పుష్కర ఉవాచః
విశ న్తియేన మార్గేణ వాయసా బహవఃపురమ్।
తేన మార్గేణ రుద్దస్య పురస్యగ్రహణం భవేత్.
సేనాయాం యదివాసార్థేనివిష్టో వాయసోరుదన్ ।
వామోభయాతురస్త్రస్తో భయం వహతిదుస్తరమ్.
ఛాయాఙ్గ వాహనోపానచ్చత్ర వస్త్రాది కుట్టనే ।
మృత్యు స్తత్పూజనే పూజా తదిష్టకరణే శుభమ్.
ప్రోషితాగమకృత్కాకః కుర్వన్ద్వారిగతాగతమ్।
రక్తం దగ్ధం గృహేద్రవ్యం క్షిపన్వహ్ని నివేదకః.
పుష్కరుడు చెప్పెను. శత్రు నగరములోనికి చాల కాకులు ఏ మార్గము ద్వారా ప్రవేశించునో ఆ మార్గము నుండి చుట్టుముట్టినచో ఆనగరము తనవశమగును. ఏదైన సేవకు, లేదా సముదాయమునకు ఎడమ పక్కనుండి భయభీతమగు కాకి ఏడ్చుచు ప్రవేశించినచో అది రాబోవు థయమునకు సూచకము. శామియానా, అవయవములు, వాహనములు, పాదుకలు, ఛత్రము, వస్త్రము మొదలగు వాటిచే కాకి నలగకొట్టబడినచో ఆది తనకు మృత్యు సూచకము. దానిని పూజించినచో తనకు కూడ పూజ లభించును. అన్నా దులచే దానికి ఇష్టము చేకూర్చినచో తనకు గూడ ఇష్టము చేకూరును. కాకి మాటిమాటికి ఇంటి ద్వారము వద్దకు వచ్చుచు పోవుచు ఉన్నచో అది ఎవరో పరదేశీయుడు వచ్చుటకు సూచకము. ఆది ఏదైన ఎఱ్ఱని వస్తువును గానీ, కాలిన వస్తువును గాని ఇంటి మీద పెట్టినచో అది గృహదహనమునకు సూచకము.
న్య సేద్రక్తం పురస్తాచ్చ నివేదయతిబంధనమ్।
పీతం ద్రవ్యం తథారుక్మరూప్యమేవతు భార్గవ.
యచ్చైవోపనయేద్ద్రవ్యం తస్యలబ్ధం వినిర్ధిశేత్ ।
ద్రవ్యం వాపనయేద్యత్తుతస్యహానిం వినిర్దిశేత్.
పురతో ధనలబ్దిః స్యాదామాంసస్యచ్ఛర్దనే ।
భూలబ్దిః స్యాన్మృదః క్షేపేరాజ్యం రత్నార్పణేమహత్.
యాతుః కాకోఽనుకూలస్తు క్షేమః కర్మక్షమోభవేత్ ।
నత్వర్థసాధకోజ్ఞేయః ప్రతికూలో భయావహః.
సమ్ము ఖేఽభ్యేతి విరుదన్యాత్రా ఘాతక రోభవేత్।
వామః కాకః స్మృతోధన్యో దక్షిణోఽర్థవినాశకృత్.
వామోఽనులోమగః శ్రేష్ఠో మధ్యమోదక్షిణః స్మృతః ।
ప్రతిలోమ గతిర్వామో గమన ప్రతిషేధకృత్.
నివేదయతి యాత్రార్థ మభిప్రేతం గృహేగతః ।
ఏకాక్షి చరణ స్వరం వీక్షమాణో భయావహః
కోటరే, వసూనశ్చ, మహానర్థకరోభవేత్ ।
నశుభస్తూషరే కాకః పంకాంకః సతుశస్యతే.
ఆమేధ్యపూర్ణవదనః కాకః సర్వార్థసాధకః ।
జ్ఞేయాః పత త్త్రిణోఽన్యేవికాక వద్భృగునన్దన.
