అగ్ని మహా పురాణము

285 - అథ మృతసంజీవనకర సిద్ధయోగః

ధన్వంతరి రువాచః

సిద్ధయోగాన్పు నర్వక్ష్యే మృతసంజీవనీ కరాన్

ఆత్రేయ భాషితాన్దివ్యా న్సర్వవ్యాధి విమర్దనాన్.   

ఆత్రేయ ఉవాచః

బిల్వాని పంచమూలస్య క్వాథః స్యాద్వాతి కే జ్వరే

 పావనం పిప్పలీమూలం గుడూచీ విశ్వజోఽథవా.

 ఆమలక్య భయాకృష్ణా వహ్నిః సర్వజ్వరాన్తకః

 బిల్వాగ్ని మంథశ్యోనాక కాశ్మర్యః పాటలా స్థిరా.

త్రికంఠకం, పృశ్ని పర్ణీ బృహతీకృష్ణకారకాః

జ్వరావిపాక పార్శ్వార్తి కాశను త్కుశ మూలకమ్.

గుడూచీ పర్పటీ ము స్తం కిరాతం విశ్వ భేషజమ్

వాతపిత్త జ్వరే దేయం పంచభద్ర మిదం స్మృతమ్.

త్రివృద్వి శాలాకటుకా త్రిఫలాల గ్వధైః కృత

సంస్కారో భేదనః, క్వాథ పేయః సర్వజ్వరాపహః.

దేవదారు బలా వాసాత్రిఫలావ్యోష పద్మ కైః

సవిడంగైః సితాతుల్యం తచ్చూర్ణం పంచకాసజిత్.

దశ మూలీశటీ రాస్నా పిప్పలీ బిల్వపౌష్క రైః

శ్రూంగీ తామలకీ భాంగీ గుడూచీ నాగవల్లిభిః.

య వాగూం విధినా సిద్ధం కషాయం వా పిబేన్నరః

కాసా హృద్గృహణీ పార్శ్వ హిక్కా శ్వాస ప్రశాంతయే.

మధుకం మధునా యు క్తం పిప్పలీం శర్కరాన్వితమ్

నాగరంగుడ సంయుక్తం హక్కామ్నం లవణ త్రయమ్.

కారవ్య జాజీమంచం ద్రాక్షా వృక్షామ్ల దాడిమమ్

సౌవర్చలం గుడం క్షౌద్రం సర్వారోచన నాశనమ్.

శృంగ వేర రసం చైవ మధునాసహ పాయయేత్

 అరుచి శ్వాసకాసఘ్నం ప్రతిళ్యాయక ఫానకమ్.  

ధన్వంతరి చెప్పెను. ఆత్రేయుడు చెప్పి నవియు, దివ్యములును సర్వవ్యాధి నివారకములును మృత సంజీవనకర ములును యగు సిద్ద యోగములను మరల చెప్పేదను ఆత్రేయుడు చెప్పేను. వాత జ్వర మన బిల్వాది పంచమూల క్వాథము శ్రేష్ఠము. జీర్ణ శక్తికి పిప్పలి మూల గుడూచి కంఠీ క్వాథము ఇవ్వవలేను. ఆమలక అభయా కృష్ణ చిత్రక క్వాథము సర్వ జ్వర నాశకము. బిల్వమూల అగ్ని మంథశ్యానాక, కాశ్మరులం పాటలా, స్థిర, త్రికంటక, పృష్ఠిపర్ణి, బృహతీ, కంటి కారికలు వీటికి దశ మూలములని పేరు. వీటి క్వాథము కుశ మూల. క్వాథము. జ్వరమును అజీర్ణమును పార్శ్వశూలను దగ్గును నశింప చేయును. గుడూచి, పర్పటి, ముస్త, కిరాత, విశ్వ భేషజములతో చేసిన పంచ భద్ర క్వాథము ఛాత పిత్త జ్వరమున ఇవ్వవలెను. తివృత్, విశాల, కటుక, త్రిఫం, ఆరగ్వధమునితో చేసిన క్వాథమును, యవ ర మ కలిపి, త్రాగించినచో యది విరేచకమై, 'సంపూర్ణ జ్వరములను నశింప చేయును. దేవదారు, బల, వాస, త్రిఫల, వ్యోష, పద్మక, వాయు, విడంగ, సీతలను సమాన భాగములో చూర్ణము చేసి సేవించినచో పంచ విధకాసములను తొలగించును. హృదయ రోగ గ్రహణి పార్శ్వ రోగ హిక్కా, శ్వాస, కాస రోగ ములను పోగొట్టు పీకు దశ మూల శరీరాస్న పిప్పలి, బిల్వ, పౌష్కర శృంగీ ఆమలకీ, బార్లీ, గుడూచి, నాగవల్లులతో యథా శాస్త్రముగ చేసిన క్వాథమును గంజిని త్రాగ వ రెసు మధు యుక్త మగు మధుకమును శర్కరాసహిత మగు పిప్పలిని గుడ యుక్త నాగరమును లవణత్రయమును సేవించిన ఎక్కిళ్ళు పోవును. కారవి, ఆజాజి, మరిచ, ద్రాక్ష, వృక్షామ్ల దాడిమ, సౌవర్చల, గుడ మును సమాన భాగ ము గ గ్రహిు) చేసిన చూర్ణ ముతో తేనే కలిపి తయారు చేసిన కారవ్యాధి వటి సర్వ విధములగు అరుచి రోగములను నశింప చేయును. ఆల్ల పుర సమును తేనె కలిపి త్రాగించినచో అరుచి, శ్వాస, కొసలు, జలుబు, కఫము నశించును.  

