అగ్ని మహా పురాణము

14. మహాభారతాఖ్యానము.

అగ్ని రువాచః

యౌధిష్ఠిరీ కురుక్షేత్రం యయౌ దౌర్యోధనీ చమూః

భీష్మద్రోణాదికాన్ దృష్ట్వా నాయుధ్యతి గురూనితి.

పార్థం హ్యువాచ భగవాన్నశోచ్యా భీష్మముఖ్యకాః

శరీరాణి వినాశీని న శరీరీ వినశ్యతి.

అయమాత్మా పరం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి విద్ధి తమ్

సిద్ధ్యసిద్ధ్యోః నమో యోగీ రాజధర్మం ప్రపాలయ.

యుధిష్ఠిరుని సేనయు, దుర్యోధనుని నేనయు కురు క్షేత్రమును చేరినవి. ఆర్జునుడు భీష్మద్రోణాదులను చూచి యుద్ధము చేయ డని తెలిసికొని, భగవంతు డైన శ్రీకృష్ణు డాతనితో ఇట్లనెను. భీష్మాదులను గూర్చి శోకింప పనిలేదు. శరీరములు నశించును గాని ఆత్మ నశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే. “నేనే పరబ్రహ్మను” అని తెలిసికొనుము. ప్రయత్నము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమబుద్ధి కలవాడవై, యోగివై, రాజధర్మమును పాలించుము.

కృష్ణోక్తోథార్జునోఽయుధ్యద్రథస్థో వాద్యశబ్దవాన్

భీష్మః సేనాపతిరభూ దాదౌ దౌర్యోధనే బలే.

పాణ్డవానాం శిఖణ్డీ చ తయార్యుద్ధం బభూవ హ

 ధార్తరాష్ట్రాః పాణవాంశ్చ జమ్ను ర్యుద్దే సభీష్మకాః.

ధార్తరాష్ట్రాన్శిఖడ్గాద్యాః పాణ్డవా జమ్ను రాహవే

 దేవాసురసమం యుద్ధం కురుపాణ్డవ సేనయోః.

బభూవ ఖస్థ దేవానాం పశ్యతాం ప్రీతివర్ధనమ్

            ఈ విధముగా కృష్ణుడు ఉపదేశించగా ఆర్జునుడు రథము పై నెక్కి, వాద్య శబ్దములు చేయుచు యుద్ధము చేసెను. మొదట దుర్యోధన సైన్యమునకు భీష్ముడు సేనాపతి యయ్యెను. పాండవులకు శిఖండి సేనాపతి అయ్యెను. ఆ రెండు సైన్యములకును యుద్ధము జరిగెను. భీష్మునితో కూడిన కౌరవులు యుద్ధమునందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధమునందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము, ఆకాశము నుండి చూచుచున్న దేవతలకు ప్రీతిని వృద్ధిపొందించుచు, దేవాసుర యుద్ధము వలె జరిగెను.

భీష్మోఽ స్త్రైః పాణ్డవం సైన్యం దశాహోభిర్నపాతయత్.

దశమే హ్యర్జునో బా డైరీష్మం వీరం వవర్ష హ

శిఖణ్డీ ద్రుపదోక్తో శ్రార్వవర్ష జలదో యథా.

 హస్త్యశ్వరథపాదాతమన్యోన్యాస్త్రనిపాతితమ్

భీష్ముడు వది దివసములలో, అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసము చేసెను. వదవ రోజున, ఆర్జునుడు వీరుడైన భీష్ముని పై బాణవర్షము కురిపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడ, మేమమువలే అస్త్రములను వర్షం చెను. పరస్పరము ప్రయోగించిన స్త్రజాలముచే ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు నేల పై కూలెను.

భీష్మః స్వచ్ఛందమృత్యుశ్చ యుద్దమార్గం ప్రదర్శ చ.

వసూక్తో వసులోకాయ శరశయ్యాగతః స్థితః

ఉత్తరాయణమీక్షంశ్చ ధ్యాయన్ విష్ణుం స్తువన్ స్థితః

స్వేచ్ఛామరణము గల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధము చేయవలెనో పాండవులకు చెప్పి వస్తువులచేత పేరితు డై, వసులోకమునకు తిరిగి వెళ్ళదలచి, శరశయ్యాగతుడై , విష్ణువును ధ్యానించుచు, స్తుతించుచు, ఉత్తరాయణము నకై వేచి యుండెను.

