అగ్ని రువాచః
ఆభిముఖ్యం నయన్నర్థాన్విజ్ఞేయోఽభి నయోబుధైః ।
చతుర్దసంభవః సత్త్వావాగంగా హరణాశ్రయః.
స్తంభాదిః సాత్త్వికో వాగారంభో వాచిక ఆంగికః ।
శరీరారంభ ఆహార్యో బుద్ద్యారంభ ప్రవృత్తయః .
రసాది వినియోగోథ కథ్యతే హ్యభిమానతః ।
తమంత రేణ సర్వేషామపార్థైవ స్వతంత్రతా.
సంభోగో విప్రలంభశ్చ శృంగారో ద్వివిధః స్మృతః ।
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ తావపి ద్వివిధౌపునః.
విప్రలంభాభి ధానోయః శృంగారః సచతుర్విధః ।
పూర్వానురాగమానాఖ్యః ప్రవాస కరుణాత్మకః.
ఏతేభ్యోఽన్యతరం జాయమాన సంభోగ లక్షణమ్ ।
వివర్తతే చతుర్థైవనచ ప్రాగతివర్తతే.
స్త్రీ పుంసయో స్త దుదయ స్తస్య నిర్వర్తికారతిః ।
నిఖిలాః సాత్త్వికా స్తత్ర వై వర్ణ్య ప్రలయౌవినా.
ధర్మార్థకామమోక్షైశ్చ శృంగార ఉపచీయతే ।
ఆలంబన విశేషైశ్చ తద్విశేషైర్నిరంతరః.
శృంగారం ద్వివిధం విద్యాద్వాజ్ నేపథ్య క్రియాత్మకమ్ ।
హాసశ్చతుర్విధోఽలక్ష్యదన్తః స్మితఇతీరితః.
కించిల్లక్షిత దంతాగ్రం హసితం ఫుల్లలోచనమ్ ।
విహసితం సస్వనం స్యాజ్జిహ్మోప హసితంతు తత్.
సశబ్దం చాపహసిత మశబ్దమతీ హాసితమ్ ।
యశ్చాసౌ కరుణోనామ సరసస్త్రి విధోభ వేత్.
ధర్మోప ఘాతజశ్చిత్త విలాస జనిత స్తథా ।
శోకః శోకాద్భవేత్స్థాయీకః స్థాయీపూర్వజో మతః.
అంగ నేపథ్య వాక్యైశ్చ రౌద్రోఽపి త్రివిధోరసః ।
తస్య నిర్వర్తకః క్రోధః స్వేదో రోమాంచ వేపథూ.
అగ్ని దేవుడు పలికెను. విషయమును ఆభి ముఖములు చేయువది ఆభినయము. సాత్త్వికము, వాచికము, ఆంగికము, ఆహార్యము అని ఇది నాలుగు విధములు. స్తంభాధికము సాత్త్వికము. వాక్ప్ర వృత్తి వాచికము. శరీర చేష్ట ఆంగికము. బుద్ధిని ఉపయోగించి చేయునది ఆహార్యము. అభిమాన స్థితిచే రసాది వినియోగము చెప్పబడుచున్నది. రసము లేకుండగా మిగిలినవి స్వతంత్రములుగా నుండుట వ్యర్థము. సంభోగము విప్రలంబము యని శృంగారము రెండు విధములు. ప్రచ్ఛన్నము ప్రకాశము యని యవి రెండేసి విధములు. పూర్వానురాగము మానము ప్రవాసము కరుణ యని విప్రలంబము వాలుగు విధములు. వీనిలో ఒక దాని వలన సంభోగ శృంగారము ఉత్పన్న మగును. ఇది కూడ నాలుగు విధములు. స్త్రీ, పురుషలమ ఆశ్రయించి వుండును. శృంగార జనక నురతి. వై వర్ణ్య ప్రళయములు తప్ప అన్ని సాత్త్విక భావములు దీని యందుండును. ధర్మార్థ కామ మోక్షముల చేతను అలంబన విశేషముల చేతను వాటి అవాంతర విశేషము చేతను శృంగారము నిరంతరము పుష్టిపొందును. శృంగారము వాక్ క్రియ నేపథ్య క్రియ అని రెండు విధములు. హాసము నాలుగు విధములు. దంతములు కనబడనిది స్మితము. కొంచెము దంతాగ్రములు కనబడి నేతములు వికసించినచో అది హసితము. ధ్వనితో కూడినది విహసితము. కుటిలత్వముతో కూడినది ఉపహసితము. సశబ్దముగ ఉన్నది అపహసితము. ఎక్కువ శబ్దము కలది అతిహసితము. కరుణ రసము ధర్మోప ఘాతజము, చిత్తవిలాస జనితము, శోక జనితము యని మూడు విధములు. దీనికి శోకము స్థాయి భావము. రౌద్ర రసము కూడ అంగ నేపథ్య వాక్యములచే మూడు విధములు. దీని స్థాయీ భావము క్రోధము. స్వేద రోమాంచ వేపథువులు వుండును.
