అగ్ని మహా పురాణము

170 - అథ పునః ప్రాయశ్చిత్తాని.

పుష్కర ఉవాచః-

మహాపాపానుయుక్తానాం ప్రాయశ్చిత్తాని వచ్మి తే

సంవత్సరేణ పతతి పతితేన సహాచరన్.

 యాజనాధ్యాపనాద్యౌనాన్న తు యానాశ నాసనాత్

యో యేన పతితేనై షాం సంసర్గం యాతి మానవః.

 స తస్యైవ వ్రతం కుర్యాత్తత్సంసర్గస్య శుద్ధయే

పతితస్యోదకం శౌర్యం సపిథైర్బాన్డవైః సహ.

  నిన్దితేహని సాయా హ్నే జైత్యృత్విగ్గురు సన్నిధౌ

దాసీఘటమపాం పూర్ణం పర్య స్యేత్రేతవత్త .

అహోరాత్రముపాసీరన్న శౌచం బిన్దవైః సహ

నివర్తయేరం స్తస్మాత్తు జ్యేష్టాంశం భాషణాది కే.

జ్యేషాంశం ప్రాప్నుయాత్తస్య యవీయాన్ గుణతోధికః

ప్రాయశ్చిత్తే తు చరితే పూర్ణం కుమ్భమపాం నవమ్.

తేనైవ సార్థం ప్రా ధ్యేయుః స్నా త్వా పుణ్య జలాశయే

ఏవ మేవ విధిం కుర్యాద్యోషిత్సు పతితాస్వపి. 

వస్త్రాన్న పానం దేయం తు వసేయుశ్చ గృహా నికే

 తేషాం ద్విజానాం సావిత్రీ నానూద్యేత యథావిధి.

 తాం శారయిత్వా త్రిన్ కృచ్ఛాన్యథావిధ్యుపనాయయేత్

 వికర్మస్థాః పరిత్యక్తా స్తేషామ ప్యేతదాది శే.

 జపిత్వాత్రీణి సావిత్ర్యైః సహస్రాణి సమాహితః

మాసం గోష్ఠే పయః పీత్వా ముచ్యతే సత్పతిగ్రహాత్.

పుష్కరుడు చెప్పెను మహాపాపులతో సంబంధము కలవారికి ప్రాయశ్చిత్తములను చేప్పెదను. పతితునితో కూడి తీరుగువాడు సంవత్సరకాలములో పతితు డగును. ఈ పతికత్వము, పతితునిచే యజ్ఞము చేయించుటచేతను, అధ్యయనము చేయించుటచేతను వైవాహిక సంబంధము ఏర్పరచుకొనుటచేతను మాత్రమే కలుగును గాని వానితో ప్రయాణముచేయుట చేతను భుజించుటచేతను, కలిసి కూర్చుండుటచేతను కలుగదు. ఈ పతితులలో ఎవనితో ఒక వ్యక్తి సంసర్గమును పొందునో అతడు ఆ పతితుడు చేయ వలసిన ప్రాయశ్చిత్తమును చేసికొనవలెను. పతితుని సపిండులు బంధువులతో కలసి నిందితదినమునందు, సంధ్యాసమయమున వంశానికి సంబంధించినవారు, ఋత్విక్కులు, గురువులు మొదలగువారి సమక్షమున ఆ పతితునకై (జీవించియుండగనే) ఉదక క్రియ చేయవలెను. పిదప పేతకు చేసినవిధముగ, ఒక జలము నింపిన కుండను దాసిచే తన్నించ వలెను. సపిండులు బంధువులతో కూడ ఒక రోజు ఆశౌచము పాటించవలెను. అతనితో సంభాషణము చేయకుండవలెను. అతని జ్యేష్టభాగమును ఉపసంహరించవలెను. గుణములచే ఆధికు డగు చిన్న వానికి జ్యేష్టభాగము చెందునట్లు చేయవలెను. అతడు ప్రాయశ్చిత్తము చేసికొనిన పిదప బంధువులు ఆతనితో కలిసి పుణ్యనదిలో స్నానము చేసి, జలము నింపిన క్రొత్త కుండను నీటిలో విసరివేయవలెను. పతితస్త్రీలకు కూడ ప్రాయశ్చిత్తము ఈ విధముగనే చేయవలెను. వారికి వస్త్రములు, అన్న పానాదికముమాత్ర మివ్వవలెను. గృహసమీపమున నివాస మేర్పరుపవలెను. యథాకాలముగ గాయత్రీఉపదేశము పొందని ద్విజులచేత మూడు కృచ్చములు చేయించి పిదప యథావిధిగా ఉపనయనము చేయవలెను. నిషిద్ధకర్మలు చేయుచు పరిత్యకు పునఃప్రాయశ్చిత్తాని లైనవారి విషయమున గూడ ఇట్లే చేయవలెను. చెడ్డ దానములు పట్టినవాడు మూడు వేల గాయత్రీమంత్రజపము చేసి, సమాహిత చిత్తడై ఒక మాసము గోష్ఠమునందు నివసించుచు పాలునూత్రము త్రాగినచో పరిశద్ధు డగును.