వటం శృంగీ శిలాలోధ్ర దాడిమం మధురం మధు

పిబే త్తండుల తోయేన చర్దీ తృష్ణానివారణమ్.

గుడూచీ వాసకంలోధ్రం పిప్పలీ క్షౌద్రసంయుతమ్

కఫాన్వితం జయేద్ర క్తం తృష్ణా కాస జ్వరాపహమ్.

పానకస్య రస సద్వత్స మధుస్తామ్రజోరసః

 శిరీష పుష్పసురస భావితం మరిచం హితమ్.

సర్వార్తిను నృసూరోఽథ పిత్తము క్తండులీయకమ్

నిర్గుండి శారివా శేలురంకోలశ్చ విషాపహః.

మహౌషధామృతా క్షుద్రాపుష్కగం గంథికోద్భవమ్

పిబేత్కణాయుతం క్వాథం మూర్చాయాం చ మదేషు చ.

హింగు సౌవర్చలవ్యోషో ద్విపలాంశైర్ఘృతాడకమ్

చతుర్గుణే గవాంమూత్రే సిద్దమున్మాద నాశనమ్.

శంఖ పుష్వేవ చాకుష్ఠైః సిద్ధబ్రాహ్మీర సైర్యుతమ్

 పురాణం హన్త్యపస్మారం సోన్మాదం మేధ్య ముత్తమమ్.

పంచగవ్యం ఘృతంతద్వతుష్ఠను చ్చా భయాయుతమ్

పటోల త్రిఫలానిమ్బ గుడూచీ ధావనీ వృషైః.

సక రం జైర్ఘృతం సిద్దం కుష్ఠనుద్వజ్రకం స్మృతమ్

నిమ్బం పటోలం వ్యాఘ్ చ గుడూచీ వాసకం తథా.

కుర్యాద్దశ పలాస్భాగానే కైక స్య సుకుట్టితాన్

జలద్రోణే విపక్తవ్యం యావత్పాదవ శేషితమ్.

ఘృతప్రస్థం పచేత్తేన త్రిఫలాదర్బ సంయుతమ్

పంచతి క్తమితి ఖ్యాతం సర్పి: కుష్ఠవినాశనమ్.

ఆశీతిం హిత జాన్రోగా శ్చత్వారింశచ్చ వై త్తికాన్

 వింశతిం శ్లైష్మి కాన్కాస పీన సార్శోవ్రణాదికాన్.

