ఈశ్వర ఉవాచః
వక్ష్యే సూర్యార్చనం స్కన్ద కరాజ్గన్యాసపూర్వకమ్ ।
అహంతేజోమయః సూర్య ఇతి ధ్యాత్వార్ఘ్యమర్పయేత్ .
పూర యేద్రక్తవర్ణేన లలాటాకృష్ణబిన్దునా ।
తం సంపూజ్య. రవేర జ్ఞఃకృత్వా రక్షావగుత్థానమ్.
సంప్రోక్ష్య తజ్జలెవ్యం పూర్వస్యాం భాసుమర్చయేత్ ।
ఓం ఆం హృద్బీజాది సర్వత్ర పూజనం దజ్జిపిజ్గలౌ.
ద్వారి దక్షే వామపార్శ్వ ఈశానే అం గణాయ చ ।
అగ్నౌ గురుం పీఠమధ్యే ప్రభూతం చాసనం యజేత్ .
అగ్నాదౌ విరలం సారమారాధ్యం పరమం సుఖమ్ ।
సితర క్తపీతనీలవర్ణాన్సింహనిబాన్యజేత్.
పద్మ మధ్యే రాం చ దీప్తాం రీం సూక్ష్మాం రుం జయాం క్రమాత్ ।
రూం భద్రం రేం విభూతీశ్చ విమలాం రై మమోఘ యా.
రోం రేం చ విద్యుతాం శ క్తిం పూర్వాద్యాః సర్వతోముఖాః ।
రం మధ్యే అరాసనం స్యాత్సూర్యమూ ర్తిం షడక్షరమ్.
ఓం హం ఖం ఖ్లకాయేతి యజేదావాహ్య భాస్కరమ్ ।
లలాటాకృష్టమజ్ఞూల్యాం ధ్యాత్వా రబ్ధం న్య సేద్రవిమ్.
హ్రాం హ్రీం సః సూర్యాయ నమో ముద్రయావానాదికమ్ ।
విధాయ ప్రీతయే బిమ్బముద్రం గన్గాదికం దదేత్.
పద్మ ముద్రిం బిల్వముద్రం ప్రదర్యాగ్నౌ హృదీరితమ్ ।
ఓం అం హృదయాయ నమః అర్కాయ శిర సే తథా.
భూర్భువః స్వః సు రేయ శిఖాయై నైరృతే యజేత్ ।
హుం కవచాయ వాయవ్యే హ్రాం నేత్రాయేతి మధ్యతః.
హః అస్రాయేతి పూర్వాదౌ తతో ముద్రాః ప్రదర్శయేత్ ।
పరమేశ్వరుడు పలికెను. స్కందా! ఇపుడు అంగన్యాస కరన్యాసములతో సూర్య పూజావిధానమును చెప్పెదను. తేజోమయసూర్యుడను నేనే” అని భావన చేసి అర్ఘ్యపూజనము చేయవలెను. ఎఱ్ఱటి చందనము కలిపిన జలమును లలాట సమీపమునకు తీసికొని వెళ్ళి దానితో అర్ఘ్యపాత్రమును నింపవలెను. దానిని గంధాదులతో పూజించి సూర్యాంగములచే రజావగుంఠనము చేయవలెను. పిమ్మట జలముతో పూజాసామగ్రిని ప్రోక్షించి, పూర్వాభిముఖుడై సూర్యుని పూజ చేయ వలెను. “ఓం ఆం హృదయాయ నమః” ఇత్యాది విధమున స్వరబీజము మొదట చేర్చి శిరస్సు మొద లగు అన్ని అవయవముల న్యాసము చేయవలెను. పూజాగృహద్వారమునందు కుడి వైపున దండిని, ఎడమ వైపున పింగళుని పూజింపవలెను. “గం గణపతయే నమః” అను మంత్రముతో ఈశాన్యమున గణేశుని పూజింపవలెను. ఆగ్నేయమున గురుపూజ చేయవలెను. పీఠమధ్యమునందు కమాలాకారాసనము భావన చేసి పూజించవలెను. పీఠముయొక్క ఆగ్నేయాది కోణములలో క్రమముగ విమల-సార - ఆరాధ్య - పరమసుఖములను, మధ్యభాగమున ప్రభూతాసనమును పూజింపవలేను. విమలాదుల నాల్గింటి రంగులు వరుసగ శ్వేత.రక్త-పీత.