భృగునందనా ! కాకి మనుష్యుని ఎదుట ఏదైన ఎఱ్ఱని వస్తువుపడ వేసినచో ఆతనికి కైదు శిక్ష వచ్చునని సూచింపబడును. పచ్చని రంగు గల వస్తువును పడ వేసినచో బంగారము, వెండి లభించునని సూచన. ఏ వస్తువును తన వద్దకు తెచ్చి విడచునో అది లభించును. దేనిని తన దగ్గర నుండి తీసికొని పోవునో ఆది నష్టమగును. పచ్చి మాంసము తీసికొనివచ్చి ఎదుట పడవేసినచో ధనము, మట్టి పడ వేసినచో భూమి, రత్నమును పడవేసినచో మహాసామ్రాజ్యము లభించును. యాత్ర చేయువానికి అనుకూల దిశయందు కాకి వెళ్ళినచో అది కల్యాజకరము, కార్యసాధకము. ప్రతికూల దిశయందు వెళ్ళినచో అది కార్యవిఘాతకము; భయంకరము. కాకి ‘కావ్ కావ్' అనుచు ఎదుటికి వచ్చినచో యాత్రాభంగము కలుగును. కాకి ఎడమవైపున ఉన్న చో శుభము, కుడివైపున ఉన్న చో అశుభము. వామభాగమున దుండి అనుకూలమైన దిక్కు వైపు ఎగిరినచో శ్రేష్టము, కుడిప్రక్కన ఉండి అనుకూలమగు దిక్కు వైపు ఎగిరినచో మధ్యమ ఫలము. వామ భాగమునందుండి ప్రతికూలమగు దిక్కువైపు వెళ్ళినచో అది యాత్రను నిషేధించుచున్నది. యాత్రాకాలమున కాకి వచ్చి ఇంటిపై వాలినచో ఆది ఆభీష్టసిద్ధి సూచకము. ఒక కాలు ఎత్తి, ఒక కంటితో సూర్యునివై పు చూచినచో భయము కలుగును. ఏదై న చెట్టు తొజ్జలో కూర్చుండి అరచినచో గొప్ప ఆనర్థము కలుగును. ఊషర భూమి మీద కూర్చున్నచో అశుభము. కాని దానికి బురద అంటు కొన్నచో మంచిది. మలము మొదలగు అపవిత్ర వస్తువులను ముక్కున పెట్టుకొని కాకి కనబడినచో అన్ని కార్యములు సాధింపబడును. ఇగరపక్షలకు గూడ కాకికి వలెనే ఫలితము తెలియవలెను.
స్కన్దావారాపసవ్యస్థాః శ్వానో విప్రవినాశకాః।
ఇంద్రస్థానే నరేంద్రస్య పురేశ స్యతు గోపురే.
ఆంతర్గృహే గృహేశస్య మరణాయ భవేద్భషన్ ।
యస్య జిఘ్రతి వామాంగం తస్య స్యాదర్థ సిద్దయే.
భయాయదక్షిణం చాఙ్గం తథా భుజమదక్షిణమ్ ।
యాత్రాఘాతకరో యాతుర్బవేత్ప్రతి ముఖాగతః.
మార్గావరోధకోమార్గే చౌరాన్వదతి భార్గవ ।
అలాభోఽస్థిముఖః పాపో రజ్జుక్షీర ముఖ స్తథా.
సోపానత్కముథో ధన్యో మాంసపూర్ణముఖోఽపిచ ।
అమంగల్యముఖద్రవ్యం కేశం చై వాశుభం తథా.
అవమూత్య్రాగ్రతో యాతి యస్య తస్య భయం భవేత్ ।
యస్యావమూత్య్ర వ్రజతిశుభం దేశం తథాధ్రువమ్.
మంగల్యంచ తథాద్రవ్యం తస్యస్యాదర్థసిద్ధయే ।
శ్వవచ్చ రామ విజ్ఞేయా స్తథావై జంబుకాదయః.
సేవానివేశమునకు దక్షిణమున కుక్కలు వచ్చినచో ఆది బ్రాహ్మణ వినాశ సూచకము. ఇంద్రధ్వజస్థానమునకు వచ్చినచో రాజునకును, నగరద్వారమునకు వచ్చినచో నగరాధీశునకును మృత్యువు కలుగును. కుక్కమొరుగుచు ఇంటిలోనికి చొరబడినచో గృహస్వామికి మృత్యువుకలుగును. కుక్క ఎవరిని ఎడమ అవయవములను నాకునో వానికి కార్యసిద్ధి కలుగును. కుడి అవయవములను ఎడమభుజమును వాసన చూచినచో భయము వచ్చును. యాత్రకు వెళ్ళు వానికి ఎదురుగా వచ్చినచో యాత్రావిమ్నము కలుగును. భృగునందనా! కుక్క దారికి అడ్డముగా నిలబడినచో మార్గమున చోరభయము సూచితము. ముఖమునందు ఎముకను గ్రహించి కనబడినచో యాత్రచేయువానికి లాభమేదియక లగదు. త్రాడు చింపిరిగుడ్డ ముఖమునందు పెట్టుకొనియున్న కుక్కకూడ అశుభ సూచకము. చెప్పుకాని, మాంసముకాని నోటిలో కరచికొని ఎదురైనచో శుభము కలుగును. దానినోటిలో ఏదైన అమాంగలికమగు వస్తువుగాని, కేశముగాని ఉన్నచో ఆశుభ సూచకము. కుక్క ఎవని ఎదుట మూత్రము విడచి పోవునో వానికి భయము వచ్చును. మూత్రత్యాగానంతరము కుక్క ఏదై న శుభ స్థానమునకుగాని, శుభకరమగు వృక్షము వద్దకుగాని శుభకరమగు వస్తువు దగ్గరకుగాని వెళ్ళినచో కార్యమ సిద్ధించును. పరశురామా! గ్రద్దమొదలగువాటి విషయముగూడ కుత్తవిషయమునందు వలెనే గ్రహించవలెను.