హన్త్యన్యాన్యోగరాజోయం యథార్కస్తిమిరంఖలు   

వట, శృంగి. శిల, లోధ్ర, దాడిమ, మధుకములను చూర్ణము చేసి, ఆచూర్ణముతో సమానముగ పటిక బెల్లము కలిపి తేనెతో సేవించవలెను. ఈ వటశృంగాది 'అవలేహమును జలముతో త్రాగినచో వనమును దాహమును తొలగించును. గుడూచి, వాసక, లోధ్ర పిప్పలి చూర్ణమును తేనెలో కలిపి సేవించినచో కఫయుక్తమగు రక్తము, దాహము, దగ్గు జ్వరము నశించును, తేనె కలిపిన పోసకరసము, తామర భస్మము కాసమును పోగొట్టును. శిరీష పుష్ప రసముచే భావన చేసిన మరిచ చూర్ణము హితకరము మసూరము ఆన్ని భాధలను పోగొట్టును. తండులీయకము. పిత్త దోషమును తొలగించును. నిర్గుండి, శారిబ లు అంకోలములు విషనాశకములు, శుంఠి అమృత, క్షుద్ర పుష్కర గ్రంథి. పిప్పల మూలములతో చేసిన క్వాథము, మూర్చను మదమును తొలగించును. హింగు, సౌవర్చల, వ్యోషము లను రెండేసి పలములు నాలుగు శేర్లమృతము కలిపి నాలుగు రెట్ల గోమూత్రముతో సిద్దము చేసినచో ఉన్మాదనాశక ము శంఖ పుష్పివచి, కుష్ట సిద్ద, బ్రాహ్మి రసములను కలిపి గుటికలు చేసి, ఇచ్చినచో పాత ఉస్మాదమును ఆపస్మార మును తొలిగించి మంచి మేధాశ క్తిని యిచ్చును. అభయముతో పంచగవ్యమును మృతమును కలిపి సేవించిన కష్టము వశించును. పటోల త్రిఫల, నింబ, గుడూచి, ధావని, వృష, కరంజములతో తయారు చేసిన మృతము కుష్టరోగ మును తొలగించును "వజకము" నింబ, పటోల, వ్యాఘ్, గుడూచి, వాసకములను పదేసి పలములు తీసుకుని బాగుగా నూరవలేను. పదునారు శేరుల జలముతో క్వాథము చేసి దానిలో ఒక శేరు మృతము త్రిఫలా చూర్ల కల్కము, వేసి నాల్గవ వంతు మిగులు. వరకు వండవలెను, ఈ పంచ తిక్త మృతము కుష్ఠరోగమును ఎనుబది విధములగు వాత రోగములను నలుబది విధములగు పిత్తరోగిమలను ఇరువది విధములగు కఫరోగ ములను పీవస, ఆరో, వ్రణాదులను నశింపచేయును. ఈ యోగరాజము సూర్యుడు అంధకారము నశింపచేసినట్లు ఇతర రోగములను కూడ నిస్సంశయముగ నశింపచేయుష.

త్రిఫలాయః కషాయయేణ భృంగరాజ ర సేనచ.

వ్రణ ప్రక్షాలనం కుర్యాదుప దంశప్రశాంతయే

పటోలగల చూర్ణేన దాడిమత్వ గ్రజోఽథవా.

 గుండయేచ్చ గజేనాపి త్రిఫలా చూర్ణ కేనచ

 త్రిఫలాయోరజో యష్టిమార్క వోత్పల మారిచైః.

 స సైంధవైః పచేత్తైల మభ్యంగాచ్ఛర్ధి కాపహమ్

సక్షిరాన్మార్క వరసాబ్ద్వి ప్రస్థమధు కోత్పలైః.

పచేత్తు తైలకుడవం తన్న స్యం పలితాపహమ్

నింబం పటోలం త్రిఫలా గుడూచీఖ దిరం వృషమ్.

 భూమిమ్బ పాఠాత్రి ఫలా గుదూచీ రక్తచందనమ్

యోగద్వయం జ్వరం హన్తి కుష్ఠ విస్ఫోట కాదికమ్.

పటోలామృత భూనిమ్బ వాసారిష్టక పర్పటైః

ఖదిరా న్తయుతైః క్వాథో విస్ఫోటజ్వర శాంతికృత్.

 దశమూలీ చిన్న రుహాపథ్యాదారు పునర్న పో

జ్వర విదధి శోథేషు శిగ్రు విశ్వజితా హితాః.

మధూకం నిమ్బపత్రాణి లేపః స్యాద్ర్వణ శోధనః

 త్రిఫలా ఖదిరో దార్వీన్యగ్రోధాతి బలాకుశాః.