నీలములు ఉండును. వాటి ఆకారము సింహముతో సమానముగ నుండును. వీటి నన్నింటిని పూజించవలెను. పీఠముపై నున్న కమలములోపల “రాం దీప్తాయై నమః” అను మంత్రముచే దీప్తాశ క్తిని, “రీం సూష్మాయై నమః” అను మంత్రముతో స్మూశక్తిని, “రూం జయాయై నమః” అను మంత్రముచే జయాశ క్తిని, “రేం భద్రాయై నమః” అను మంత్రముచే భద్రాశ క్తిని, “రైం విభూతయే నమః” అను మంత్రముచే విభూతి శక్తిని, “రోం విమలాయై నమః” అను మంత్రముచే విమలాశ క్తిని, “రౌం అమోఘాయై నమః” అను మంత్రముచే అమోఘా శక్తిని, “రం విద్యుతాయై నమః” అను మంత్రముచే విద్యుతాశ క్తిని పూర్వాది దిక్కులు ఎనిమిదింటి యందును పూజించి, “రః సర్వతోముఖ్యై నమః” అను మంత్రముచే మధ్యభాగమునందు, తొమ్మిదవ పీఠశ క్తి యైన సర్వతోముఖిని పూజించ వలెను. పిమ్మట “ఓం బ్రహ్మ విష్ణుశివాత్మకాయ సౌరాయ- యోగ పీఠాత్మనే నమః” అను మంత్రముచే సూర్యదేవుని పీఠమును పూజించవలెను. పిమ్మట “డోలాయ నమః” అను షడక్షర మంత్రమునకు ప్రారంభమున “ఓం హం ఖం” అను అక్షరములు చేర్చి తొమ్మిది అక్షరములు గల “ఓం హం ఖథోలాయ నమః” అను మంత్రము ద్వారా సూర్య విగ్రహావాహనము చేసి సూర్యుని పూజ చేయవలెను. దోసిటిలో నున్న ఉదక మును లలాటసమీపమునకు తీసికొని వెళ్ళి రక్త వర్ణుడై న సూర్యుని ధ్యానించి, ఆ సూర్యుడు తన ఎదుట నున్నట్లు భావన చేయవలెను. పిదప “హ్రాం హ్రీం సః సూర్యాయ నమః” అని పలుకుచు సూర్యునకు అర్ఘ్య మీయవలెను. . పిదప బింబముద్ర చూపుచు ఆవాహనాద్యుపచారములు సమర్పింప వలెను. పిదప సూర్యునీ ప్రీతి కొరకై గంధాదికి ము సమర్పింపవలెను. ఆగ్నేయమునందు “ఓం ఆం హృదయాయ నమః” అను మంత్రముచే హృదయమును, నైరృతిదిక్కునందు “ఓం భూః ఆర్కాయ శిర సే స్వాహా” అను మంత్రముచే శిరస్సును, వాయవ్యమున “ఓం భువః సురేశాయ శిఖాయై వషట్” అను మంత్రముచే శిఖను, ఈశాగ్యమునందు “ఓం స్వః కవచాయ హుం” అను మంత్రముచే కవచమును, ఇష్టదేవతకును ఉపాసకుసకును మధ్య “ఓం హాం నేత్రత్రయాయ వౌషట్” అను మంత్రముచే నేత్రమును, దేవతకు పశ్చిమభాగమునందు “వః అస్త్రాయ ఫట్” అను మంత్రముచే అస్త్రమును పూజింపవలెను. పిన్ముట పూర్వాదిదిశలందు ముద్రలను ప్రదర్శింపవలెను.
ధేనుముద్రా హృదాదీనాం గోవిషాణా చ నేత్రయోః ।
అస్త్రస్య త్రాసనీ యోజ్యా గ్రహాణాం చ నమస్క్రియా।
సోం సోమం బుం బుధం బృం చ జీవం భం భార్గవం యజేత్.
రవేపూర్వాది కేగ్న్యాఔ అం భౌమం శం శనైశ్చరమ్ ।
రం రాహుం కేం కేతవే చ గన్గాద్వైశ్చ ఖథోల్కయా.
మూలం జప్త్వార్ఘ్యపాత్రామ్బు దత్త్వా సూర్యాయ సంస్తుతిః ।
నత్వా పరాజ్ముఖం చాతం క్షమ స్వేతి తతో వదేల్.
శరాణునా ఫడ నైన సమాహృత్యాణుసంహృతిమ్ ।
హృత్పద్మే శివసూర్యేతి సంహారిజ్యోపసంస్కృతిమ్.
