగమునండు నిలువవలెను. వారందరును సంఘటితులై యుండి ఒకరి నొకరు రక్షించుచు యుద్దము చేయవలెను. దుర్బల సైన్యమును ప్యూహమధ్యము నందుంచవలెను. యుద్దమునకు సంబంధించిన యంత్రములు ఆయుధములు, ఓషధులు మొదలగు ఉపకరణములను సైన్యమునకు వెనుక ఉంచవలెను. యుద్ధమునకు ప్రాణము రాజు. రాజు లేనిచో యుద్ధములో పాల్గొన్నవారు హతులగుదురు హృదయస్థానము నందు గజములను, క స్థానమున రథములను, పక్షస్థానములందు అశ్వములను, కషభాగమునందు రథములను, పక్షములందు గజములను ఉంచిన వ్యూహము ‘ఆంతభేది’. కక్ష ములందు ఆశ్వములను, మధ్యదేశ మున పదాతులను ఉంచి ఏర్పరచినది మరొక విధమగు “ఆంతభేదవ్యూహము”, ఈ రథములు లేనిచో వ్యూహము లోపల ఆంతటను గజములను ఉంచవలెను. సేన ఆధికముగా ఉన్న చో అది “ఆవాపము”. మండలము, అసహతము, భోగము, దండము అనునవి నాల్గును ప్రకృతిస్యూహములు. దండాకారమున పొడవుగా ఏర్పరచిన వ్యూహము “దండ వ్యూహము”. సర్పశరీరాకారమున ఏర్పరచినది “భోగవ్యూహము”. దానిలో సైనికుల ఆన్వావర్తనము జరుగుచుండును. సర్వతోముఖమునుండి గోళాకారమున నేర్పరచిన వ్యూహము “మండలవ్యూహము” అనీకములను దూరదూరముగా నిలబెట్టిన వ్యూహము “అసంహతవ్యూహము”.
ప్రదరో దృడకోఽసహ్యః చాపోవైకుక్షిరేవచ.
ప్రతిష్ఠః సుప్రతిష్ఠశ్చశ్యేనో విజయ సంజయౌ ।
విశాలో, విజయః సూచీ స్థూణాకర్ణచమూముఖౌ.
సర్పాస్యోవలయశ్చైవ దండభేదాశ్చ దుర్జయాః ।
అతిక్రాంతః ప్రతికాంతః కక్షాభ్యాం చైకపక్షతః.
ఆతిక్రాంతస్తు పక్షాభ్యాం త్రయోఽన్యే తద్విపర్యయే ।
పక్షోరస్త్యెరతిక్రాంతః ప్రతిష్ఠోఽన్యో విపర్యయః.
స్థూణాపక్షో ధనుఃపక్షో ద్విస్థూణోదండ ఊర్ధ్వగః ।
ద్విగుణోఽన్త స్త్వతిక్రాంత పక్షోఽన్యస్యవిపర్యయః.
ద్విచతుర్దండ ఇత్యేతే జ్ఞేయః లక్షణతఃక్రమాత్ ।
ప్రదరము, దృడకము, అసహ్యము, చాపము, చాపకుడి, ప్రతిష్ఠము, సుప్రతిష్ఠము, శ్యేనము, విజయము, సంజయము, విశాలవిజయము. సూచి, స్థూణాకర్ణము, చమూముఖము, ముషాస్యము, వలయము సుదుర్జయము అని దండవ్యూహము పదునేడు విధములు. పక్ష - కక్ష - ఉర స్యము లను మూడు స్థానములందును సైనికుల సమస్థితిలో నన్నచో అది “దండ ప్రకృతి” కక్ష భాగమునందు సైనికులు కొంచెము ముందుకు వెళ్ళగా మిగిలిన రెండు స్థానము