దానవీరో ధర్మవీరో యుద్దవీర ఇతిత్రయమ్ ।
వీర స్తస్యచ నిష్పత్తి హేతురుత్సాహ ఇష్యతే.
ఆరంభేషు భవేద్యత్ర వీర మేవాను వర్తతే ।
భయానకో నామ రస స్తస్య నిర్వర్తకం భయమ్.
ఉద్వేజనః క్షోభణశ్చ బీభత్సో ద్వివిధః స్మృతః ।
ఉద్వేజనః స్యాత్ప్లుత్యాద్యైః క్షోభణోరుధి రాదిభిః.
జుగుప్సారంభి కాతస్య సాత్త్వికాంశో నివర్తతే ।
దాన వీరము, ధర్మ వీరము, యుద్ధ వీరము అని వీరము మూడు విధములు. ఉత్సాహము స్థాయీ భావము. ప్రారంభమున వీర ముండి చివర మునకు భయమును కలిగించునది భయావకము. దాని స్థాయి లావము భయము. ఊద్ద్వే జనము క్షోభణము యని బీభత్సము రెండు విధములు. పూతి వస్తువులచే కలిగినది ఉద్వేజనము. రుదిరాదులచే కలిగినది క్షోభణము. దీని స్థాయీ భావము జుగుప్స. దీని యందు సాత్త్విక భావములుండవు.
కావ్యశోభాకరాన్దర్మా నలంకారాన్ప్రచక్షతే.
అలంకరిష్ణ వస్తేచ శబ్దమర్థ ముభౌత్రిధా ।
దేవ్యుత్పత్త్యాదినా శబ్దమలంకర్తు మిహక్షమాః.
శబ్దాలంకార మాహుస్తాన్కా వ్యమీమాం సకావిదః ।
ఛాయాముద్రాతథో క్తిశ్చ యు క్తిర్గుం ఫనయాసహ.
వాకోవాక్య మనుప్రాసశ్చిత్తం దుష్కరమేవచ ।
జ్ఞేమాన వాలంకృతయః శబ్దానామిత్య సంక రాత్.
తత్రాన్యో క్తేరనుకృతి చ్ఛాయాసాపి చతుర్విధా ।
లోక చ్ఛే కార్భ కోక్తీనామేకో క్తేరను కారతః.
ఆభాణకో క్తిర్లోకోక్తిః సర్వ సామాన్య ఏవతాః ।
యానుధావతి లోకోక్తి శ్చాయామిచ్చన్తి తాంబుధాః.
ఛకావీదగ్ధా వైదగ్ధ్యం కలాసుకుశలామతిః ।
తాముల్లిఖన్ తీ ఛేకోక్తి చ్ఛాయా కవిభిరిష్యతే.
అవ్యుత్పన్నో క్తి రఖిలై రర్భకోక్త్యోపలక్ష్యతే ।
తేనార్భకోక్తి శ్ఛాయాతన్మాత్రోక్తి మనుకుర్వతీ.
విప్లుతాక్షర మశ్లీలం వచో మత్తస్య తాదృశీ ।
యాసాభవతి మత్తో క్తిశ్చాయోక్తాప్యను శోభతే.
అభిప్రాయ విశేషేణ కవిశక్తిం వివృణ్వతీ ।
ముత్ర్పదాయినీతి సాముద్రా సైవశయ్యాపి నోమతే.
ఉక్తిః సా కథ్యతే యస్యామర్థకోఽప్యుప పత్తిమాన్ ।
లోకయాత్రార్థ విధినాధినోతి హృదయం సతామ్.
ఉభౌవిధి నిషేధౌచ నియమా నియమావపి ।
వికల్ప పరిసంఖ్యేచ తదీయాః షడథోక్తయః.
ఆయు క్తయోరివ మిథో వాచ్యవాచక యోర్ద్వయోః ।
యోజనాయై కల్ప్యమానాయుక్తి రుక్తా మనీషిభిః.
పదంచైవ పదార్థంచ వాక్యం వాక్యార్థమేవచ ।
విషయోఽస్యాః ప్రకరణం ప్రపంచ శ్చేతి షడ్విధః.
గుంఫనారచనాచర్యా శబ్దార్థ క్రమగోచరా ।
శబ్దానుకారాదర్థాను పూర్వార్థేయం క్రమాత్త్రిదా.
