అగ్ని మహా పురాణము

222 - అథ దుర్గసంపత్తిః.

పుష్కర ఉవాచః

దుర్గసంపత్తి మాఖ్యాస్యే దుర్గదేశేవ నేస్నృపః

వైశ్యశూద్ర జనప్రామో హ్యనాహార్య స్తథాపరైః.

 కించిద్బ్రాహ్మణసంయుక్తో బహుకర్మ కర స్తథా

ఆదేవ మాతృకో భక్తజలో (నో) దేశః ప్రశస్యతే.

పరై రపీడితః పుష్పఫల ధాన్య సమన్వితః

అగమ్యః పరచక్రాణాం వ్యాలతస్కర వర్జిత.

షణ్డామేకతమం దుర్గం తత్రకృత్వా వసేద్బలీ

ధన్వదుర్గం మహీదుర్గం నరదుర్గం తథైవచ.

వార్షం చై వామ్బుదుర్గంచ గిరిదుర్గంచ భార్గవ

సర్వోత్తమం శైల దుర్గమభేద్యం చాన్యభోదనమ్.

 పురం తత్రచ హట్టాద్యం దేవతాయతనాదికమ్

 అనుయన్త్రాయుధో పేతం సోదకం దుర్గముత్తమమ్.

పుష్కరుడు చెప్పెను : ఇపుడు దుర్గమును గూర్చి చెప్పెదను. రాజు దుర్గమునందు వివసించ వలెను. తనతో కూడ ఉండు వారిలో వైశ్య - శూద్రుల సంఖ్య ఆధీక మగా ఉండవలెను. శత్రువులకు వశము కాని స్థలమునందు దుర్గము ఏర్పరచు కొవవలెను. దుర్గ మునందు కొందరు బ్రాహ్మణులు కూడ ఉండవలెను. దోమంది కార్మికులు ఎచట లభింతురో, ఎచట నీటికొరకై వరాల మీద ఆధార పడవలసి ఉండదో, నదీ తటాకాదుల నుండి ఉపశము సమృద్ధముగా లభించునో, ఎచట శత్రుపీడ ఉండదో, పుష్పఫలములు, ధనధాన్యములు ఎచట సమృద్ధముగా ఉండదో, శత్రు సేనలు ఎచటికి జాలనో, సర్పభయమ, చోరతపము ఎచట ఉండదో అట్టి ప్రదేశములలో దుర్గమాను నిర్మించుకొనవలెను. బలవంతు డైన వాడు, ధన్వదుర్గము, మహదుర్గము, నరదుర్గము, వృక్షదుర్గము, జలదుర్గము, పర్వతదుర్గము అని ఆరు విధములగు దుర్గములలో ఏదైన ఒక దానిని ఆశ్రయించి ఉండవలెను. ఈ దుర్గములలో పర్వత దుర్గము శ్రేష్టమైనది. ఇది శత్రువులకు అభేద్యమై శత్రువులను నశింపచేయ వీలగునదిగా ఉండును. దుర్గమే రాజధాని. దాని యందు రాజవీధులు, ఆపణములు, దేవాలయములు ఉgడవలెను. నలుమూలల అస్త్రశస్త్ర భరితములగు యంత్రములు కలదై, జలప్రవాహయుక్తమై, చుట్టును జలముతో నిండిన కందకములు గలదై యుండు దుర్గము ఉత్తమము.

రాజరక్షాం ప్రవక్ష్యామి రక్ష్యోభూపోవిషాదితః

పంచాఙ్గస్తు శిరీషఃస్యాన్మూత్రపిష్టా విషార్దనః.

శతావరీ ఛిన్న రుహా విషఘ్నీ తండులీయకమ్

శాకోతకి చ కహ్లరీ బ్రాహ్మీ చిత్రపటోలికా.

 మండూక పర్ణీ వారాహీ ధాత్య్రానన్దక మేవచ

 ఉన్మాదినీ సోమరాజీ విషఘ్నం రత్న మేవచ.

వాస్తులక్షణసంయుక్తే వసన్దుర్గే సురాన్యజేత్

ప్రజాశ్చ పాలయేద్దుష్టాఞ్ఙయేద్దానాని దాపయేత్.