దుర్యోధనే తు శోకార్తె ద్రోణః సేనావతి స్వభూత్

పాణ్డవే హర్షితే సైన్యే ధృష్టద్యుమ్నశ్చమూపతిః.

దుర్యోధనుడు శోకార్తుడయ్యెను. అపుడు ద్రోణుడు సేనాధిపత్యము వహించెను. సంతసించిన పాండవ సైన్యమున ధృష్టద్యుమ్నుడు నేనాపతి అయ్యెను.

తయోర్యుద్ధం బభూవోగ్రం యమరాష్ట్ర వివర్ధనమ్

విరాటద్రువదాద్యాశ్చ విమగ్నా ద్రోణసాగరే.

వారిరువురికిని యముని రాష్ట్రమును పెంచు యుద్ధము జరిగెను. ద్రోణ డను మహాసముద్రమునందు విరాట ద్రుపదాదులు మునిగిపోయిరి.

దౌర్యోధనీ మహా నేనా హ న్యశ్వరథవత్తినీ

ధృష్టద్యుమ్నాధిపతినా ద్రోణః కాల ఇవాబభౌ.

హస్వశ్వరథపదాతులు గల దుర్యోధన నేన కూడ పాండవ సేనాపతి యైన ధృష్టద్యుమ్ను ని చేత (చంవ బడెను). ద్రోణుడు యుద్ధమునందు యముడు వలే కన్పట్టెను.

హతోశ్వత్థామా చేత్యు కే ద్రోణః శస్త్రాణి చాత్యజత్

ధృష్టద్యుమ్న శరాక్రా నః పాతితః స మహీతలే.

పఞ్చమేహని దుర్ధర్షః సర్వక్షత్రం ప్రమథ్య చ !

ఆశ్వత్థామ మరణించేను. అను మాట విని ద్రోణుడు ఆయుధములను విసర్జించెను. ఎదిరింప శక్యము కాని ఆతడు సర్వశత్రియులను సంహరించి ఐదవ దివసమున ధృష్టద్యుమ్ను ని బాణములచే కొట్టబడి మరణించెను.

 దుర్యోధనే తు శోకార్తే కర్ణః సేనాపతి స్వభూత్.

ఆర్జునః పాణ్డవానాం చ తయార్యుద్ధం బభూవ హ

శస్త్రాశస్త్రి మహారౌద్రం దేవాసురరణోపమమ్.

దుర్యోధనుడు “కార్తుడయ్యెను. అపుడు కర్ణుడు సేనాపతి ఆయెను. అర్జునుడు పాండవుల సేనాపతి ఆయెను వారిరువురును శస్త్రములతో ఒకరి నొకరు కొట్టుకొనగా భయంకరమైన, దేవాసురయుద్ధతుల్య మగు యుద్ధము జరిగేను.

కర్ణార్జునాఖ్యే సజ్గ్రామే కర్ణోఒరీనవధీచ్చరైః

 ద్వితీయేహని కర్ణస్తు అర్జునేన నిపాతితః.

కర్ణార్జునసంగ్రామమునందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. రెండవ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను.

శల్యో దినార్ధం యుయుధే హ్యవధీ త్తం యుధిష్ఠిరః

యుయుగే భీమ సేనేన హత సైన్యః సుయోధనః.

బహూన్ హత్వా నరాదీంశ్చ భీమ సేన మథాద్రవత్

 గదయా ప్రహర క్తం తు భీమస్తం పా వ్యపాతయత్.

గదయాన్యానుజాం స్తస్య తస్మిన్నష్టాద శేఒహని

శల్యుడు సేనాధిపత్యమును వహించి అర్ధ ఎవనము యుద్ధము చేసెను. యుధిష్ఠిరు డాతనిని సంహరించెను. సైన్యము నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధము చేసెను. చాలమంది సైనికులు మొదలగు వారిని చంపి అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమ సేనుడు గదతో యుద్దము చేయుచున్న ఆతనిని ఆతని తమ్ములను పదునెనిమిదవ దివసమున పడగొట్టెను.

