అగ్ని మహా పురాణము

76 - చండపూజవర్ణన

టజ్క కారేఽర్ధచంద్రే వా చతుర్వక్రం ప్రపూజ యేత్

 యథాశ క్తి జపం కుర్యాదజ్గానాం తు దశాంశతః.

గోభూహిరణ్యవస్త్రాది మణి హేమాది భూషణమ్

విహాయ శేష నిర్మాల్యం చణేశాయ సమర్పయేత్.

లేహ్య చోష్యాద్యన్న వరం తామూృలం స్రగిలేపనమ్

నిర్మాల్యం భోజనం తుభ్యం ప్రదత్తం తు శివాజ్ఞయా.

సర్వమేతత్రి యాకాణ్డం మయా చడ్డ తవాజ్ఞయా

న్యూనాధికం కృతం మోహాత్పరిపూర్ణం సదాస్తు తే.

ఇతి విజ్ఞాప్య దేవేశం దత్త్వాక్యం తస్య సంస్మరన్

సంహారమూ ర్తిమ శ్రేణ శనైః సంహారముద్రయా.

పూరకాన్వితమూలేన మన్రానాత్మని యోజయేత్

నిర్మాల్యాపసయస్థానం లిమేర్గోమయ వారిణా.

ప్రోక్ష్యార్ఘ్యాది విసృజ్యాథ స్యా చాన్తన్యత్సమాచ రేత్

ఇత్యాది మహాపురాణే అగ్నే యే చణ్డపూజావిధానం నామ షట్సప్తతిత మోఽధ్యాయః.

ఓం చణ్డేశాయ నమః అని పూజ చేయవలెను ఓం ధూలిచణేశ్వరాయ హూ ఫట్ స్వాహా ఆనుచు ఆ విగ్రహముపై చండేశ్వరుని ఆవాహనము చేయవలెను పిమ్మట అంగపూజ “ఓం చణ్డశిర! హూం ఫట్ అని శిరస్సును, “ఓం చణ్డశిఖాయై హూం ఫట్” అని శిఖను “ఓం చణ్డయుష్కవచాయ హూం ఫట్ అని కవచమును, “ఓం చణ్డస్త్రీయ హూం ఫట్” అని అస్త్రమును పూజించవలెను. పిదప రుద్రాగ్ని నుండి - జనించిన చండ దేవతను “చండదేవుడు. హస్త మునితో శూలమును, టంకమును ధరించి యుండును నీల వర్ణము కలవాడు మూడవ హస్తమున అక్షసూత్రమును, నాల్గవ హస్తమున కమండలమును ధరించి యుండును. అతడు ఓంకారము గలది, లేదా ఆర్థచంద్రాకారము గలది యగా మండలమున ఉండును. నాలుగు ముఖములు కలవాడు” అని ధ్యానించి, పూజించి, యథాశక్తి జపము చేయవలెను హోమసామాగ్రి సమకూర్చుకొని జపములు దళాంశము హోమము చేయవలెను భగవంతునకు సమర్పించిన గో భూ-సువర్ణ-వస్త్రరత్నాదులు తప్ప మిగిలిన నిర్మాల్యము నంతను చండేశ్వరునకు సమర్పించవలెను.

సమయమున ఇట్లు చెప్పవలెను.- “ఓం చండేశ్వరా! శివుని ఆజ్ఞచే ఈ లేహ్యచోషార్వత్త మాన్నము, తాంబూలము, పుష్పములు, అనులేపనము మొదలగు, నిర్మాల్యరూప భోజనమును నీకు సమర్పించుచున్నాను చండా! పూజకు సంబంధించిన ఈ కర్మ కొండయు నంతను నేను నీ ఆజ్ఞచే నిర్వర్తించితిని. అజ్ఞానము చే కలిగిన న్యూనత్వాధికత్వాది దోషములు తొలగి ఈ పూజాదికము పరిపూర్ణమగుగాక” ఈ విధముగ నివేదించి, ఆ దేవతలను స్మరించుచు, అర్ఘ్య మిచ్చి, సంహార మూర్తి మంత్రమును చదివి, సంహార ముద్ర భూముల నన్నింటిని తనలో ఉపసంహరించు కొనవలెను. నిర్మాల్యమును తోసివేసిన ప్రదేశమును గోమయజలముతో అలికి, ఆర్ఘ్యదుల ప్రోక్షణము చేసి దేవతావిసర్జనము చేసిన పిమ్మట ఆచమనము చేసి మిగిలిన అవశ్యక కావ్యములను ముగించుకొనవలెను.

అగ్నిమహాపురాణమునందు చండపూజావర్ణన మను డెబ్బదియారవ అధ్యాయము సమాప్తము.