వ్రత్యానాం యాజనం కృత్వా పరేషామ న్యకర్మ చ

 ఆభిచార మహీనానాం త్రిభిః కృచ్ఛైర్యపోహతి.

 శరణాగతం పరిత్యజ్య వేదం విప్లావ్య చ ద్విజః

సంవత్సరం మితాహార సతాపమప సేధతి.

శ్వకృగాలఖరైక్టష్ణోగ్రామ్యైః ప్రవ్యాద్భిరేవ చ

 నరోష్ట్రాశ్వైర్వరా హైశ్చ ప్రాణాయామేన శుధ్యతి.

 స్నాతకవ్రతలో పే చ కర్మత్యాగే హ్యభోజనమ్

 హుంకారం బ్రాహ్మణస్యోక్త్వా తుంకారం చ గరీయసః.

స్నాత్వానశ్నన్నహః శేషమభివాద్య ప్రసాదయేత్

ఆవగూర్య చరేత్కృచ్చమతి కృచ్చం నిపాతనే.

 కృచ్ఛాతికృచ్ఛం కుర్వీత విప్రస్యోత్పాద్య శోణితమ్

చణాలాధిర విజ్ఞాతో యస్య తి షెత్తు వేశ్మని.

 సమ్యగ్ జ్ఞాతస్తు కాలేన తస్య కుర్వీత శోధనమ్

చాన్గాయణం పరాకం వా ద్విజానాం తు విధనమ్.

ప్రాజాపత్యం తు శూద్రాణాం శేషం తదనుసారత

గుడం కుసుమం లవణం తథాధాన్యాని యాని చ.

 కృత్వా గృహే తతో ద్వారి తేషాం దద్యా ధుతాశనమ్

మృన్మయానాం తు భాణానాం త్యాగ ఏవ విధీయతే.

ద్రవ్యాణాం పరి శేషాణాం ద్రవ్యశుద్దిర్విధీయతే

కూ వైకపానసత్తా యే స్పర్శాత్సజ్కల్ప దూషితాః.

శుధ్యయురుపవా సేన పళ్చాగవ్యన వాప్యథ

 యస్తు సంస్పృశ్య చడ్డాలమశ్నీ యాచ్చ స్వకామతః.

 ద్విజశ్చాన్గాయణం కుర్యాత్త ప్రకృచ్ఛమథాపి వా

భాణసంకుల సంకీర్ణశ్చాజ్జాలాదిజుగుపితై కి.

భుక్త్వా పీత్వా తథా తేషాం షడ్రా త్రేణ విశుధ్యతి

 అన్యానాం భుక్త శేషం తు భక్షయిత్వా ద్విజాతయః.

 వ్రతం చాబ్ధాయణం కుర్యుగ్రిరాత్రం శూద్ర ఏవ తు

చబ్ధాలకూభాజేషు అజ్ఞానాత్పితే జలమ్.

 ద్విజః సనపనం కుర్యాచ్ఛూద్రశ్చోపవ సేద్దినమ్

చాణాలేన తు సంస్పృష్టా య స్వపః పిబతే ద్విజః.