నిమ్బమూలక పత్రాణాం కషాయాః శోధనే హితాః

కరం జారిష్ట నిర్గుండీ రసోహన్యా ద్ర్వణకృమీన్.

ధాతకీ చందన బలాసమంగా మధుకోత్పలైః

 దార్వీ మేదోన్వితై ర్లేపః స సర్పిర్ర్వణ రోపణః.   

ఉపదంశము శమించుటకే త్రిఫలాకషాయ భృంగరాజర సములతో వ్రణమును కడిగివేసి పటోలపత చూర్ణ మతో గాని, దాడిమ చూర్ణము తోగాని, గజచూర్ణముతోగాని త్రిఫలా చూర్ణముతోగాని, ఆ వణమును కప్పవలెను త్రిఫలా, లోహ చూర్ణ, యష్టిక, ఆర్కవ, నీలక మల, మరిచ, సైంధవములు వేసి, వండిన తైలమునుమర్ధించినచో వచనములు శాంతించును. క్షీర మార్క వరస, మధుక, ఉత్పలములను రెండు శేర్లు తీసుకొని తైలము నాల్గవ వంతు మిగులు వరకు వండి దానిని నశ్యముగ ఉపయోగించినచో పలితము తగ్గును. నింబపట్ల, త్రిఫలా, గుడూచి, ఖదిర, వృష, భూనింబ, పాఠాత్రి ఫలా, గుడూచి రక్త చందనములుఅను ఈ రెండు యోగములు జ్వరమును తొలగించును. కుష్ణ విస్పోట కాదులను నశింపచేయును. పటోల, అమృత, భూనింబ, వాస, ఆరిష్టక, పర్పట, ఖదిరల క్వాథము, విస్ఫోట జ్వర ములను తొలగించును. దకమూవీ, భిన్న రుహా, పథ్యాదారు. పునర్నవ, గ్రు, విశ్వజిత్ లతో చేసిన క్వాథము జ్వర, విద్రథి, శోథములందు హితకరములు. మధూకము, నింబ పత్రములు నూరి చేసిన లేపము వ్రణములను తొలగించును. త్రిఫలా, ఖదిర దార్వీ, న్యగ్రోధ, అతిబల, కుశ, నింబ, పత్రములు నూరి చేసిన లేపము వ్రణములను తొలగించును. త్రిఫలా, ఖదిర దార్వి, న్యగ్రోధ, అతి బల, కుశ, నింబ, మూలక పత్రములతో చేసిన కషాయములు శరీర బాహ్య శోధనమునకు మంచివి. కరంజ, అరిష్ట, నిర్గుండి రసములు, గాయము నందలి క్రుములను నశింప చేయును. ధాతకీ, చందన, విలాస మంగా మధుక, ఉత్పల, దారు , మేదలను నేతితో కలిపి లేపముగ వ్రాసిన వ్రణములను మాన్పను.  

గుగ్గులు త్రిఫలావ్యోష సమాంశైర్ఘృత యోగతః

నాడీ దుష్టవ్రణం శూలం భగందర ముఖం హరేత్.

హరీతకీం మూత్రసిద్దాం సతైల లవణాన్వితామ్

ప్రాతః ప్రాతశ్చ సేవేత కఫవాతామయా పహామ్.

త్రికటు త్రిఫలాక్వాథం సక్షార లవణం పిబేత్

కఫవాతాత్మ కేష్వేవ విరేకః కఫవృద్ధినుత్.

పిప్పలీ పిప్పలి మూలవతా చిత్రకనాగరైః

 క్వాథితం వా పిబేత్సేయ మామవాత వినాశనమ్.

రాస్నాం గుడూచీ మేరండ దేవదారు మహౌషధమ్

పిబేత్సర్వాంగీ కే వాతే సామేసంధ్యస్థిమజ్జగే.

దశమూల కషాయం వా పిబేధ్వానాగరాంభసా

శుంఠి గోక్షురకక్వాథః ప్రాతః ప్రాతర్ని షేవితః.

సామవాత కటిశూల పాచనో రుక్ర్పణాశనః

నమూలపత్ర శాఖాయాః ప్రసారణ్వాశ్చ తైలకమ్.