లందలి సైనికులు లోనికి అణగి యున్నచో అది ‘ప్రదరము’. శత్రువులను చీల్చివేయును గాన దీని కాపేరు వచ్చినది. కత - పక్షములు రెండును లోనికి అణగియుండి, ఉరస్యము మాత్రము బైటకు వచ్చినచో ఆది ‘దృడకము’ రెండు పక్ష ములు మాత్రము బైటకు వచ్చినచో ఆది “ఆసహ్యము” ప్రదర - దృడక - అసహ్యములను విపరీతముగా ఏర్పర చినచో అవి క్రమముగ చాప - చాపకుక్షి - ప్రతిష్ఠ లగును. రెండు పక్షములు బైటకురాగా ఉరస్యము. అంతః ప్రవిష్ట మైనచో ఆది “సుప్రతిష్ఠితము”. ఏతద్విరుద్ధస్థితి “శ్యేనవ్యూహము”. నిలబెట్టిన దండము వంటి ఆకారముగల దండ వ్యూహమునకు స్థూణాకర్జములు రెండు పక్షములైనచో అది “విజయము”, రెండు చాప వ్యూహములు రెండు పక్షములుగా నున్నది . ‘సంజయము’, ఒక దానిపై ఒకటి చొప్పున రెండు సూణాకర్ణములు నిలిపినచో ఆది “విశాల విజయము”, కక్ష - పక్షాదులను ఒకదానిపై ఒకటిగ నిలబెట్టినచో అది “సూచి”. రెండు రెట్లుగా ఉన్న పక్షములు గల దండవ్యూహము “స్థూణాకర్ణము”. మూడేసి పక్షములు బైటకు వచ్చినది చతుర్గుణ పక్షములు కలది ఆగు వ్యూహము “చమముఖము”; దీనికి విపరీతమైనది రషాస్యము; రెండుదండ వ్యూహములచే వరియవ్యూహమేర్పడును. నాలుగు దండవ్యూహములచే దుర్జయవ్యూహమేర్పడను.
గోమూత్రికాహిసంచారీ శకటో మకరస్తథా.
భోగభేదాః సమాఖ్యాతాస్తథా పారిప్లవంగకః ।
దండపక్షౌయుగోరస్య శకట స్తద్విపర్యయే.
మకరోవ్యతికీర్ణశ్చ శేషః కుంజరరాజిభిః ।
మండలవ్యూహ భేదౌతు సర్వతోభద్ర దుర్జయౌ.
ఆష్టానీకో ద్వితీయస్తు ప్రథమః సర్వతోముఖః ।
అర్ధచంద్రక ఊర్ధాంగో వజ్రభేదాస్తు సంహతేః.
తథాకర్కట శృంగీచ కాకపాదీచ గోధికా ।
త్రిచతుః పంచసైన్యానాం జ్ఞేయః ఆకారభేదతః.
దండస్య స్యుః సప్తదశ వ్యూహాద్వౌ మండలస్య చ ।
ఆసంఘాతశ్చ షట్ పంచ భోగస్యైవతు సంగరే.
పక్షాదీనామథై కేన హత్వాశేషైః పరీక్షిపేత్ ।
ఉరసావా సమాహత్య కోటిభ్యాం పరివేష్టయేత్.
పరేకోటీ సమాక్రమ్య పక్షాభ్యామప్రతిగ్రహాత్ ।
కోటిభ్యాం జఘనం హన్యాదురనా చ ప్రపీడయేత్.
యతః ఫల్గుయతో భిన్నం యతశ్చాన్త్యెరధిష్ఠితమ్ ।
తతశ్చారిబలం హన్యా దాత్మనశ్చోప బృంహయేత్.
సారం ద్విగుణసారేణ ఫల్గుసారేణ పీడయేత్ ।
సంహతం చ గజానీకైః ప్రచండైర్దారయేద్బలమ్.
