అగ్ని మహా పురాణము

219 - అథాభిషేకమన్త్రాః.

పుష్కర ఉవాచః-

రాజ దేవాద్యభిషేకమంత్రాన్వ క్ష్యేఽఘమర్దనాన్

కుంభాత్కుశోదకైః సించేత్తేన సర్వం హి సిద్ధ్యతి.

 సురాస్త్వామభిషిఞ్చన్తు బ్రహ్మ విష్ణుమహేశ్వరా

వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్న శ్చానిరుద్ధకః.

భవన్తు విజయాయైతే ఇంద్రాద్యా దశ దిగ్గతాః

రుద్రోధర్మో మనుర్ధక్షో రుచిఃశ్రద్ధా చ సర్వదా.

భృగురత్రిర్వశిష్ఠశ్చ సనకశ్చ సనందనః

 సనత్కుమారోఽఙ్గిరాశ్చ పులస్త్యః పులహః క్రతుః.

మరీచిః కశ్యపః పాన్తు ప్రజేశాః పృథివీపతిమ్

ప్రభాసురా బర్హిషదః హ్యగ్నిష్వాత్తాశ్చ పాస్తుతే.

 క్రవ్యాదాశ్చోపహూతాశ్చ హ్యాజ్యపాశ్చ సుకాలినః

అగ్ని భిశ్చాభిషిఞ్చన్తు లక్ష్మ్యాద్యా ధర్మవల్లభాః.

 ఆదిత్యాడ్యాః కశ్యపస్య బహుపుత్రస్య వల్లభాః

కృశాశ్వస్యాగ్నిపుత్రస్య భార్యాశ్చారిష్టనేమినః.

అశ్విన్యాద్యాశ్చ చంద్రస్య పులహస్య తథా ప్రియాః

భూతా చ కపిశా దంష్ట్రీ సురసా సరమా దనుః.

 శ్యేనీ భాసీ తథాక్రౌంచీ ధృతరాష్ట్రీ శుకీ తథా

పత్న్యస్త్వామభిషిఞ్చన్తు ఆరుణశ్చార్కసారథిః.

ఆయతిర్నియతీ రాత్రిర్నిద్రా లోకస్థితౌ స్థితాః

ఉమా మేనా శచీ పాన్తు ధూమ్రోర్ణానిరృతిర్జయే.

గౌరీ శివాచ బుద్ధిశ్చ వేలాయాచైవ నడ్వలా

అసిక్నీచ తథా జ్యోత్స్నా దేవపత్న్యో వనస్పతిః. 

            పుష్కరుడుపలికెను : ఇపుడు రాజదేవతాద్యభిషేకమునకు సంబంధించిన మంత్రములను గూర్చి చెప్పెదను. ఇవి సకలపాపములను తొలగించును. కలశను  కుశ యుక్త జలముతో నింపి రాజాభిషేకము చేసినచో సకల మనోరథములు సిద్ధించును. (మంత్రముల ఆర్థము)- రాజా! బ్రహ్మ విష్ణు శివాది దేవతలందరను నీక అభిషేకము చేయుదురు గాక! వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్న - అనిరుద్ధులు, ఇంద్రాది దశ దిక్పాలకులు, రద్ర - ధర్మ - నును దక్ష - రుచి శ్రాద్ధాది దేవతలును నీకు సర్వదా విజయము నిచ్చెదరు గాక. భృగు - అత్రి - వసిష్ఠ- సనక సనందన - సనత్కుమార ఆంగీరస్ - పులస్త్య - పులహ - క్రతు - మరీచి - కశ్యపాదిమహర్షులు ప్రజాసనము చేయు భూపతిని రక్షింతురు గాక. ప్రకాశ వంతులగు “బర్హిషద్” “అగ్నిష్వాత్త” అను పితృదేవతలు నిన్న రక్షింతురు గాక. క్రవ్యాదులు, ఆవాహితులగు ఆజ్యపులు, సుకాలి, ధర్మప్రియ, లక్ష్మి మొదలగు దేవతలను వృద్ధిపొందిన అగ్నులును నీకు అభిషేకము చేయుదురు గాక. అనేక పుత్రవంతుడైన ప్రజాపతి, కశ్యపుని ఆదిత్యాది పుత్రగణము, ఆభినందన - కృశాశ్వులు, ఆరిష్టనేమిభార్యలును నీకు అభిషేకము చేయుదురుగాక. ఆశ్విన్యాది. చంద్రభార్యలు, పులహుని భార్యలు, భూతా - కపి - దంష్ట్రా - సురసా సరమా - దను - శ్యేనీ - భాసీ - క్రౌంచీ - ధృతరాష్ట్రీ - శుకి మొదలగు దేవతలును, సూర్యుని సార థియైన అరుణుడును, నీ ఆభిషేక మును సుసంపన్నము చేయుదురు గాక. ఆతిథి - నియతి - రాత్రి - నిద్రాదిదేవతలును, లోక రక్షణ తత్పరురాలగు ఉమాదేవియు, మేనా - శచీప్రభృతి దేవతలును, ధూమ్రా- ఊర్జా - నైరృతీ - గౌరీ - శివా బుద్ధి - వేలా - నడ్వలా - ఆసిక్నీ - జ్యోత్స్నా దేవతలును, దేవాంగనలును, వనస్పతులును నిన్ను పాలించుగాక.