గుడూబ్యాః సురసః కల్కః చూర్ణం వాక్వాథ మేవచ

ప్రభూత కాలమా నేవ్య ముచ్యతే వాతశోణిత్.

పిప్పలీ వర్ధమానంవా సేవ్యం పధ్యా గుడేనవా

పటోల త్రిఫలా తీవ్ర కటుకామృత సాధితమ్.

పక్వం పీత్వా జయత్యాశు సదాహం వాత శోణితమ్

గుగ్గులుం కోష్ణశీతేతు గుడూచీత్రి ఫలాంభసా.

బలాపునర్న వైరండ బృహతీద్వయ గోక్షురైః

 సహింగు లవణైః పీతం సద్యో వాతరుజాపహమ్.

కార్షికం పిప్పలి మూలం పంచైవ లవణానిచ

పిప్పలీ చిత్రకం శుంఠీ త్రిఫలా త్రివృతావచా.

ద్వౌక్షారోశాద్వలా దన్తీ స్వర్ణ క్షిరీ విషాణికా

కోల ప్రమాణాం గుటికాం పిబే త్సౌవీరకాయుతామ్.

శోథావపాకే త్రివృతా ప్రవృద్దే చోదరాదికే

 క్షీరం శోథహరం దారు వర్షా భూర్నా గరైః శుభమ్.

సేక స్త థార్క వర్షాభూనిమ్బ క్వాథేన శోథజిత్

 వ్యోషగర్భం పలాశస్య త్రిగుణే భన్మవారిణి.

సాధితం పిబతః సర్పిః పతత్యర్శోన సంశయః

 విష్వక్సేనాబ్జ నిర్గుండీ సాధితం చాపి లావణమ్.

విడంగానల సింధూత్థరాస్నాగ్ర క్షార దారుభిః

 తైలం చతుర్గుణం సిద్ధం కటు ద్రవ్యం జలేఽథవా. 

గుగ్గులు, త్రిఫలా, వ్యోషములను సమాంశమున గ్రహించి ఘృతము కలపి. పూసినచో నాడీ వ్రణములు దుష్ట వ్రణములు శూల భగందరము మొదలగునవి నశించును. గోమూత్రము నందు, శుద్ధము చేయబడిన హరీతకిని తైలము నందు వేయించి ప్రతి దినము లవణముతో ప్రాతః కాలమున సేవించినచో కఫ వాత రోగములు తొలగును. త్రికటు, త్రిఫలా క్వాథమును వార లవణము కలిపి త్రాగినచో కఫ వాత ప్రకృతి గల వారికి విరేచన మగును. కఫ వృద్ధి తగ్గును. పిప్పలి, పిప్పలీమూల, వ, చిత్రక, నాగరములతో చేసిన క్వాథమును గాని, పేయమును గాని త్రాగినచో ఆమ వాతము తొల గును. రాస్నా గుడూచి, హేరండ, దేవదారు డుంఠుని క్వాథము సర్వాంగ వాతమును సంధి కాలమును, ఆస్తి మజ్జి గత ఆమవాతమును తొలగించును. దశ మూల కషాయమును నాగర జలముతో కలిపి త్రాగినను పైరోగములు శాంతించును. శుంఠి గోక్షుర క్వాథమును ప్రతి దినమున ప్రాతః కాలమున సేవించినచో ఆమ వాత సహితమగు కటి శూలము పాండు రోగము నశించును. శాఖా పత్ర సహిత మగు ప్రసారిణి తైలము కూడ పైరోగములు తగ్గించును. గుడూచి స్వర సము కల్కము, చూర్ణము, లేదా క్వాథము చాల కాలము సేవించినచో వాత రోగము పోవును. పిప్పలి, కాని, వర్తమానము గాని, గుడముతో గాని, పథ్యతో గాని సేవించవలెను. పటోల, త్రిఫలా, తీవ్ర కుటకి, ఆమృతముల పాకము తయారు చేసి, సేవించినచో దాహ యుక్త వాత రక్త రోగము శీఘ్రముగ నశించును. గుగ్గు 2ను గోరువెచ్చటి నీటితో త్రివ:ను సమ శీతోష్ణ జలముతోసు లేదా బలా, పునర్నవ, హేరండమూల, బృహతీద్వయ, గోక్షుర, పాలగు, లవణములతోను తీసుకునినచో వెంటనే వాత రోగము నశించును. ఒక కర్షము పిప్పలీమూలము పంచ లవణములు పిప్పలీ, చిత్రక, శుంఠి, త్రిఫలా, త్రివృత్, వచా, షారద్వయ, శాద్వల, దంతీ స్వర్ణ క్షీరి, విపాళిక లను కలిపి రేగి పండు ప్రమా ణము గల గుటికలు చేసి, గంజితో త్రాగ వలెను. శోధము నందును దాని వలన కలిగిన ఆమపాకము నందును దీనిని సేవించ వచ్చును. ఉదర వృద్ధి యందు కూడ దీనిని సేవించ వచ్చును. దారు వర్షాభూ, శుంఠి క్షీరముల శోధ నాశక ములు. ఆర్క, వర్షాభూ, నింబ, క్వాథ కూడ శోధను తొలగించును. వ్యోషముతో గూడిన మృతమును మూడు రెట్లు పలాశ భస్మ జలముతో సిద్ధము చేసి త్రాగినచో వాని ఆర్ఘ రోగము తప్పక నశించును. విశ్వక్సేన ఆప్ష నిర్గుండులతో సాధితమైన లవణము కూడ విడంగ ఆవల సైంధవ, రాస్న దుర్థ దేవదారు వచలతో నాలుగు రెట్ల కటు ద్రవ్యములు కలిపిన తైలము మర్దించుటచే గండమాల గల గండ రోగములు నశించును.

