అగ్ని రువాచః
నాటకం ప్రకరణం డిమ ఈహామృగోఽపివా ।
ఙ్ఞేయః నమవకారశ్చ భవేత్ప్రహ సనంతథా.
వ్యాయోగ బాణవీథ్యంక త్రోటకాన్యథనాటికా ।
సట్టకం శిల్పకః కర్ణ ఏకో దుర్మల్లికాతథ.
ప్రస్థానం బాణికా భాణీ గోష్ఠీ హల్లీశకానిచ ।
కావ్యం శ్రీ గదితం నాట్వరాసకం రాసకంతథా.
ఉల్లాప్యకం ప్రేక్షణం చ సప్తవింశతి రేవతత్ ।
సామాన్యం చ విశేషశ్చ లక్షణస్యద్వయీగతిః.
సామాన్యం సర్వవిషయం శేషః క్వాపి ప్రవర్తతే ।
పూర్వరంగే నివృత్తేద్వౌ దేశకాలా వుభావపి.
రసభావ విభావాను భావా అభినయా న్తథా ।
అంకః స్థితిశ్చ సామాన్యం సర్వత్రైవోప సర్పణాత్.
విశేషోఽవసరే వాచ్యః సామాన్యం పూర్వ ముచ్యతే ।
త్రివర్గసాధనం నాట్యమిత్యాహుః కరణం చయత్.
ఇతి కర్తవ్యతా తస్య పూర్వరంగో యథావిధి ।
నాందీముఖాని ద్వాత్రింశదంగాని పూర్వరంగ కే.
దేవతానాం నమస్కారో గురూణామపి చస్తుతిః ।
గోబ్రాహ్మణ నృపాదీనా మాశీర్వాదాది గీయతే.
సాంద్య న్తే సూత్రధారోఽసౌరూప కేషు నిబధ్యతే ।
గురుపూర్వ క్రమం వంశ ప్రశంసా పౌరుషం కవేః.
సంబంధార్థౌ చ కావ్యస్య పంచై తానేష నిర్థిశేత్ ।
నటీవిదూషకోవాపి పారిపార్శ్విక ఏవవా.
సహితాః సూత్రధా రేణ సంలాపం యత్రకుర్వతే ।
చిత్రైర్వాక్యైః స్వకార్యోత్థేః ప్రస్తుతా క్షేపిభిర్మిథః.
ఆముఖం తత్తు విజ్ఞేయం బుధైః ప్రస్తావనాపిసా ।
ప్రవృతకం కథోద్ఘాతః ప్రయోగాతిశయ స్తథా.
ఆముఖస్య త్రయో భేదా బీజాం శేషూపజాయతే ।
కాలం ప్రవృత్తమాశ్రిత్య సూత్రధృగ్యత్ర వర్ణయేత్.
తదా శ్రయశ్చ పాత్రస్య ప్రవేశ స్తత్ర్పవృత్తకమ్ ।
సూత్రధారస్య వాక్యం వాయత్ర వాక్యార్థమేవవా.
గృహీత్వా ప్రవి శేత్పాత్రం కథోద్ఘాతః స ఉచ్యతే ।
ప్రయోగేషు ప్రయోగన్తు సూత్రధృగ్యత్ర వర్ణయేత్.
తతశ్చ ప్రవి శేత్పాత్రం ప్రయోగాతి శయోహిసః ।
శరీరం నాటకాదీనామితి వృత్తం ప్రచక్షతే.
సిద్దముత్ప్రేక్షితం చేతితస్య భేదావుభౌ స్మృతౌ ।
సిద్దమాగమ దృష్టంచ సృష్టము త్ప్రేక్షి తం క వేః.
బీజం బిందుః పతాకా చ ప్రకరీ కార్యమేవచ ।
అర్థప్రకృతయః పంచ పంచ చేష్టా ఆపిక్రమాత్.
ప్రారంభశ్చ ప్రయత్నశ్చ ప్రాప్తిః సద్భావ ఏవచ ।
నియతాచ ఫలప్రాప్తిః ఫలయోగశ్చ పంచమః.
