అగ్ని మహా పురాణము

38 - అథ దేవాలయ నిర్మాణఫలమ్

అగ్ని రువాచః

వాసుదేవాలయస్తస్య కృతౌ వక్ష్యే ఫలాదికమ్

చి కేర్షోర్దేవధామాది సహస్రజని పాపనుత్.

మనసా సద్మకర్తృణాం శతజన్మాఘనాశనమ్

యేఽనుమోదన్తి కృష్ణస్య క్రియమాణం నరా గృహమ్.

తేఽపి పాపైర్వినిర్ముక్తాః ప్రయాన్త్యచ్యావలోకకమ్

సమతీతం భవిష్యం చ కులానామయుతం నరః.

విష్ణులోకం నయత్యాకు కారయిత్వా హరేర్గృహమ్

వసన్తి పితరో హృష్టా విష్ణులోకే హ్యలఙ్కృతాః.

విముక్తా నారకైర్దుఃఖైః కర్తుః కృష్ణస్య మన్దిరమ్

బ్రహ్మహత్యాదిపాపౌఘఘాతకం దేవతాలయమ్.

ఫలం యన్నాప్యతే యజ్ఞేర్ధామ కృత్వా తదాప్యతే

దేవాగారే కృతే సర్వతీర్థస్నానఫలం భవేత్.

అగ్ని దేవుడు చెప్పేను :- మునీశ్వరా! వాసుదేవాదులకొరకు దేవాలయమును చేయించుటచే కలుగు ఫలమును చెప్పుచున్నాను. దేవాలయములు కట్టవలే ననియు, తటాకాదులు నిర్మింపవలెననియుకలిగిన శుభసంకల్పము అట్టి సంకల్పము కలవాని వేల కొలది జన్మల పాపములను నశింపచేయును. భావన చేతనైన దేవాలయనిర్మాణము చేసినవాని అనేక జన్మల పాపములు తొలగిపోవును. ఎవరైన దేవమందిరాదులు. గట్టుచున్నపుడు దానిని ఆమోదించినవారు కూడ సమస్తపాపములు తొలగి విష్ణులోకమును పొందుదురు. శ్రీమహావిష్ణువునకు ఆలయము నిర్మించినవారు భూతకాలము ఎందలి వేయి తరములవారిని భవిష్యత్తులోని వేయి తరములవారిని విష్ణులోక నివాసార్డులనుగ చేయును. శ్రీకృష్ణుని ఆలయమును నిర్మించినవాని పితరులు వెంటనే నరకదుఃఖమునుండి విముక్తులై . దివ్యవసాభరణాదులు ధరించి ఆనందముతో విష్ణులోకమున నివసింతురు. దేవాలయనిర్మాణము బ్రహ్మహత్యాదిపాపములను తొలగించులు. యజ్ఞము చేతనవలన కలుగని ఫలములు గూడ దేవాలయనిర్మాణముచే కలుగును. దేవాలయనిర్మాణమువలన సమ స్తతీర్థములందును, స్నానము చేసిన ఫలము కలుగును.

దేవాద్యర్థే హతానాం చ రణే యత్తత్ఫలాదికమ్

శాఠ్యేన పాంసునా వాపి కృతం ధామ చ నాకదమ్.

ఏకాయతనకృత్స్వర్గీ త్ర్యగారీ బ్రహ్మలోకభాక్

పఞ్చాగారీ శమ్బులోకమష్టాగారాద్ధరౌ స్థితిః.

షోడశాలయకారీ తు భుక్తిం ముక్తిమవాప్నుయాత్

కనిష్ఠం మధ్యమంశ్రేష్ఠం కారయిత్వాహరేర్గృహమ్.

స్వర్గం చ వైష్ణవంలోకం మోక్షమాప్నోతి చ క్రమాత్

శ్రేష్ఠమాయతనం విష్ణోః కృత్వాయద్ధనవాన్లభేత్.