గండ మాలా పహం తైలమభ్యంగా ద్గల గండనుత్

శటీకునాగ వలయక్వాథః క్షీరర సంయుతమ్.

పయస్యా పిప్పలీవాసాకల్కం సిద్దం క్షయేహితమ్

వచా విడభయాశుంఠీ హింగు కుష్ఠాగ్ని దీప్యకాన్.

ద్విత్రిషట్ చతురేకాంశ సప్తపంచాశికాః క్రమాత్

చూర్ణం పితం హన్తి గుల్మముదరం శూలకాసనులత్.

పాఠానికుంభ త్రికటు త్రిఫలాగ్నిషు సాధితమ్

మూత్రేణ చూర్ణగుటికా గుల్మ ప్లీహాదీమర్దనీ.

వాసానింబపటోలాని త్రిఫలా వాతపిత్తనుత్

లిహ్యాత్క్షౌద్రేణ విడంగ చూర్ణం కృమి వినాశనమ్.

విడంగ సైంధవక్షార మూత్రేణాపి హరీతకీ

శల్లకి బదరీ జంబూద్రియాలామ్రార్జునత్వచః.

 పీతాః క్షీరేణ మధ్వక్తా పృథశ్చోణిత వారణాః

 బిల్వామ్రధాతకీ పాఠాశుంఠీమోచరసాః సమాః.

పీలో రుంధ న్త్యతీసారం గుడత క్రేణ దుర్జయమ్

చాంగేరీకోలదధ్యమ్బు నాగరక్షార సంయుతమ్.

ఘృత యక్త్వాథితం పేయం గుదభ్రంశ రుజాపహమ్

 విడంగాతి విషము స్తదారు పాఠాక లింగకమ్.

