ఈశ్వర ఉవాచః
వ్రతేశ్వరాంశ్చ సత్యాదీనిష్ట్వా వ్రత సమర్పణమ్ ।
ఆరీష్టశమనే శ స్తమరిష్టం సూత్రనాయకమ్.
హేమరత్న మయంభృత్యై మహాశంఖం చ మారణే ।
ఆప్యాయనే శంఖ సూత్రం మౌక్తికం పుత్రవర్ధనమ్.
స్ఫాటికం భూతిదం కౌశం ముక్తిదం రుద్రనేత్రజమ్ ।
దాత్రీఫల ప్రమాణేన రుద్రాక్షం చోత్తమం తతః.
సమేరుం మేరుహీనం వా సూత్రం జప్యన్తు మానసమ్ ।
అనామాంగుష్ఠ మాక్రమ్య జపంభాష్యన్తు కారయేత్.
తర్జన్యం గుష్ఠమాక్రమ్య నమేరుం లంఘయేజ్జపే ।
ప్రమాదాత్పతే సూత్రే జప్తవ్యన్తు శతద్వయమ్.
సర్వవాద్యమయీ ఘంటాతస్యా వాదనమర్థకృత్ ।
గోశకృన్మూత్ర వల్మీక మృత్తికా భస్మ వారిభిః.
పరమేశ్వరుడు చెప్పెను. ప్రతేశ్వరులను సత్యాది దేవతలను పూజించి వారికి వ్రతము సమర్పించవలేను. ఆరిష్టశాంతికి అరిష్టమూలమాల ఉత్తమము కల్యాణ ప్రాప్తి సువర్ణ రత్న మాలా, మారణకర్మకు మహా శంఖమాలా, శాంతి కర్మకు శంఖమాలా పుత ప్రాప్తి కి మౌక్తి కమాలా ఉపయోగించి జపము చేయవలెను. స్పటికమాల ఐశ్వర్య ప్రదము రుద్రాక్షమాలా ముక్తికి పదము, ఉసిరికాయ పరిమాణము గల రుద్రాక్షము ఉత్తమము. మేరు సహితములు, లేదా, మేరు రహితమగు మాలను జవమునందు ఉపయోగించవచ్చును. మానసిక జపము చేయుచున్న పుడు మాలయందలి పూసలను ఆనా మికంగుష్టములతో జరపవలేను. ఉపాంశు జపమునందు తర్జన్యం గుష్ట వణులను కలిపి గణన చేయవలెను. జప సమయ మున ఎన్నడును మేరువును దాటరాదు. ప్రమాద వశమున మాట జారిపడినచో రెండు వందల పర్యాయము జపము చేయ వలేను. మంట సర్వవాద్యమయము ఘంటావాదనము సకల ప్రయోజన పదము గృహము నందును మందిరము వందురు. శివలింగమును గోమయ గోమూత్ర వల్మీక మృత్తికా భస్మ జలములతో శుద్ధి చేయవలెను.
వేశ్మాయతన లింగాదేః కార్యమేవం విశోధనమ్ ।
స్కందోం నమః శివాయేతి మంత్రః సర్వార్థ సాధకః.
గీతః పంచాక్షరో వేదేలో కే గీతః షడక్షరః ।
ఓమిత్యన్తే స్థితః శంభుర్ముద్రార్ధం వటబీజవత్.
క్రమాన్నమః శివాయేతి ఈశాన్యాద్యాని వై విదుః ।
షడక్షరస్య సూత్రస్య భాష్యాద్విద్యా కదంబకమ్.
యదోం నమః శివాయేతి ఏతావత్పరమం పదమ్ ।
అనేన పూజయేల్లింగం లింగేయస్మాత్ స్థితః శివ.
అనుగ్రహాయ లోకానాం ధర్మమార్థ ముక్తిదః ।
యోనపూజయతే లింగం న స ధర్మాది భాజనమ్.
లింగార్చనాద్భుక్తి ముక్తిర్యావజ్జీవమతోయజేత్ ।
వరం ప్రాణపరిత్యాగో భుం జీతా పూజ్యనై వతమ్.
రుద్రస్య పూజనాద్రు ద్రో విష్ణుః స్యాద్విష్ణ పూజనాత్ ।
సూర్యస్స్యాత్ సూర్యపూజాతః శక్త్యాదిః శ క్తి పూజనాత్.
సర్వయజ్ఞ తపోదానే తీర్థేవోదేషు యత్ఫలమ్ ।
తత్ఫలు కోటిగుణితం స్థాప్యలింగం లభేన్నరః.
త్రిసంధ్యం యోర్చయేల్లింగం కృత్వాభిల్వేన పార్థివమ్ ।
శతైకాదశికం యావత్కుల ముద్దృత్య నాక భాక్ .