కనిష్ఠైనెవ తత్పుణ్యం ప్రాప్నోత్యధనవాన్నరః

సముత్పాద్య ధనం కృత్వా స్వలేనాపి సురాలయమ్.

కారయిత్వా హరేః పుణ్యం ప్రాప్నోత్యభ్యధికం వరమ్

లక్షేణాథ సహస్రేణ శతస్యార్దేన వా హరేః.

కారయన్ భవనం యాతి యత్రాస్తే గరుడధ్వజః

దేవతాబ్రాహ్మణాదుల రక్షణము నిమిత్తము రణభూమిలో ప్రాణత్యాగము చేసిన వీరునకు ఏ ఫలము లభించునో ఆ ఫలము దేవాఃయనిర్మాణము చేయువానికి లభించును. లోభముచే మట్టితో దేవాలయము కట్టించినవానికి గూడ స్వర్గముగాని దివ్యలోకము గాని లభించును. ఏకాయతన దేవాలయము. ఒకే దేవతా విగ్రహమునకై ఒక గది గల ఆలయము నిర్మించినవాడు స్వర్గమును పొందును. త్యాయతనదేవాలయమును నిర్మించినవాడు బ్రహ్మలోకములో నివసించును. పంచాయతనదేవాలయమును నిర్మించినవాడు. శివలోకమును చేరును, అష్టాయతనమందిరము నిర్మించిన వాడు. శ్రీహరిసానిధ్యము నం దుండును. షోడశాయతనదేవాలయ నిర్మాణము చేసినవాడు భోగమును, మోక్షమును కూడా పొందును. శ్రీహరి దేవాలయములలో కనిష్టము, మధ్యమము, శ్రేష్టము అను మూడు శ్రేణు లున్నవి. వీటి నిర్మాణము వలన క్రమముగ స్వర్గలోక - విష్ణులోక - మోక్షములు ప్రాప్తించును. ధనవంతుడు శ్రేషశ్రేణికి చెందిన విష్ణ్వాలయమును నిర్మించుటచే ఎట్టి ఫలితమును పొందునో ఆ ఫలితమునే కనిష్ట శ్రేణికి చెందిన దేవాలయమును నిర్మించిన నిర్దనుడు పొందును. తాను సంపాదించిన ధనములో స్వల్పధనమును మాత్రమే వెచ్చించి దేవాలయమును నిర్మించినను భక్తుడు అధిక మగు పుణ్యమును, భగవంతుని అనుగ్రహమును పొందును. ఒక లక్షగాని, ఒక వెయ్యి గానీ, నూరు గాని, దానిలో సగము గాని ముద్రలను వెచ్చించి విష్ణునుందిర మును నిర్మించువాడు శ్రీ మహావిష్ణులోకమును చేరును.

బాల్యేతు క్రీడమానా యే పాంసుభిర్భవనం హరేః.

వాసుదేవస్య కుర్వన్తి తేఽపి తల్లోకగామినః

తీర్థే చాయతనే పుణ్యే సిద్ధక్షేత్రే తథాశ్రమే.

కర్తురాయతనం విష్ణోర్యథోక్తాత్త్రిగుణం ఫలమ్

బన్దూకపుష్పవిన్యాసైః సుధాపఙ్కేన వైష్ణవమ్.

యేవిలిమ్పన్తి భవనం తే యాన్తి భగవత్పురమ్

పతితం పతమానం తు తథార్ధపతితం నరః.

సముద్ధృత్య హరేర్దామ ప్రాప్నోతి ద్విగుణంఫలమ్

పతితస్య తు యః కర్తా పతితస్య చ రక్షితా.

విప్లోరాయతనస్యేహ స నరో విష్ణురూపభాక్

ఇష్టకానిచ యస్తిష్ఠేద్యావదాయతనం హరేః.

సకులస్తస్య వై కర్తా విష్ణులోకే మహీయతే

స ఏవ పుణ్యవాన్ పూజ్య ఇహలోకే పరత్ర చ.

కృష్ణస్య వాసుదేవస్య యః కారయతి కేతనమ్

జాతః స ఏవ సుకృతీ కులం తేనైవ పాలితమ్.