శటీ, కొనాగ, వలయ, క్వాథమును క్షీర రస పయస్యా: పిప్పలి వాసా కల్కమును క్షీరముతో సేవించినచో క్షయ రోగ ము నశించును. వచా, విట్ల వణ, అథయా, శుంఠి, హింగు, కుష్ఠ అగ్ని, దీభ్యకములను రెండు, మూడు, ఆరు నాలుగు, ఒకటి, ఏడు, భాగముల చొప్పున, వరుసగ గ్రహించి చూర్ణము చేసి సేవించినచో గుల్మ రోగమును, ఉదర రోగమును శూలరోగమను కాసర్గమును తొలగించును. పాఠ, నికుంది, త్రికటు త్రిఫల, చిత్రకముల చూర్ణమును గోమూత్రముచే సాధించి గుటికలు చేసి సేవించినచో గుల్మ ప్లీహాదికములు నశింప చేయును. వాసా, నింబ పటోల త్రిఫల ములు, వాత పిత్తములను తొలగించును వాయు విడంగ చూర్ణమును తేనెతో సేవించినచో కుమి వినాశకర ము, విడంగ సైధవ, యవక్షారములు, గోమూత్రముతో కలిపి సేవించిన హరీతకీ, క్రుమిఘ్నములు. శల్ల కీ, బదరీ, జంబూ, ప్రియాల, ఆమ, ఆర్జున వృక్షముల, బెరడు తేనెతో కలిపి, పాలతో సేవించినచో, రకాతి సొర ము నశించును. బిల్వ ఆమ్ర ధాతకీ, పాఠా శుంఠి మోచర సములు సమములుగా గ్రహించి చేసిన చూర్ణమును గుడ మిశ్ర తక్రముతో సేవించినచో దుర్జయ మగు అతిసారమును జయించును. చాంగే, కోల, దధ్యంబు, శుంఠి యవక్షార ముని క్వాథమును ఘృతముతో సేవించినచో గుదభ్రంశ రోగము తొలుగును. విడంగ. అతి విషా, ముస్త, దేవదారు పాఠా కలింగ కములు క్వాథము మిర్చ చూర్ణముతో కలిపి సేవించినచో శోధ అతి సారములు నశించును.

మరీచేన సమాయుక్తం శోథాతీసార నాశనమ్

 శర్కరాసింధు శుంఠీభిః కృష్ణామధు గుడేనవా.

ద్వేద్వేఖాదేద్దరీతక్యౌ జీవేద్వర్షశతం సుఖీ

త్రిఫలా పిప్పలీయుక్తా సమధ్వాజ్యోతథైవ సా.

చూర్ణమామలకం తేన సుర సేనతు భావితమ్

మధ్వాజ్య శర్కరాయుక్తం లీడ్యాస్త్రీశః పయః పిబేత్ .

మాషపిప్పలి శాలీనాం యవగోధూమయో స్తథా

చూర్ణభాగైః సమాంశైశ్చ పచేత్పిప్పలికాం శుభామ్.

తాం భక్షయిత్వా చ పిబేచ్చరరా మధురం పయః

నవశ్చటక వద్గ చ్చేద్దశ వారాన్ స్త్రియం ధ్రువమ్.

సమంగా ధాతకీ పుష్ప లోధ్ర నీలోత్పలానిచ

ఏతత్రీ రేణ దాతవ్యం స్త్రీణాం ప్రదర నాశనమ్.

బీజం కౌరంటకం చాపి మధుకం శ్వేతచందనమ్

పద్మోత్పలస్య మూలాని మధుకం శర్కరా తిలాన్.

ద్రవమాణేషు గర్భేషు గర్భస్థాపన ముత్తమమ్

దేవదారు నరః కుష్ఠ నలదం విశ్వబేషజమ్.

లేపః కాంజిక సమిష్ట స్తైలయుక్తః శిరో ర్తినుత్

వస్త్రపూతం క్షిపేత్కోష్ణం సింధూత్థం కర్ణశూలనుల్.

లశునార్ద్రక శిగ్రూణాం కదల్యా వారసః పృథక్

బలాశతావరీ రాస్నా మృతాః సైరీయకైః పిబేత్.

త్రిఫలా సహితం సర్పి స్తిమిరఘ్న మనుత్తమమ్

త్రిఫలావ్యోష సింధూత్థైర్ఘృతం సిద్దం పిబేన్నరః.

చాక్షుష్యం భేదనం హృద్యం దీపనం కఫరోగనుత్

నీలోత్పలస్య కింజల్కం గోశకృద్రస సంయుతమ్.

గుటికాంజన మేతత్స్యాద్ధినరాత్ర్యం ధయోర్హితమ్

యష్టిమధు వచాకృష్ణా బీజానాం కుటజన్యచ.

కల్కేనాలోడ్య నిమ్బస్య కషాయో వమనాయ సః

స్నిగ్ధన్వన్న యవం తోయం ప్రదాతవ్యం విరేచనమ్.

అన్యథాయోజితం కుర్యాన్మం దాగ్నిం గౌరహరుచిం

పథ్యా సైంధవకృష్ణానాం చూర్ణముష్ణాంబునా పిబేత్.

