అగ్ని మహా పురాణము

256 - అథ దాయవిభాగః

అగ్ని రువాచః

విభాగం చేత్పితా కుర్యాదిచ్ఛయా విభ జేత్సుతాన్

జ్యేష్ఠం వాశ్రేష్ఠభాగేన సర్వేవాస్యుః సమాంశినః.

యది దద్యాత్సమానంతాన్కార్యాః పత్న్యః సమాంశికాః

నదత్తం స్త్రీధనం యాసాం భర్త్రావాశ్వతు రేణవా.

శక్తస్యానీహమానస్య కించిద్దత్వా పృథక్ క్రియా

న్యూనాధిక విభక్తానాం ధర్మ్యశ్చపితృణా కృతః.

విభజేయుః సుతాః పిత్రోరూర్ధ్వమృక్థమృణం సమమ్

మాతుర్దుహితరః శేషమృతాత్తాభ్యఋతేఽన్వయః.

పితృ ద్రవ్యావినా శేన యదన్యత్స్వయమర్జయేత్

మైత్ర మౌద్వాహికం చైవ దాయాదానాంనతద్భవేత్.

సామాన్యార్థ సముత్థానే విభాగస్తు సమఃస్మృతః

అనేక పితృకాణాంతు పితృతోభాగకల్పనా.

భూర్యా పితామహోపాత్రా నిబంధో ద్రవ్య మేవవా

తత్రస్యాత్సదృశం స్వామ్యం పితుః పుతస్యచోదయోః.

విభ క్షేషుసుతో జాతః సవర్ణాయాం విభాగబాక్

దృశ్యాద్వా తద్విభాగః స్యాదాయవ్యయవిశోధితాత్.

క్రమాడభ్యాగతం ద్రవ్యం హృతమభ్యుద్ధ రేచ్చయః

దాయాదేభ్యో న తద్దద్యా ద్విద్యయా లబ్ద మేవచ.

పితృభ్యాం యస్య యద్దత్తం తత్తస్యైవ ధనం భవేత్

పితురూర్ధ్వం విభజతాం మాతాప్యంశం సమం హరేత్.

ఆసంస్కృతాస్తు సంస్కార్యా భ్రాతృభిః పూర్వసంస్కృతైః

భగిన్యశ్చ నిజాదంకాద్దత్తాంశం తు తురీయకమ్.

చతుస్త్రిద్వ్యేక భాగాః స్యుర్వర్ణశో బ్రాహ్మణాత్మజాః

క్షత్రజా శ్రీద్వ్యేక భాగా విడ్ జాస్తు ద్వ్యేక భాగినః.

అన్యోఽన్యాపహృతం ద్రవ్యం విథ కేయత్తు దృశ్యతే

తత్పువస్తే సమైరం శై ర్విభజేరన్నితి స్థితి.

అపుత్రేణ వరక్షేత్రే నియోగోత్పాదితః సుతః

ఉభయోరప్యసావృక్థీ పిండదాతా చ ధర్మతః.