మహాకల్పశ్చ కల్పశ్చ మన్వంతర యుగాని చ

సంవత్సరాశ్చ వర్షాణి పాన్తు త్వామయనద్వయమ్.

 ఋతవశ్చ తథా మాసాః పక్షా రాత్య్రహనీ తథా

సంధ్యాతిథి ముహూర్తాశ్చ కాలస్యావయవాకృతిః.

 సూర్యాద్యాశ్చ గ్రహాః పాన్తు మనుః స్వాయమ్భువాదికః

స్వాయమ్భువః స్వారోచిష ఔత్త మస్తామసోమనుః.

రై వతశృక్షుషః షష్ఠో వైవస్వత ఇహేరితః

సావర్ణీ బ్రహ్మపుత్రశ్చ ధర్మపుత్రశ్చ రుద్రజః.

దక్షజో రౌచ్యభౌత్యౌ చ మనవస్తు చతుర్దశ

విశ్వభుక్ చ విపశ్చిచ్చ సుచిత్తిశ్చ శిఖీవిభుః.

మనోజవస్త థౌజస్వీ బలిరద్భుతశాంతయః

వృషశ్చ ఋతధామా చ దివః స్పృక్ కవిరింద్రకః.

 రై వన్తశ్చ కుమారశ్చతథా వత్సవినాయక

వీరభద్రశ్చ నందీ చ విశ్వకర్మా పురోజవః.

ఏతే త్వామభిఞ్చన్తు సురముఖ్యాః సమాగతాః

నాసత్యౌ దేవభిషజౌ ధ్రువాద్యా వసవోఽష్టచ.

దశ చాంగీరసో వేదాస్త్వాభిషిఞ్చన్తు సిద్ధయే

ఆత్మాహాయుర్మనో దక్షోమదః ప్రాణస్త థైవ చ.

హవిష్మాంశ్చ గరిష్ఠశ్చ ఋతః సత్యశ్చ పాన్తువః

ఋతుర్దక్షో వసుః సత్యః కాల కామోధురిర్జయే.

 పురూరవా మాద్రవాశ్చ విశ్వేదేవాశ్చరోచనః

అఙ్గార కార్యాః సూర్యస్త్వాం నిరృతిశ్చ తథా యమః.

 అజైకపాదహిర్బుద్న్యో ధూమ కేతుశ్చ రుద్రకః

భరతశ్చ తథా మృత్యుః కాపాలిరథ కింకిణిః.

భవనో భావనః పాన్తు స్వజన్యః స్వజనన్తథా

క్రతుక్రవాశ్చ మూర్ధా చ యజనోఽభ్యుశనాస్త థా.

 ప్రసవశ్చావ్యయశ్చైవ దక్షశ్చ భృగవః సురాః

మనోఽనుమన్తా ప్రాణశ్చ నవోపానశ్చ వీర్యవాన్.

 వీతిహోత్రోనయః సాధ్యో హంసోనారాయణోఽవతు

విభుశ్చైవ ప్రభుశ్చైవ దేవ శ్రేష్ఠా జగద్ధితాః.

 ధాతామిత్రోఽర్యమా పూషా శక్రోఽథ వరుణోభగః

త్వష్టా వివస్వాన్సవితా విష్ణుర్ద్వాదశ భాస్కరాః.