విరేకః సర్వరోగఘ్నః  శ్రేష్ఠో నారాచ సంజ్ఞకః

సిద్ధయోగా మునిభ్యోయే ఆత్రేయేణ ప్రదర్శితాః.

సర్వరోగహరాః సర్వయోగాగ్ర్యాః సుశ్రుతేనహి.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మృతసంజీవన కర సిద్ధయోగోనామ పంచాశీత్యధిక ద్విశతత మోఽధ్యాయః. 

శర్కరా సైంధవ శుంఠులతో కాని కృషా, మధు గుడములతో గాని ప్రతిదినము రెండేసి, కర్కాయలు తీను వాడు నూరు సంవత్సరములు సుఖముగ జీవించును. పిప్పలి యుక్తమగు త్రిఫలను కూడ మధుమృతములతో సేవించిన ఆ విధముగనే ఫలము నిచ్చును. ఆమలక సురస భావితమగు ఆమలకమును మధుమృత, శర్కరులతో కలిపి దుర్గ పానము చేసినవాడు స్త్రీలకు ప్రభువగును. మాష, పిప్పల, శాలి, యవగోధూమల, చూర్ణమును సమాన ప్రమాణములో గ్రహించి, పిప్పలికను వండి దానిని భక్షించి, శర్కరాయుక్తమగు, మధుర దుగ్గ మును చేసినవాడు, చటక పక్షివలె నిస్సంశయముగ పది పర్యాయముగా స్త్రీ సంగమము చేయసమర్థుడగును, సమంగ, రాతకి పుష్ప, లోధ్ర నీలో త్పలము లను పాలతో ఇచ్చినచో స్త్రీల ప్రదర రోగమును నశించును. కరంటక బీజము, మధుకము, శ్వేతచందనము, పద్మోత్పల వబాలములు, మధుకము, శల్కరతిలలు, వీటి చూర్ణమును గర్భపాత శంఖ కలుగునపుడు, సేవించిన గర్భమును స్థిర ముగి వుంచును. దేవదారు, నథః కష్ట, నలద, విశ్వ భేషజములను గంజిలో నూరి తైలము కలిపి పూసినచో శిరో రోగమలు పోవును. సైంధవలవణమును, వస్త్రముతో శుద్దము చేసి, కొంచెము వేడి తైలములో కలిపి, కర్ణములో పోసి నచో కర్ణ శూల రోగము తగ్గును, లశున, ఆర్ధక, శిర్రు కదళీల వేరు వేరు రసము కర్ణశూలహరము. ఐలా, శతావరి, రాస్నా, అమృతా సైకియక త్రిఫలలతో సిద్ధము చేసినమృతము, తిమిర రోగమును తొలగించును. త్రిఫలా, వ్యోష. సైంధవములు కలిపిన ఘృతము, త్రాగినచో కండ్లకు హితము విరేచనక రము. హృదయమునకు పాతము జఠరాగ్ని దీపనము, కఫరోగనాశ కము. నీలో తల కింజల్కము. గోమయ రసముతో కనిపి గుటి కాంజనముచేసి, ఉపయోగించి నచో ఆది దినాంధ రాత్ర్యంధులకు హితకరము. యష్టి, 'మధువచ, పిప్పలీబీజ కుటజముల బెరడుతో కల్కముసు నింది క్వాథమును కలిపి ఇచ్చినచో ఆదివమనకారకము, తడిసినయవల నీరు విరోచనకరము. దీనిని అనుచితముగ ప్రయోగించి నచో అగ్నిమాంద్యము, ఉదరము గౌరవము, అరుచిపుట్టును. పథ్యా సైంధవ ప్పిలములను సమాన భాగములుగ గ్రహించి చూర్ణముచేసి, ఉషోదకముతో లాగినచో నారాచ సంజ్ఞక మగు ఈ చూర్ణము విరేచనకరము. సర్వరోగ వినాశకము, ఆత్రే యుడు మునులకు చెప్పిన సిద్ధయోగములలో శ్రేష్ఠములైన సర్వరోగనాశక యోగములను సుశ్రుతుడు తెలుసుకొనెను. 

అగ్ని మహాపురాణ మున మృత సంజీవనీకర సిద్ధయోగ ములను రెండువందల యేన బది యైదవ ఆధ్యాయము సమాప్తము.