ఇపుడు రాజరక్షణను గూర్చి చెప్పెదను. రాజు రాజ్యమునంతను తను పాలించువాడు గాన విషాదులచే ఆతనికి హాని కలుగకుండునట్లు రక్షించవలెను. శిరీషవృక్షము వేళ్ళు, బెరడు, ఆకులు, పువ్వులు, పండ్లు ఈ ఐదింటిని గోమూత్రముతో నూరి సేవించినచో విషనివృత్తి కలుగును. శతావరి, గుడూచి, తండలీయకము కూడ విషనివారకములు. కోశాతకి, కప్లరి. బ్రాహ్మి, చిత్రపటోలిక, మండూకపర్ణి, వారాహీకందము, ఆమలకము, ఆనందకము, భంగు, సోమరాజ___ ఇవి కూడ విషనివారకములు. కొన్ని మాణిక్యములు, ముత్యములు మొదలగునవి కూడ విషవాశ కములు.

దేవద్రవ్యాది హరణాత్కల్పంతు నరకే వసేత్

దేవాలయాంశ్చ-కుర్వీత దేవపూజారతోనృపః

 సురాలయాః పాలనీయాః స్థాపనీయాశ్చ దేవతాః

మృన్మయాద్దారుణం పుణ్యం దారుజాదిష్టకామయమ్.

 ఐష్టకాచ్చైలజం పుణ్యం శైలజాత్స్వర్ణ రత్నజమ్

క్రీడన్సుర గృహం కుర్వన్భు క్తిము క్తిమవాప్నుయాత్.

చిత్రకృద్గీత వాద్యాది పేక్షణీయాది దానకృత్

తైలాజ్యమధు దుద్గాద్యైః స్నాప్యదేవం దివం వ్రజేత్.

 పూజయేల్పాలయేద్విప్రాన్ద్విజస్వం న హరేన్నృపః

 సువర్ణ మేకం గామేకాం భూ మేర ప్యేక మఙ్గులమ్.

 హరన్నరక మాప్నోతి యావదాభూత సమ్లవమ్

దురాచారం న ద్విషేచ్చ సర్వపా పేష్వపిస్థితమ్.

 నై వాస్తి బ్రాహ్మణవధాత్సాపం గురుతరంక్వచిత్

ఆదై వం దైవతం కుర్యుః కుర్యుర్దైవమదై వతమ్. 

బ్రాహ్మణా హి మహాభాగాస్తాన్న మస్యేత్సదై వతు

రాజు వాస్తులక్షణ లక్షితమైన దుర్గములో నివసించుచు దేవతాపూజనము, ప్రజాపాలసము, దుష్ట శిక్షణము దానము చేయుచుండవలెను. దేవాదిధనమును అపహరించిన రాజు ఒక కల్పము వరకను నరకములో పడి యుండును. రాజు దేవపూజాతత్పరుడై దేవాలయములను కట్టించవలెను. దేవతాస్థాపన చేసి, దేవాలయ రక్ష చేయవలెను. దేవతా విగ్రహము మట్టితో కూడ చేయవచ్చును. మట్టితో చేసిన విగ్రహము కంటే దారునిర్మితము, దాని కంటే ఇటుకలతో చేసినది, దాని కంది శిలానిర్మితము, దాని కంటే సువర్ణ నిర్మితము, దాని కంటె రత్న మయము పవిత్రమైనది. భక్తి పూర్వకముగ దేవాలయ నిర్మాణము చేయువాడు. భుక్తిముక్తులను పొందును. దేవాలయము లో చిత్రములు గీయించవలేను. గీతవాద్యాదులు ఏర్పరుపవలేను. అందమైన వస్తువులను దానము చేయవలెను. తైల - ఆజ్య - మధు - క్షీరాదులతో దేవతాభిషేకము చేయవలెను. ఇట్లు చేసినవాడు స్వర్గమును పొందును. బ్రాహ్మణులను పాలించి వారి సన్మానము చేయవలెను. వారి ధనమును లాగికొనరాదు. బ్రాహ్మణుని ఒక బంగారు నాణెమును గాని, గోవును గాని, ఒక అంగుళము భూమి గానీ ఆపహరించిన రాజు మహాప్రళయము వరకును నరకములో పడి ఉండును. అనేక పాపకృత్యములు చేయుచు దురాచార వంతుడుగా ఉన్న బ్రాహ్మణుని కూడ ద్వేషింపరాదు. బ్రహ్మహత్యను మించిన పాపములేదు. ప్రభావతియగు బ్రాహ్మణుడు తలచుకొన్నచో దేవతకానీ పొవిని దేవతగా చేయగలడు, దేవతను కూడ పదచ్యుతుని చేయగలడు. అందుచే సర్వదా ఆతనికి నమస్కారము చేయవలెను.