బాల్యమునందు ఆట లాడుచు మట్టితో విష్ణ్వాలయమును నిర్మించినవారు కూడ విష్ణులోకమును చేరుదురు. తీర్థములందు, పవిత్రస్థానములందు, సిద్ధ క్షేత్రములందు, ఆశ్రయములందు విష్ణ్వాలయము నిర్మించువారికి ఇతర ప్రదేశము లందు నిర్మించువారికంటే మూడు రెట్లు ఎక్కువ ఫలము లభించును., విష్ణ్వాలయమునకు వెల్లివేసినవారును, దానిపై బంధూకపుష్పముల చిత్రములు వేసినవారును విష్ణులోక మును పొందుదురు. కూలిపోయిన లేదా కూలిపోవుచున్న లేదా సగము కూలిపోయిన దేవాలయమును జీర్ణోద్దారణము చేసినవానికి కొత్తదేవాలయము నిర్మించినవానీకంటే రెట్టింపు ఫలము లభించును. కూలిపోయిన విష్ణ్వాయమును మరం నిర్మించి రక్షించినవాడు, సాక్షాత్ భగవత్స్వరూపుడు. భగవంతుని ఆలయమునందు ఇటుకలు ఎంతకాల ముండునో అంతవరకును, వాటిని నిర్మించినవాడు, తన కులముతో కూడ, విష్ణులోకములో నుండును. ఇహలోకమునందును, పరలోకమునందును గూడ ఆతడే పూజనీ ముడు; ఆతడే పుణ్యవంతుడు.

విష్ణురుద్రార్కదేవ్యాదేర్గృహకర్తా స కీ ర్తిభాక్

కిం తస్య విత్తనిచయై ర్మూఢస్య పరిరక్షిణః.

దుఃఖార్జితైర్యః కృష్ణస్య న కారయతి కేతనమ్

నోపభోగ్యం ధనం తస్య పితృవిప్రదివౌకసామ్.

నోపభోగాయ బన్దూనాం వ్యర్థస్తస్య ధనాగమః

యథా ధృవో నృణాం మృత్యుర్విత్తనాశ స్తథా ధృవః.

మూఢస్తత్రానుబధ్నాతి జీవితేథ చలే ధనే

యదా విత్తం న దానాయ నోపభోగాయ దేహినామ్.

నాపి కీర్త్యైన ధర్మార్థం తస్య స్వామ్యేఽథ కో గుణః

తస్మాద్విత్తం సమాసాద్య దైవాద్వా పౌరుషాదథ.

దద్యాత్సమ్యగ్ద్విజాతిభ్యః కీర్తనాని చ కారయేత్

దానేభ్యశ్చాధికం యస్మాత్కీర్తనేభ్యో వరం యతః.

అతస్తత్కారయేద్దీమాన్ విష్ణ్వాదేర్మన్దిరాదికమ్

వినివేశ్య హరేర్దామ భక్తిమద్భిర్నరోత్తమైః.

నివేశితం భవేత్కృత్స్నం త్రైలోక్యం సచరాచరమ్

భూతం భవ్యం భవిష్వం చ స్థూలం సూక్ష్మం తథేతరత్.

ఆబ్రహ్మస్తమ్బాపర్యన్తం సర్వం విష్ణోః సముద్భవమ్

తస్య దేవాదిదేవస్య సర్వగస్య మహాత్మనః.

నివేశ్య భవనం విష్ణోర్న భూయో భువి జాయతే

యథా విష్ణోర్ధామకృతా ఫలం తద్వద్దివౌకసామ్.

శివబ్రహ్మార్కవిఘ్నేశ చణ్డీలక్ష్మ్యాదికాత్మనామ్

దేవాలయకృతేః పుణ్యం ప్రతిమాకరణేఽధికమ్.

ప్రతిమాస్థాపనే యాగే ఫలస్యాన్తో న విద్యతే

మృన్మయాద్దారుజే పుణ్యం దారుజాదిష్టకోద్భవే.

ఇష్టకోత్థాచ్ఛైలజే స్యాద్ధేమాదేరధికం ఫలమ్

సప్తజన్మకృతం పాపం ప్రారమ్భాదేవ నశ్యతి.

దేవాలయస్య స్వర్గీ స్యాన్నరకం న స గచ్ఛతి

కులానాం శతముద్దృత్య విష్ణోర్లోకం నయేన్నరః.

యమో యమభటానాహ దేవమన్దిరకారిణః

శ్రీకృష్ణునకు ఆలయము కట్టించిన పుణ్యాత్ముడే పుట్టినవారిలో లెక్క. ఆతడే తన వంశమును రక్షించువాడు. విష్ణు-శివ-సూర్య-దేవ్యాదులకు ఆలయమును నిర్మించువాడే ఈ లోకమునందు కీర్తి పొందును. ఎంతో శ్రమపడి సంపాదించిన ధనమును, శ్రీకృష్ణాలయమును నిర్మించుటకు వినియోగింపక, కేవలము దానిని రక్షించుచుండు మూర్జునకు దానివల్ల ఏమి ప్రయోజనము కలుగును? పితరులు, బ్రాహ్మణులు, దేవతలు. వీరికై తన ధనమును వినియోగించని వాని ధనము, బంధువులకు ఉపకరించని వాని ధనము వ్యర్థము. దానమునకు గాని, భోగమునకు గాని, ధర్మాచరణమునకు గాని, కీర్తికొరకు గాని ఉపకరించని ధనమునకు స్వామి. అయి ఏమి ప్రయోజనము? అందుచే పూర్వజన్మాదృష్టముచేత గాని, పురుషప్రయత్నముచేత గాని, మరి ఏఉపాయాంతరముచేత గాని లభించిన ధనమును ఉత్తమబ్రాహ్మణులకు దానము చేయవలెను; స్థిరకీర్తి లభించుటకు ఉపయోగించవలెను. దానకీర్త్యాదులకంటె గూడ దేవాలయనిర్మాణము ఉత్తమ మైనది గాన ఐదీమంతుడు విష్ణ్వాదిదేవతకు ఆయములు కట్టించవలెను. భక్తిమంతుడగు పురుషుడు దేవాలయమును నిర్మించి, దానిలో దేవతాప్రతిష్ట చేసినా డనగా, ఆతడు చరాచరరూపమంగు ముల్లోకములకును భవనమునిర్మించినా డని యర్థము. భూతవర్తమాన భవిష్యత్కాలములకు చెందిన స్థూల సూక్ష్మరూపము. తద్భిన్నము అయిన బ్రహ్మాది స్తంభాంత మగు ప్రపంచ మంతయు మహావిష్ణువునుండియే జనించినది. దేవాధిదేవుడును, సర్వవ్యాపకుడుమ, మహాత్ముడును అగు అట్టి విష్ణువునకు ఆలయమును నిర్మించినవాడు మరల ఈ సంసారమునందు జనింపడు. శివ-బ్రహ్మ-సూర్య-గణేశ-దుర్గా-లక్ష్మ్యాదిదేవతలకు ఆలయమును నిర్మించినవారికి గూడ విష్ణ్వాలయమును నిర్మించినవారికి లభించు ఫలము లభించును. దేవతాప్రతిమను నిర్మింపచేసినవారికి ఆలయనిర్మాణము చేయించినవారికంటె గూడ అధికఫలము లభించును. దేవతాప్రతిమా స్థాపనరూప మగు యజ్ఞమువలన లభించు ఫలము అనంతము. మట్టితో చేసిన ప్రతిమకంటే కట్టితో చేసిన ప్రతిమ ఉత్తమ మైనది. దానికంటే ఇటుకలతో నిర్మించినది, దానికంటె జాయితో నిర్మించినది, దానికంటె సువర్ణావిలోహములతో నిర్మించినది శేషమైనది, దేవాలయ ప్రారంభము చేసినంతమాత్రముననే ఏడు జన్మల పాపము నశించును. నిర్మించువాడు స్వర్గలోక ప్రాప్తికి అధికారి యగును. అతడు నరకమునకు వెళ్ళడు. ఆంతే కాదు-ఆతడు తన వంశములోని నూరు తరములవారిని విష్ణులోకమునకు పంపును. యమధర్మరాజు తన దూతలతో, దేవాలయములు నిర్మించువారిని గూర్చి ఇట్లు చెప్పేను.