ఏక జ్యోతిశ్చ ద్విర్ణ్యోతిస్త్రిశ్చతుర్జ్యోతిరేవచ

ఏకశక్రో ద్విశక్రశ్చ త్రిశక్రశ్చ మహాబలః.

ఇంద్రశ్చ మేత్యాదిశతు తతః ప్రతిమకృత్త థా

మితశ్చ సమ్మితశ్చైవ అమితశ్చ మహాబలః.

 ఋత జిత్సత్యజిశ్చైవ సుషేణః సేనజిత్తథా

అతిమిత్రోఽనమిత్రశ్చ పురుమిత్రోఽపరాజితః.

ఋతశ్చ ఋతవాగ్దాతా విధాతాధారణోధ్రువః

విధారణో మహాతేజా వాసవస్య పరః సఖా.

ఈదృక్షశ్చాప్యదృక్షశ్చ ఏతాదృగమితాశనః

క్రీడితశ్చ సదృక్షశ్చ శరభశ్చ మహాతపాః.

ధర్తాధుర్యో దురిర్భీమో హ్యభిముక్తోఽక్షపాత్సహ

ధృతిర్వసుర నాధృష్యో రామః కామోజయోవిరాట్.

 దేవా ఏకోన పఞ్చాశన్మరుతస్త్వామవన్తుతే

చిత్రాఙ్గదశ్చిత్రరథశ్ చిత్ర సేనశ్చ వై కలిః.

 ఊర్ణాయురుగ్ర సేనశ్చ ధృతరాష్ట్రశ్చ నన్దకః

హాహా హూహూ ర్నారదశ్చ విశ్వావసుశ్చ తుమ్బురుః.

 ఏతత్వామభిషిఞ్చను గంధర్వా విజయాయతే

పాన్తుతే కురవో ముఖ్యా దివ్యాశ్చాప్సరసాం గణాః.

 అనవద్యాసు కేశీచ మేనకా సహజన్యయా

క్రతుస్థలా ఘృతాచీ చ విశ్వాచీ పుఞ్జికస్థలా.

 ప్రహ్లిచా చోర్వశీ రంభా పంచచూడా తిలోత్తమా

చిత్రలేఖా లక్ష్మణా చ పుండరీకా చ వారుణీ.

