సంక్షేపాత్సర్వదేవానాం పవిత్రారోపణం శృణు ।
పవిత్రం పూర్వలక్ష్మీ స్యాత్త్వరసానలగం త్వపి.
జగద్యోనే సమాగచ్చ పరివారగణైః సహ ।
నిమన్త్రయామ్యహం ప్రాతర్దద్యాం తుభ్యం పవిత్రకమ్.
జగత్సృజే నమస్తుభ్యం గృహ్ణీష్వేదం పవిత్రకమ్ ।
పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్ ।
శివ దేవ నమస్తుభ్యం గృహ్ణీష్వేదం పవిత్రకమ్ ।
మణివిద్రుమమాలాభిర్మన్దారకుసుమాదిభిః.
ఇయం సంవత్సరా పూజా తదాస్తు వేదవిత్పతే ।
సాంవత్సరా యమాం పూజాం సంపాద్య విధివన్మమ.
ప్రజ పవిత్రకేదానీం స్వర్గలోకం విసర్జితః ।
సూర్యదేవ నమస్తుభ్యం గృహ్ణేష్వేదం పవిత్రకమ్.
పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్ ।
శివ దేవ నమస్తుభ్యం గృహ్ణీష్వేదం పవిత్రకమ్.
పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్ ।
గణేశ్వర సమస్తుభ్యం గృహ్ణీష్వేదం పవిత్రకమ్.
పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్ ।
శక్తి దేవి నమస్తుభ్యం గృహ్ణీష్వేదం పవిత్రకమ్.
పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్ ।
ఆగ్ని దేవుడు చెప్పేను :- ఇపుడు సమస్తదేవతాపవిత్రారోపణవిధానముమ సంక్షేపముగ చెప్పుచున్నాను. వినుము. పైన చెప్పిన లక్షణములు గల పవిత్రములనే దేవతలకు సమర్పింపవలెను. వాటిలో “స్వరసము” “అనలగము” ఆని రెండు భేదము లున్నవి. మొదట ఇష్టదేవతను ఈ క్రింద చెప్పిన విధముగ ఆహ్వానింపవలెను - “జగత్తునకు కారణ మైన బ్రహ్మదేవా! పరివార సహితుడవై ఇచటకు రమ్ము. నేను ని న్నా హ్వానించుచున్నాను. రేపు ప్రాతఃకాలమునందు నీకు పవిత్రకము సమర్పింపగలడు”. మరునాడ మరల ఈ విధముగ ప్రార్థించుచు పవిత్రకములు సమర్పింపవలెను. “జగతృష్టికర్త లైన విధాతా! నీకు నమస్కారము. ఈ పవిత్రకమును స్వీకరింపుము. నా పవిత్రత్వము కొరకై నీకు దీనిని సమర్పించుచున్నాను. ఇది సంవత్సర మంతయు జరుగు పూజఫలము నిచ్చునది”. “వేదవేత్తలను రక్షించు శివా! దేవా! నీకు నమస్కారము. ఈ పవిత్రకమును స్వీకరింపుము. దీనిచే మణులతో పగడములతో, మందార కుసుమాదులతో నీకు సంవత్సర మంతయు చేయు పూజ దీనిచే సంపన్న మగుగాక”. “ఓ పవితకమా! నేను చేయు ఈ వార్షికపూజను యథావిధిగ సుసంపన్నము చేసి, నీవు స్వర్గలోకమునకు పొమ్ము”. “సూర్యదేవా! నీకు నమస్కారము. ఈ పవిత్రకము స్వీకరింపుము. పవిత్రము చేయగల దను ఉద్దేశ్యముతో దీనిని నీకు సమర్పించుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజకు ఫలము నివ్వగలదు”. “గణేశా! నీకు నమస్కారము. ఈ పవిత్రకము స్వీకరింపుము. పవిత్రము చేయుటకై దీనిని ఇచ్చుచున్నారు. ఇది ఒక సంవత్సరము జరుగు పూజ ఫల మిచ్చును”. “ఓ! శక్తిదేమీ! నీకు నమస్కారము. ఈ పవిత్రకము స్వీకరింపుము. పవిత్రము చేయు నను ఉద్దేశ్యముతో దీనిని ఇచ్చుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజ ఫలము నిచ్చును”.
నారాయణమయం సూత్రమనిరుద్దమయం వరమ్.
ధనధాన్యాయురారోగ్యప్రదం సంప్రదదామి తే ।
కామదేవమయం సూత్రం సఙ్కర్షణమయం వరమ్.
విధ్యాసన్తతిసౌభాగ్యప్రదం సంప్రదదామి తే ।
వాసుదేవమయం సూత్రం ధర్మకామార్థమోక్షదమ్.
సంసారసాగరోత్తారకారణం ప్రదదామి తే ।
విశ్వరూపమయం సూత్రం సర్వదం పాపనాశనమ్.
అతీతానాగతకులసముద్ధారం దదామి తే ।
కనిష్ఠాదాని చత్వారి దదిరే మునిభిః క్రమాత్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సర్వదేవపవిత్రారోపణం నామ సప్తత్రింశోఽధ్యాయః.
“పవిత్రకమునందలి ఈ దారము నారాయణ అనిరుద్ద మయ మైనది. ధన-ధాన్య-ఆయురారోగ్యముల నిచ్చునది. దీనిని నీకు సమర్పించుచున్నాను. ఈ శ్రేష్ట మైన దారము ప్రద్యుమ్న-సంకర్షణమయ మైనది. విద్యా-దంతతి-సౌభాగ్యముల నిచ్చును. దీనిని మీకు సమర్పించుచున్నాను. వాసుదేవమయ మగు ఈ సూత్రము ధర్మార్థకామమోక్షముల నిచ్చును. సంసారసాగరమును దాటుటకు ఇది ఉత్తమసాధనము. దీనిని మీ పాదములపై సమర్పించు చున్నాను. విశ్వరూపమయ మగు ఈ సూత్రము సర్వకామములను సఫలము చేయును. సమ స్తపాపములను నశింపచేయును. కడచిన తరములవారిని, రాబోవు తరములవారిని కూడ ఉద్ధరించును. దీనిని మీకు సమర్పించుచున్నాను. కనిష్ఠము, మధ్యమము, ఉత్తమము, పరమోత్తమము అని నాలుగు విధము లగు పవిత్రకములను, మంత్రోచ్చారణపూర్వకముగ క్రమానుసారముగ మునులు సమర్పించిరి”.
ఆగ్నిమహాపురాణమునందు సర్వదేవతాపవిత్రారోపణ మను ముప్పదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 37 of the Agni Purāṇa is as follows:
This chapter provides a theological and practical account of mokṣadharma — the path of liberation from the cycle of birth and death. The Purāṇa presents three broad paths: jñāna (knowledge that the individual self is identical with Brahman), karma (selfless action performed as an offering to Bhagavān without attachment to results), and bhakti (unwavering devotion to Bhagavān). The chapter affirms that all three are ultimately forms of the same love for Bhagavān, leading to the same goal. The qualities of a mukta (liberated being) — equanimity, compassion, freedom from the pairs of opposites — are described. The direct path of nididhyāsana (sustained meditation on the Ātman) as taught by the Upaniṣad-s is referenced, and the teaching that liberation is not a future attainment but the recognition of one's ever-present nature is affirmed.