అగ్ని రువాచః
నీతిస్తే పుష్కరోక్తాతు రామోక్తాలక్ష్మణాయచ ।
జయాయ తాం ప్రవక్ష్యామి శృణుధర్మాది వర్దినీమ్.
రామ ఉవాచః న్యాయేనార్జన మర్థస్య వర్ధనం రక్షణం చరేత్ ।
సత్పాత్ర ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధమ్.
నయస్య వినయే మూలం వినయః శాస్త్ర నిశ్చయాత్ ।
వినయో హీన్ద్రియజయస్తైర్యుక్తః పాలయేన్మహీమ్.
శాస్త్రం ప్రజ్ఞాధృతిర్దాక్ష్యం ప్రాగల్భ్యం ధారయిష్ణుతా । ఉత్సాహోవాగ్మితౌదార్యమాపత్కాలసహిమ్ణతా.
ప్రభావః శుచితా మైత్రీ త్యాగః సత్యం కృతజ్ఞతా ।
కులం శీలం దమశ్చేతి గుణాః సమ్పత్తి హేతవః.
ప్రకీర్ణవిషయారణ్యే ధావన్తం విప్రమాథినమ్ ।
జ్ఞానాంకుశేన కుర్వీత వశ్యమింద్రియదంతినమ్.
కామః క్రోధ స్తథాలోభో హర్షోమానోమద స్తథా ।
షడ్వర్గ ముత్సృజేదేన మస్మిం స్త్యక్తే సుఖీనృపః.
ఆగ్ని దేవుడు పలికెను : వశిష్ఠా! ఇంతవరకు, పుష్కరుడు బోధించిన రాజనీతిని చేప్పితిని. ఇపుడు లక్ష్మణు నకు రాముడు చెప్పిన విజయప్రదమగు రాజనీతిని వినుము. శ్రీ రాముడు చెప్పెను. లక్ష్మణా న్యాయమగా ధనమును ఆర్జించుట, సంపాదించిన దానిని వ్యాపారాదుల ద్వారా వృద్ధి పొందించుకొనుట, దానిని స్వజనుల నుండియు, పరుల నుండియు రక్షించుకోనుట, సత్పాత్రము బందు వినియోగించుట ఇవీ రాజు చేయవలసిన సొలుగు పనులు. నయమునకు మూలము విశ్యము. అది శాస్త్రనిశ్చయముచే కలుగును. వినయమనగా ఇంద్రియజయము. వీవయము కలవాడే శాస్త్రము లను పొందగల్గును. శాస్త్రజ్ఞానము, ఎనిమిది గుణములు గల బుద్ధి, ధృతి, దక్షత, ప్రగల్భత్వము, ధారణశక్తి, ఉత్సాహము, ప్రవచనశక్తి, దృఢత్వము, ప్రభుశక్తి, శుచిత్వము, మైత్రి, త్యాగము, సత్యము, కృతజ్ఞత, కులీనత్వము, శీలము, దమము . ఇవి సంపత్తికి హేతువులగు గుణములు. విషయములనెడు మహారణ్యములో నిర్భయముగ పరుగెత్తు చున్న ఇంద్రియగ జములను జ్ఞానాంకుశముతో వశమునందుంచుకొనవలెను. రాజు, కామ - క్రోధ - లోభ - మోహ -హర్ష - మద - మాత్సర్య మానములను అరిషడ్వర్గమును పూర్తిగా పరిత్యజించినచో సుఖవంతుడగును.
అన్వీక్షికీం త్రయీం వార్తాం దండనీతించ పార్థివః ।
తద్విద్యై స్తత్క్రియోపే తైశ్చింతయేద్వినయాన్వితః.
ఆన్వీక్షి క్యార్థ విజ్ఞానం ధర్మాదర్మౌత్రయీస్థితౌ ।
అర్ధానర్థౌతు వార్తాయాం దండనీత్యాం నయానయౌ.
అహింసా సూనృతావాణీ సత్యం శౌచం దయాక్షమా ।
వర్ణినాం లింగినాం చైవ సామాన్యో ధర్మ ఉచ్యతే.
ప్రజాః సమనుగృహ్ణీయాత్కుర్యా దాచార సంస్థితిమ్।
వాక్సూనృతా దయాదానం హీనోపగతరక్షణమ్.