మహాకల్ప-కల్ప-మన్వంతర-యుగ-సంవత్సర-వర్ష-ఆయన-ఋతుమాస-పక్ష-రాత్రి-దివస-సంధ్యా-తిథి ముహూర్తములు, కాలము యొక్క విభిన్నా వయవములును నిన్ను రక్షించుగాక. సూర్యాది గ్రహములు, స్వాయం భువాది మనువులు నిన్ను రక్షింతురు గాక. స్వాయంభువ-స్వారోచిష-ఉత్తమ-తామస-రైవత చాక్షుష-వైవస్వత సావర్ణి- బ్రహ్మ పుత్ర-ధర్మపుత్ర రుద్రపుత్రదక్షపుత్ర-రౌచ్య-భౌత్యులను పదునాల్గురు మనువులు నిన్ను రక్షింతురుగాక. పేశ్వథుక్ - విపశ్చిత్ –శిఖి-విభు-మనోజవ-ఓజస్వి-బలి-అద్భుతశాంతి-వృష-ఋతధామ-దివస్పృక్-కవి-ఇంద్ర-రైవంత-కుమార- కార్తికేయ–వత్స వినాయక –వీరభద్రనంది-విశ్వకర్మ- పురోజవ - దేవ వైద్య - అశ్వినీకుమారులు, ధ్రు వాద్యష్టవసువులుఈ ప్రధాన దేవతలందరును ఇచట పార్పణము చేసి నీ అభిషేకకార్యమును సుసంపన్నము చేయుదురుగాక. ఆంగిరసుని కులమునందుద్భవించిన పదిమంది దేవతలును, నాలుగు వేదములును సిద్దికొరకై నీకు అభిషేకము చేయుదురుగాక. ఆత్మ-ఆసుష్-మస్-దక్ష-మద-ప్రాణ-హవిష్మత్-గరిష్ఠ-ఋత-సత్యములు నిన్ను రక్షించుగాక. క్రతు–దక్ష-వాసు సత్య-కాల-కామ-ధురి అనువారు నీకు విజయ ప్రదానము చేయుదురుగాక. పురూరవస్-ఆర్ద్రవ-విశ్వేదేవ-రోచన అంగారకాదివిగ్రహ-సూర్య-నిరృతియములు నిన్ను రక్షించుగాక. అజైకపాద-అహిర్బుధ్న్య-ధూమకేతు-రుద్రవుత్రభరత-మృత్యుకాపాలికింక-భవన-భావన-స్వజన్య-స్వజవక్రతుశ్రవస్-మూఢ యాజన-ఉశనసులు నిన్ను రక్షించు గాక. ప్రసప-అవ్యయ-దక్ష-భృగువంశ ఋషి-దవతా-మను–అనుమంతృ - ప్రాణనవబిలవదపానవాయువీతి హోత్ర-నయ-సాధ్య-హంస-విభు-ప్రభ-నారాయణులను లోక క్షేమకారు లగు దేవతలు నిన్ను పాలింతురుగాక, ధాత్మ మిత్ర-ఆర్యమన్-పూషన్-శుక్ర-వరుణభగ -త్వష్టృవివస్వల్-సవితృ భాస్కర విష్ణువులను పండ్రెండుగురు సూర్యులు నిన్ను రక్షించుగాక. ఏకజ్యోతి-ద్విజ్యోతి చతుర్యోతి - ఏకశ క్ర-ద్విశ క్రమహాబలి–త్రిక క్ర-ఇంద్రపతికృత్-మితసంత-మహాబలి. ఆమితఋతజిత్ -సత్యజిత్-సుషేణ-సేనజర్-అతిమిత్ర-పురుమిత్ర అపరాజిత- ఋత ఋకవాక్ధాతృ విధాతృధారణ-ధ్రువులును, ఇంద్రుని పరమమిత్రుడును తేజః శాలియు నగు విధారణుడును, ఐదృక్ష-ఆదృషఏతాదృక్- ఆమితాశన-క్రీడిత –సదృక్ష-సర భ - మహాతపస్-ధరృ - ధుర్య - ధురి - భీమ - ఆభియుక్త - ఆక్షపాత . సహ - ధృతి - వసు - అనాధృష్య - రామ - కామ - జయ - విరాట్టులను నలుబది తొమ్మండుగురు మరుత్తులను దేవతలును నీకు ఆభిషేకము చేసి, నీకు లక్ష్మీ నొసంగుదురు గాక. చిత్రాంగద - చిత్రరథ - చిత్రసేన - కలి -ఊర్జాయు - ఉగ్రసేన - ధృతరాష్ట్ర - నందన - హాహా - హూహూ - నారద - విశ్వావసు - తుంబురులను గంధర్వులు నీ ఆభిషేకమును సుసంపన్నము చేయుదురు గాక; నీకు విజయము నిత్తురు గాక. అతి ప్రధానులై నమునులు, అనవద్యాను కేశీ - మేనకా - సహజన్యా - క్రతుస్థలా - ఘృతాచీ - విశ్వాచీ - పుంజికస్థలా - ప్రహ్లిచా - ఉర్వశీ - రంభా - పంచచూడా - తిలోత్తమా - చిత్రలేఖా - లక్ష్మణా - పుండరీకా - వారుణీ అను దివ్యాప్సరలు నిన్ను రక్షింతురు గాక.

ప్రహ్లాదో విరోచనోఽథ బలిర్బాణోఽథ తత్సుతాః

ఏతే చాన్యేఽభిషిఞ్చన్తు దానవా రాక్షసాస్తథా.

 హేతిశ్చైవ ప్రహేతిశ్చ విద్యుత్స్పూర్జథురగ్రకాః

యక్షః సిద్దాత్మకః పాతు మణిభద్రశ్చనన్దనః.

 పిఙ్గాక్షోద్యుతిమాంశ్చైవ పుష్పవంతో జయావహః

శంఖః పద్మశ్చ మకరః కచ్ఛపశ్చ నిధిర్జయే.

 పిశాచా ఊర్ధ్వ కేశాద్యా భూతా భూమ్యాదివాసినః

మహాకాలం పురస్కృత్య నరసింహం చ మాతరః.