అగ్ని దేవుడు పలికెను : తండ్రిదాయవిభాగము చేసినచో, జ్యేష్ఠపుత్రునకు అధిక భాగము ఇవ్వవచ్చును, లేదా ఆందరికి ని సమముగా ఇవ్వవచ్చును. సమముగా ఇచ్చిన పక్షమున థర్తద్వారా కాని, మామగారి ద్వారా కాని స్త్రీధనము అఖించని స్త్రీలకు కూడా సముభాగము లివ్వవలెను. తాను స్వయముగా ధనమును సంపాదింప సమర్థుడు పితృధనము కోరని కుమారునకు కూడ ఏమైనను కొంచెము ఇచ్చి వేరు చేయవలెను. తండ్రి చేసిన దాయవిభాగమునందు న్యూనాధిక ములున్నను అది తండ్రి చేసినదగుటచే ధర్మ సమ్మతమే. తల్లిదండ్రులానంతరము కుమారులు ధనమును ఋణమును కూడ సమముగా పంచుకొనవలెను. తల్లి చేసిన ఋణమేదైనా వున్న చో దానిని తీర్చి కుమార్తెలు మిగిలిన ధనమును సమముగా పంచుకొనవలెను. కుమార్తెలు లేనిచో కుమారులు పంచుకొనవలెను. పితృధనమునకుజయవిభాగః వష్టము కల్గింపక స్వయముగ సంపాదించినది కాని, మితు ద్వారా కాని వివాహము ద్వారా కాని వచ్చినది గాని యైన ధనము పై దాయాదులకు అధికారము లేదు. అన్నదమ్ములందరును కలిసి సంపాదించినధనమును, వారందరును సమముగా పంచుకొనవలెను. చాలమంది తండ్రులగల పౌత్రులు పితామహధనమును తమ తండ్రులను బట్టి పంచుకొనవలెను. పితామహుడు సంపాదించిన భూమి నిబంధము ద్రవ్యము వీటిపై తండ్రికిని పుత్రులకును అధికారము సమానము. విభాగము చేసికొనిన పిమ్మట సవర్ణస్త్రీయందు పుట్టిన కూమారునకు కూడ వాటా ఇవ్వవలెను. లేదా ఆయవ్యయము సరిచూచు కొనిన తరువాత దృశ్యధనమునుండీ ఆతనికి భాగ మీయవలెను. కుల క్రమాగతమైన ధనమును ఎవరైన అపహరించినపుడు దానిని మరల ఎవడు సంపాదించునో ఆ ఆతనికే చెందును. దాయాదులకు ఇవ్వవలసిన పనిలేదు. విద్యద్వార లభించిన ధనమును కూడ దాయాదులకు ఇవ్వపనిలేదు. తల్లితండ్రులు ఒక వస్తువును ఎవరికిత్తురో ఆడి అతి నికి మాత్రమే చెందును. తండ్రి తరువాత కుమారులు పంచుకొనునపుడు తల్లికూడ సమామును పొంది వలెను. వివాహాదులు జరగని సోదరులకు వివాహాదులు జరిగిన సోదరులు ఆసంస్కారములు చేయించవలెను. తోబుట్టువులకు కూడ తమధనములో నాల్గవవంతు ఇచ్చి వివాహము చేయవలెను. బ్రాహ్మణునకు బ్రాహ్మణాది శ్రీలయందు పుట్టిన పుత్రులకు వరుసగా నాలుగు మూడు రెండు ఒకటి భాగములు ఇవ్వవలెను, క్షత్రియులకు పుట్టిన కుమారులకు (తల్లివర్ణమును బట్టి) వరుసగా రెండు మూడు ఒకటి భాగములను, వైశ్యుని పుత్రులకు (వర్ణక్రమమునుబట్టి) వరపగా రెండు ఒకటి భాగములను ఇవ్వవలెను. ధనవిభాగము ఆయిన తరు వాత ఏదైన ద్రవ్యమును అన్నదమ్ములలో ఎవరై న అపహరించినట్లు కనబడినచో ఆద్రవ్యమును వారందరును మరల సమముగా పంచుకొనవలెనని నియమము. పుత్రులు లేని వానిచే పర భార్యయందు ని యోగముచే పుట్టింపబడిన కుమారుడు వారి ఇరువురి రిక్తమునకు (అస్థికి) ఆధికారి-ఇద్దరికిని-పిండదాత.

ఔరసో ధర్మపత్నీ జస్తత్సమః పుత్రికాసుతః

 క్షేత్రజః క్షేత్ర జాతస్తు సగోత్రేణేత రేణవా.

గృహే ప్రచ్ఛన్న ఉత్పన్నో గూడ జస్తుసుతః స్మృతః

కానీనః కన్యకాజాతో మాతామహసుతోమతః.

క్షతాయామక్షతాయాం వాజాతః పౌనర్భవః సుతః

దద్యాన్మాతా పితావా యం సపుత్రో దత్తకోభ వేత్.

క్రీతశ్చ లాభ్యాం విక్రీతః కృత్రిమఃస్యాత్స్వయంకృతః

దత్తాత్మాతు స్వయందత్తో గర్భేవిత్తః సహోడజః.

ఉత్సృష్టో గృహ్యతేయస్తు సోపవిద్ధో భవేత్సతః

పిండదోఽశ హర శ్చైషాం పూర్వాభావేపరఃపరః.

సజాతీయష్వయం ప్రోక్త స్తనయేషమయావిధిః

ధర్మపత్నియందు పుట్టిన పుత్రుడు. ఔరసుడు. పుత్రికాపుత్రుడు ఔరస సమానుడు. తన భార్యయందు సగోత్రుడగువానిద్వారా కాని, సగోత్రునిద్వారాకాని, ఇతరులచేతగాని, పుట్టింపబడినవాడు క్షేత్రజుడు. గృహమునందు రహస్యముగా పుట్టినవాడు గూఢజుడు. అవివాహిత కన్యకు పుట్టినవాడు కానీనుడు. వాడు మాతా మహునికి పుత్రునిగా అంగీకరింపబడును. క్షతయోనిగాని, అక్షతయోనిగాని యైన, విధవకు పుట్టినవాడు పౌనర్భవుడు. తండ్రిచేతకాని, తల్లి చేత కాని, ఇవ్వబడినవాడు దత్తకుడు. తల్లిదండ్రులు అమ్మగా కొనబడినవాడు విక్రీతుడు. స్వయముగా పెంచుకొన బడినవాడు కృత్రిముడు. తననుతానే ఇతరులకు ఇచ్చినకుమారుడు దత్తాత్మ. గర్భవతిని వివాహమాడగా పుట్టినవాడు సహోడజుడు. తల్లిదండ్రులు పరిత్యజించగా గ్రహింపబడినవాడు ఆపవిద్ధుడు. ఈ పదకొండు విధముల కుమారులలో పూర్వ పూర్వ పుత్రులు లేనిచో పర పర పుత్రుడు పిండమును ఇవ్వవలెను. ఆస్తి తీసుకొనవలెను. ఇంతవరకు చెప్పిన విధానము సమానజాతీయుల విషయముననే.