యమ ఉవాచః

ప్రతిమా పూజాదికృతో నానేయా నరకం నరాః.

దేవాలయాద్యకర్తార ఆనేయాస్తే విశేషతః

విచరధ్వం యథాన్యాయ్యం నియోగో మమ పాల్యతామ్.

నాజ్ఞాభఙ్గం కరిష్యన్తి భవతాం జన్తవః క్వచిత్

కేవలం యే జగత్తాత మనన్తం సముపాశ్రితాః.

భవద్భిః పరిహర్తవ్యాస్తేషాం నాత్రస్తి సంస్థితిః

యత్ర భాగవతా లోకే తచ్చిత్తాస్తత్పరాయణాః.

వూజయన్తి సదా విష్ణుం తే వస్త్యాజ్యాః సుదూరతః

యస్తిష్ఠన్ ప్రస్వపన్ గచ్చన్నుత్తిష్ఠన్ స్ఖలితే స్థితే.

సఙ్కీర్తయన్తి గోవిన్దం తే వస్త్యాజ్యాః సుదూరతః

నిత్యైరైమిత్తికైర్దేవం యే యజ’న్తి జనార్దనమ్.

నావలోక్యా భవద్బిస్తే తద్ర్వతా యాన్తి సద్గతిమ్

యే పుష్పధూపవాసోభిర్భూషణై శ్చాతివల్లభై.

అర్చయన్తి న తే గ్రాహ్యా నరాః కృష్ణాలయం గతాః

ఉపలేపనకర్తారః సంమార్జనపరాశ్చ యే.

కృష్ణాలయే పరిత్యాజ్యాస్తేషాం పుత్రాస్తథా కులమ్

యేన చాయతనం విష్ణోః కారితం తత్కులోద్భవమ్.

పుంసాం శతం నావలోక్యం భవద్బిర్దుష్టచేతసా

యస్తు దేవాలయం విష్ణోర్దారుశైలమయం తథా.

కారయేన్మృన్మయం వాపి సర్వపాపైః ప్రముచ్యతే

అహన్యహని యజ్ఞేన యజతో యన్మహాఫలమ్.

ప్రాప్నోతి తత్ఫలం విష్ణోర్యః కారయతి కేతనమ్

కులానాం శతమాగామి సమతీతం తథా శతమ్.

కారయన్భగవద్ధామ నయత్యచ్యుతలోకకమ్

సప్తలోకమయో విష్ణుస్తస్య యః కురుతే గృహమ్.

తారయత్యక్షయాన్ లోకానక్షయాన్ప్రతిపద్యతే

ఇష్టకాచయవిన్యాసో యావన్త్యబ్ధాని తిష్ఠతి.

తావద్వర్షసహస్రాణి తత్కర్తుర్ధివి సంస్థితిః

ప్రతిమాకృద్విష్ణులోకం స్థాపకో లీయతే హరౌ.

దేవసద్మప్రతికృతిప్రతిష్ఠాకృత్తు గోచరే

అగ్ని రువాచః

యమోక్తా నానయంస్తేథ ప్రతిష్ఠాదికృతం హరేః

హయశీర్షః ప్రతిష్ఠార్థం దేవానాం బ్రహ్మణేఽబ్రవీత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే దేవాలయాది నిర్మాణ మాహాత్మ్యాదివర్ణనం నామాష్టత్రింశోఽధ్యాయః.