బ్రాహ్మణీ రుదతి హన్తి కులం రాజ్యం ప్రజా స్తథా.

సాధ్వీస్త్రీణాం పాలసం చ రాజాకుర్యాచ్చధార్మికః

స్త్రియాప్రహృష్టయాభావ్యం గృహకార్యైకదక్షయా.

 సుసంస్కృతోపస్కరయా వ్యయే చాము క్తహ స్తయా

యస్మైదద్యాత్పితా త్వేనాం శుశ్రూషేత్తం పతింసదా.

మృతేభ ర్తరి స్వర్యాయాద్బ్రహ్మచర్యే స్థితాఙ్గనా

పరవేశ్మరుచిర్న స్యాన్న స్యాత్కలహశాలినీ.

 మండనం వర్జయేన్నారీ తథాప్రోషిత భర్తృకా

 దేవతారాధసపరా తిష్ఠేద్భర్తృహితేరతా.

ధారయేన్మఙ్గలార్థాయ కించిదాభరణం తథా

భర్త్రాగ్నిం యా విశేన్నారీనాపి స్వర్గమవాప్నుయాత్.

 శ్రియః సమ్పూజనం కార్యం గృహసమ్మార్జనాదికమ్

ద్వాదశ్యాం కార్తికే విష్ణుంగాంసవత్సాం దదే త్తథా.

సావిత్య్రా రక్షితోభర్తా సత్యాచారవ్రతేన చ

సప్తమ్యాం మార్గశీర్షేతు సితేభ్యర్చ్య దివాకరమ్.

పుత్రానాప్నోతి చస్త్రీహ నాత్ర కార్యావిచారణా.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే దుర్గసంపత్తిర్నామ ద్వావింశతిత మోఽధ్యాయః.

రాజు చేసిన అధర్మానికి బ్రాహ్మణ స్త్రీ ఏడ్వవలసి వచ్చినట్లయితే అతని రాజ్యము, వంశము, సర్వమును నశించును. అందుచే ధర్మ పరాయణుడగు రాజు పతివ్రతలకు మంచి రక్షణము కల్పించవలెను. శ్రీ గృహకర్మలయందు నిపుణురాలై, సంతుష్టురాలై ఉండవలెను. ఆమె ఇంటిలోని అన్ని వస్తువులను పరిశుభ్రముగా నుంచవలెను. ఖర్చు చేయుటలో సంయమవంతురాలై ఉండవలెను. తండ్రి కన్యకను ఎవనికిచ్చునో అతడే ఆమెకు పతి. ఆమె సర్వదాతనపకే సేవచేయవలెను. భర్తృమరణానంతరము బ్రహ్మచర్యమును పాలించుకొనుశ్రీ స్వర్గమునకువెళ్ళును. ఆమెఇతరులగృహములలో నివసించగూడదు. కలహములనుండి దూరముగా ఉండవలెను. భర్త పర దేశమునందున్న శ్రీ అలంకరించుకొనగూడదు. సర్వదా ఆతని పాతమునే కోరుచు దేవతారాధానము చేయుచుండవలెను. కేవలము మంగళార్ధమై సౌభాగ్యచిహ్నముగా రెండు మూడు ఆలంకారమలనుమాత్రమే ధరించవలెను. మరణించిన భర్త చితిపై అగ్ని ప్రవేశ ముచేసిన శ్రీకూడ స్వర్గము చేరును. లక్ష్మి నిపూజించుట, ఇంటిని పరిశుభ్రముగానుంచుట శ్రీకకర్తవ్యము. కార్తి క ద్వాదశినాడు విష్ణువును పూజించి వత్ససహిత గోదానము చేయవలెను. సావిత్రి తన సదాచార వ్రతముల ప్రభావముచే తన భర్త ను మృత్యువునుండి రక్షించుకొనగలినది. మార్గశిర శుక్ల సప్తమినాడు సూర్యునారాధించుచే స్త్రీ పుత్రులను పొందును. ఇందులో ఏమాత్రము సందేహములేదు.

అగ్ని మహాపురాణమునందు దుర్గసంపత్తివర్ణనము నారీధర్మకథనము అను రెండు వందల ఇరువదిరెండవ అధ్యాయము సమాప్తము.