అగ్ని మహా పురాణము

198 - అథ మాసవ్రతాని

అగ్ని రువాచః-

మాసవ్రతకమాఖ్యా స్యే భుక్తిముక్తి ప్రదాయకమ్

ఆషాఢాదిచతుర్మాసమభ్యజ్గం వర్జయేత్సుధీః. 

వైశాఖే పుష్పలవణం త్యక్త్వా గోదో నృపో భవేత్

గోదో మాసోపవాసీ చ భీమవతకరో హరిః.

ఆషాడాదిచతుర్మాసం ప్రాతః స్నాయీ చ విష్ణుగః

మా మే మాస్యథ చైత్రే వా గుడధేను ప్రదో భవేత్.

గుడవత స్రృతీయాయాం గౌరీశః స్యాన్మహావతి

మార్గశీర్షాదిమా సేపు నక్తకృద్విప్రలోక భాక్ .

ఏకభక్తవతీ తద్వద్ద్వాదశీవ్రతకం పృథక్

ఫలవతీ చతుర్మాసం ఫలం త్యక్త్వా ప్రదీపయేత్.

కావణాది చతుర్మాసం ప్రతై కి సర్వం లభేద్ర్వతీ

ఆషాఢస్య సితే పక్షే హ్యేకాదశ్యాముపోషితః.

చాతుర్మాస్యవ్రతానాం తు కుర్వీత పరికల్పనమ్

ఆషాఢ్యం చాథ సంక్రాస్తో కర్కటస్య హరిం యజేల్.

ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురత స్తవ

నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసన్నే త్వయి కేశవ.

గృహీతేస్మిన్ వ్రతే దేవ యద్యపూర్ణే మ్రియేహ్యహమ్

తన్మే భవతు సంపూర్ణం త్యత్ప్రసాదాజ్ఞనార్ధన.

ఆగ్నిదేవుడు పలికెను : నే నిపుడు భుక్తిముక్తి ప్రదము లగు మాసవ్రతములను గూర్చి చెప్పెదను. ఆషాడాది మాసచతుష్టయమునందు అథ్యంగస్నానము చేయరాదు. దీనివలన ఉత్తమబుద్దిమంతు డగును. వైశాఖమున పుష్పములను లవణమును త్యజించి గోదానము చేయువాడు రాజ్యమును పొందును. ఒక మాసము ఉపవాస ముండి గోదానము చేయువాడు ఈ భీమవ్రతప్రభావముచే విష్ణుసాయుజ్యము పొందును. ఆషాఢాదిమాసచతుష్టయమునందు నియమపూర్వకముగా ప్రాత స్నానము చేయువాడు విష్ణులోకము చేరును. మాఘతృతీయడందు లేదా చైతతృతీయయందు గుడ ధేనుదానము చేయుటకు గుడ వ్రత మని పేరు. ఈ మహావ్రతమాచరించువాడు శివస్వరూపుడగును. మార్గశీరాదిమాసములందు నక్త వతమాచరించు వాడు విష్ణులోకమునకు అర్హు డగును. ఏక భుక్త వ్రత మాచరించువాడు ఆ విఢముగ నే వేరుగా ద్వాదశీవ్రతపాలనము కూడ చేయవలెను. ఫలవ్రతము చేయువాడు చాతుర్మాస్యమున ఫలములు పరిత్యజించి వాటిని దానము చేయవలెను. శ్రావణము మొదలు మాసచతుష్టయమునందు వ్రతముల నాచరించుటచే సర్వమును పొందును. చాతుర్మాస్య వ్రతము ఈ విధముగ ఆచరించ వలెను ఆషాఢశుక్లైకాదశినాడు ఉపవాస ముండవలెను. ఆషాఢమున వచ్చు కర్కటసంకాంతియందు శ్రీమహావిష్ణువును పూజించవలెను. “దేవా! నేను నీ ఎదుట ఈ వ్రతము అవలంబించినాను. కేశవా ! నీ యనుగ్రహముచే ఇది నిర్విము ముగ సిద్దించుగాక. దేవాధిదేవా! జనార్ధనా! ఈ వ్రతము ప్రారంభించిన తరువాత ఇదిపూర్తి కాకుండగనే నేను మరణించినచో, నీ కృపచే ఇది పరిపూర్ణ మగుగాక!” అని ప్రార్థించవలెను.