 త్రిరాత్రం తేన కర్తవ్యం శూద్రశ్చోపవ సేద్దినమ్

సంస్కారహీనులచే యజ్ఞము చేయించినను, ఇతరులకు అంత్యేష్టి కర్మ చేసినను, మంచివారి విషయమున ఆభిచార ప్రయోగము చేసికను బ్రాహ్మణుడు మూడు ప్రాజాపత్యములు చేయవలెను. ద్విజుడు శరణాగతుని పరిత్యజించినను, అనధికారికి వేదోపదేశము చేసినను, ఒక సంత్సరము నియమితాహారము భుజించుటచే పాపవిముక్తుడగును. కుక్క, నక్క, గాడిద, పిల్లి, ముంగిస, మనుష్యుడు, గుఱ్ఱము, ఒంటె, పంది. ఇవి కరచినచో ప్రాణాయామముచే శుద్దు డగును. వ్రతలోపము చేసినను, నిత్యకర్మలను ఉల్లంఘించినను, స్నాతకుడు ఉపవాసము చేయవలెను. బ్రాహ్మణుని విషయమున హుంకరించినవాడును, పెద్దలను తుంకరించినవాడును (నువ్వు అని అన్న వాడును) స్నానము చేసి, ఆదినమున మిగిలిన కొలము ఉపవాసముండి, వారికి నమస్కరించి ప్రసన్ను లను చేసికొనవలెను. బ్రాహ్మణునిపై కఱ్ఱఎత్తినవాడు ప్రాజాపత్య  వ్రతము చేసికొనవలెను. కర్రతో కొట్టినచో అతికష్టమును, రక్తము వచ్చు నట్లు చేసినచో కృచ్ఛమును, అతికృచ్చ మును చేయవలెను. తెలియకుండ ఒక చండాలుడు వచ్చి ఇంటిలో కాపుర మున్న చో, తెలిసినపిమ్మట ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. చాంద్రాయణము గాని పరాక వ్రతమును గాని చేసినచో ద్విజులకు శుద్ధి యగును. శూద్రులకు ప్రాజాపత్య వ్రతముచే శుద్ధి యగును. మిగిలిన దంతయు అతడు కూడ ద్విజుల వలెనే చేయవలెను. ఇంటిలో నున్న బెల్లము, కుసుంభము, లవణము, ధాన్యము మొదలగు పదార్థములను ద్వారమువద్ద కుప్పగా చేసి తగులబెట్టవలెను. మట్టి పాత్రలను పారవేయవలెను. ఇతర ద్రవ్యములకు శాస్తోక్త శుద్ది చేయవలెను. చండాలస్పర్శదూషిత మగు నూతినుండి నీరు త్రాగిన. బ్రాహ్మణుడు ఉపవాసము గాని పంచదివ్యశుద్ధి గాని చేయవలెను. ఇష్టపడి చండాలుని స్పర్శ చేసి భోజనము చేసిన బ్రాహ్మణుడు చాంద్రాయణము గాని, తపకృచ్చము గాని చేయవలెను. చండాలాదినీచజాతుల స్పర్శచే భోజనాటి పాత్రలు అపవిత్ర మైనచో బ్రాహ్మణుడు షడ్రాత్రవ్రతము చేయవలెను. అంత్యజాతివాని ఉచ్చిష్టము తిన్న ద్విజుడు చాంద్రాయణవ్రతము చేయవలెను; శూద్రుడు త్రిరాత్రవ్రతము చేయవలెను. చండాలుని కూపమునుండి గాని, పాత్ర నుడి గాని తెలియక త్రాగిన ద్విజుడు సంతపరకృచ్చమును, శూద్రుడు ఏక దినోపవాస మును చేయవలెను. చండాలస్పర్శ చేసి జలము త్రాగిన ద్విజుడు త్రిరాత్ర వ్రతమును చేయవలెను. శూద్రుడు ఒక దినము ఉపవాసము చేయవలెను.

ఉచ్ఛిష్టేన యది స్పృష్టః శునా శూద్రేణ వా ద్విజః.

ఉపోష్య రజనీ మేం పశ్చిగవ్యేన శుధ్యతి

వై శ్యేన క్షత్రియేణై వ స్నానం నక్తం సమాచరేత్.

ఆధ్వానం ప్రస్థితో విప్ర కాన్హారే యద్యనూద కే

పక్వాన్నేన గృహీతేన మూత్రోచ్చారం కరోతి వై.

అనిధాయైవ తవ్యం అజేకృత్వా తు సంస్థితమ్

 శాచం కృత్వాన్న మభ్యుద్య ఆరస్యాగ్నేశ్చ దర్శయేత్.

ప్లేచ్ఛేర్గతానాం చౌరై ర్వా కాన్హారే వా ప్రవాసినామ్

 భవ్యాభక్ష్యవిశుద్ద్యర్థం తేషాం వశ్యామి నిష్కృతిమ్.

