అగ్ని మహా పురాణము

148 - అథ సంగ్రామవిజయపూజాః.

ఈశ్వర ఉవాచః-

 ఓం డే ఖ ఖ్యాం సూర్యాయ సంగ్రామవిజయాయ నమః హ్రాం హ్రీం హ్రూం హేం హోం హ్రః షడజ్ఞాని తు సూర్యస్య సంగ్రామే జయస్య పా ఓం హం ఖం ఖథోలాయ స్వాహా స్ఫూం హుం హుం క్రూం ఓం హోంకేం ప్రభూతం విమలం సారమారాధ్యం పరమం సుఖమ్.

ధర్మజ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యాద్యష్టకం యజేత్

ఆనన్హాసనం సింహాసనం పద్మాసనమత  పరమ్.

కర్ణికా కేసరాజ్యేన సూర్యసోమాగ్ని మట్టిలమ్

దీప్తా సూక్ష్మా జయా భద్రా విభూతిర్విమలా తథా.

అమోమా వైద్యుల పూజ్యా నవమీ సర్వతోముఖీ

సత్వం రజస్తమనైన ప్రకృతిం పురుషం తథా.

ఆత్మానం దాన్తరాత్మానం పరమాత్మానమర్చయేత్

సర్వే బిన్దుసమాయుక్తా మాయానిలసమన్వితాః.

ఉషాప్రధాచసన్యా చ సాయా మాయా బలాన్వితా

బిన్దువిష్ణుసమాయుక్తా ద్వారపాలా స్తథాష్టకమ్.

సూర్యం చణ్ణం ప్రచణ్ణం చ పూజయద్దనకాదిభిః

పూజయా జపహోమాద్యైర్యుద్ధాదౌ విజయో భవేత్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే యుద్ధజయార్ణవే సంగ్రామవిజయపూజానామాష్ట

చత్వారింశదధికశతతమోఽధ్యాయః

పరమేశ్వరుడు పలికేను:- ఓం డే ఐ ఖ్యాం సూర్యాయ సంగ్రామ విజయాయనమః-ఇది మంత్రము. హ్రం హ్రీం హ్రః ఇవి సంగ్రామమునందు విజయము నిచ్చు సూర్యుని ఆరు అంగములు. ఓం హం ఖం బఖోలాయ స్వాహా ఇది పూజామంత్రము. స్ఫూం హ్రూం హుం క్రూం ఓం హ్రాం కేం ఇవి ఆంగన్యాస బీజమంత్రములు. పీఠస్థానమున ప్రభూత. విమలసార ఆరాధ్య పరమసుఖములను పూజించవలెను. పీఠపాదములందును, మధ్యనున్న నాల్గుదిక్కులందును వరుసగా ధర్మ-జ్ఞాన-వైరాగ్య ఐశ్వర్య-అధర్మ.అజ్ఞాన-అవే రాగ్య-ఆనైశ్వర్యములను పూజించవలెను. పిదప అనంలాసవ-సింహా సన-పద్మాసనములను పూజించి కమలకర్ణిక ను, కేసరములను, అచ్చటనే సూర్యమండల సోమమండల వహ్నిమండలములను ఆర్చించి, దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, విమల, ఆమోమ, విద్యుత, సర్వతోముఖీ అను నవశక్తులను పూజించ వలెను. పిదప సత్త్వరజస్-తమస్సులను, ప్రకృతి పురుషులను, ఆత్మాంతరాత్మ పరమాత్మలను పూజించవలెను. ఆద్య క్షరమును అనుస్వారయుక్తము చేసి అంతమున నమః చేర్చి చతుర్థ్యంతము చేయగా పూజామంత్రము లగును. (ఉదా. సం సత్త్వాయ నమః మొ.) ఉష, ప్రథ, సంధ్య, సాయా, మాయా, ఐల, బిందు, విష్ణువులను, ఎనమండుగురు ద్వారపాలులను పూజించి, గంధాదులతో సూర్య-చండ-ప్రచండులను పూజించవలెను. ఈ విధముగ పూజా-జపహోమాదులు చేయుటచే యుద్దాదులందు జయము కలుగును.

అగ్నిమహాపురాణమునందు సంగ్రామ విజయదాయక సూర్యపూజావర్ణన మను నూటనలుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.