అగ్ని మహా పురాణము

191 - అథ త్రయోదశీవ్రతాని

అగ్ని రువాచః-

  త్రయోదశీవ్రతానీహ సర్వదాని వదామి తే

అనజ్గేన కృతామాదౌ వక్ష్యేనజ్గత్రయోదశీమ్.

 త్రయోదశ్యాం మార్గశీర్ష శుక్లీనజం హరం యజేత్

మధు సంప్రాశయేద్రాత్రే మృతహోమ స్త్రీలక్షత్రి .

పౌషే యోగీశ్వరం ప్రార్చ్య చన్దనాశీ కృతాహుతిః

మహేశ్వరం మౌక్తికాశీ మా ఘఓథ్యర్చ్య దివం వ్రజేత్.

కాకోలం ప్రాక్య నీరం తు ఫాల్గునే పూజయేద్ర్వతీ

కర్పూరాశీస్వరూపం చ చైత్ర సౌభాగ్యవాన్ భవేత్.

 మహారూపం తు వైశాఖే యజేజాతీఫలాశ్యపి

లవఙాశీ జ్యేష్టదినే ప్రద్యుమ్నం పూజయేద్ర్వతీ.

తిలేదాశీ తథాషాడే చోమాభర్తారమర్చయేత్

 శ్రావణ్ గన్లతోయాళీ పూజ యేచ్చూలపాణినమ్.

 సద్యోజాతం భాద్రపదే ప్రాశిలో గురుమర్పయేత్

సువర్ణ వారి సంప్రాక్య హ్యాశ్వినేత్రిదశాధిపమ్.

 విశ్వేశ్వరం కార్తికే తు మదనాశీ యజేద్ర్వతీ

శివం హైమం తు వర్షానే సంఛాద్యామదలేన తు.

 వస్త్రేణ పూజయిత్వా తు దద్యాద్విపాయ గాం తథా

శయనం ఛత్రకలశాన్ పాదుకారసభాజనమ్.

 త్రయోదశ్యాం సితే చైత్ర రతిక్రీతియుతం స్మరన్

అశోకాఖ్యం నగం లిఖ్య సిన్హూరరజనీముఖైః.

 ఆబ్డం యజేత్తు కామార్ధీ కామత్రయోదశీ వ్రతమ్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే త్రయోదశీ వ్రతాని నామైకనవత్యధిక శతతమోధ్యాయః.

ఆగ్ని దేవుడు చెప్పెను: ఇపుడు  అన్నింటిని ఇచ్చు త్రయోదశీతిథివ్రతములను గూర్చి చెప్పెదను. మొదట ఆవ్యంగత్రయోదశి వ్రతమును గూర్చి చెప్పెదను. పూర్వము అనంగుడు (మన్మథుడు) ఈ వ్రతము చేసెను. మార్గశీర్షశుక్ల తయోదశినాడు కామదేవస్వరూపు డగు హరుని పూజించవలెను. రాత్రి మధువు భుజించి పాలాక్షత మిశఘృతము హోమము చేయవలెను. పౌషమాసమున యోగేశ్వరుని పూజించి మౌక్తి కజలాహారము చేయవలెను. ఇట్లు చేసినవాడు స్వర్గము పొందును. ఫాల్గునమున వీరభద్రుని పూజించి కంకోలమును భుజించవలెను. చైతమున సురూపుని పూజించి కర్పూరాహారము తీసికొనువాడు సౌభాగ్యయుక్తు డగును. వైశాఖమున మహారపుని పూజించి జాయవలము భుజించవలెను, జ్యేష్ఠమున ప్రద్యు మ్మని పూజించి లవంగము రక్షించవలెను. ఆషాఢమున ఉమాపతిని పూజించి తిలమిశ్ర జలము త్రాగ వలెను. శ్రావణమున శూలపాణిని పూజించి సుగంధితమగు జలము త్రాగవలెను. భాద్రపదము ఆగురు భక్షించి  సద్యోజాతుని పూజించవలెను. ఆశ్వయుజమున త్రిదశాధిపు డగు శంకరుని పూజించి స్వర్ణజలము త్రాగ వలెను. కార్తి కమున విశ్వేశ్వరుని అర్చించి లవణము భక్షించవలెను, ఈ విధముగ సంవత్సరము పూర్తి యేన పిమ్మట  సువర్ణనిర్మిత శివలింగమును మామిడాకులు, వస్త్రములు, కప్పి, గోవు, శయ్య, ఛత్రము, కలశము, పాదుకలు, రసవూర్ణ పాత్రములు గూడ దానము చేయవలెను. చైత్ర శుక్ల త్రయోదశిబాడు అశోక వృక్షమునకు సిందూరము, కాటుక పూసి, దాని మూలమున రతి - ప్రీతిసమేతు డగు కామదేవుని స్మరించవలెను. కామ్యములు కోరువాడు ఈ విధముగ ఒక సంవత్సరము కామదేవుని పూజించవలెను. ఇదియే “కామత్రయోదశీవ్రతము”

అగ్ని మహావురాణమునందు త్రయోదశీవ్రతవర్ణన మను నూటతొంబదియొకటవ అధ్యాయము సమాప్తము.