 గుహః స్కందో విశాఖస్త్వాం నైగమేయోఽభిషిఞ్చతు

డాకీన్యో యాశ్చ యోగిన్యః ఖేచరాభూచరాశ్చయాః.

గరుడశ్చారుణః పాన్తు సంపాతి ప్రముఖాః ఖగాః

అనంతాద్యా మహానాగాః శేషవాసుకి తక్షకాః.

ఐరావతో మహాపద్మః కంబలాశ్వతరావుభౌ

శంఖః కర్కోటక శ్చైవ ధృతరాష్ట్రోధనంజయః.

 కుముదై రావణౌపద్మః పుష్పదంతోఽథవామనః

సుప్రతీకోంఽజనోనాగాః పాంతుత్వాంసర్వతః సదా.

 వైతామహ స్తథా హంసో వృషభః శంకరస్యచ

 దుర్గాసింహశ్చ పాన్తుత్వాం యమస్యమహిష స్తథా.

 ఉచ్చైఃశ్రవాశ్చాశ్వపతి స్తథా ధన్వంతరిః సదా

కౌస్తుభః శంఖరాజశ్చ వజ్రం శూలంత చక్రకమ్.

 నందకోఽస్రాణిరక్షంతు ధర్మశ్చ వ్యవసాయకః 

 చిత్రగుప్తశ్చదండశ్చ పిఙ్గలో మృత్యుకాలకౌ.

 వాలఖిల్యాదిమునయో వ్యాసవాల్మీకిముఖ్యకాః

పృథుర్దిలీపోభరతో దుష్యంతః శక్ర జిద్వలీ.

మల్లః కకుత్స్థశ్చాన్న యువనాశ్వో జయద్రథః

మాంధాతా ముచుకుందశ్చ పాంతుత్వాంచ పురూరవాః.

 వాస్తుదేవాః పంచవింశ త్తత్త్వాని విజయాయతే

రుక్మభౌమః శిలా భౌమః పాతాలోనీలమూర్తికః.

 పీతరక్తః క్షితిశ్పైవ శ్వేత భౌమో రసాతలమ్

భూర్లోకౌఽథ భువర్ముఖ్యా జంబూద్వీపాదయః శ్రియే.

 ఉత్తరాః కురవః ఫాంతు రమ్యాహిరణ్యక స్తథా

భద్రాశ్వః కేతుమాలశ్చ వర్షశ్చైవ బలాహకః.

హరివర్షః కిమ్పురుష ఇంద్రద్వీవః కశేరుమాన్

తామ్రవర్ణో గభ స్తిమాన్నా గద్వీపశ్చ సౌమ్యకః.

గంధర్వోవరుణోయశ్చ నవమఃపాన్తు రాజ్యదః

హిమవా న్హేమకూటశ్చ నిషధోనీలఏవచ.

శ్వేతశ్చ శృంగవాన్మేరుర్మాల్యవాన్గంధమాదనః

మహేంద్రోమలయః సహ్యః శుక్తిమానృక్షవాన్గరిః.

 వింధ్యశపారియాత్రశ్చ గిరయః శాంతి దాస్తుతే

ఋగ్వేదాద్యాః షడఙ్గాని ఇతిహాసపురాణకమ్.

 ఆయుర్వేదశ్చగంధర్వ ధనుర్వేదోపవేదకాః

 శిక్షాకల్పోవ్యాకరణం నిరుక్తం జ్యోతిషాంగతిః.

 ఛందోఽఙ్గాని చ వేదాశ్చ మీమాంసా న్యాయవిస్తరః

ధర్మశాస్త్రం పురాణం చ విద్యా హ్యేతాశ్చతుర్దశ.

