శ్రీ భగవానువాచః
వక్ష్యే విధిం చోత్సవస్య స్థాపితే తు సురే చరేత్ ।
తస్మిన్నబ్ధే చై కరాట్టేత్రం త్రిరాత్రం చాష్టరాత్రకమ్.
ఉత్సవేన వినా యస్మాత్థాపనం నిష్ఫలం భవేత్ ।
ఆయనే విషువే చాపి శయనోపవనే గృహే.
కారకస్యానుకూలే వా యాత్రాం దేవస్య కారయేత్ ।
మజలాజ్కురరో గీతనృత్యాదివాద్యకైః.
శరావవటికాపాలీ స్వజురారోపణే హితాః ।
యవాఞ్చాలీం స్తీలాన్ముద్గాన్ గోధూమాన్సితసర్షపాన్.
కులుత్తమాషనిష్పావాన్ డౌళయిత్వా తు వాపయేత్ ।
పూర్వాదౌ చ బలిం దద్యాదృమల్టీ వైః పురం నిశి.
ఇనాదేః కుముదాదేశ్చ సర్వభూతేభ్య ఏవచ ।
అనుగచ్చ స్తి తే తత్ర ప్రతిరూపధరాః పునః.
పదే పదే శ్వమేధస్య ఫలం తేషాం న సంశయః ।
ఆగత్య దేవతాగారం దేవం విజ్ఞాపయేద్గురుః.
తీర్థయాత్రా తు యా దేవ శ్వః కర్తవ్యా సురోత్తమ ।
తస్యారమ్భమనుజ్ఞాతు మర్ఘ సే దేవ సర్వథా.
దేవ మేవం తు విజ్ఞాప్య తతః కర్మ సమారభేత్ ।
ప్రరోహఘటికాభ్యాం తు వేదికాం భూషితాం వ్రజేత్.
చతుః స్తంభాం తు తన్మధ్యే స్వస్తి కే ప్రతిమాం న్య సేత్ ।
కామార్థాం లేఖ్య చిత్రేషు స్థాప్య తత్రాధివాసయేత్.
హయగ్రీవుడు పలికెను. ఇప్పుడు ఉత్సవ విధిని చెప్పెదను. ఉత్సవము లేని దేవతాపతివ నిష్ఫలము, అందుచే దేవతాస్థాపనము చేసిన సంవత్సరమునందే ఏక రాతోత్సవము లేదా తిరాతోత్సవము లేదా అష్టరాతోత్సవము చేయవశాను. ఆయనసమయమునందు గాని, విషువసంక్రాంతి సమయమునందు గాని శయనోపవనమునందు లేదా దేవతా గృహమునందు లేదా కర్తకు అనుకూలముగా ఉన్న విధమున దేవుని నగరయాత్ర చేయించవలెను. ఆ సమయమున మంగలాంకురారోపణము, నృత్యగీతాదులు, వాద్యములు ఏర్పాటు చేయవలెను. ఆంకురారోపణవంనకు మూకుళ్ళు ఉత్తమ మైనవి. యవ - శాలి - తిల - ముద్దగోధూమ - శ్వేతసర్షప - కులత్త - మాష - నిష్పావములు కడిగి చల్లవలెను. దీపములతో రాత్రి ఊరేగుచు ఇంద్రాదిదిక్పాలులకు, కుముదాది దిగ్గజములకు, సకల ప్రాణులక పూర్వాది దిక్కులందు బలి ప్రదానము చేయవలెను. దేవతా విగ్రహమును మోయుచు దేవయాత్రను అనుసరించు వారికి ఆడుగడుగునకు ఆశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును, కొంచెమైనను సందేహము లేదు. ఆచార్యుడు తొలుచటి దివసమున దేవాలయమునకు వచ్చి దేవునితో “దేవ శ్రేష్టా! రేపు నీ తీర్థ యాత్రజరుపవలసి యున్నది. అందుకు అనుజ్ఞ ఇచ్చటకై నీవు సర్వదా సమర్థుడవు అని నివేదించి ఉత్సవకార్యము ప్రారంభింపవలెను. నాలుగు గ్రంథములు గలదియు అంకురములున్న ఘట ముతో కూడినదియు ఆలంకరింపబడినదియు అగు వేదిక దగ్గరకు వెళ్ళి దాని మధ్య భాగమున స్వస్తి కము ప్రతిమనుంచి, తన కోరికను వ్రాసి చిత్రముల పై స్థాపించి ఆధివాసనము చేయవలెను.
వైష్ణవైః సహ కర్వీత ఘృతాభ్యజ్గం తు మూలతః ।
ఘృతధారాభి షేకం వా సకలాం శర్వరీం బుధః.
దర్పణం దర్శ్య నీరాజం గీతవాద్యైశ్చ మగలమ్ ।
వ్యజనం పూజనం దీపం గన్ధపుష్పాదిభిర్యజేత్.
