అగ్ని మహా పురాణము

250 - పునః ధనుర్వేద

 అగ్ని రువాచః

పూర్ణాయతం ద్విజః కృత్వాతతో మాంసైర్గదాయుధాన్

సునిర్ధౌతం ధనుః కృత్వా యజ్ఞభూమౌనిధాపయేత్.

తతో బాణం సమాగృహ్య దంశితః సుసమాహితః

తూణమాసాద్య బధ్నీ యాద్దృడాం కక్షాచ దక్షిణామ్.

విలక్ష్యమపి తద్బాణం తత్ర చైవ సుసంస్థితమ్

తతః సముద్ద రేద్బాణం తూణాద్దక్షిణ పాణినా.

తేనైవ సహితం మధ్యేశరం సంగృహ్య ధారయేత్

వామహస్తేన వై కక్షాం ధను స్తస్మాత్సముద్ద రేత్.

 అవిషణ్ణమతిర్భూత్వా గుణే పుంఖం నివేశ యేత్

సంపీడ్య సింహకర్ణేన పుంఖేనాపి సమేధృడమ్.

వామకర్ణోప విష్టంచ ఫలం వామస్య ధారయేత్

వర్ణాన్మధ్యమయా తత్ర వామాంగుల్యాచ ధారయేత్.

 మనోలక్ష్యగతం కృత్వా ముష్టినా చ విధానవిత్

 దక్షిణే గాత్రభాగేతు కృత్వా వర్ణం విమోక్షయేత్.

 లలాట పుట సంస్థానం దండం లక్ష్యం నివేశ యేత్

ఆకృష్య తాడయే త్తత్ర చంద్రకం షోడశాం గులమ్.

 ముక్త్వా బాణం తతః పశ్చాదుల్కా శిక్ష స్తదాతయా

నిగృహ్ణీయాన్మధ్యమయా తతోఽఙ్గుల్యా పునః పునః.

 అక్షి లక్ష్యం క్షిపేత్తూణాచ్చతురస్రం చ దక్షిణమ్

 చతురస్ర గతం వేద్యమభ్య సేచ్చాదితః స్థితః.

అగ్ని దేవుడు పలికెను : ద్విజుడు పూర్తి పొడవుగల ధనస్సును తయారు చేయించి, దానిని బాగుగా కడిగితుడిచి, దానిని, గదాద్యాయుధములను గూడ శుభము చేసి వాటిని, యజ్ఞభూమిలో మంచవలెను. పిదప బాణములు గ్రహించి, కవచము ధరించి, ఏకాగ్రచిత్తుడై ఆఁబుల పొడిని వీపుపై కుడి చంక దగ్గర గట్టిగా బంధించవలెను. అట్లు చేయుటచే విలక్ష్యమగు బాణము కూడ తూణీరము నందు స్థిరముగా నుండును. కుడి చేతితో తూణీరమునుండి బాణమును వెలికి తీయవలెను. ఎడమ చేతితో ధనస్సును అచటినుండి పైకెత్తి, దాని మధ్యభాగమున బాణసంధానము చేయవలెను. చిత్తమునందు విషాదమేమియ లేనివాడై, ఉత్సాహసంపన్నుడై నారిపై బాణపుంఖమునుంచి, సింహకర్ణమను ముష్టితో వారిని బాణపుంఖముతో నొక్కి పెట్టి, సమముగ సంధించి, బాణమును లక్ష్యము వైపు విడువవలెను. ఎడమచేతితో బాణము విడువవలెనన్నపుడు ఎడమచేతిలో బాణముధరించి, కుడి చేతిలో ధనస్సు ముష్టిని పట్టుకొనవలెను. లాగినపుడు బాణము వలము (ఆగ్రము) గాని, చెడివరకు వచ్చునట్లు వారి పై బాణము నుంచవలెను. ఆసమయమున బాణమును తర్జన్యంగుష్ఠమునే కాక మధ్యమాంగుళితో కూడ పట్టుకొనవలెను. బాణ ప్రయోగ విధి నెరిగిన యోధుడు ధనస్సునో ముష్టితో గట్టిగ పట్టుకొని, మనస్సును, దృష్టిని లక్ష్యము పై నిలిపి, బాణము శరీరము కుడివైపునకు వచ్చునట్లు చేసికొని లక్ష్యమువైపు విడువవలెను. ధనుర్దండము నేలపై నిల పెట్టినపుడు లలాట సమీపమునకు వచ్చునంత పొడవు ఉండవలెను. దాని పై చంద్రక బాణమును సంధించి, బాగుగా లాగి లక్ష్యము పై విడువవలెను. ఈ విధముగ ఒక బాణము విడచిన పిమ్మట, వెంటనే తూణీరము నుండి, తర్జన్యంగుష్ఠము లతో మాటిమాటికి బాణము పైకి తీసి, దానిని మధ్యమాంగుళి చేతగూడ తన వశమునందుండు నట్లు చేసికొని, శీఘ్రముగ లక్యము వైపు విడువవలెను. నలువైపులను, దక్షిణమునందును లక్ష్యవేధము చేయుచుపోవలెను. మొదటి నుండియు వాలుగు వైపుల లక్ష్యమును కొట్టుచు గాణ ప్రయోగము చేయుట అభ్యసించవలెను.