రాత్రా సుషుప్తం చ బలం పాణవానాం న్యపాతయత్.

అక్షౌహిణీ ప్రమాణం తు ఆశ్వత్థామా మహాబలః

ద్రౌపదేయాన్ స పాఞ్చాలాన్ ధృష్టద్యుమ్నం చ సోవధీత్.

మహాబలశాలియైన అశ్వత్థామ, రాత్రియందు నిద్రించుచున్న, పాండవుల, అక్షౌహిణీప్రమాణము గల నేను ద్రౌపదీపుత్రులను, పాంచాలులను, ధృష్టద్యుమ్నుని చంపెను.

పుత్రహీనాం ద్రౌపదీం తాం రుద నీమర్జున స్తతః !

శిరోమణిం చ జగ్రాహ ఐషీకాస్త్రేణ తస్య చ.

పిమ్మట అర్జునుడు పుత్రహీనురాలై విలపించుచున్న ద్రౌపదిని చూచి ఆమెను ఓదార్చుటకై, ఐషికాస్త్రముచే ఆశ్వత్థామ శిరోమణిని గ్రహించెను.

అశ్వత్థామాస్త్రనిర్దగ్ధం జీవయామాస వై హరిః

ఉత్తరాయా స్తతో గర్భం స పరీక్షిడభూన్నృపః.

శ్రీ కృష్ణుడు అశ్వత్థామస్త్రముచే దహింపబడుచున్న ఉత్తరాగర్భమును రక్షించెను. పిమ్మట ఆ గర్భస్థశిశువు పరీతిన్మహారాజు ఆయెను.

కృతవర్మా కృపో ద్రౌణిస్త్రయోము క్తాంతతో రణాత్

పాణ్డవాః సాత్యకి కృష్ణః సప్త ముక్తా న చాపరే.

ఆ యుద్దమునుండి, కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామ అను ఈ ముగ్గురు మాత్రమే ప్రాణములతో బయట పడిరి. పాండవ పక్షమున పంచపాండవులు, సాత్యకి, కృష్ణుడు ఈ ఏడుగురు మాత్రమే. మిగిలిరి. మరెవ్వరును మిగలలేదు.

స్త్రియశ్చాత్తాః సమాశ్వాస్య భీమా ద్యైః న యుధిష్ఠిరః

సంస్కృత్య ప్రహతాన్వీరాన్డతోదకధనాదిక.

భీష్మాచ్ఛా ననవాచ్భుత్వా ధర్మాన్ సర్వాంశ్చ శా నిదాన్

రాజధర్మాన్ మోక్షధర్మాన్ దానధర్మానృపోథవత్.

అశ్వమేధో దదౌ దానం బ్రాహ్మణేభ్యోఒరి మర్దనః

యుధిష్ఠిరుడు దుఃఖార్త లైన స్త్రీలను ఓదార్చి, భీమాదిన మేతుడై, మరణించిన వీరు లందరికిని పేత సంస్కా రములను చేసి, వారికై ఉదక ధనాదిదానములు చేసి, శంతనుకుమారు డైన భీష్మునినుండి శాంతిని కలిగించు సమస్త ధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను, దానధర్మములను విని, రాజయ్యేను. శత్రుసంహారి యైన ఆతడు ఆశ్వమేధ మాచరించి, బ్రాహ్మణులకు దానము లిచ్చెను.

శ్రుత్వార్జునాన్మౌసలేయం యాదవానాం చ సంక్షయమ్

 రాజ్యే పరీక్షితం స్థావ్య సానుజః స్వర్గమాప్తవాన్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ చతుర్దశోధ్యాయః.

ముసలము పుట్టి యాదవు లందరును నశించి రను విషయమును ఆర్జునునినుండి తెలిసికొని పరీక్షిత్తును రాజ్యాధి షిక్తుని చేసి, సోదరసహితుడై స్వర్గము చేరెను.

అగ్ని మహాపురాణమునందు మహాభారతాఖ్యాన మను చతుర్దశాధ్యాయము సమాప్తము.