ఈశ్వర ఉవాచః
ఓం హ్రీం కర్ణమోటని బహురూపే బహుదంష్ట్రే హూం ఫట్
ఓం హః ఓం గ్రస గ్రస కృన్త కృన్త ఛక ఛక హూం ఫట్ నమః.
పత్యమానోహ్యయం మన్త్రః క్రుద్దైః సంరక్తలోచన్తెః ।
మారణే పాతనే వాపి మోహనోచ్చాటనే భవేత్.
కర్ణమోటా మహావిద్యా సర్వవర్ణేషు రక్షకా ।
నానావిద్యా :
పఞ్చోదయం ప్రవక్ష్యామీ స్వరోదయసమాశ్రితమ్.
నాభిహృదన్తరం యావత్తావచ్చరతి మారుతః ।
ఉచ్చాటయేద్రణాదౌ తు కర్ణాక్షీణి ప్రభేదయేత్.
కరోతి సాధకః క్రుద్ధో జపహోమపరాయణః ।
హృదయాత్పాయుకం కణ్ఠం జ్వరదాహారి మారణే.
కణ్ఠోద్భవో రసో వాయుః శాన్తికం పౌష్టికం రసమ్ ।
దివ్యం స్తమ్భం సమాకర్షం గన్దో నాసాన్తికో భ్రువః.
గన్దలీనం మనః కృత్వా స్తమ్బయేన్నాత్ర సంశయః ।
స్తమ్బనం కీలనాద్యం చ కరోత్యేవ హి సాధకః.
చణ్డఘణ్టా కరాలీ చ సుముఖీ దుర్ముఖీ తథా ।
రేవతీ ప్రథమా ఘోరా వాయుచక్రేషు తా యజేత్.
ఉచ్చాటకారికా దేవ్యః స్థితాస్తేజసి సంస్థితాః ।
సౌమ్యా చ భీషణా దేవీ జయా చ విజయా తథా.
ఆజితా పరాజితా మహాకోటీ చ రౌద్రయా ।
శుష్కకాయా ప్రాణహరా రసచక్రే స్థితా అమూః.
విరూపాక్షీ పరా దివ్యా స్తథా చొకాశమాతరః ।
సంహారీ జాతహారీ చ దంష్ట్రాలా శుష్కరేవతీ.
పిపీలికా పుష్టిహారా మహాపుష్టిప్రవర్దనా ।
భద్రకారీ సుభద్రా చ భద్రభీమా సుభద్రికా.
స్థిరా నిష్ఠురా దివ్యా నిష్కమ్పా గదినీ తథా ।
ద్వాత్రింశన్మాతరశ్చక్రే హ్యష్టాష్ట్ర క్రమశః స్థితాః.
పరమేశ్వరుడు చెప్పెను : “ఓం హ్రీం కర్ణమోటని బహురూపే బహుదంష్ట్రా హుం ఫట్ ఓం హః ఓం గ్రస గ్రస, కృన , కృన , చక, ఛక. హూం వద్ నమః”. ఇది కర్ణమోడీ మహావిద్య, ఇది అన్ని వర్ణములందును రక్ష నిచ్చు శధి. ఈ మంత్రమును చదివినంతమాత్రముననే మనుష్యుడు. క్రోధావిష్టు డగును, వాని కండ్లు ఎర్రవడును. ఈ మంత్రము తూరణ-పాతన-మోహన-ఉచ్చాటనములయం దుపయోగించును. అపుడు స్వరోదయముతో పాటు పంచవిధ వాయుస్థానమాలను, వాటి ప్రయోజనము లమ చేప్పెదను. హృదయమునుండి నాభివరకును వాయుసంచారము జరుగు చుండును. దానికి మారతచక్ర మని పేరు. జపహోమాదులు చేయు సాధకుడు, క్రోధవంతుడై, దానిచే సంగ్రామాది కార్యములందు ఉచ్చాటనాదికార్యములు చేయును. కర్ణములనుండి నేత్రముల వరకును ఉన్న వాయువుచే ప్రభేదన కార్య మును, హృదయమునుండి గుదము వరకును ఉండు వాయువుచే జ్వర దాహములను, శత్రుమారణమును