ఈశ్వర ఉవాచః-
శివ శాంతిం ప్రవక్ష్యామి కల్పా ఘోర ప్రపూర్వకమ్ ।
సప్తకోట్యధిపో ఘోరో బ్రహ్మ హత్యాద్యమార్దనః.
ఉత్తమాధమ సిద్ధీనామాయోఽఖిల రోగనుత్ ।
దివ్యా న్తరిక్ష భౌమానా ముత్తత్పాతానాం విమర్దనః.
విషగ్రహ పిశాచానాం గ్రసనః సర్వకామకృత్ ।
ప్రాయశ్చిత్తమ మౌఘార్తె దౌర్భాగ్యార్తి వినాశనమ్.
ఏక వీరస్తు విన్యస్య ధ్యేయః పంచముఖః సదా ।
శాంతి కే పౌష్టి కే శుక్లో రక్తో వశ్యేఽ థ పీతకః.
స్తంభనే దూమ్ర ఉచ్చాట మారణే కృష్ణ వర్ణకః ।
కర్షణః కపిలో మోహే ద్వాత్రింశ ద్వర్ణమర్చయేత్.
త్రింశల్లక్షం జపేన్మంత్రం హోమం కుర్యాద్దశాంశతః ।
గుగ్గులామృతయు క్తేన సిద్దే సిద్దేఽథ సర్వకృత్.
ఆ ఘోరాన్నా పరో మంత్రో విద్యతే భుక్తిముక్తికృత్ ।
ఆ బ్రహ్మచారీ బ్రహ్మచారీ అస్నాతః స్నాతకోభవేత్.
ఆ ఘోరాస్త్ర మఘోరస్తు ద్వావిమౌ మంత్రరాజకౌ ।
జపహోమార్చ నాద్యుద్ధే శత్రు సైన్యం విమర్దయేత్.
పరమేశ్వరుడు చెప్పెను. ఇపుడు కల్పా ఘోర శివకాంతిని చేప్పెదను. అఘోర శివుడు ఏడు కోట్ల గణములకు ఆధిపతి బ్రహ్మహత్యాది పాపములను నశింపచేయును. ఉత్త మాధమ సిద్దును ఇచ్చువాడు సమస్త రోగములను తొలగించును. భౌమ దివ్య ఆంతరిక్ష ఉత్పాతములను మర్ధించును. విషగ్రహ పిశాచములను కూడ మీంగీ వేసి సకల కామము లను పూరించును. పాప పీడలను తొలగించుటకు దుర్బాగ్య దుఃఖ వినాశకమగు ప్రజల ప్రాయశ్చిత్తరూపుడు. ఏకవీర మును సర్వాంగ న్యాసము చేసి సర్వదా పంచముఖ ధ్యానము చేయవలెను. శాంతిక పౌష్టికములందు శివుడు శుక్ల వర్ణుడు వశి కరణమున రక్త వర్ణుడు స్తంభన కర్మగుందు పీతవర్ణుడు. ఉచ్చాటన మారణ కర్మలందు ధూమ వర్ణుడు ఆకర్షణమున కృష్ణవర్ణుడు మోహన కర్మయందు కపిల వర్ణుడు ముప్పది రెండు అక్షరములు వేదోక్తములగు ఆఘోర శివుని రూపము అందుచే ఆట్టి ఆ ఘోర శివుని పూజించవలేను ఈ మంత్రమును ముప్పది లక్షల జపము చేసి గుగ్గులు మిశ్ర మృతముతో దశాంశ హోమము చేసినచో, సాధకుడు మంత్ర సిద్ధి పొంది సిద్ధార్థుడగును అతడన్నియు సాధించగలడు. అఘోర మంత్రమును మించి భుక్తి ముక్తి పదమగు మరియొక మతములేదు. దీనిని జపించుటచే అబహ్మ చారి బ్రహ్మచారి యగును. ఆస్నాతకు స్నాతకుడగును. అఘోరాస్త్రము అఘోర మంత్రము ఈ రెండును మంత్రరాజములు ఏఒక్క దాని నైనను జప హోమార్చనములందు వినియోగించినచో యుద్ధము నందు శత్రు సైన్యమును నశింపచేయవచ్చును.
రుద్రశాంతిం ప్రవక్ష్యామి శివాం సర్వార్థసాదనీమ్ ।
పుత్రార్థం గ్రహనా శార్థం విషవ్యాధి వినష్టయే.
దుర్భిక్షమారీ శాంత్యర్దే దుః స్వప్ప హరణాయచ ।
బలాది రాజ్య ప్రాప్యర్థం రీపూణాం నాశ నాయచ.
ఆకాలఫలితే వృక్షే సర్వ గ్రహ విమర్ధనే ।
పూజనేతు నమస్కారః స్వాహాన్తో హవనే తథా.
ఆప్యాయనే వషట్ కారం పుష్టౌ పౌషణ్ని యోజయేత్ ।
చకార ద్వితీయస్థానే జాతి యోగన్తు కారయేత్ .