పునః ప్రాప్య స్వదేశం చ వర్ణానామానుపూర్వశః

కృచ్ఛస్యా నే బ్రాహ్మణస్తు పునః సంస్కారమర్హతి.

పాదోనా నే క్షత్రియశ్చ ఆర్ధానే వైశ్య ఏవ చ

పాదం కృత్వా తథా శూద్రో దానం దత్త్వా విశుధ్యతి.

 ఉదక్యా తు సవర్ణా యా స్పృష్టా చేత్యాదుదక్యయా

తస్మిన్నే వాహని స్నా త్వా శుద్దిమాప్నోత్యసంశయమ్.

రజస్వలా తు నాశ్నీయాత్సంస్పృష్టా హీనవర్ణయా

యావన్న శుద్ధిమాప్నోతి శుద్ధస్నానేన శుద్యత.

 మూత్రం కృత్వా వజన్వర్త్మ స్మృతిభ్రంశాజలం పిబేత్

 అహోరాత్రోషితో భూత్వా పక్బాగవ్యేన శుధ్యతి.

మూత్రోచ్చారం ద్విజః కృత్వా ఆకృత్వా శాచమాత్మనః

మోహాద్భుక్త్వా త్రిరాత్రం తు యవాన్ఫీత్వా విశుధ్యతి.

            ఉచ్ఛిష్ట మైన కుక్క చేతగాని, శూద్రునిచేత గాని స్పృశింపబడిన ద్విజుడు ఒక రాత్రి ఉపనాస ముండి పంచ గవ్యముచే శుద్ధిపొందును. అట్టి వైశ్యుడు గాని, క్షత్రియుడు గాని స్పృశించిన చో రాత్రి స్నానము చేయవలెను. మార్గ మధ్యమునం దున్న బ్రాహ్మణుడు ఉదకములేని ఆరణ్యమునందు, ప్వన్న ము చేతిలో నుండగా మూత్రవిసర్జనము చేసినచో, ఆ ఆహారమును క్రింద పెట్టకుండగ, తన శరీరము పైననే ఉంచుకొని, శౌచము చేసికొని ఆ అన్నమును ప్రోషించి సూర్యు నకును అగ్నికిని చూపవలెను. ఆరణ్యమునందు మ్లేచ్చులతో గాని చోరులతోగాని సంబంధ మేర్పడినవారికి, లేదా ప్రవాసములో నున్నవారికి భజ్యా భక్ష్యశుద్ధినిమత్తము ఉపాయమును చెప్పెదను. వర్ణక్రమానుసారముగా బ్రాహ్మణుడై నచో అతడు మరల స్వదేశమునకు తిరిగి వచ్చి కృచ్చవ్రతము చేసిన పిమ్మట మరల సంస్కారము చేసి కోనవలెను. క్షత్రియుడు మూడు వంతుల ప్రాయశ్చిత్తము, వైశ్యుడు సగము ప్రాయశ్చిత్తము చేసికొని శుద్దులగుదురు. శూద్రుడు పాదము ప్రాయశ్చిత్తము చేత గాని, దానము చేత గాని, శుద్దు డగును. సవర్ణ యగు రజస్వలచే స్పృశింపబడిన రజస్వలాశ్రీ ఆ దినమునందే స్నానము చేసినచో శుద్ధురాలగును. తక్కువవర్ణము గల రజస్వల శ్రీచ స్పృశింపబడిన రజస్వల శుద్ధస్నానము చేత శుద్ధురాలగును; స్నానము చేయునంతవరకును భుజించగూడదు. మూత్రోత్సర్గానంతరము ప్రయాణము చేయుచు, మరచి నీళ్లు తాగినచో ఒక రాత్రి ఒక పగలు ఉపవాస మండి పంచగవ్యముచే శుద్దుడగును. మూత్రోత్సర్గము చేసిన ద్విజుడు శాచము చేసికొనకుండ, అజ్ఞానముచే భోజనము చేసినచో మూడు రాత్రులు యవలు త్రాగి శుద్ది చెందును.

యే ప్రత్యవసితా విప్రాః ప్రవ్రజ్యా దిబలాత్తథా

అనాశక నివృత్తాశ్చ తేషాం శుద్ధిః ప్రచక్ష్యతే.

చరయే త్రీణి కృచ్చాణి చాన్గాయణమథాపి వా

జాతకర్మాదిసంస్కారై కి సంస్కుర్యాత్తం తథా పునః.