చేయవలెను. ఈ వాయువు పేరు వాయుచక్రము. హృదయమునుండి కంఠము వరకును ఉన్న వాయువునకు రస మని పేరు. దీనికి రసచక్ర మని పేరు. దీనిచే శాంతిప్రయోగము చేయబడును. దాని గుణము పౌష్టికర సతుల్యమ కనుబొమ్మల నుండి నాసికాభాగమువరకును ఉన్న వాయువు పేరు దివ్యము. దీనికి తేజశ్చక్ర మని పేరు. దీనికి గంధము గుణము. దీనిచే స్తంభన-ఆకర్షణములు చేయబడును. సాధకుడు మనస్సును నాసికాగ్రమునందు స్థిరము చేసి, నిస్సందేహముగ స్తంభన. కీలనములు చేయును. పైన చెప్పిన వాయు చక్రమునందు చండఘంటా, కరాలీ, సుముఖీ, దుర్ముఖి, రేవతి, ప్రథమా, ఘోర అను శక్తులను ఆర్చించవలెను. ఉచ్చాటనము చేయు శక్తులు తేజశ్చక్రమునం దుండును. సౌమ్య, భీషణీ, దేవీ, జయ, విజయ, అజితా, అపరాజితా, మహాకోటి, మహారౌద్రీ, శుష్కకాయా, ప్రాణహరా అను పదకొండుగురుశక్తులు రసచక్రమునం దుండును. విరూపాక్షి-పరా-దివ్యలు, పదకొండుగురు ఆకాశమాతృకలు. సంహారీ, జాతహారీ, దంష్ట్రాలా, కుష్క రేవతీ. పిపీలికా, పుష్టిహరా, మహాపుష్టి, ప్రవర్ధనా, భద్రకాళీ, సుభద్ర, భద్రభిమా, సుభద్రికా, స్థిరా, నిష్ఠురా-దివ్యా, నిష్కంపా, గదినీ, రేవతీ అను ముప్పదిఇద్దరు మాతృకలు మారుత-వాయు-రస-దివ్యచక్రములు నాల్గింటి యందను ఎననుండుగురు చొప్పున ఉందురు.
ఏక ఏవ రవిశ్చన్ద్ర ఏకశ్చైకైక శక్తికా ।
భూతభేదేన తీర్థాని యథా తోయం మహీతలే.
ప్రాణ ఏకో మణ్డలైశ్చ భిద్యతే భూతపఞ్ఞరే ।
వామదక్షిణయోగేన దశధా సంప్రవర్తతే.
బిన్దుముణ్డవిచిత్రం చ తత్తత్వవస్త్రేణ వేష్టితమ్ ।
బ్రహ్మాణ్డేన కపాలేన పిబేత్తు పరమామృతమ్.
పఞ్చవర్గబలాద్యుద్దే జయో భవతి తచ్ఛృణు ।
అ ఆ క చ త ప యా శఆద్యో వర్గ ఈరితః.
ఇ ఈ ఖ ఛ ఠ థ ఫ రాఃషవర్గశ్చ ద్వితీయకః ।
ఉ ఊ గ జ డ ద బ లాః సవర్గశ్చ తృతీయకః.
ఏ ఐ ఘ ఝ ఢ ధ భ వా హవర్గశ్చ చతుర్థకః ।
ఓ ఔ అం అః ఙ ఞ ణ నా మవర్గః పఞ్చమో భవేత్ .
వర్ణాశ్చాభ్యుదయే నృణాం చత్వారింశచ్చ పఞ్చ చ ।
బాలః కుమారో యువా స్యాద్వృద్దో మృత్యుశ్చ నామతః.
ఆత్మపీడా శోషకః స్యాదుదాసీనశ్చ కాలకః ।
కృత్తికాప్రతిపద్భౌమ ఆత్మనో లాభదః స్మృతః.
షష్ఠీ భౌమో మఘాపీడా హ్యార్ద్రా చై కాదశీ కుజః ।
మృత్యుర్మమా ద్వితీయా జ్ఞో లాభశ్చార్ద్రా చ సప్తమీ.
బుదే హానిర్భరణీ జ్ఞః శ్రవణం కల ఈదృశః ।
జీవో లాభాయ చ భవేత్తృతీయా పూర్వఫల్గునీ.