భోగ వ్యూహమున గోమూత్రిక, ఆహిసంచారి, శకటము, మకరము, పరిపతన్తికము ఆని ఐదు భేదములున్నవి. నడచుచున్న ఎద్దు మూత్రముపోసినపుడు ఎట్లు రేఖ ఏర్పడునో ఆ విధముగా సైన్యమును నిలిపిన గోమూత్రికా వ్యూహము. సర్పము సంచరించునపుడు ఏర్పడు రేఖవలె సైన్యమును నిలిపిన అది ఆహిసంచారి. రక్ష - పక్షములు రెండును ముందు వెనుక క్రమమున దండ వ్యూహమువలె నుండి ఉరస్య సంఖ్య రెట్టింపు అయినచో ఆది “శకట వ్యూహము”; దీనికి విపరీతముగ నున్నది మకర వ్యూహము. ఈ రెంత వ్యూహములలో దేనికై న మధ్య భాగమునందు అశ్వ - గజాదుల ఆవాపము చేసినచో అది పరిపతంతిక వ్యూహము. సర్వతోభద్రము దుర్జయము అని మండల వ్యూహము రెండు విధములు. దీనిలో ఐదు ఆనీకముల సేన ఉండును. ఆవశ్యకలాను సారము ఉర స్యమునందును, రెండు కక్షములందును ఒక్కొక్క ఆనీకమును పెంచినచో దుర్జయమను వ్యూహము. ఆర్థచంద్రము, ఉత్థానము వజము అని ఆసంహ తము మూడు విధములు. కర్కట శృంగీ కాక పాది, గోధిక అని కూడ అసంహతమున మరి మూడు భేదములు. ఆర్ధ చంద్ర - కర్కట శృంగులందు మూడేసి ఆనీకసలుండును. ఉత్థాన - కాకపాదుందు నాలుగేసి అనీకములును, వజ్ర - గోధికు ఐదేసి ఆనీకములతో ఏర్పడును. ఆనీకములను పట్టి మూడు భేదములేయైనను, ఆకృతి భేదమును బట్టి ఆరు భేదములు చెప్పబడినవి. ఈ విధముగ దండవ్యూహమున పదునేడు భేదమాలు, మండల వ్యూహమునకు రెండు భేదములు ఆసంహతమునకు ఆరుభేదములు, భోగవ్యూహమునకు ఐదు భేదములు చెప్పబడినవి. పది అంగముల ఏదైన ఒక ఆంగము సేనచే శత్రువ్యూహమును భేదించి, మిగిలిన అనీక ములచే దానిని చుట్టుముట్టవలెను. లేదా ఉరస్యమునందలి అనీకముచే శత్రువ్యూహమును ఆక్రమించి, రెండు ప్రపక్షములచే చుట్టుముట్టవలెను. శత్రుసేన యొక్క రెండు ప్రపక్షములందును తన వ్యూహమునందలి పక్షములచే ఆక్రమణము సలిపి, శత్రుజఘనభాగమును తన ప్రతిగ్రహ - కోటి ద్వయములతో నశింపచేయవలెను. ఉరస్యమునందలి సేనతో శత్రు పక్షమును పీడించవలెను. వ్యూహమునందు సారహీన సైనికులున్న చోట్లను, విభేదము లేర్పడిన సైన్యమునందును, దూష్య సైనికులున్న ప్రదేశములందును శత్రుసేనను సంహరించి, తన పక్షమునందున అట్టి స్థానములకు బలము చేకూర్చవలేను. బలిష్ట సేనను, అంతకంటే బలిష్టనుగు సేనను ఉపయోగించి, పీడించవలెను. నిర్బల సైన్యమును సబల సైన్యముతో అణచివేయవలెను. శత్రు సైన్యము సంఘటితముగనున్నచో, ప్రచండమగు గజసేనతో ఆ శత్రుసైన్యమును చీల్చివేయవలెను.
స్యాత్కక్షపక్షోరస్యైశ్చ వర్తమానస్తు దండకః ।
తత్ర ప్రయోగో దండస్యస్థానం తుర్యేణ దర్శయేత్.
స్యాద్ధండ సమవృక్షాభ్యా మతిక్రాంతః ప్రదారకః ।
భవేత్స పక్ష కక్షాభ్యా మతిక్రాంతో దృఢఃస్మృతః.
కక్షాభ్యాం చ ప్రతిక్రాంత వ్యూహోఽసహ్యః స్మృతో యథా ।
కక్ష పక్షౌవధః స్థాప్యోరస్యైః క్రాంతశ్చ ఖాతకః.
ద్వౌదండౌ వలయఃప్రోక్తో వ్యూహోరిపువిదారణః ।
దుర్జయశ్చతుర్వలయః శత్రోర్బలవిమర్దనః.
కక్ష పక్షోరస్యైర్భాగో విషయం పరివర్తయన్ ।
సర్వచారి గోమూత్రికా శకటః శకటాకృతిః.