తస్మాదనంతరం తీక్ష్ణం పరావృత్తం గతం చయత్

నిమ్న మున్నత వేధం చ హ్యభ్యసే త్క్షిప్రకం తతః.

వేధ్య స్థానేష్వ థై తేషు సత్త్వస్య పుట కాద్ధనుః

హస్తా వాపశ తైశ్చిత్రై స్తర్జయేద్దుస్తరై రపి.

 తస్మిన్వేధ్యగతే విప్ర ద్వేవేద్యే దృఢ సంజ్ఞకే

ద్వే వేధ్యే దుష్కరే వేధ్యేద్వే తథా చిత్ర దుష్కరే.

 నతునిమ్నంచ తీక్ష్ణం చ దృఢ వేధ్యే ప్రకీర్తితే

 నిమ్నం దుష్కతముద్దిష్టం వేధ్య మూర్ధ్వ గతం చయత్.

మస్తకాయన మద్యేతు చిత్ర దుష్కర సంజ్ఞకే

ఏవం వేధ్యగణం కృత్వా దక్షిణేనేత రేణ చ.

 ఆరో హేత్ప్ర థమం వీరో జితలక్ష స్తతో నరః

ఏష ఏవవిధిః ప్రోక్త స్తత్ర దృష్టః ప్రయో క్తృభిః.

 అధికం భ్రమణం తస్య తస్మాద్వేధ్యాత్ప్ర కీర్తితతమ్.

లక్ష్యం సంయోజయేత్తత్ర పత్రిపత్ర గతం దృఢమ్.

భ్రాంతం ప్రచలితం చై వస్థిరం యచ్చ భ వేదితి

సమంతాత్ తాడయేద్బిన్ ద్యాచ్చేదయేద్య్వథ యేదపి.

కర్మయోగ విధానజ్ఞో జ్ఞాత్వైవం విధిమాచరేత్

మనసా చక్షుషా దృష్ట్యా యోగశిక్షుర్యమం జయేత్ .

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ధనుర్వేదో నామ పంచాశదధిక ద్విశతత మోఽధ్యాయః.

పిదప అతడు తీక్ష్ణ - పరావృత్త - గత - నిమ్న - ఉన్నత - క్షిప్ర వేధలను అభ్యసించపలెను. పైన చెప్పిన వేధ్యలక్ష్య స్థానములను కొట్టుటకు సత్త్వమును చూపుచు విచిత్రము, దుస్తరము అగు పద్దతిలో అనేక పర్యాయములు హస్తములచే బాణములను తీయుట విడచుట అను పనులచే ధను సర్జనము చేయవలెను. విప్రవరా! వేధ్యములలో అనేక భేదములున్నవి. దృఢము, దుష్కరము, చిత్రదుష్కరము అని ఆవి మూడువిధములు. ఆ మూడును మరల రెండేసి విధములు- నతనిమ్న ము, తిక్షము అనునవి దృఢవేధ్యభేదములు. నిమ్నము, ఊర్ధ్వగతము అని దుష్కర వేధ్యభేదములు. మస్తక పనము. మధ్యము ఆని చిత్రదుష్కర వేధ్యభేదములు. ఈ విధముగ వీరుడు వేధ్యగణములవేధించుటలో ప్రవీణుడై ముందు పునః ధనుర్వేదకుడి ప్రక్కనుండి గాని, ఎడమ ప్రక్కనుండి గాని శత్రుసైగ్యముపై ఆక్రమణము చేయవలెను. దానివలన లక్ష్యము పై విజయము లభించును. ప్రయోగ నిపుణులు వేద్యవిషయమున ఈ విధానము గ్రహించి ప్రతిపాదించి యున్నారు. యోధునకు వేధ్యముకంటెగూడ భ్రమణము ఉత్తమమని చెప్పబడినది. లక్షమును తనబాణము పుంఖముచే ఆచ్చాదించి దానివైపు దృఢముగ శరసంధానము చేయవలెను. భ్రమణశీలము, చంచలము, అగులక్ష్యమును అన్ని వైపుల నుండియు కోట్టవలెను. దానిని ఛేదించి, భేదించి, సర్వవిధముల దొనికి పీడకలిగించవలెను. కర్మయోగ విధానము తెలిసిన వాడు ఈ విధముగ తెలిసికొని ఉచితవిధముగ ఆచరించవలెను. మనోనేత్ర దృష్టులను లక్ష్యముపై నిలుపగలిగిన వాడు యముని కూడ జయించగలుగును,

అగ్ని మహాపురాణమున ధనుర్వేద కథనమను రెండువందలఏబదవ అధ్యాయము సమాప్తము.