జాతో ఽపిదాస్యాం శూద్రేణ కామతోఽశహరో భవేత్.

మృతేపితరి కుర్యుస్తం భ్రాతర స్త్వర్ధ భాగికమ్

ఆభ్రాతృకో హరేత్సర్వం దుహితౄణాం సుతాదృలే.

పత్నీ దుహితరశ్చైవ పితరౌ భ్రాతర స్తథా

తత్సుతో గోత్రజో బంధుః శిష్యః సబ్రహ్మ చారిణః.

ఏషామభావే పూర్వేషాం ధనభాగుత్తరోత్తరః

స్వర్యాతస్యహ్యపుత్రస్య సర్వవర్ణేష్వయం విధిః.

వానప్రస్థయతిబ్రహ్మచారిణామృక్థభాగినః

క్రమేణాచార్య సచ్చిష్య ధర్మభ్రాత్రేక తీర్థినః.

సంనృష్టినస్తు నంసృష్టీ సోదరస్యతు సోదరః

దద్యాచ్చాప హరేచ్చాంశం జాతస్యచ మృతన్యచ.

ఆన్యోదర్యస్తు సంసృష్టీ నాన్యోదర్యధనం హరేత్

అసంతృష్ట్యపి చాదద్యాత్పో దర్యోనాన్యమాతృజః.

శూద్రునకు దాసియందు పుట్టినవాడుకూడ తండ్రికి ఇష్టమైనచో ఆంశహరుడు అగును (ఆస్తిపంచుకొనువాడగును) తండ్రి మరణించిన పిమ్మట సోదరులు ఆతనికి ఆర్థభాగ ములు ఇవ్వవలెను. ఆతనికి సోదరులు లేనిదో, దౌహిత్రుడుకూడ లేనిచో దాసీపుత్రుడే అంతయు తీసుకొనవచ్చును. పైన చెప్పిన పదకొండు విధముల పుత్రులులేనివాని ధనముపై క్రమముగా భార్యకు, కుమార్తెలకు, తల్లిదండ్రులకు, సోదరులకు, సోదరపుత్రులకు, గోత్రమువారికి, బంధువులకు, శిష్యనకు సహాధ్యాయికి అధికారముండును. ఈ నియమము అన్ని వర్ణములవారికిని చెల్లును. వానప్రస్థ, సన్యాసి, బ్రహ్మ దారుల రుక్తముపై క్రమముగ ఆచార్యునకు ఉత్తమ శిష్యునకు ధర్మభ్రతకు ఏక తీర్థికి అధికారముండును. సోదరుడు జన్మించినవ, సోదరుడు మరణించినను వారిద్దరు కలసివున్నపుడు ఆతనికి భాగమును ఇవ్వవలేను. ఆతని భాగ మను తీసుకొనవలెను. కలసివున్న మరియొక సోదరుడు మరియొక సోదరుని ధనమును గ్రహిం కూడదు. సవతిసోదరుడుకూడ కలిసిలేక పోయినను, మరణించినవాని ధనమును తీసుకొనవచ్చును

పతిత స్తత్సుతః క్లీబః పంగురున్మత్తకోజడః

 ఆంధోఽచికిత్స్య రోగాద్యా భర్త వ్యాస్తు నిరంశకాః.

ఔరసాః క్షేత్రజా స్త్వేషాం నిర్దోషా భాగహారిణః

సుతాశ్చైషాం ప్రభర్తవ్యా యావద్వై భర్తృసాత్కృతాః.

అపుత్రా యోషితశ్చైషాం భర్తవ్యాః సాధువృత్తయః

నిర్వాసాః వ్యభిచారిణ్యః ప్రతికూలా స్తథై వచ.

పితృమాతృ పతిభ్రాతృ దత్తమధ్యగ్న్యుపాగతమ్

ఆధివేదనికం చైవ స్త్రీధనం పరికీర్తితమ్.

బంధుదత్తం తథా శుల్కమన్వా ధేయక మేవచ

ఆప్రజాయామతీతాయాం బాంధవాస్తదవాప్నుయుః.