జీవోఽష్టమీ ధనిష్ఠార్ద్రా జీవోఽశ్లేషా త్రయోదశీ ।
మృత్యుః శుక్రశ్చతుర్థిస్యాత్పూర్వభాద్రపదా శ్రీయే.
పూర్వాషాడా చ నవమీ శుక్రః పీడాకరో భవేత్ ।
మఘా శనిః పూర్ణిమా చ యోగో మృత్యుకరః స్మృతః.
సూర్యుడు ఒక్కడే: చంద్రుడును ఒక్కడే; వారి శ క్తులు కూడ భూతభేదమును బట్టి ఒక్కొక్కటియే; భూమిపై నున్న నదీజలమునకు స్థానభేదమును బట్టి తీర్థసంజ్ఞ కలిగి నట్లే శరీరమునందలి ఆర్థికంజరములో నున్న ఒకే ప్రాణము అనేక మండలముల రూపమున విభక్త మైనది. వాయుదక్షిణాంగములతో యోగముచే ఆదే వాయువు పది విధములైనట్లు, అదే వాయువు తత్వరూప మగువస్త్రమునందు దాగి విచిత్రబిందురూప మగు ముండము ద్వారా, కపాలరూప బ్రహ్మాండము నకు సంబంధించిన అమృతమును త్రాగుచుండును. పంచవర్గ బలముచే యుద్ధమునం దెట్లు జయము కలుగునో వినుము. అ,ఆ,క,చ,ట,త,ప,య,శ లు ప్రథమవర్గము. ఇ, ఈ,ఖ,చ,త,థ,వ,ర,ష లుద్వితీయవర్గము. ఉద్యోగ ,జ,డ,ద,బ,ల,స లు తృతీయవర్గము. ఏ,ఐ,మ,ర,ఠ,ధ,థ,వ,హ లు చతుర్థవర్గము. ఓ, ఔ, అం, అః,జ, జా,ణ,న,మ లు పంచమవర్గము. ఈ నలు బదియైదు అక్షరములు ను మానవులకు ఆభ్యుదయ మిచ్చునవి. వీటికి వరుసగ బ్యాంకుమార .యువన్-వృద్ధ-మృత్యువు అని పేరు. కాలము-ఆత్మ పీడము,శోషకము, ఉదాసీనము అని మూడు విధములు. మంగళవారమునందు ప్రతిపత్తు, కృత్తిక వచ్చినచో అవి లాభదాయకములు. మంగళ వారమున షష్టి మఘనక్షత్రములు వచ్చినచో అవి పీడాక రములు. మంగళ వారమున ఏకాదశీ ఆర్ధానక్షత్రములు వచ్చినచో అవి మృత్యుదాయకములు. బుధవారమున ద్వితీయా మఘాయోగము, సప్తమీ ఆర్ధానక్షత్రయోగము లాభదాయకములు. బుధవార-భరణీనక్షత్రయోగము! హానికరము. బుధవార-శ్రవణ నక్షత్రయోగము “కాలయోగము. బృహస్పతివారమున తృతీయా-పూర్వఫల్గునీ యోగము లాభకరము. బృహస్పతివార మున అష్టమీతిథి-ధనిషానక్షత్రయోగము, అష్టమీ-ఆర్ధాయోగము, త్రయోదశి-ఆశ్లేషాయోగము మృత్యుకారకములు. శక్రపా తమున చతుర్దే-పూర్వాభాద్రాయోగము లక్ష్మీవృద్ధికరము. శుక్రవారమున-నవమీ.పూర్వాషాఢయోగము దుఃఖప్రదవి ద్వితీయా భరణీ నక్షత్రయోగశ యమదండము వలె హానికరము. శనివారమున వంచమీ.కృత్తికాయోగమ లాభకరము దశమి-ఆశ్లేషా యోగము పీడాకారము. పూర్ణిమ-మహయోగము మృత్యుప్రదము.
ఆథ తిథియోగః :
పూర్వోత్తరాగ్నినైరృత్యదక్షిణానిలచన్ద్రమాః.