ముఖం ప్రతిముఖం గర్బో విమర్శశ్చ తథైవచ ।
తథా నిర్వహణం చేతి క్రమత్పంచై వసంధయః.
అల్పమాత్రం సముద్ధిష్టం బహుధా యత్ప్ర సర్పతి ।
ఫలావసానం యచ్చైవ బీజం తదభిధీయతే.
యతబీజ సముత్పత్తిర్నా నార్థ రససంభవా ।
కావ్యే శరీరాను గతం తన్ముఖం పరికీర్తితమ్.
ఇష్టస్యార్థస్య రచనా వృత్తాన్త స్యాను పక్షయః ।
రాగప్రాప్తిః ప్రయోగస్య గుహ్యానాం చైవ గూహనమ్.
ఆశ్చర్య వదభిఖ్యాతం ప్రకాశ్యానాం ప్రకాశనమ్ ।
ఆంగహీనం నరోయద్వన్న శ్రేష్ఠం కావ్యమేవచ.
దేశకాలౌవీనా కించిన్నే తివృత్తం ప్రవర్తతే ।
అత స్తయోరుపాదాన నియమాతృద ముచ్యతే.
దేశేషుభారతం వర్షం కాలేకృత యుగత్రయమ్ ।
నర్తేతాభ్యాం ప్రాణభృతాం సుఖదుఃఖోద యః క్వచిత్.
సర్గేసర్గాది వార్తాచ ప్రసజ్జ న్తీన దుష్యతి.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నాటక నిరూపణం నామాష్ట త్రింశ దధిక త్రిశతత మోఽధ్యాయః.
ఆగ్ని దేవుడు పలికెను నాటకము, ప్రకరణము, డిమము, ఈహా మృగము , సమకార ము, ప్రహసనము, వ్యాయోగము భాణము, వీథి, ఆంకము, త్రోటకము, నాటికా, సట్టకము శిల్పకము, కర్ణ, దుర్మల్లికా, ప్రస్థానము భాళిక, భాణి, గోష్ఠి హల్లీశ కము, కావ్యము, శ్రీ గదితము, నాట్యరాసకము, ఉల్లాప్యము, ప్రేంఖణము యని రూపక ములు ఇరువదియేడు విధములు. లక్షణము సామాన్యము విశేషము యని రెండు విధములు. అన్ని రూపకములకు వర్తించు నది సామాన్య లక్షణము. ఏదో ఒక దానికి వ ర్తించునది విశేష లక్షణము. అన్ని రూపకము లందును పూర్వరంగము జరిగిన పిమ్మట దేశ కాలములు రసభావ విభావ, అనుభావ, అభినయ, అంకస్థితులు సామాన్య లక్షణము. విశేష లక్షణము సమయానుసారముగా చెప్పబడును. ఇపుడు సామాన్య లక్షణము చెప్పబడుచున్నది. ధర్మార్థకామములను నాటకము సాధించవలెను. ముందుగా పూర్వరంగమును యథావిధిగా జరుపవలెను. దీనికి నాంది మొదలగు ఇరువది రెండు అంగములున్నవి. దేవతా నమస్కారము. గురుస్తుతి గోబ్రాహ్మణ రాజాద్యాశీర్వాదము, చేయబడును. నాంది తరువాత “నాంద్యన్తే సూత్రధారః” యని రూపకములలో వ్రాయబడును. కవి యొక్క గురు పరంపర వంశ ప్రశంస, పౌరుషము కావ్యము యొక్క సంబంధ ప్రయోజనములు ఈ ఐదింటిని సూత్రధారుడు చెప్పవలెను. నటిగాని విదూషకుడు గాని పారిపొర్మ్వకుడు గాని, సూత్రధారునితో కలిపి స్వకార్యముతో సంబంధించినవి ప్రస్తుత విషయమును చెప్పనవి యగు చిత్రమైన వాక్యములతో సంభాషణము చేసినచో దానికి ఆముఖమని పేరు. దీనికి ప్రస్తావనయని కూడ పేరు. ప్రవృత్త కము కథోద్ఘాతము ప్రయోగాతిశయము యని ఆమఖము మూడు విధములు. సూత్రధారుడు వచ్చిన కాలమును గూర్చి వర్ణించినపుడు ఆ వర్ణనను ఆశ్రయించి పాత్ర ప్రవేశించినచో దానికి ప్రవృత్తక మని పేరు. యిది బీజాంశము లందే ఆవిర్భవించును. సూత్రధారని