విపర్యయోఽమరః ప్రోక్తః సర్వశత్రు విమర్ధకః ।
స్యాత్కక్షపక్షారస్యానామేకీ భావస్తు మండలః.
చక్ర పద్మాదయోభేదా మండలస్య ప్రభేదకాః ।
ఏవంచ సర్వతో భద్రో వజ్రాక్షవరకాశవత్.
అర్థచంద్రశ్చ శృంగాటో హ్యచలో నామరూపతః ।
వ్యూహా యథా సుఖం కార్యాః శత్రూణాం బలవారణాః.
అగ్నిరువాచః
రామస్తు రావణం హత్వా హ్యయోధ్యాం ప్రాప్తవాన్ద్విజ ।
రామోక్త నీత్యేంద్రజితం హతవాం ల్లక్ష్మణః పురా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రామోక్త రాజనీతిర్నామ ద్విచత్వారింశచధిక ద్విశతతమోఽధ్యాయః.
పక్ష - కక్ష - ఉరస్యములు మూడును సమస్థితిలో నున్నపుడు అది ఉండవ్యూహము. దండము యొక్క ప్రయోగమును, స్థానమును వ్యూహ చతుర్థాంగముతో ప్రదర్శించవలెను. దండముతో సమానముగ రెండు పక్షములు కూడ ముందుకు వచ్చినచో అది ‘ప్రదరము’ లేదా ‘ప్రహరక’ వ్యూహము. అదే పక్షక క్షముద్వారా అంతక్రాంతమైనచో ఆది దృఢవ్యూహము. రెండుపక్షములు మాత్రమే ముందుకు చొచ్చుకున్నచో ఆది “అసహ్యవ్యూహము”. కక్షమును పక్షమును క్రిండనుంచి, ఉరస్యముద్వారా ముందుకు వచ్చినది “చాపవ్యూహము” రెండుదండములు కలిసిన “వలయ వ్యూహము” ఏర్పడును. ఈ వ్యూహము శత్రువులను చీల్చివేయును. నాలుగువలయ వ్యూహములు కలిసినచో, శత్రు సేనను మర్ధించు “దుర్జయవ్యూహము ఏర్పడును. కక్ష - పక్ష - ఉరస్యము విషమములుగా నున్న చో ఆది “భోగవ్యూహము”. సర్పచారి, గోమూత్రిక, శకటము, మకరము, పరివతంతికము అని దానికి ఐదుభేదములు. సర్పము సంచరించు ఆకారమున సర్పదారి, గోమూత్రాకారమున గోమూత్రక , శకటాకార మున శకట ము, దీనికి విపరీతముగ మకరవ్యూహము ఏర్పడును. ఇట్లు పంచ భేదములుగల భోగ వ్యూహము శత్రువినాశకమ, మండలవ్యూహమునకు చక్రవ్యూహ - పద్మవ్యూహాదుల భేద ప్రభేదములు. ఇదే విధముగ సర్వతోభద్ర - వజ్ర - అక్షవర - కాక - ఆర్ధచంద్ర - శృంగార ఆచలాడి వ్యూహములు ఉన్నవి. వీటి ఆకారములను బట్టి పేర్లు వచ్చినవి. వ్యూహములను తమ ఇచ్ఛననుసరించి ఏర్పరచుకొనవలెను. వ్యూహములు శత్రు సేన ప్రగతిని నిలిపి వేయును. అగ్ని చెప్పెను:- శ్రీరాముడు రావణుని వధించిన పిదప ఆయోధ్య రాజ్యమును పొందెను. శ్రీరాముడు చెప్పిన ఈ నీతిని అనుసరించుట చేతనే లక్ష్మణుడు పూర్వము, ఇంద్రజిత్తును వధించెను.
అగ్ని మహాపురాణమునందు రాజనీతికథనమను రెండువందలనలుబదిరెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 242 of the Agni Purāṇa is as follows:
The science of dravyaguṇa — the properties of medicinal substances — is presented. Agni classifies all dravyas according to their guṇas (qualities), rasas (tastes), vīrya (potency), vipāka (post-digestive effect), and prabhāva (specific action). The chapter describes how substances of similar guṇa increase the corresponding doṣa, while substances of opposing guṇa reduce it. Specific plant families and their dominant therapeutic actions are catalogued.