బ్రహ్మాద్యాః స్యుర్దృష్టయః స్యుః ప్రతిపన్నవమీముఖాః ।
రాశిభిః సహితా దృష్టా గ్రహాద్యాః సిద్ధయే స్మృతాః.
మేషాద్యాశ్చతురః కుమ్భా జయః పూర్ణేఽన్యథా మృతిః ।
చూర్యాదిరిక్త పూర్ణా చ క్రమాదేవం ప్రదాయేత్.
రణే సూర్యే ఫలం నాస్తి సోమే భఙ్గః ప్రశామ్యతి ।
కుజేన కలహం విద్యాద్బుధః కామాయ వై గురుః.
జయాయ మనసే శుక్రో మన్దే భఙ్గో రణే భవేత్ ।
దేయాని పిఙ్గలాచక్రే సూర్యగాని చ భాని హి.
ముఖే నేత్రే లలాటేఽథ శిరోహస్తోరుపాద కే ।
పాడే మృతిస్త్రిఋక్షే స్యాత్రీణి పక్షేఽర్థనాశనమ్.
ముఖస్థే చ భవేత్పీడా శిరఃస్ఠే కార్యనాశనమ్ ।
కుక్షిస్థితే ఫలం స్యాచ్చ రాహుచక్రం వదామ్యహమ్.
ఇన్ద్రాచ్చ నైరృతం గచ్ఛేన్త్నెరృతాత్సోమమేవ చ ।
సోమాద్దుతాశనం వహ్నేరాప్యమాప్యాచ్ఛివాలయమ్.
రుద్రాద్యమం యమద్వాయుం వాయోశ్చన్ద్రం వ్రజేత్పునః ।
భుఙ్త్కే చతస్రో నాడ్యస్తు రాహుపృష్ఠే జయో రణే.
అగ్రతో మృత్యుమాప్నోతి తిథిరాహుం వదామి తే ।
ఆగ్నేయాదిశివాన్తం చ పూర్ణిమామాదితః ప్రియే.
పూర్వే కృష్ణాష్టమీయావద్రాహుదృష్టౌ భయో భవేత్ ।
ఐశాన్యాగ్నేయనైరృత్యవాయవ్యే ఫణిరాహుకః.
మేషాద్యా దిశి పూర్వాదౌ యత్రాదిత్యోఽగ్రతో మృతిః ।
తృతీయా కృష్ణపక్షే తు సప్తమీ దశమీ తథా.
చతుర్దశీ తథా శుక్లే చతుర్ఖ్యేకాదశీ తిథిః ।
పఞ్చదశీ విష్టయః స్యుః పూర్ణిమాగ్నేయవాయవే.
పూర్వ-ఉత్తర-ఆగ్నేయ-నైరృతి-తక్షిణ-వాయవ్య-పశ్చిమ-ఈశాన్యములు పరస్పరము చూచుకొనును. ప్రతిపత్తు వవమి మొదలగు తిథులలో మేషాదిరాశులతో రత్యాదివారములను కలపవలెను. ఈ యోగము కార్యసిద్ధికరము. ఉదా: తూర్పు, ప్రతిపత్తు, మేషలగ్నము, రవివారము ఈ యోగము పూర్వదిశ యందు యుద్ధాదికార్యములందు, సిద్ధిప్రదము. మేషాదిరాళులు నాలుగు, కుంభము-ఈలగ్నములు పూర్ణవిజయము నిచ్చును. ఇతర రాశులు మృత్యుకారకములు. సూర్యాది గ్రహములను, రిపూర్ణాదితిథులను వెనుక దిక్కులవిషయమున చెప్పి నట్లు న్యాసము చేయవలెను. సూర్యసంబంధముచే యుద్ధము నందు ఉత్తమఫల మేదియు లభించదు. సోమసంబంధము సంధిని కలిగించును. మంగలసంబంధముచే కలహ. మగును. బుధ సంబంధమున యుద్దము చేయుటచే ఆభీష్టసాధనములు చేకూరును. గురుసంబంధముచే విజయలాభము కలుగును. శుక్రసంబంధముచే అభీష్టసిద్ధి యగును. శనిసంబంధముచే పరాజయము కలుగును. ఒక పక్షి ఆకారము గీసి దానిముఖ నేత్రా-లలాట-శీర్ష-హస్త-కుక్షి-చరణ-పక్షములందు సూర్యనక్షత్రము మొదలు మూడేసి నక్షత్రములు వ్రాయ వలెను. పాదమునం దున్న మూడు నక్షత్రములలో యుద్ధము చేసినచో మృత్యు వగును. రెక్కలపైనున్న మూడు నక్షత్రములందు ధననాళము. మఖము నందలి మూడు నక్షత్రములందు పీడ కలుగును. శిరస్సునం దున్న మూడు నక్షత్రములందు కార్యనాశనము. కుక్షీయందలి మూడు నక్షత్రములందు యుద్ధము చేయగా ఉత్తమఫలము లభించును. తూర్పునుండి నైరృతివరకును, నైరృతినుండి ఉత్తరమువరకును, ఉత్తర మునుండి ఆగ్నేయమువరకును, ఆగ్నేయమునుండి వశ్చిమమువరకును, పశ్చిమమునుండి ఈశాన్యమువరకును, ఈశాన్యమునుండి దక్షిణమువరకును, దక్షిణమునుండి వాయవ్యము వరకును, వాయవ్యమునుండి ఉత్తరము వరకును నాలుగేసి దండముల వరకు రాహుక్రమణ ముండును. రాహువునుపృష్ణ శునం దుంచుకొని యుద్ధము చేయుట జయప్రదము. రాహువు ఎదురుగా ఉండగా యుద్దము చేసినచో మృత్యువు: ఇపుడ తిథిరాహం విషయము చెప్పెదను. పూర్ణిమ పిమ్మట కృష్ణప్రతిషత్తు మొదలు. ఆగ్నేయముండి ఈర్డాన్యమువరకు, అనగా యుద్ధజియార్ణవే నావాచక్రాణి కృష్ణ అష్టమివరకు రాహువు పూర్వాది దిక్కున ఉండును. ఆచట యుద్దము చేయుటచే జయము కలుగును. ఈశాన్యమునుండి ఆగ్నేయము వరకును, నైరృతి నుండి వాయవ్యము వరకును రాహుక్రమం ముండును మేషాదిరాళులను పూర్వాదిదిక్కులం దుంచవలెను. ఇట్లుంచగా మేష-సింహ-ధనూరాశులు తూర్పునను, వృషభ-కన్నా-మకరరాశలు దక్షిణ మునందును, మిథున-తులా-కుంభములు పశ్చిమమునందును, కర్కటక-వృశ్చిక-మీనములు ఉత్తరమునందును ఉండును. సూర్యరాశిని పట్టి సూర్యుని దిక్కు తెలిసికొని, సూర్యుడు సమ్ముఖుడై ఉన్నపుడు యుద్ధము చేయుట మృత్యుకారకము, కృష్ణ పక్షమునందు తృతీయా-సప్తమీ-దశమీ-చతుర్దశితిథులు భద్రతిథులు. శుక్ల పక్షమునందు చతుర్థి-ఏకాదశీ-ఆప్షమీ పూర్ణిమలు భద్రతిథులు. ఆగ్నేయమునుండి వాయవ్యము వరకును భద్రానివాసము.
అ క చ ట త ప య శా వర్గాః సూర్యాదయో గ్రహాః ।
గృద్రోలూకశ్యేనకాశ్చ పిఙ్గలః కౌశికః క్రమాత్.
సారసశ్చ మయూరశ్చ గోరఙ్కుః పక్షిణః స్మృతాః ।
ఆదౌ సాధ్యో హుతో మన్త్ర ఉచ్చాటే పల్లవః స్మృతః.
వ్యశ్యేజ్వరే తథాకర్షే ప్రయోగః సిద్ధికారకః ।
శాన్తౌ ప్రీతా నమస్కారో వౌషట్ పుష్టౌ వశాదిషు.
హుం మృత్యౌ ప్రీతిసంనాశే విద్వేషోచ్చాటనే చ ఫట్ ।
వషట్సుతే చ దీప్త్యాదౌ మస్త్రాణాం జాతయశ్చ షట్.
