అగ్ని మహా పురాణము

70 - అథ వృక్షాది ప్రతిషాకథనమ్

శ్రీ భగవానువాచః

ప్రతిష్ఠాం పాదపానాం చ వక్ష్యేహం భుక్తి ముక్తిదామ్

సర్వౌషధ్యుదకైర్లిపాన్ పిష్టాతకవిభూషితాన్.

వృక్షాన్మాలైనిరలంకృత్య వాసోభిర బ్రివేష్టయేత్

సూచ్యాసౌవర్ణయా కార్యం సర్వేషాం కర్ణ వేధనమ్

హేమశలాకయాజ్జనం చ వేద్యాం తు ఫలస ప్రకమ్

అధివాసయేచ్చ ప్రత్యేకం ఘటాన్బలిని వేదనమ్.

ఇన్గాదేర ధివాసోఽథ హోమః కార్యో వనస్పతేః

వృక్షమధ్యాదుత్సృజేద్దాం తతో భి షేక మ స్తోతః.

ఋగ్యజుఃసామమనైశ్చ వారుజైర్మజలారవై

వృక్ష వేదిక కుమైశ్చ స్నపనం ద్విజపుణ్ణవాః.

తరూణాం యజమానస్య కుర్యుశ్చ యజమానకః

భూషితో దక్షిణాం దద్యాధోభూభూషణవస్త్రకమ్.

క్షీ రేణ భోజనం దద్యాద్యావద్దినచతుష్టయమ్

హోమ స్త్రీలాద్యైః కార్యస్తు పలాశ సమిధే స్తథా..

ఆచార్యే ద్విగుణం దద్యాత్పూర్వవన్మణ్ణపాదికమ్

పాపనాశః పరా సిద్దిర్వృక్షారామప్రతిష్ణయా.

స్కన్దాయేశో యథా ప్రాహ ప్రతిష్ఠాద్యం తథా శృణు

సూర్యేశ గణశాక్త్యాదేః పరివార స్య వై హరేః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే పాదపారామప్రతిష్టాక థనం నామ సప్తతిత మోధ్యాయః.

శ్రీ భగవంతుడు చెప్పెను : ఇపుడు భోగ మోక్షము నిచ్చు వృక్ష ప్రతిష్ఠనుగూర్చి చెప్పెను. వృక్షముకు సర్వౌషధిజలములు పూసి, సుగంధచూర్ణము చల్లి , చూలలచే ఆలంక రించి. వస్త్రములు చుట్టబెట్టవలెను. అన్ని వృక్షములకు బంగారు సూదులతో కర్ణవేధనము చేసి, సువర్ణమయ శలాక తో ఆంజన ముంచవలెను. వేదిక పై ఏడు ఫలము లుంచి, ఒక్కొక్క వృక్షమునకు అధివాసనము చేసి, కుంభము సమర్పించ వలెను. పిదప ఇంద్రాది దిక్పాలకుల నుద్దేశించి బలిప్రదా నము చేయవలెను. వృషాధివాసన సమయమున, ఋగ్వేదమంత్రములతోగాని, యజుర్వేదమంత్రములతో గాని, సామవేద మంత్రములతోగాని, వరుణ దేవతాక మంత్రములతో గాని, మత్తభైరవమంత్రములతో గాని హోమము చేయవలెను. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వృక్షవేదిక పై నున్న కలశలతో వృక్షములకును, యజమానునకును స్నానము చేయించవలెను. యజమానుడు ఆలంకరించుకొని బ్రాహ్మణులకు గో భూ-భూషణవస్తాదులు దక్షిణగా ఇచ్చి నాలుగు దివసములు క్షీరయుక్త భోజనము పెట్టవలెను. తిల.మృత-పలాశ సమిధలతో హోమము చేయించవలేను. ఆచార్యునకు రెట్టింపు దక్షిణ ఇవ్వవలెను. మండపాడి నిర్మాణము వెనుక చెప్పిన విధముననే చేయవలెను. వృక్ష-ఉద్యానముల ప్రతిష్ఠ చేయుటచే పాపములు నశించి పరమసిద్ది లభించును, ఇపుడు సూర్య-శివ-గణపతి-శక్తి -శ్రీహరి పరివారముల ప్రతిష్టా విధానమును వినుము. దీనిని మహేశ్వరుడు కుమారస్వామికి చెప్పెను.

అగ్ని మహాపురాణమునందు పాదపారామప్రతిష్ఠావిధాన కథన మను డెబ్బదవ అధ్యాయము సమాప్తము.