ఇతివృత్తం సతాం సాధుహితం నత్పురుషవ్రతమ్ ।
ఆధివ్యాధిపరీతాయ అద్యశ్వోవినాశినే.
కోహి రాజాశరీరాయ ధర్మా పేతం సమాచరేత్ ।
రాజు, వినయ గుణ సంపన్నుడై, అన్వీక్షకి, వేదత్రయము, వార్త (కృషి వాణిజ్య పశుపాలనాది కము) దండ నీతి అను నాలుగు విద్యలను గూర్చి విద్వాంసుల వద్దను, వాటి ప్రయోగ ముందు నేర్పు కల వారి వద్దను కూర్చుండి చింత నము చేయవలెను. ఆన్వీక్షకి వలన ఆత్మజ్ఞానము, వస్తుయథార్థ స్వరూపజ్ఞానము కలుగును. ధర్మాధర్మ జ్ఞానము వేదత్రయాధీ కము. అర్థ . అనర్థములు వార్త ప్రయోగాధీ ములు. న్యాయ . అన్యాయములు దండనీతి యొక్క సముచిత ప్రయోగ ముపై ఆధారపడియున్నవి. ఏ ప్రాణులకును కష్టము కలిగించకుండు మధురము మాటలాగు), సత్యము పలుకుట, బైటను అంతరంగమునందును పవిత్రముగ నుండుట, శౌచాదా పాము , దీనుల పైదయ, ఓర్పు - ఇవి అన్ని వర్ణము వారికిని, ఆశ మములవారికి వర్తించు సాధారణ ధర్మములు. రాజు ప్రజ ను అనుగ్రహించుచు, సదా దార తత్పరుడై ఉండవలెను. మధురమైన వాక్కు దీనుల పైదియ, దేశ కాలానుసారము సత్పాతదానము, దీనులను శరణాగతులను రక్షించుట, సత్పురుష సహవాసము . ఇది సత్పురుషుల ఆచారము. ఈ ఆచారము ప్రజాసంగహోపా యము. ఇదిలోక ప్రశంసాపాతముగాన శేషము. భవిష్యత్తులో గూడ ఆభ్యుదయ హేతువుగాన హితకరము. ఈ శరీరము రోగములతోను, మానసిక చింతలతోను నిండియున్నది. నేడో, రేపో, దీని వినాశము నిశ్చితము. ఇట్టి పరిస్థితులలో ఇట్టి శరీరము కొరకై ఏ రాజు అధర్మాచరణము చేయును:
నహిస్వ సుఖమన్విచ్చన్పీడయేత్కృపణం జనమ్.
కృపణః పీడ్యమానోహి మన్యునా హ న్ తిపార్థివమ్ ।
క్రియతేఽభ్యర్హ ణీయాయ స్వజనాయయథాంజలిః.
తతఃసాధుతరః కార్యో దుర్జనాయశివార్థినా ।
ప్రియమేవాభిధాతవ్యం సత్సునిత్యం ద్విషత్సుచ.
దేవాస్తే ప్రియవక్తారః పశవః క్రూర వాదినః ।
శుచిరాస్తిక్యపూతాత్మా పూజయేద్దేవతాఃసదా.
దేవతావద్గురుజన మాత్మవచ్చసుహృజ్జనమ్ ।
ప్రణిపాతేన హిగురుం సతోఽమృషానుచేష్టితైః.
కుర్వీతాభిముఖాన్ భృత్యైర్దేవాన్సుకృత కర్మణా ।
సద్భావేన వారేన్మిత్రం సంభ్రమేణచ బాంధవాన్.
స్త్రీభృత్యాన్ ప్రేమదానాభ్యాం దాక్షిణ్యేనేతరంజనమ్ ।
అనిందాపరకృత్యేషు స్వధర్మపరిపాలనమ్.
కృపణేషు దయాలుత్వం సర్వత్ర మధురాగిరః ।
ప్రాణై రప్యుపకారిత్వం మిత్రాయావ్యభిచారిణే.
గృహాగతే పరిష్వఙ్గః శక్త్యా దానం సహిష్ణుతా।
స్వసమృద్ధిష్వనుత్సేకః పరవృద్ధిష్వమత్సరః.