భయాయ స్వామినోజ్ఞేయమనిమిత్తం రుతం గవామ్ ।
నిశిచౌర భయాయస్యాద్వికృతం మృత్యవేతథా.
శివాయ స్వామినో రాత్రౌ బలీ వర్దోనదన్భవేత్ ।
ఉత్సృష్టవృషభో రాజ్ఞో విజయం సంప్రయచ్ఛతి.
అభయం భక్షయ న్త్యశ్చ గావో దత్తా స్తథాస్వకాః ।
త్యక్త స్నేహాః స్వవత్సేషు గర్భక్షయక రామతాః.
భూమిం పాదైర్వినిఘ్నన్త్యో దీనా భీతా భయావహః ।
ఆర్ద్రాంగ్యో హృష్ట రోమాశ్చ శృంగలగ్న మృదః శుభాః.
మహిష్యాదిషు చాప్యేతత్సర్వంవాచ్యం విజానతా ।
గోవులు అకారణముగా త్రేన్చుట ప్రారంభీంచినచో స్వామికభయము కలుగును. అది రాత్రి అరిచినచో చోర భయము వికృత స్వరూపస్వరముతో అరచినచో మృత్యుభయము. వృషభము రాత్రి గర్జించినచో స్వామికి కల్యాణనుగును. అబోతు రం కెలు వేసినచో రోజుకు విజయము లభించును. తాను ఇచ్చిన గోవులుగాని, తన ఇంటిలో నున్న గోవులుగాని అభక్ష్య భక్షణము చేసినచో లేదా తమ దూతల పై ప్రేమచూపకున్న చో అది గర్భస్రావసూచకము, పాదములతో నేలనుగియుగోవులు దీనము భయభీతములు అయిన గోవులును భయమును కలిగించును. తడిసిన శరీరముగలవి, ఆనందము చేవికసించిన రోషములు గలవి, కొమ్ములకుమట్టి అంటుకొన్నవి అయిన గోవులు శుభసూచకములు. బుద్ధిమంతులు గేదే మొదలగువాటి విషయమున గూడ ఈ విధముగనే శకునములు చెప్పవలెను.
ఆరోహణం తథాఽన్యేన సపర్యాణస్య వాజినః.
జలోపవేశ నం నేష్టం భూమౌచ పరివర్తనమ్ ।
విపత్కరం తురంగస్య సుప్తంవాప్య నిమిత్తతః.
యవ మోదక యోర్ద్వేష స్త్వకస్మాచ్చ నశస్యతే ।
వదనాద్రుధిరోత్పత్తిర్వేపనం నచశస్యతే.
క్రీడన్బకైః కపోతైశ్చ సారికాభిర్మృతిం వదేత్ ।
సాశ్రునేత్రో జిహ్వయాచ పాదలేహీ వినష్టయే.
వామపాదేన చ తథా విలిఖంశ్చ పసుంధరామ్ ।
స్వపేద్వా వామ పార్శ్వేన దివావా నశుభప్రదః.
భయాయస్యాత్సకృన్మూతీ తథానిద్రావిలానసః ।
ఆరోహణం నచేద్దద్యాత్ప్రతీపం వా గృహం వ్రజేత్.
యాతావిఘాతమాచష్టే వామపార్శ్వం తథాస్పృశన్ ।
హేషమాణః శత్రుయోధం పాదస్పర్శ జయావహః.