ఓం రుద్రాయ చతేఓం వృషభాయ నమః
అవిముక్తాయ అసంభవాయ,పురుషాయచ పూజ్యాయ ఈ శానాయ
పౌరుషాయ పంచచోత్తరే విశ్వరూపాయ కరాలాయ వికృతరూపాయ అవికృతరూపాయ.
నికృతౌ చాపరేకాలే ఆప్సుమాయాచ నైరృతే ।
ఏక పింగలాయ శ్వేతపింగలాయ కృష్ణపింగలాయ నమః.
మధు పింగలాయ నమః మధుపింగలాయ నియతౌ
అనంతాయ ఆర్ధ్రాయ శుష్కాయ ప్రయోగణాయ
కాలతత్త్వే కరాలాయ వికరాలాయ ।
ద్వౌమాయాతత్త్వే ।
సహస్రశీర్షాయ సహస్ర వక్త్రాయ సహస్ర కర
చరణాయ సహస్ర లింగాయ ।
విద్యాతత్త్వే ।
సహస్రాక్షాద్విన్య సేద్ధ క్షిణే దలే ।
ఏక జటాయ ద్విజటాయ త్రిజటాయ స్వాహాకారాయ
స్వధాకారాయ వషట్ కారాయ ।
షడ్ రుద్రాయేకత త్త్వేతు వహ్ని పత్రే స్థితా గుహ ।
భూతపతయే పశుపతయే ఉమాపతయే కాలాధిపతయే ।
సదాశి వాఖ్యత త్త్వే షట్ పూజ్యాః పూర్వదలే స్థితాః.
ఉమాయై కురూప ధారిణీ ఓం కురు కురు రుహిణి రుహిణి ।
రుద్రోఽసి దేవానాం దేవానాం దేవ దేవ విశాఖ
హనహస దహదహ పచపచ మథమథ తురుతురు
ఆరుఆరు సురసురు రుద్రశాంతి మనుస్మర కృష్ణపింగల
ఆకాల పిశాచాధిపతి విశ్వేశ్వరాయ నమః.
శివత త్త్వే కర్ణికాయాం పూజ్యౌతూమా మహేశ్వరౌ.
ఓం వ్యోమవ్యాపినే వ్యోమ రూపాయ సర్వవ్యాపినే
శివాయ ఆనన్తాయ ఆనాథాయ అనాశ్రితాయ
శివాయ శివత త్త్వేనవ పదాని వ్యోమవ్యాప్యభిదాస్యహి.
శాశ్వతాయ యోగపీఠ సంస్థితాయ నిత్యం యోగినే
ధ్యానాహారాయనమః. ఓం నమః శివాయ సర్వప్రభ వే
శివాయ ఈశాన మూర్దాయ తత్పురుషాది పంచ వక్త్రాయ ।
నవపదం పూర్వదలే సదాఖ్యే పూజయేద్గుహ ।
ఆ ఘోర హృదయాయ వామదేవ గుహ్యాయ సద్యోజాత
మూర్తయే ఓం నమో నమః గుహ్యాతి గుహ్యాయ గోప్త్రే
ఆనిధనాయ సర్వయోగాధి కృతాయ జ్యోతీ రూపాయ ।
ఆగ్ని పత్రే హోమతత్త్వే విద్యాతత్త్వే ద్వేయామ్యగే ।
పర మేశ్వరాయ చేతనా చేతన వ్యోమన వ్యాపినే ప్రథమ
తేజస్తే జః మాయాతత్వే నైరృతే చ కాలతత్త్వేఽథ వారుణే ।
ఓం ధృధృ నానా వాం వాం అనిధన నిధనోద్భవ
శివ సర్వ పరమాత్మన్ మహాదేవ సద్భావేశ్వర మహాతేజః
యోగాధిపతే ముంచ ముంచ ప్రమథ ప్రమథ
ఓంసర్వ ఓంసర్వ ఓం భవ ఓం భవ
ఓం భవోద్భవ సర్వభూత సుఖ ప్రద ।
వాయుపుత్రేఽథ నియతౌ పురుషే చోత్తరేణ చ ।
సర్వసాన్నిధ్యకర బ్రహ్మ విష్ణు రుద్రపర ఆనర్చిత
ఆస్తుతస్తుత సాక్షిణ సాక్షిణ తురు తురు పతంగ పింగ
పతంగ పింగ జ్ఞాన జ్ఞాన
శబ్ద శబ్ద సూక్ష్మ సూక్ష్మ శివ శివ సర్వపద సర్వప్రద ఓం నమః.
శివాయ ఓం నమోనమః శివాయ ఓం నమో నమః.
ఈశానే ప్రాకృతే తత్త్వే పూజయేజ్జుహుయాజ్జ పేత్ ।
గ్రహరోగాది మాయా ర్తి శమనీ సర్వసిద్ధికృత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రుద్రశాంతి వర్ణనం నామ చతుర్వింశత్యధిక త్రిశతతమోఽధ్యాయః.