మాంసాది త్యక్త్వా విప్రః స్యాత్తైలత్యాగీ హరిం యజేత్

 ఏకా న్తరోపవాసీ చ త్రిరాత్రం విష్ణులోక భాక్.

చాన్గాయణీ విష్ణులో కే మౌనీ స్యాన్ము కి భాజనమ్

ప్రాజాపత్యవతీ స్వర్డీ సక్తుయావక భక్షకః.

దుర్గాద్యాహారవాన్స వర్గీ పళ్చాగవ్యామ్బులుక్ తథా

కమూలఫలాహారీ నరో విష్ణుపురీం వ్రజేత్.

మాంసవర్జీ యవాహారో రసవర్జీ హరిం వ్రజేత్

కౌముదవ్రతమాఖ్యా స్యే ఆశ్వినే సముపోషితః.

ద్వాదశ్యాం పూజయేద్విష్ణుం ప్రతిప్యాజ్జోత్పలాదిభిః

ఘృతేన తిలతై లేన దీపనై వేద్యమర్పయేత్.

ఓం నమో వాసుదేవాయ మాలత్యా మాలయా యజేత్

ధర్మకామార్థ మోక్షాంశ్చ ప్రాప్నుయాత్కాముదవ్రతీ.

సర్వం లభేద్ధరిం ప్రార్చ్య మాసోపవాసక వ్రతీ

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే మాసవ్రతాని నామ అష్టనవత్యధిక శతత మోధ్యాయః.

వ్రత మాచరించు ద్వీజుడు మాంసాదులను, తైలమును పర్జించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. రోజు విడచి రోజు ఉపవాస ముండుచు తిరాతవత మాచరించువాడు విష్ణులోకము పొందును. చాంద్రాయణము చేయువాడు విష్ణు లోకమును చేరును. మౌనవతము పాటించువాడు మోక్షమునకు అధికారి యగును. ప్రాజాపత్యవతమాచరించువాడు స్వర్గము. పొందును. సత్తువులను, యవలను, తినుచు క్షీరాదులు సేవించుచు, లేదా పంచగవ్యములను, జలములను గహించుచు కృచవతము చేయువాడు స్వర్గము చేరును. శాక-మూల-ఫలాహారము మాత్రము భుజించుచు కృచ వ్రతము చేయువాడు వైకుంఠము చేరును. మాంస - రసములను పరిత్యజించి యవలు మాత్రము భుజించువాడు శ్రీమహావిష్ణసాంనిధ్యము. పొందును. ఇపుడు కౌముదవతమును గూర్చి చెప్పేదను. ఆశ్వయుజ శుక్ల ఏకాదశినాడు ఉపవాసముండి, ద్వాదశినాడు, శ్రీమహావిష్ణువు అవయవములకు చందనాదులు పూసి, ఉత్పలాదులతో పూజించవలెను. పిదప తైలదీపము సమర్పించి మృతపక్వాన్నము నైవేద్యము చేయవలెను. శ్రీమహావిష్ణువునకు మాలతీపుష్పముల కూడ సమర్పించవలెను. “ఓం నమో వాసుదేవాయ” అను మంత్ర ముచ్చరించుచు వ్రతసమాప్తి చేయవలెను. ఈ విధముగ కౌముద వ్రతము చేయువాడు ధర్మార్థ కామమోక్షములను స్వాధీనము చేసికొనును. మాసోపవాసవ్రతము చేయువాడు శ్రీమహావిష్ణువును పూజించి సర్వమును పొందగలడు.

అగ్ని మహాపురాణమునందు మాసవ్రతవర్ణనమను నూటతొంబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.