ఉపానహమమేధ్యం చ యస్య సంస్పృశ తే ముఖమ్

మృత్తికాగోమయా తత్ర పళ్చిగవ్యం చ శోధనమ్.

వపనం విక్రయం చైవ నీలవస్త్రాదిధారణమ్

తపనీయం హి విప్రస్య త్రిభిః కృతైర్విశుధ్యతి.

 అన్యజాతిశ్వపా కేన సంస్పృష్టా శ్రీ రజస్వలా

చతుర్థహని శుద్దా సా త్రిరాత్రం తత్ర చాచ రేల్.

 చాణాలశ్వపచౌ స్పృష్ట్వా తథా పూయం చ సూతికామ్

 శవం తత్స్పర్శినం స్పృష్ట్వా సద్యః స్నా నేన శుద్ధ్యతి.

నారం స్పృష్ట్వాస్థి స స్నేహం స్నాత్వా విప్రో విశుద్యతి

రథ్యాకర్దమతోయేన హ్యధో నాభోర్మదోదకై

 వాన్తో వీరిక్తః స్నాత్వా తు మృతం ప్రాళ్య విశుధ్యతి

 స్నా నాళ్లురకర్మ కర్తా కృచ్ఛకృద్ధహణేన్నభుక్.

ఆపా జేయాశీ గవ్యాశీ శునా దష్ట స్తథా శుచిః

కృమిదష్టశ్చాత్మహతీ కృచ్ఛాజ్ఞాప్యాచ్చ హోమతః.

 హోమాద్యైశ్చానులా పేన పూయ నే పాపినోభిలాః

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే ప్రాయశ్చిత్తనిరూపణం నామ సప్తత్యధిక శతతమోధ్యాయః.

బలాత్కారాది కారణములచేత సన్యసించిన విప్రులు అందుండ ఆసమర్థులై మరల గృహస్థాశ్రమమునకు రావలె నన్నచో వారికి శుద్ధిని చెప్పుచున్నాము. మూడు కృచ్చములుగాని తెరిచే చాంద్రాయణము కాని చేయించవలెను. మరల జాతకర్మాఓసంస్కారములచే సంస్కరించవలెను. పాదుక గాని, అమేధ్యము గాని ముఖమునకు తగిలినచో మృత్తిక, గో మయము, పంచగవ్యము వీటిచే శుద్ది చేసికొనవలెను. నీలిమందు పండించుట, విక్రయము, నీలవస్తాదిధారణను చేసిన బ్రాహ్మణుడు పతితుడగును. మూడు కృచ్చములచే శుద్దుడగును. అంత్యజాతివాని చేతను, శ్వపాకుని చేతిను స్పృశింప బడిన రజస్వల త్రిరాత్రము చేసినచో నాల్గవరోజున శద్దురా లగును. చండాలశ్వపచులను, పాసినవస్తువును, సూతికాశ్రీని శవమును వీటిని సృశించినవానిని సృశించినవాడు సద్యఃస్నానముచే శదు డగును. పచ్చిగా నున్న మనిషి ఎముకను స్పృశించిన విప్రుడు స్నానముచే శుద్దుడగును. మార్గముందలి బురదనీళ్ళు పడి నపుడు నాభి క్రింద మట్టితోను, ఉదకము తోను శుద్ధి చేసికొనవలెను. వాంతిచేసుకొన్న వాడు, విరేచనములు వెళ్ళినవాడును స్నానము చేసి మృతప్రాశనము చేసినచో శుద్ధుడగును. క్షారము చేయించుకొన్నవాడు స్నానము చేతను, గ్రహణసమ యమున అన్నము తిన్న వాడు కృచ్ఛము చేతను శుద్దుడగును. పంక్తిబాహ్యులతో కలిసి భోజనము చేసినవాడును, కుక్క గాని, కృములు గానికరచినవాడును, ఆశుచి యైనవాడును పంచగవ్యములచే శుద్ధి పొందును. ఆత్మహత్యా ప్రయత్నము చేసినవాడు కృచ్ఛముచేతను, జపము చేతను శుద్దుడగును. పాపాత్ములందరును హోమాదులచేతను, పశ్చాత్తాపముచేతను శుద్రులగుదురు.

అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్తనిరూపణమను నూట డెబ్బదవ అధ్యాయము సమాప్తము.