ఓషధీః సంప్రవక్ష్యామి మహారక్షావిధాయినీః ।
మహాకాలీ తథా చణ్డీ వారాహీ చేశ్వరీ తథా.
సుదర్శనా తథేన్ద్రాణి గాత్రస్థా రక్షయ న్తి తమ్ ।
బలా చాతిబలా భీరుర్ముసలీసహదేవ్యపి.
జాతీ చ మల్లికా యూథీ గారుడీ తుఙ్గరాజకః ।
చక్రరూపా మహౌషధ్యో ధారితా విజయాదయః.
గ్రహణే చ మహాదేవి ఉదృతాః శుభదాయికాః ।
మృదా చ కుఞ్జరం కృత్వా సర్వలక్షణలక్షితమ్.
తస్య పాదతలే కృత్వా స్తమ్భాయేచ్ఛత్రుమాత్మనః ।
నగాగ్రే చైత్యవృక్షే చ వజ్రాహతప్రదేశకే.
వల్మీకమృదయాహృత్య మాతరౌ యోజయేత్తతః ।
ఓం నమో మహాభైరవాయ వికృతదంష్ట్రోగ్రరూపాయ పిఙ్గలాక్షాయత్రిశూలఖడ్గధరాయ వౌషట్.
పూజయేత్కర్ధమం దేవి స్తమ్భయేచ్ఛస్త్రజాలకమ్.
అ, క, చ, ట, త, ప, య, శ- అవి ఎనిమిదివర్గములు. వీటి ఆధిపతులు వరుసగ నూర్య-చంద్ర-కుజ-బుధ-గురు-శుక్ర-శని-రాహువులు. ఈ వర్గముల పక్షులు క్రమముగ గృధ్ర-ఉలూక-శ్యేనపింగళ-కౌశిక-సారస-మయూర-గోరంకు పక్షులు మొదట హోమములు చేసి మంత్రసిద్ధి చేసికొనవలెను. ఉచ్చాటనమున మంత్రప్రయోగము పల్లవరూపమున చేయవలెను. వశ్య-జ్వర-ఆకర్షణములందు పల్లవప్రయోగము సిద్ధికరము. శాంతియందును, మోహన ప్రయోగమునందును, ‘నమః’ అని చెప్పుట మంచిది. పుష్టి-వశీకరణములందు ‘వౌషట్’, మారణ-ప్రీతివినాశములందు ‘హుం’ ప్రయోగించవలెను. విద్వేషణమునందును, ఉచ్చాటనము నందును ‘ఫట్’ చెప్పుట మంచిది. పుత్రాది ప్రాప్తి ప్రయోగమునందును దీప్త్యాదులందును ‘వషట్’ చెప్పుట మంచిది. ఈ విధముగ మంత్రములలో ఆరు జాతు లేర్పడినవి. ఇపుడు అన్ని విధముల రక్షణము నిచ్చు ఓషధులను గూర్చి చెప్పుచున్నాను. మహాకాళీ, చండీ, వారాహీ, ఈశ్వరీ, సుదర్శనా, ఇంద్రాణీ-ఈ ఓషధులను శరీరము పై ధరించుటచే ధారకునకు రక్ష కలుగును. బలా, అతిబలా, భీరు, ముసలీ, సహదేవీ, జాతి, మల్లికా, యూథ, గారుడి, భృంగరాజ, చక్రరూపా-ఈ మహౌషధులను ధరించుటచే యుద్ధమునందు విజయము కలుగును. మహాదేవి ఈ ఓషధులను గ్రహణ సమయమున వెలికి తీయట శుభదాయకము. సర్వాంగ సంపన్న మెన ఏనుగ మూర్తి ఒకటి నిర్మించి, దాని పాదము క్రింద శత్రువుమూర్తి నుంచి, స్తంభన వయోగము చేయవలెను. లేదా ఒకే వృక్షమున్న ఒక పర్వతోపరిభాగమునందు ఆ చెట్టు క్రింద గాని, పిడుగుపడిన చోటున గాని, పుటమట్టితో ఒక స్త్రీమూర్తి నిర్మించి. “ఓం నమో మహాభైరవాయ వికృతదంష్ణోగ్ర రూపాయ పిజ్జలాశాయ, త్రిశూల ఖడరరాయ ‘పౌషట్’ అను మంత్రముచే ఆ మృత్తిక మయ దేవీమూర్తికి పూజ చేసి, శత్రువువద్ద నున్న శస్త్ర సమూహమున స్తంభింపచేయవలెను.