జను వేసిన తనగుఱ్ఱముపై ఇతరులు ఎక్కుట ఆ గుఱ్ఱము నీటిలో కూర్చుండిపోవుట, ఒకేచోట గుండ్రముగా తిరుగుట ఇవి అనిష్టసూచకములు. ఏకారణము లేకుండ గుఱ్ఱము నిద్రపోవుట ఆపదను కలిగించును. యవల పైనను బెల్లము పైనను గుఱ్ఱమునకు అరుచికలిగినను, దాని ముఖమునుండి రక్తము కారుచున్నను, దాని శరీరమంతయువణకుచున్నను ఇవి ఆశుభసూచకములగు దుర్లక్షణములు. గుఱ్ఱము కొంగలతోను, పావురములతోను సారికలతోను ఆటలు ప్రారంభించి నచో అది మృత్యుసూచకము. దాని నేత్రమునుండి కన్నీళ్లకారినను అని నాలుకతో పాదమునాకికొనిను వినాశ సూచకము. అది ఎడమ డెక్కతో నేల త్రవ్వినను, ఎడమ పక్క పండుకొనినను, పగలు నిద్రించినను శుభకరము కాదు. ఒకమాటు కొంచెము మూత్రము విడచునది, నిద్రచేమలినముఖముకలది అగు గుఱ్ఱము భయమునుసూచించును. గుఱ్ఱము తన పైకి ఎక్కనీయకున్నను ఎక్కునపుడు వెనుకకు తిరిగి ఇంటిలోనికి వెళ్ళిపోయినను, సవాచేయువాని ఎడమ పార్శ్వమునందలి ఎముకలుస్పృశించినను యాత్రలో విఘ్నము కలుగును. శత్రుయోధులను చూచి సకిలించినను తన యజమాని పాదములను స్పృశించినను విజయము లభించును.
గ్రామే వ్రజతి నాగ శ్చేన్మైథునం దేశహాథ వేత్।
ప్రసూతా నాగవనితా మత్తా చాంతాయ భూపతేః.
ఆరోహణం స చేద్దద్యాత్ప్రతీపం వా గృహం వ్రజేత్ ।
మదం వా వారణే జహ్యా ద్రాజ ఘాతకరో భవేత్.
వామం దక్షిణ పాదేన పాడమాక్రమతే శుభః ।
దక్షిణంచ తథా దన్తం పరిమార్ష్టిక రేణచ.
ఏనుగ గ్రామములో మైథునము చేసినచో అది దేశోపద్రవకారకమం. ఆడ ఏనుగ గ్రామములో ఈనినను, పిచ్చిదైనను రాజ వినాశ సూచకము. ఏనుగ తన పై ఎక్కనీయకున్నను, హస్తిశాల లోనికి వెళ్ళిపోయినను, మదధార సవించినను రాజుకు మరణము కలుగును. కుడిపాదము ఎడమకాలిపై ఉంచి, తుండముతో దంతములను తుడిచినచో ఆది శుభకరము.
వృషోఽశ్వః కుంజరోవాపి, రిపు సైన్యగతోఽశుభః ।
ఖండమేఘాతి వృష్ట్య తు సేనానాశ మవాప్నుయాత్.
ప్రతికూలగ్రహర్షాత్తు తథా సమ్ముఖ మారుతాత్ ।
యాత్రాకాలే రణేవాపి ఛత్రాది పతనం భయమ్.
హృష్టానరాశ్చానులోమా గ్రహా వై జయలక్షణమ్ ।
కాకైర్యోధాభిభవనం క్రవ్యాద్భిర్మండలక్షయః ।
ప్రాచీపశ్చిమకై శానీ సౌమ్యా ప్రేష్ఠా శుభాచదిక్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శకున నిరూపణం నామ ద్వాత్రింశదధిక ద్విశతతమోఽధ్యాయః.
తన వృషభము గాని, గుఱ్ఱము గాని, ఏనుగ గాని శత్రు సైన్యములోనికి వెళ్ళిపోయినచో అశుభము కలుగును - కొద్ది దూరమునందే మేఘము అంతటను వ్యాపించి పెద్ద వర్షము కురిసినచో సేన నశించును. యాత్రా సమయమునందు గాని, యుద్ధ సమయము నందు గాని, గ్రహనక్షత్రములు ప్రతికూలమైనను, గాలి ఎదురుగా వీచినను, ఛత్రాదులు విరిగి పడి పోయినను, భయము కలుగును. యుద్ధము చేయు హారోత్సాహభరితులై, గ్రహములు కూడ ఆనుకూలముగా నున్నచో విజయము కలుగును. కాకులు, మాంసాహార జంతువులును యోధులను తిరస్కరించినచో మండలము నశించును. పూర్వపశ్చిమ - ఈశాన్య దిక్కులు ప్రసన్నములై శాంతములుగా ఉన్నచో ప్రియము, శుభము అగు ఫలము లభించును.
అగ్ని మహాపురాణమునందు శకునవర్ణన మను రెండువందల ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 232 of the Agni Purāṇa is as follows:
The science of prāṇāyāma is presented as a prerequisite for higher stages of meditation. Agni describes the three fundamental operations — pūraka (inhalation), kumbhaka (retention), and recaka (exhalation) — and their ratios for different levels of practice. The purification of the seventy-two thousand nāḍīs through sustained prāṇāyāma practice is described, with particular emphasis on Iḍā (lunar), Piṅgalā (solar), and Suṣumnā (central). The chapter declares that twelve years of prāṇāyāma practice grant complete mastery over prāṇa.