ప్రహ్లాద - విరోచన - బలి - దాణులు, బాణునిపుత్రులు, ఇతర దానవులు, రాక్షసులు, నీ ఆభిషేకమును సిద్ధము చేయుదురుగాక, హేతి - ప్రతి - విద్యుత్ - స్ఫూర్జథు - అగ్రక - యక్ష - సిద్ధ-మణిభద్ర - నందనులు నిన్ను రక్షించుగాక.  పింగాక్ష - ద్యుతిమత్ - పుష్పవన్త - జయావహ - శంఖ - పద్మ - మకర - కచ్ఛపములను నిధులు నీకు జయప్రదము లగు గాక. ఊర్ధ్వ కేశాది పిశాచములు, భూమ్యాదులందు నివసించు భూతములు, మాతృదేవతలు, మహాకాలనృసింహులను ఉందు ఉంచుకొని నిన్ను పాలింతురుగాక, గుహ - స్కంద - విశాఖ - నైగమేయులు నీకు ఆభిషేకము చేయుదురుగాక, భూతమునందును ఆకాశము నందును సంచరించు డాకీనులు, యోగినులు, గరుడ-అరుణసంపాత్యాది పక్షులు నిన్ను పాలించు గాక. ఆనంతుడు మొదలగు మహానాగములు, శేష - వాసుకి - తక్షక - ఐరావతమహావద్మ - కంబల - అశ్వతర . శంఖ - కర్కోటక - ధృతరాష్ట్ర - ధనంజయ - కుముద - ఐరావత - పద్మ - పుష్పదంత - వామన - సుప్రతీక - అం జనములను నాగములు ఎల్లప్పుడును అన్ని వైపులనుండియు నిన్ను రక్షించు గాక. బ్రహ్మ వాహనమైన హంసయు, శంకరుని వాహనమైన వృషభము, దుర్గా దేవి వాహనమైన సింహము, యముని వాహనమైన మహిషము నిమ్న పాలించు గాక. అశ్వరాజమైన ఉచ్చశ్రవస్సు, ధన్వంతరి, కౌస్తుభమణి, శంఖజమైన పాంచ జన్యము, వజ్ర - శూల - చక్ర - నందక ఖడ్గాది శస్త్రములు నిన్ను రక్షించు గాక. దృడ నిశ్చయవంతుడగు యమధర్మ రాజు, చిత్రగుప్త - దండ - పింగల - మృత్యు - కాలులు, వాలఖిర్యాది మునులు, వ్యాసవాల్మీ క్యాది మహర్షులు, పృథు - దిలీప - భరత - దుష్యక్తులు, అత్యంత బలవంతుడగు శత్రుజిత్తు, మను - కకుత్థ - అనేనా - యువనాశ్వ - జయద్రథ - మాంధాతృ - ముచుకుంద - పురూరవులు నిన్ను రక్షింతురు గాక. వాస్తుదేవతయు, ఇరువది యెదు తత్త్వమును నీకు విజయము కూర్తురుగాక. రుక్మభౌమ - శిలా భౌమ - పాతాల - నీలమూర్తి - పీతర క్త - క్షితి. శ్వేతభౌమ - రసాతల - భూర్లోక - భువర్లోకాదిలోకములు, జంబూద్వీపము మొదలగు ద్వీపములు నీకు రాజ్యలక్ష్మి నీచ్చుగాక. ఉత్తరకురు - రమ్య - హిరణ్యక - భద్రాశ్వ - కేతుమాల - బలాహక - హరి నర - కింపురుష - ఇంద్రద్వీప - కశేరుమత్ - తామ్రవర్ణ - గభస్తిమత్ - నాగ ద్వీప - సౌమ్యక - గాంధర్వ - వారుణ - నవమాది వర్షములు నిన్ను రక్షించు గాక ; నీకు రాజ్యము నిచ్చుగాక. హిమవత్ – హేమకూట - నిషధ - నీల - శ్వేత - శృంగవత్ - మేరు -మాల్యవతి - గంధమాదన - మహేంద్ర - మలయ - సహ్య - శుక్తిమత్ - ఋక్షవత్- మిధ్యపారియాత్ర - పర్వతములు నీకు శాంతి నిచ్చుగాక. ఋగ్వేదాది వేద చతుష్టయము, షడ్వేదాంగములు, ఇతిహాస - పురాణ - ఆయుర్వేద - గాంధర్వవేద- థనుర్వేదాదులపవేదములు, శిక్షా-వ్యాకరణ - ఛందస్ - నిరుక్త - జ్యోతిషకల్పము అను ఆరు వేదాంగములు, మీమాంసా - వ్యాయ - ధర్మశాస్త్ర - పురాణములు అను ఈ పదునాలుగు విద్యలు నిన్ను రక్షించు గాక.

సాంఖ్యం యోగః పాశుపతం వేదావై పాంచరాత్రకమ్

కృరాంతపంచకం హ్యేతద్గాయత్రీ చ శివా తధా.