అగ్నికార్యం ప్రవక్ష్యామి రణాదౌ జయవర్ధనమ్ ।
శ్మశానే నిః కాష్ఠాగ్నౌ నగ్నో ముక్తశిఖోనరః.
దక్షిణాస్యస్తు జుహూయాన్నృమాంసం రుధిరం విషమ్ ।
తుషాస్థిఖణ్డమిశ్రం తు శత్రునామ్నా శతాష్టకమ్.
ఓం నమో భగవతి కౌమారి లల లల లాలయ లాలయ మణ్టా
దేవి అముకం మారయ మారయ సహసా నమోఽస్తుతే భగవతి
విద్యే స్వాహా.
అనయా విద్యయా హోమాదృన్దనం జాయతే రిపోః.
ఓం వజ్రకాయ వక్రతుణ్డ కపిలపిఙ్గల కరాల వదన ఊర్ద్వ
కేశ మహాబల రక్తముఖ తడిజ్జిహ్వ మహారౌద్ర దంష్ట్రోత్కట
కవాకరాలిన్ మహాదృథప్రహార లఙ్కేశ్వరసేతుబన్దప్రవాహ
గగనచర ఏహ్యేహి భగవన్ మహాబల పరాక్రమ భైరవో జ్ఞాప
యతి ఏహ్యహి మహారౌద్ర దీర్ఘలఙ్గూలేన ఆముకం వేష్టయ
వేష్టయ జమృయ జమ్భయ ఖన ఖన వైతేహూం ఫట్
ఆప్షత్రింకచ్ఛతం దేవి హనుమాన్సర్వకర్మకృత్ ।
పటే హనూమత్సన్దర్శాద్భఙ్గమాయాన్తి శత్రవః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే యుద్ధజయార్ణవే నానాచక్రవర్ణనం నామ పఞ్చవింశత్యధిక శతతమోఽధ్యాయః.
ఇపుడు యుద్ధమున విజయము చేకూర్చు ఆగ్ని కార్యమును గూర్చి చెప్పెదను. రాత్రి శ్మశానమునకు వెళ్ళి నగ్నుడై శిఖ విర బోసికొని, దక్షిణాభిముఖముగ కూర్చుండి జ్వలించుచున్న చితియందు మనుష్యమాంసర క్తములను, విషమును, ఊక ఎముకలు కలిపి, శత్రువు పేరు చెప్పుచు “ఓం నమో......విద్యేస్వాహా” అను (మూలములోనున్న) మంత్రముతో ఎనిమిదివందల పర్యాయములు హోమము చేయవలెను. అట్లు చేయగా శత్రువు బద్దుడై పోవును. (గ్రుడ్డివా డగును.) దేవీ! “ఓం వజ్రకాయ.........హుం ఫట్” అను (మూలములో నున్న) మంత్రమును మూడువేల ఎనిమిదివందల (3800) పర్యాయములు జపము చేయగా హనుమంతుడు అన్ని కార్యములను సమకూర్చును. వస్త్రముపై వ్రాసిన హనుమన్మూర్తిని చూపగనే శత్రువులు నశింతురు.
అగ్నిమహాపురాణమునందు, యుద్ధజయార్ణవమున నానాచక్రవర్ణన మను నూటఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 125 of the Agni Mahā Purana is as follows:
A survey of numerous other sacred tīrthas across Bhāratavarṣa is presented. Agni describes Kurukṣetra, Puṣkara, Gayā, Mathurā, Ayodhyā, Dvārakā, Hardvār, Badrikāśrama, Kedāranātha, and Rāmeśvara among others, with a verse or more extolling each site's particular sanctity and the phala of pilgrimage there. River-tīrthas including Godāvarī, Kṛṣṇā, Narmadā, Sindhu, and Kāverī are praised. The principle that a tīrtha visited with greed and pride yields no fruit whereas genuine śraddhā transforms even a small lake into Gaṅgā is reiterated.