ఇపుడు సర్వార్థ సాధకమగు మంగళకరమైన రుద్రశాంతిని చేప్పెదను, పుత్రపాప్తి గ్రహ బాధా నివారణ విష వ్యాధుల వినాశము దుర్భిక్ష మహామారి శాంతి దుస్స్వప్న నివారణము బల రాజ్యాది ప్రాప్తి రివు విదాశనము వీటిని సాధించుటకు రుద్రశాంతిని ప్రయోగించవలెను. వృక్షము అకాలమున ఫలించినను సమస్త గ్రహబాధలను తొలగించుటకును కూడ దీనిని ప్రయోగించవలెను. పూజనమునందు మంత్రాంతమున నమః చేర్చవలెను. హోమమునందు స్వాహా చేర్చవలేను. తృప్తి యందు వషట్ పుష్టికరము యందు నౌషట్ చేర్చవలెను. మంత్రము నందు రెండు చోట చ వున్న చోట ఆవశ్య కతాను సారముగ “నమః” స్వాహా మొదలు జాతి యోగములు చేయవలెను. “ఓం రుద్రాయ” మొదలు “అవికృత రూపాయ” వరకును మూలో క్తము రుద్ర శాంతి మంత్రము. ఉత్తరపర్తి కమల దళమున నియతి తత్వము. పశ్చిమ కమల దళ మన తొలతత్వము నే ఋతి దశమన మాయాతత్వము వుండును వీటి యందు దేవతలను పూజించవలెను. ఏక పింగళాయ శివతపింగళాయ కృష్ణపింగళాయ, మధుపింగళాయ, మధుపింగళాయ నమః యని నియతితత్త్వమునందు పూజించవలెను. అనం లాయ ఆర్థాయ శుషాయపయో గణాయయని కాలతత్వమునందు కరాళాయ వికరాళయయని మాయాతత్వము నందు పూజి చవలెను. దక్షిణ దళము నందున్న విద్యాత త్వమన “సహస్ర శీరాయ” మొదలు “సహస్ర లింగాయ” వర కుచెప్పి పూజించ వలెను. అచటనే ఏక జటాయ మొదలు షడుద్రాయ వరకును షడ్విధ రుద్రుల పూజ చేయవలెను. ఆగ్నేయ దళమున వున్న ఈ శతత్వమున భూత పతయే పశుపతయే ఉమాపతయే కాలాధి పతయే యని చెప్పి పూజ చేయవలెను. పూర్వ దళమున నున్న సదా శివతత్వము నందున్న ఆరువురిని “ఉమాయై” మొదలు “విశ్వేశ్వరాయ నమః” వరకును వున్న మంత్రము లతో పూజించవలెను. కర్ణికలను నున్న శివతత్వము పై ఉమామహేశ్వరుని ఓం వ్యోమ వ్యాపినే మొదలు శివాయ వరకును వున్న మూలో క్త మంత్రముతో పూజించవలేను. శివతత్వమున వ్యోమ వ్యాపి యను పేరు గల శివుని నవ పదముని పూజ చేయవలెను. పిదప యోగ పీఠముపై నున్న శివుని నవ పద యు క్త నామములు చెప్పుచు పూజించవలెను. “శాశ్వతాయ” మొదలు పంచ వక్త్రాయ వరకును వున్న మూలో క్షము మంత్రము. పిదప “సత్” యను పేరు గల పూర్వ దళము నందు “ఆ ఘోర హృదయాయ” మొదలు “జోతీ రూపాయ” వరకును మూలో క మంత్రముతో శివుని పూజించవలెను. ఆగ్నే యము నందున్న ఈ శతత్వము నందును దక్షిణము నందున్న విద్యాతత్వము నందును “పర మేశ్వరాయ” మొదలు “తేజ” వర కును వున్న మూలోక్త మంత్రముతో పరమేశ్వరుని పూజించవలెను. నై ఋతి యందున్న కాలతత్త్వము నందును పశ్చిమ దిక్కు నందున్న కాలతత్వము నందును “ఓం ధ్రు ధ్రు” మొదలు “సుఖప్రద” వరకును వున్న మూలోక్త మంత్ర ముతో పూజించవలేను. వాయవ్య ఉత్తరదళములందున్న నియతి పురుషులను సర్వసాన్ని ధ్యకర” మొదలు “నమోన్నమః” వరకును వున్న మూలోక్త మంత్రముతో పూజ చేయవలెను. ఈశాన్యము నందున ప్రాకృత తత్త్వము నందు కూడ జప హోమములు చేయవలెను. ఈ రుద్ర శాంతి గ్రహ బాధను రోగాది త్రివిధ పీడలను నశింప చేయును.
ఆగ్ని మహా పురాణమున రుద్ర శాంతి వర్ణన మను మూడు వందల ఇరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 325 of the Agni Purāṇa is as follows:
Temple architecture (prāsāda-nirūpaṇa) is expounded as sacred science rooted in the Vāstu tradition. Agni describes the selection and purification of the building site, the orientation of the structure relative to the cardinal directions, and the layout of the vāstupuruṣamaṇḍala — the cosmic diagram that underlies all sacred construction. The classification of prāsādas into vairāja, puṣpaka, kailāsa, maṇika, triviṣṭapa, and other types is given along with their proportional specifications. The chapter details the placement of the garbhagṛha, maṇḍapa, and gopura, and the deities presiding over each sector of the sacred complex.