అగ్ని మహా పురాణము

77 - అథ కపిలాపూజాది విధానమ్

ఈశ్వర ఉవాచః-

కపీలాపూజనం వక్ష్యే ఏభిర్మంత్రైర్యజేచ్చ గామ్

ఓం కపిలే నమో నమః ఓం కపిలేభద్రి కే నమః.

ఓం కపిలే సుశీలే నమః కపిలే సురభి ప్రభే

ఓం కపిలే సుమనసే నమః ఓం భుక్తి ముక్తి ప్రదే నమః.

నమః హం సోమాయ నమః, ఓం హం సూర్యాయ నమః, ఓం హం బృహస్పతయే నమః, ఓం హాం ప్రజాపతయే నమః, ఓం హాం సర్వేభ్యో దేవేభ్యో నమః, ఓం హం సర్వవిశ్వేభ్యో నమః, ఓం హం అగ్నయే స్విష్టకృతే నమః” అను ఎనిమిది మంత్రములతో ఎనమండుగురు దేవతలను పూజించవలెను. పిదప ఈ మంత్రముల చివర “స్వాహా చేర్చి ఒక్కొక్క ఆహుతి ఇచ్చి, అపరాధములను క్షమింపు డని ప్రార్థించి అందరిని విసర్జన చేయవలెను.

చుల్లా దక్షిణబాహౌ యజేద్దార్మాయ వై నమః

 వామబాహావధర్మాయ కాఞ్జికాదిక భాణ్డ కే.

రసపరివర్తమానాయ వరుణాయ జలాగ్నయే

విఘ్నరాజో గృహద్వారే పేషణ్యాం సుభగే నమః.

ఓం రౌద్రికే నమో గిరి కే నమశ్చోలూఖలే యజేత్

బల ప్రియాయాంబుధాయ నమ స్తే ముసలి యజేత్.

పొయ్యికి కుడిప్రక్క “ధర్మాయ నమః” అను మంత్రముతో ధర్మమును, ఎడమప్రక్క “అధర్మాయ నమః” అను మంత్రముతో అధర్మమును పూజించవలెను. గంజి మొదలగునవి పోయుట కషయోగించు పాత్రలందును, జలము నుంచు మటాదులందును “ఓం రసపరివర్తమానాయ వరుణాయ నమః” అను మంత్రముతో వరుణుని, వంటింటిద్వారమున అవిఘ్న రాజాయ నమః” అని విఘ్నేశ్వరుని, తిరుగలి పై “సుభగాయై నమః” అని సుథగను, రోటియందు “రౌద్రికే గిరికే నమః” అను మంత్రముచే రౌద్రికా-గిరికలను, రోకలియందు “బలప్రియాయుధాయ నమః” అను మంత్రముతో బలిరాముని ఆయుధ మును పూజించవలెను.

నంమార్జన్యాం దేవతోక్తే కామాయ శయనీయకీ

మధ్యస్తమే చ స్కస్ధాయ దత్త్వా వాస్తుబలిం తతః.

భుఞ్జీత పాత్రే సౌవర్ణే పద్మి న్యాదిదలాది కే

ఆచార్యః సాధకః పుత్రః సమయీ మౌనమాశ్రితః.

వటాశ్వత్థార వాతావిసర్జభల్లాతకాం స్త్యజేత్

ఆపౌశానం పురాదాయ ప్రాణాద్యైః ప్రణవాన్వితైః.

స్వాహా నేనాహులీః పఞ్చ దత్త్వా దీప్యోదరానలమ్

నాగ కూర్మోథ కృకరో దేవదత్తా ధనఞ్జయః.

ఏతేభ్య ఉపవాయుభ్యః సాహా పోశానవారిణా

భక్తాదికం నివేద్యాథ పిచ్ఛేషోదకం నరః.

అమృతోపస్తరణమసి ప్రాణాహుతీ స్తతో దధీత్

ప్రాణాయ స్వాహా పానాయ సమానాయ తత స్తథా.

ఉదానాయ చ వ్యానాయ భాక్త్వా చుల్లకమాచ రేత్

అమృతాపిధానమ నేతి నరీ రేన్నా దీవాయవః.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే కపిలాపూజాదివిధానం నామ సప్తసప్తతితమోఽధ్యాయః.

చీపురు పైన పూర్వోక్త దేవతలను (రౌద్రికాగిరికలను), శయ్య పై కామదేవుని, మధ్యనున్న స్తంభముపై స్కందుని పూజింపవలెను. పిమ్మట వ్రతపాలనము చేయు సాధకుడును, పురోహితుడును వాస్తుదేవతకు బలి సమర్పించి, బంగారు పాత్రలో గాని, లేదా తామరాకులలో గాని భోజనము చేయవలెను. మట్టి, రావి, జిల్లేడు, వాతావి! సర్జము, భల్లాతకము ఈ ఆకులలో భోజనము చేయగూడదు. ముందు ఆచమనము చేసి, ప్రాణ మొదలగు శబ్దములకు మొదట “ఓం” కారము చివర “స్వాహా చేర్చి అన్నము ఐదు ఆహుతులు తీసికొని, జఠరాగ్నిని ఉద్దీపము నిసిన పిమ్మట భోజనము చేయవలెను. వాగ--కూర్మ-కృకల-దేవదత్త.లేవంజయములు' ఉపవాయువులు “ఏతేభ్యో నాగాదిభ్య ఉపవాయుభ్యః స్వాహా” అను మంత్రముతో ఆచమనము చేసి, ఆ దులను నివేదసము చేసి, చివర మరల ఆచమనము చేసి “ఓం అమృతోపస్తరణమసి స్వాహా అని చెప్పి, “ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయస్వాహా, ఓం సమానాయ స్వాహా” అను మంత్రములతో పంచ ప్రాణములకుమ పంచాహును తన ముఖమునందు ఈయవలెను. పిమ్మట పూర్తిగా భోజనముచేసి, చుబుకము నీటితో ఆచమనము చేసి, “ఓం అమృతాపిధానమసి స్వాహా” అని చెప్పవలెను. ఈ ఆచమనము శరీరములోపల నున్న అన్న మును ఆచ్చాదించుటకు ఉపయోగించును.

అగ్ని మహాపురాణమునందు కపిలా పూజాది విధాన మను డెబ్బది యేడవ అధ్యాయము సమాప్తము.