వాక్యముగాని వాక్యార్థములుగాని గ్రహించి పాత్ర ప్రవేశించినచో యది కథోద్ఘాతము. సూత్ర ధారుడు ఒక ప్రయోగమున మరియొక ప్రయోగ మును వర్ణించగా ఆ సమయమున పాత్ర ప్రవేశించినచో అది ప్రయోగాతి శయము నాటకాదులకు ఇతి వృత్తము శరీరము. సిద్దము ఉత్ర్పేడితము యని యది రెండు విధములు. ప్రసిద్దమైని సిద్దమ; కవి కల్పించివది ఉత్ర్పేషితము. బీజము, బిందువు, పరాక, ప్రక, కార్యము యని ఐదు అర్థ ప్రకృతులు. చేష్టలు కూడ ప్రారంభము ప్రయత్నము ప్రాప్తి సద్భావము నియత ఫల ప్రాప్తి ఫల యోగము యని ఐదు. ముఖము ప్రతి ముఖము గర్భము విమర్శము నిర్వహణము యని క్రమముగా ఐదు సుధులు. ఆల్పముగా వర్ణి తమై బహుధా విస్తరించి ఫలమును కల్గించునది బీజము. నానార్థ రస సంభవ మగు బీజోత్పత్తి కావ్యము నందు కలిగిన సంధికి ముఖము యని పేరు. ఇష్టమైన ఆర్థము యోక్క రచన, కథాంశము అఖండముగా నుండుట ప్రయోగము నందు ఆనురాగము గోపనీయ విషయముల గోప వము ఆద్భుత విషయముల వర్ణనము ప్రకాశింపదగిన విషయములను ప్రకాశింప చేయుట యివి కావ్యాంగముల ఆరు వల ము, అంగ హీనుడగు మనుష్యునివలె అంగ హీన మగు కావ్యము కూడ శ్రేష్ఠము కాజాలదు, దేశ కాలములు లేకుండగ ఇతి వృత్త మేదియు ప్రవర్తించదు. అందుచే వాటిని నియమ పూర్వకముగా స్వీకరించుటకు పదము యని పేరు. దేశములలో భారత వర్షమున, కాలమున, కృతాది యుగ త్రయమును గ్రహించవలెను. దేశ కాలములు లేకుండ ప్రాణులకు ఎచ్చటను సుఖ దుఃఖోదయము కలుగదు. సృష్ట్యాదివార్త ప్రసంగ వశమున వర్ణింప వలసి వచ్చినను దోషము లేదు.
అగ్ని మహా పురాణమున నాటక నిరూపణ మను మూడు వందల ముప్పది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 339 of the Agni Purāṇa is as follows:
The nine rasas (navarasas) are described as emanations of the ānanda of Paramātman, making aesthetic experience a form of spiritual participation in divine bliss. The four primary rasas — śṛṅgāra (love), hāsya (humor), karuṇa (pathos), and raudra (fury) — are identified as the bases from which the remaining five — vīra (heroism), bhayānaka (terror), bībhatsa (disgust), adbhuta (wonder), and śānta (serenity) — arise. For each rasa, the sthāyibhāva (permanent emotion), the aṣṭa sāttvika-bhāvas (eight involuntary physical responses such as horripilation, tears, and paralysis), and the thirty-three vyabhicārī-bhāvas (transient emotions) are enumerated. The nāyaka-nāyikā classification — the various types of hero and heroine defined by their emotional situation — is also presented.