అపరోపతాపి వచనం మౌనవ్రత చరిష్ణుతా ।
బంధుభిర్బద్ద సంయోగః స్వజనే చతురస్రతా ।
ఉచితాను విధాయిత్వ మితివృత్తం మహాత్మనామ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రామోక్త నీతిర్నామాష్ట త్రింశదధిక ద్విశతతమోఽధ్యాయః॥
రాజు తాను సుఖించుచు దీనులను పీడించ కూడదు. ఏలన పీడితులైన దీనజనులు దుఃఖము వలన కలిగిన క్రోధముచే క్రూరుడైన రాజును నశింపజేయుదురు. కల్యాణమును కోరురాజు పూజ్యుల విషయమున ఏ విడమున అంజలి మటించి ఆదరము చూపునో దుష్టుల విషయమున అంత కం టేకూడ ఆధికమగు ఆదరము చూపవలెను. మంచి స్నేహితుల విషయమునను, దుష్టులగు శత్రువుల విషయమునను గూడ ప్రియవచనములే పలుకవలెను. ప్రియవాది 'దేవత' ; కటువాది ‘పశువు’. రాజు భైటను లోపలను విశుద్దుడై , ఆ స్తికత్వముతో అంతఃకరణమును పవిత్రము చేసికొని సర్వదా దేవతలను పూజించ వలెను. గురువులను దేవతలను వలే పూజించవలెను. మిత్రులను తనతో సమానులని భావించుచు బాగుగ సత్కరించవలెను. తన ఐశ్వర్యమును రక్షించుకొనుటకును, వృద్ధిపొందించుకొనుటకును, రాజు ప్రతిదినము ప్రణామము చేయుచు పెద్దలను అనుకూలులనుగా చేసికొనవలెను. సాంగ వేదాధ్యయనము చేసిన వారు ప్రవర్తించు విధముగ ప్రవర్తించుచు విద్యావృద్దులగు సత్పురుషులను సుముఖులను చేసికొనవలెను. సుకృతకర్మలచేదేవతానుకూల్యము సంపాదించవలెను. సద్బా వముచే మిత్రులను, ఆదరముచే బంధువులను, ప్రేమచే స్త్రీలను, దానముచే భృత్యులను, అనుకూలులుగ చేసికొనవలెను. ఇతరులనుఅనుకూలతా ప్రదర్శనము ద్వారా సుముఖులను చేసికొనవలెను. ఇతరుల పనులు నిందింపకుండుట, తన వర్ణాశ్రమ ధర్మములను నిరంతరము పాలించుట, దీనులయెడదయ, లోకవ్యవహారములన్నింటి యందును, అందరితోడను, మధురముగా మాటలాడుట, ప్రాణములిచ్చియైనను తన ప్రియమిత్రులకు ఉపకారము చేయుటకై సిద్ధముగా ఉండుట ఇంటికి వచ్చిన మిత్రులను, ఇతర సజ్జనులను కౌగలించుకొనుట, ఆవసర మైనచో యథాశక్తిగ వారికి ధన మిచ్చుట, ఇతరుల కటు ప్రవర్తనను, కోరవచనములను సహించుట, తనకు అభివృద్ధి కలిగినపుడు వికారరహితుడుగ నుండుట, ఇతరులకు అభ్యుదయము కలిగినపుడు ఈర్య లేకుండుట, ఇతరులకు బాధ కలిగించు మాట పలుకకుండుట, మౌనముగా నుండుట, బంధువులతో సంబంధమం అవిచ్ఛిన్నముగ ఉంచుకొనుట, సజ్జనులతో ఋజు ప్రవర్తనము, వారి సంమతి ప్రకారము కార్యము చేయుట ఇవి మహాత్ముల ఆచారము.
అగ్ని మహాపురాణమునందు రామోక్తనీతివర్ణన మను రెండు వందల ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 238 of the Agni Purāṇa is as follows:
Pitta doṣa, the fire-principle governing digestion, metabolism, intelligence, and vision, is elaborated. Agni describes forty pitta-janya diseases including rakta-pitta (hemorrhagic disorders), dāha (burning sensations), and kamala (jaundice). The cooling therapies — virecana (purgation), śīta dravyas, and the consumption of ghee — are prescribed as the primary treatment principles. Formulations using tikta (bitter) and kaṣāya (astringent) herbs are detailed.