యమధర్మరాజు చెప్పెను : “దేవప్రతిమా నిర్మాణముచేసినవారిని, దానికి పూజలు సలిపిన వారిని మీరు వరకమునకు, తీసికొనిరాకూడదు. దేవాలయాదులను నిర్మింపనివారిని మాత్రమే తీసికొనిరావలెను. మీరందరు లోకములలో సంచరించుచు నా ఆజ్ఞను పాలింవుడు. ప్రపంచమునందలి ఏ ప్రాణియు మీ ఆజ్ఞను ధిక్కరింపజాలడు. జగత్పిత యైన ఆనంతుని శరణుజొచ్చినవారిని మాత్రము మీరు విడచివేయవలెను. వారికీ లోకములో నివాసము ఉండదు. భగవంతునిపై చిత్తములగ్నము చేసి, భగవంతుని శరణుజొచ్చినభగవద్భక్తులగు మహాత్ములను, సదా విష్ణుపూజ చేయువారిని మీరు విడిచివేయవలెమ.నించినపుడు గాని, నిద్రించినపుడు గాని, నడచునపుడు గాని, అన్ని వేళ లందును శ్రీకృష్ణనామ స్మ రణము చేయువారి దరికి పోవలదు. నిత్యనైమిత్తిక కర్మల ద్వారా జనార్ధనుని పూజ చేయువారి వైపు కన్నెత్తి యైనను చూడవలదు. అట్టి భగవద్ర్వతశీలులు భగవంతునే చేరుదురు.

పుష్పములు, ధూపము, వస్త్రములు మొదలగు అలంకారములను సమర్పించి భగవంతుని పూజ చేయువారి జాడలకు పోవలదు. వారు శ్రీకృష్ణుని చేరినవారు. దేవాలయములందు అలికి ముగ్గులు వేయువారి పుత్రులను, వంశీయులను కూడ విడిచివేయవలెను. విష్ణ్వాలయమును నిర్మించినవారి వంశములో నూరు తరములవరకును మీరెవ్వరిని దుష్టభావముతో చూడరాదు. కట్లతో గాని, మట్టితో గాని, తాతితో గానీ విష్ణువునకు ఆలయము కట్టించినవాడు సమస్తపాపనిర్ముక్తు డగును. ప్రతిదినము యజ్ఞములు చేసి భగవదారాధన చేయువానికి లభించు ఫలమే విష్ణ్వాలయము నిర్మించినవానికి గూడ కలుగును. విష్ణ్వాలయము కట్టించినవాడు తన వంశము నందలి వెనుకటి నూరుగురిని, రాబోవు నూరుగురిని విష్ణులోకమునకు పంపును. మహావిష్ణువు సప్తలోకమయుడు. ఆట్టి విష్ణుమూర్తికి ఆలయము కట్టించువాడు తన వంశమును తరింపచేయును. తన వంశీయులకు అక్షయపుణ్యలోక ప్రాప్తి కలుగునట్లు చేయును. తాను కూడ అక్షయలోకములను పొందును. దేవాలయములోని ఇటుకల కట్టుబడి ఎన్ని సంవత్సరము లుండునో అన్ని వేల సంవత్సరములపాటు ఆ దేవాలయ నిర్మాత స్వర్గలోకములో నుండును. భగవత్పతిమ నిర్మించినవాడు విష్ణులోకము చేరును. దానిని స్థాపించినవాడు భగవంతునిలో లీనమగును. దేవాలయము నిర్మించు దానిలో ప్రతి మాస్థాపన చేసినవాడు సర్వదా విష్ణుకోకములో నివసించును”.

అగ్నిదేవుడు పలికేను : యమధర్మరాజు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారము, యమదూతలు విష్ణుస్థాపనాదిపుణ్య కార్యములు చేసినవారిని యమలోకమునకు తీసికొనివెళ్ళరు. దేవాలయాదిప్రతిష్టాదివిధానమును గూర్చి హయగ్రీవుడు బ్రహ్మతో వర్ణించి చెప్పెను.

అగ్ని మహాపురాణము నందలి దేవాలయనిర్మాణమాహాత్మ్యాదివర్ణన మను ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.