యోజయే తేజశ్చణ్డాయ రవినిర్మాల్యమర్పయేత్ ।
అభ్యర్చ్యేశ జపాఢ్యా నాధోమాత్సర్వం రవేర్భవేత్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సూర్యపూజావిధిక థనం నామ త్రిసప్తతితమోధ్యాయః.
హృదయ-శిరః-శిఖా-కవచములకు పూర్వాచి దిక్కులందు ధేనుముద్రను ప్రదర్శించవలేను. నేత్రములకు గోశృంగముద్ర చూపవలేను. అస్త్రమునకు త్రాసలీముద్ర చూపవలెను. పిమ్మట గ్రహములకు నమస్కారము, పూజ చేయ వలెను. “ఓం సోం సోమాయ నమః” అను మంత్రముతో తూర్పునందు చంద్రుని, “ఓం బు బుధాయ నమః” అను ముత్రముతో దక్షిణమున బుధుని, “ఓం బృం బృహస్పతయే నమః” అను మంత్రముతో పశ్చిమమున బృహస్పతిని, “ఓం భం భార్గవాయ నమః” అను మంత్రముతో శుక్రుని పూజింపవలెను. ఈ విధముగ పూర్వాదిదిః లందు చంద్రాదిగ్రహములను పూజించి ఆగ్నేయాది విదిక్కులందు మిగిలిన గ్రహములను పూజింపవలెను. ఎట్లనగా “భౌం భౌమాయ నమః” అను మంత్రముతో ఆగ్నేయమున కుజుని, “ఓం శం శనైశ్చరాయ నమః” అను మంత్రముతో నైరృతి దిక్కునందు శనైశ్చరుని, “ఓం రాం రాహవే నమః” అను మంత్రముతో వాయువ్యమునందు రాహువును, “ఓం కేం కేతవే నమః” అను మంత్రముతో ఈశాన్యమునందు కేతువును గంధాద్యుపచారములతో పూజింపవలేను. అఖోర్కీ (సూర్యభగవానుని) తో పాటు ఈ అన్ని గ్రహములపూజ కూడ చేయవలెను. మూలమంత్రము జపించి, అర్ఘ్యపాత్రమునందు జలము గ్రహించి సూర్యునకు సమర్పించి, పిదప స్తుతించవలెను. ఈ విధముగ స్తుతి చేసిన పిదప ఆభిముఖముగ నిలబడి సూర్యునకు నమస్కరించి ఇట్లు ప్రార్థించ వలెను. “ప్రభో! నా అపరాధములను లోపములను క్షమింపుము”. పిమ్మట “అస్త్రాయ ఫట్” అను మంత్రముతో అణుసంహార సమాహరణము చేసి, “శివసూర్య” అని పలుకుచు సంహారిణీముద్ర ద్వారా సూర్యుని ఉపసంహృత మగు తేజస్సును తన హృదయకమలములో నుంచి సూర్యనిర్మాల్యమును ఆతని పారదు డైన చండునకు సమర్పింపవలెను. ఈ విధముగ జగదీశ్వరు డగు సూర్యుని పూజ చేసి, ధ్యానహోమములు చేయుటచే సాధకుని మనోరథము లన్నియు సిద్ధించును.
అగ్ని మహాపురాణమునందు సూర్యపూజావిధివర్జన మను డెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 73 of the Agni Purāṇa is as follows:
This chapter provides the detailed ritual of Sūrya pūjā — the daily worship of Bhagavān Sūrya at sunrise, noon, and sunset. The kara-nyāsa (hand gestures consecrated to Sūrya's aspects) and aṅga-nyāsa (body consecration) mantras specific to Sūrya's twelve monthly forms (Vivasvat, Aryaman, Pūṣan, Tvaṣṭṛ, Savitṛ, Bhaga, Dhātṛ, Vidhātṛ, Varuṇa, Mitra, Indra, and Vivasvat again) are given. The eight Sūrya-śaktis — Dīptā, Sūkṣmā, Jayā, Bhadrā, Vibhūti, Vimalā, Amoghā, and Vidyutā — who preside over the eight daily intervals are identified. The nine-planet worship with Sūrya at the center is prescribed, with each planet's dhyāna-mantra, color, mount, and offering substance specified. The arghya offering — with water, red flowers, and sandal paste offered toward the rising sun — is described as the daily renewal of the world's connection with its cosmic light-source.