హరిద్రా ముద్దకాశ్మీర శుక్ల చూర్ణాది మూర్ధని।
ప్రతిమాయాశ్చ భక్తానాం సర్వతీర్థఫలం ధృతే.
స్నా పయిత్యా సమభ్యర్చ్యయార్రాబిమ్బం రథే స్థితమ్ ।
నయేద్గురుర్నదీం నాదై శ్ఛత్రాద్యై రాష్ట్రపాలికామ్.
నిమ్నయోజనాదర్వాక్ తత్ర వేదీం తు కారయేత్ ।
వాహనాదవతార్యైనాం తస్యాం వేద్యాం నివేశ యేత్.
చరుం వై శ్రపయే తత్ర పాయసం హోమయే త్తతః ।
ఆబ్లింగైర్వైదికైర్మనెస్తీర్ణానావాహయే తతః.
ఆపోహిష్ణోపనిషదై పూజయేదర్ష్యముఖ్య కైః।
పునర్దేవం సమాదాయ తోయే కృత్వా ఘమర్షణమ్.
స్నా యాన్మహాజనై ర్విర్వేద్యాముత్తార్య తం న్య సేత్ ।
పూజయిత్వా తదహ్నా చ ప్రాసాదం తు నయేత్త తః.
పూజయేత్పావకస్థం తు గురుః స్యాద్భుక్తి ముక్తి కృత్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే దేవయాత్రోత్సవక థనం నామాష్టషష్టితమోధ్యాయః.
పిమ్మట విద్వాంసులై న వైష్ణవులతో కలిసి మూలమంత్రముతో ప్రతిమ అవయవములకు నెయ్యి పూసి, రాత్రి అంతయు నేతిధారతో అభిషేకము చేయవలెను. దేవతకు అద్దము చూపించి, ఆరతి, గీతము, వాద్యములు మొదలగు వాటితో మంగళకృత్యములు నెరపి, వ్యజనము విసిరి, పూజించవలెను. పిదప దీప - గంధ - పుష్పాదులతో పూజించవలేను. పసుపు, కర్పూరము, కేసరములు, శ్వేతచందన చూర్ణము దేవతా ప్రతిమ పైనను, భక్తుల శిరస్సుల పైనను చల్లినచో సమస్త తీర్థముల ఫలము లభించును. ఆచార్యుడు యాత్రకొరకై ఏర్పరచిన దేవతామూర్తి ని రథముపై ఉంచి, పూజించి, ఛత్ర - చామర - శంఖనాదాదులతో రాష్ట్రమును పాలించునదీతటమునకు తీసికొని వెళ్ళవలేను. నదిలో స్నానము చేయించు టకు ముందు ఆచట వేదికను నిర్మించి, ఆ మూర్తి ని వాహనమునుండి దింపి, దానిని ఆ వేదిక పై ఉంచవలెను, అచట చరువు వండి దానిని హోమము చేసిన పిదప పాయసహోమము చేయవలెను. వరుణ దేవతామంత్రముతో సమ సతీర్థముల ఆవాహనము చేసి “ఆపోహిషామ” ఇత్యాదిమంత్రములతో వాటికి ఆర్ఘ్య ప్రదానము చేసి పూజించవలెను. దేవతామూర్తిని తీసి కొని వెళ్ళి ఉదకమునందు ఆఘమర్షణ చేసి, బ్రాహ్మణ - మహాజనులకు స్నానము చేయవలెను. స్నానానంతరము మూర్తి ని తీసికొని వచ్చి వేదిక పై ఉంచవలెను. ఆ దివసమునందు అచట దేవతాపూజ చేసి, దేవాలయమునకు తీసికొని వెళ్ళవలెను, ఆచార్యుడు అగ్నిలో నున్న దేవతకు పూజలు చేయవలెను. ఈ ఉత్సవము భోగ . మోక్షప్రదము.
ఆగ్ని మహాపురాణమునందు ఉత్సవవిధి కథనమను ఆరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 68 of the Agni Purāṇa is as follows:
The sixty-eighth chapter describes the ritual procedures for the annual yātrā — the festival during which the deity is taken out of the temple in procession through the surrounding town or to a sacred water body. The aṅkura-ropana (seed sprouting) that begins the festival cycle, the decoration of the utsava-mūrti (processional image), the assembly of musicians and dancers, and the route of the procession are specified. The bathing of the deity in the river or tank (tīrtha-snāna) as the culmination of the procession — symbolizing the deity's cosmic bath — is described with the mantras and the substances used. The merit of accompanying the deity's procession — even for a single step — is declared to equal the merit of a single step in the aśvamedha (horse sacrifice), so that the entire procession route is a chain of sacrificial merits accruing to every participant.