ఉక్తిప్రత్యు క్రిమద్వాక్యం వాకోవాక్యం ద్విధై వతత్ ।
ఋజువక్రో క్తిభేదేన తత్రాద్యం సహజం వచః.
సాపూర్వప్రశ్నికా ప్రశ్న పూర్వి కేతి ద్విధాభ వేత్ ।
వక్రో క్తిస్తు భవేద్యంగ్యాకాకు స్తేన కృతాద్విధా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నే యేఽభినయాది నిరూపణం నామ ద్వాచత్వారింశ దధిక త్రిశతతమోఽధ్యాయః.
కావ్య శోభాకరములగు ధర్మములను అలంకారములందురు. ఇవి శబ్దమును, అర్థమును, ఉభయమును అలంక రించును. వ్యుత్పత్త్యాదులచే శబ్దమును అలంకరించునవి శబ్దాలంకారములు. ఛాయ, ముద్ర, ఉక్తి, యుక్తి, గుంఫివ, వాకో వాక్యము అనుప్రాసము, చిత్తము, దుష్కరము. ఇవి తొమ్మిది శబ్దాలంకారములు. ఇతరుల ఉక్తిని అనుకరించుటకు ఛాయ అని పేరు. లోక ఛేక, ఆర్భక మత్తుల ఉక్తుల ఆనుకరణములను బట్టి ఇది నాలుగు విధములు. ఆభాణము లోకోక్తి. యిది సర్వ సామాన్యము, లోకోక్తిని యనుసరించు రచనమును లోకోక్తి ఛాయ యని యందురు. చతురులకు చేరులు యని పేరు. కలా కౌశల్యమే బాతుర్యము. దానిని ప్రదర్శించునది ఛేకోక్తి ఛాయ. ఆర్బ కోక్తి అవ్యుత్పన్నుల ఉక్తి. దానిని అనుకరించు నది ఆర్బ కోక్తి యని పేరు. మత్తుల వాక్యము అశ్లీలము గాను లుప్తాక్షరము గాను వుండును. దాని ఛాయ కలది మల్తో కి ఛాయ. ఇది సమయానుసారముగా ఉపయోగించినచో శోభాకరముగా నుండును. ఆభిప్రాయ విశేషముచే కవిశ క్తిని సృష్టికరించుచు ఆనందమును కలిగించునది ముద్ర. యదియే మామతమున శయ్య యుక్తి యుక్త మగు అర్థమును బోధించు నది లోక యాత్రానుసారముగా నుండి సహృదయుని హృదయమును ఆనందింప చేయు నది ఉక్తి. విధి నిషేధము అని నియ మము ఆనియమము అని వికల్పము, పరిసంఖ్య అని ఊకులు ఆరు విధములు. వేర్వేరుగా నున్న వాచ్య వాచకములను కలుపుటకు సమర్థమైన దానిని యుక్తి యందురు. పదము పదార్థము, వాక్యము వాకార్థము, ప్రకరణము ప్రపంచము అని యుక్తి ఆరు విధములు. రచనా చర్యకు గుంఫన యని పేరు. శబ్దార్థ క్రమగోచర, శబ్దానుకార, ఆర్గాను పూర్వార్డ్ ఆని అది మూడు విధములు. ఉక్తి ప్రత్యు క్తులు గల వాక్యము వాకో వాక్యము, ఋజు వుక్తి వక్రోక్తి అని ఆది రెండు విధములు. మొదటిది స్వాభావిక వచన రూపము. అది పూర్వ ప్రశ్నిక, ఆప్రశ్న పూర్వికా అని రెండు విధములు. భంగవ క్రోక్తి కాకు వక్రోక్తి యని వక్రోక్తి కూడ రెండు విధములు,
అగ్ని మహా పురాణమున ఆభినయాది నిరూపణ మను మూడు వందల నలుబది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 343 of the Agni Purāṇa is as follows:
The figures of speech that operate primarily at the level of sound (śabdālaṅkāra) are catalogued. The five varieties of anuprāsa (alliteration and sound-echo) — madhurā, lalitā, prauḍhā, bhadrā, and paruṣā — are explained by examples. The elaborate citrabandha (picture-poem) tradition is described: the sarvato-bhadra (readable in all directions), the kamala-bandha or padmabandha (lotus-shaped text in four, eight, or sixteen petals), the cakra-bandha (wheel-shaped poem with four or six spokes), the muraja-bandha (drum-shaped), and the gomūtrikā (zigzag cow-urine pattern). Weapon-shaped and geometric bandhas are also mentioned, revealing how the Agni Purāṇa treats the visual arrangement of text itself as a sacred art.