భక్త్యా విత్తాను సారేణ కుర్యాత్ప్రాసాద సంచయమ్ ।
అల్పే మహతివా తుల్యఫలమాడ్య దరిద్రయోః.
భాగద్వయంచ ధర్మార్థం కలయేజ్జీవ నాయచ ।
ధనస్య భాగమేకన్తు అనిత్యం జీవితంయతః.
త్రిసప్త కులముద్దృత్య దేవాగారకృదర్థ భాక్ ।
మృత్కాష్ఠేష్టక శైలాద్యైః క్రమాత్కోటి గుణంఫలమ్.
అష్టేష్టక సురాగార కారీ స్వర్గమవాప్నుయత్।
పాంసునా క్రీడమానోఽపి దేవాగార కృదర్ధ భాక్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే దేవాలయాది మాహాత్మ్య నిరూపణం
నామసప్త వింశత్యధిక త్రిశతతమోఽధ్యాయః.
స్కందా ! “ఓం నమశ్శివాయ” యను మంత్రము సకలా భీష్ట పదము. ఇది వేదమునందు వంచాక్షరమనియు లోకమున షడక్షరమనియు చెప్పబడినది. వట బీజములో వటవృక్షమున్నట్లు ఓంకారము నందు శివుడు సమ్మితుడై వుండును “ఓం నమః శివాయ ఈశానః సర్వ విద్యానాం” మొదలకు మంత్రములు సమస్త విద్యాసముదాయము. ఈషడ క్షర మత్రమకు భాష్యము “ఓం నమః శివాయ” యను మంత్ర మే పరమ పదము, ధర్మార్థకామ మోక్షము విచ్చు శివుడు లోకాను గ్రహార్థమై లింగములో నున్నాడు. అందుచే ఈ మంత్రముచే శివలింగమును పూజించవలెను. శివలింగ మును పూజించని వాడు ధర్మదూరుడగును, లింగ పూజనము భుక్తిముక్తి పపముగాన, ఆజీవితాంతము శివలింగమును పూజించవలెను. పాణములు పోయినను శివలింగ పూజ చేయకుండగ భోజనము చేయకూడదు. రుద్ర పూజచే రుద్ర సారూప్యము, విష్ణు పూజచే విష్ణు సారూప్యము, సూర్య పూజచే సూర్య సారూప్యము, శక్తి పూజచే శ క్తి సారూప్యము, లభించును. సంపూర్ణ యజ్ఞ తపోదాన ఫలములు లభించును. లింగస్థాపన చేసిన వానికి కోటి రెట్లు ఫలము లభించును. ప్రతిదినము త్రికాలములందును, పార్థివ లింగము నిర్మించి దానిని బిల్వ పత్రము: తో పూజించువాని నూట పదకొండు తర ముల వారు స్వర్గమును పొందుదురు. విత్తాను సారముగా భక్తి పూర్వకముగా దేవతా మందిరములు కట్టించవలెను. దేవా లయ నిర్మాణము యథా శక్తి గా అల్పము ఖర్చు పెట్టిన దరిదునకును, ఆధికముగా ఖర్చు పెట్టిన ధనికునకు సమాన ఫలము లభించును. సంపాదించిన ధనము నందలి రెండు భాగములను ధర్మ కార్యము నందు వ్యయంచి జీవన నిర్వా హము నకు రెండు భాగము లుంచుకౌనవ లేను. జీవనము అనిత్యము కదా ! దేవతా మందిరమును నిర్మించువాడు ఇరువది యొక్క తరముల వారిని ఉద్దరించి అభీష్టములను పొందును. మట్టి కర్ర ఇటుక శిల వీటితో మందిర నిర్మాణము వరసగా కోటి గుణ ఫలము కలది. ఎనిమిది ఇటుకలతోనై నను మందిరము నిర్మించువాడు స్వర్గలోకమును పొందును. ఆడుకొనుచు ధూళితో మందిరము కట్టు వానికి కూడ అభీష్ట మనోరథసిద్ధి కలుగును.
ఆగ్ని మహాపురాణమున దేవాలయ మాహాత్మ్య వర్ణనమను మూడువందల ఇరువదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 328 of the Agni Purāṇa is as follows:
The installation rites for Viṣṇu images are set out in detail. Agni specifies the iconic forms appropriate for Viṣṇu — the eight-armed standing form (ṣoḍaśabhuja), the four-armed form (caturbhuja) holding śaṅkha, cakra, gadā, and padma, and the reclining form (śeṣaśāyin) — along with the proportional measurements for each. The selection of stone (śaila), metal (tāmra, pañcaloha), or wood (khadira, candana) for the mūrti is discussed relative to the installer's means and intent. The consecration ceremony concludes with a mahāpūjā, homa, and the donation of the four items of dāna — cow, land, gold, and knowledge.