దుర్గా విద్యా చ గాంధారీ పాతత్వాం శాంతిదాశ్చతే లవణేక్షుసురాసర్పిర్థధిదుగ్ధజలాబ్దయః.

చత్వారః సాగరాః పాన్తు తీర్థాని వివిదానిచ

పుష్కరశ్చ ప్రయాగశ్చ ప్రభాసోనై మిషః వర.

 గయాశీర్షో బ్రహ్మ శిర స్తీర్థముత్తర మానసమ్

కాలోదకోనందికుండ తీర్థం పఞ్చనద స్తథా.

భృగుతీర్థం ప్రభాసంచ తథా దామరకంటకమ్

జంబూమార్గశ్చ విమలః కపిలస్య తథాశ్రమః.

 గంగాద్వారకుశావర్తౌ వింధ్యకో నీలపర్వతః

 వరాహపర్వతశ్చైవ తీర్థం కనఖలం తథా.

కాలంజరశ్చ కేదారోరుద్రకోటి స్తథైవ చ

వారాణసీ మహాతీర్థం బదర్యాశ్రమ ఎవచ.

ద్వారకా శ్రీగిరి స్తీర్థం తీర్థం చ పురుషోత్తమః

 శాలగ్రామోఽథ వారాహః సింధు సాగరసంగమః.

ఫల్గుతీర్థం బిందునరః కరవీరాశ్రమ స్తథా

నద్యో గంగాసరస్వత్యౌశతద్రుర్గండకీ తథా.

 ఆచ్చోదా చ విపాశా చ వితస్తా దేవికా నదీ

 కావేరీ వరుణాచైవ నిశ్చిరాగోమతీనదీ.

 పారా చర్మణ్వతీరూపా మందాకినీ మహానదీ

తాపీ పయోష్ణీ వేణాచ గౌరీవై తరణి తథా.

గోదావరి భీమరథీ తుంగభద్రారణీ తథా

చంద్రభాగా శివాగౌరీ అభిషిఞ్చంతు పాన్తువః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అభిషేకమంత్రా నామైకోన వింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః.

సాంఖ్య - యోగ - పాశుపత - వేద - పాంచరాత్రములకు సిద్ధాంతపంచక మని పేరు. ఇవియు, గాయత్రీ - శివా - దుర్గా - విద్యా - గాంధారీ దేవులును నిన్ను రక్షించు గాక. లవణ - ఇక్షురస - సురా - మృత - దధి - దుగ్ధ - జలసముద్రములు నీకు శాంతి నొసగు గాక. నాలుగు సముద్రములును, వివిధ తీర్థములును నిన్ను రక్షించు గాక. పుష్కర - ప్రభాస - నైమిశారణ్య - గయాశీర్ష - బ్రహ్మశిర స్తీర్థ - ఉత్తరమావస - కోలోదక - నందికుండ - పంచనదతీర్థ - భృగుతీర్థ - అమరకంటక - జంబూమార్గ - విమల - కమలాశ్రమ - గంగాద్వార - ఈశావర్త - వింధ్య - నీలగిరి - వరాహపర్వత - కనఖలతీర్థ - కొలంజర - కేదార - రుద్రకోటి - వారాణసీమహాతీర్థ - బదరికా శ్రమ - ద్వారకా - శ్రీ శైల - పురుషోత్తమతీర్థ - శాలగ్రామ - వారాహ - సింధు సముద్రసంగమ తీర్థ - ఫల్గుతీర్థ - బిందుసర - కరవీరాశ్రమములును, గంగా - సరస్వతీ - శతద్రు - గండకీ - అచ్ఛోదా - విపాళా - వితస్తా- దేవికాకావేరీ - వరుణా - నిశ్చిరా - గోమతీ - పారా - చర్మణ్వతీ - రూపా - మహానదీ - మందాకినీ - తాపీ - పయోష్ణీ - వేణా - వైతరణీ - గోదావరీ - భీమరథీ - తుంగభద్రా - ఆరణి - చంద్రభాగా - శివా - గౌరి మొదలగు పవిత్ర నదులమ నీకు అభిషేకము చేసి నిన్ను పాలించుగాక.

అగ్ని మహాపురాణమునందు అభిషేకమంత్ర వర్ణనమను రెండువందల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.