అప్రజ స్త్రీ ధనం భర్తు ర్బ్రాహ్మ్యాదిషు చతుర్ష్యపి

దుహితౄణాం ప్రసూతా చేచ్ఛే షేషు పితృగామితత్.

దత్త్వా కన్యాం హరన్దండ్యో వ్యయం దద్యాచ్చ సోదయమ్

మృతాయాం దత్తమాదద్యాతురిశోధ్యో భయవ్యయమ్.

 దుర్భిక్షే ధర్మకార్యేచ వ్యాధౌ సంప్రతి రోధకే

గృహితం శ్రీధనం భర్తా నశ్రాయే దాతుమర్హతి.

అధివిన్నయై దద్యాదాధి వేదనికం సమమ్

నద త్తం శ్రీధనం యస్యై ద త్రేత్వార్ధం ప్రకీర్తితమ్.

విభాగ నిహ్నవే జ్ఞాతి బంధు సాక్ష్యభి లేఖితైః

విభావ భావనాజ్ఞేయా గృహ క్షేత్రైశ్చయౌతకైః .

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే దాయవిభాగో నామ షట్పంచాశ దధిక ద్విశతత మోఽధ్యాయః.

నపుంసకుడు పతితుడు ఆతని కుమారుడు, కుంటినాడు, ఉన్మత్తుడు, జడుడు, గ్రుడ్డివాడు చికిత్స చేయ శక్యము గాని రోగములతో బాధపడువాడు. వీరికి అంకము ఉండదు. వీరిని కేవలము పోషించవలెను. ఔరసులు, క్షేత్రజులు అయిన పుత్రులు ఈ దోషములు లేకున్నచో భాగమును తీసుకొనవచ్చును. వీరి కుమార్తెలనుకూడ వివాహమగునంతవరకు పోషించవలెను. వీరి భార్యలు పుత్రులు లేని వారైనచో సచ్చరిత్రలైన పక్షమున వారినికూడ పోషించవలెను. వ్యభిచారిణులు ప్రతికూలలు అయినచో వారిని ఇంటినుండి వెడలగొట్టవలెను. స్త్రీలకు తల్లిదండ్రుల థర్త సోదరులు ఇచ్చినది. ఆగ్ని సమీపమునందు, ఉపాయముగా లభించినది అధివేదన సమయమున లభించినది శ్రీధవమని చెప్పబడును. బందువులిచ్చినది శుల్కముగా లభించినది వివాహానంతరము పారితోషికవగా లభించినదికూడ శ్రీ ధనము. శ్రీ సంతానరహితురాలై మరణించినపుడు ఆ ధనము బంధువులకు చెందును. బ్రాహ్మము మొదలైన నాలుగు వివాహ పద్ధతులచే పెండ్లాడిన భార్య, సంతానము లేకుండ మరణించినచో ఆమెధనము భర్తకు చెందును. ఆమె సంతానవతి యైనచో అధనము పుత్రికలకు చెందును. మిగిలిన వివాహ పద్ధతులచే వివాహము చేసికొన్న స్త్రీధనము ఆమెతండ్రికి చెందును. కన్యనుఇచ్చి మరల ఆమెను హరించిన వానిని దండించవలెను. ఆతనినుండి వ్యయమైన ధనమునంతను ఉదయముతో వడ్డితో) తీసుకొనవలెను. ఆ కన్య మరణించినచో ఇద్దరి వ్యయమును పరిశీలించి భర్త ఇచ్చినదానిని ఆ కన్య తండ్రి నుండి తీసుకొనవలెను. భర్త దుర్భిక్ష సమయమునందును, ధర్మకార్యమునందును వ్యాధియందును దేశో పప్లవమునందును, భార్యనుండి తీసుకొనిన శ్రీ ధశమును తిరిగి ఆమెకు ఇవ్వవలసిన పనిలేదు. శ్రీ ధనములేని భార్యఉండగా, మరొక వివాహము చేసుకొనువాడు ఆ వివాహమునక, ఎంత వ్యయమగునో ఆంతధనమును మొదటి భార్యకు ఇవ్వవలెను. ఆమెకు శ్రీ ధనమున్నచో సగము ఇవ్వవలెను. విభాగ విషయమున సందేహము వచ్చినపుడు జ్ఞాతులు, బంధువులు, సాక్షులు, ఆభిలేఖితములు (వ్రాసిన పత్రములు) గృహములు, క్షేత్రములు కట్నము వీటినిబట్టి విభాగ నిర్ణయము చేయవలెను.

“అగ్ని మహాపురాణమునందు దాయ విభాగ మను రెండువందల యేబది ఆఱవ అధ్యాయము సమాప్తము.”