అగ్ని మహా పురాణము

174 - అథ పునః ప్రాయశ్చిత్తాని

అగ్ని రువాచః -

దేవాశ్రమార్చనాదీనాం ప్రాయశ్చిత్తం తు లోపకః

పూజాలో పే చాష్టశతం జపేద్ద్విగుణపూజనమ్.

పజ్చోపనిషదైర్మనైరుత్వాబ్రాహ్మణభోజనమ్

సూతికా న్యజకోదక్యాస్పృష్ట దేవే శతం జ పేల్.

పజ్చోపనిషదైః పూజాం ద్విగుణం స్నానమేవ చ

విప్రభోజ్యం హోమలో పే హోమస్నానం తథార్చనమ్.

హోమద్రవ్యే మూషికాద్యైరక్షితే కీటసంయుతే

తావన్మాత్రం పరిత్యజ్య ప్రోక్ష్య దేవాది పూజయేత్.

 అజురార్పణమాత్రం తు ఛిన్నం భిన్నం పరిత్యజేత్

 అస్పృశ్యైశ్చైవ సంస్పృష్ట హ్యన్యపాత్రే తదర్పణమ్.

 దేవమానుష విఘ్నఘ్నం పూజాకాలే తథైవ చ

మ శ్రద్రవ్యాదివ్యత్యాసే మూలం జప్త్వా పునర్జ పేత్.

 కుమ్భే నష్ట శతజాపో దేవే తు పతితే కరాత్

 భిన్నే నషే చోపవాసః శకహోమాచ్ఛుభం భవేత్

కృతే పా పేను తాపో వై యస్య పుంసః ప్రజాయతే

 ప్రాయశ్చిత్తం తు తస్యైకం హరిసంస్మరణం పరమ్.

 బాబ్ధాయణం పరాకో వా ప్రాజాపత్యమమౌఘనుత్

సూర్యేశశక్తి శ్రీశాదిమ స్త్రజప్యమమౌఘనుత్.

గాయత్రీ ప్రణవస్తోత్రమన్త జప్యమఘాన కమ్

కాద్యైరా బీజసంయు కైరాద్యైరాద్యైస్త దన కైః.

 సూర్యేశశక్తి శ్రీశాదిమనా కోట్యధికాః పృథక్

ఓం హేమాద్యాశ్చతుర్థనా మోస్తాః సర్వకామదాః.

దేవాలయాదులలో అర్చనాదులు చేయుటలో ఏ వేన లోపములు వచ్చినచో అట్టిలోపములు చేసినవాడు ప్రాయ శ్చిత్తము చేయవలెను. పూజాలోపము కలిగినచో నూట ఎనిమిది ప్యయములు జపము చేసి, రెట్టింపు పూజ చేయవలెమ. పంచోపనిషన్మంత్రములతో హోమము చేసి బ్రాహ్మణ భోజనము చేయించవలెను. సూతిక కలవారుగాని, అంత్యజులు గానీ రజస్వలగాని దేవుని స్పృశించినవో నూరు పర్యాయములు జపము చేసి పంచోపనిషత్మంత్రములతో పూజ రెట్టింపు అభిషేకము చేయవలెను. హోమమునందు లోపమున్న చో బ్రాహ్మణభోజనము. హోమస్నానము, అర్చనము చేయవలెను. హోమద్రవ్యము ఎలుకలు మొదలగు వాటిచే భక్షింపబడినను, కీటకములతో కూడినను ఆ భాగమును త్యజించి, మిగిలిన దానిని జలముతో ప్రోక్షించి దేవాదిపూజ చేయవలెను. అంకురార్పణము భ్నినైనను, ఛగ్నమైళను. దానిని పరిత్యజించ వలెను. ఆ అంకురార్పణ పొత అస్పృశ్యులచే స్పృశింపబడినచో దానిని మరొక పాత్రలో నుంచి సమర్పించవలేను. పూజాకాలమునందు, దేవమానుషవిఘ్నములను తొలగించుటకును, మంత్రద్ర వ్యాది వ్యత్యాసము కలిగినపుడును మూల మంత్రమును జపించి మరల జపము చేయవలెను. దేవాలయమునంపలి కుంభము నష్ట మైనపుడు శతవారజపము దేవతా ప్రతిమ చేతినుండి జారి పడి పోయిన ఉపవాసము చేసి నూరు హోమములు చేసినచో శుభసుగును. పాపము చేసి పశ్చా త్తాపము చెందువానికి హరిస్మరణమే పరమ ప్రాయశ్చిత్తము. చాంద్రాయణము, పరాకము, ప్రాజాపత్యము పాపములను తొల గించును. సూర్య- శివ-శక్తి -విష్ణు మంత్రముల జపము కూడ పాపములను నశింపచేయును. గాయత్రీ-పణవ-స్తోత. మంతముల జపము కూడ పాపవినాశ కము. సూర్య-శివ-శక్తి -విష్ణువుల క కారముతో ప్రారంభమై రా బీజముతో కూడి నవియు రాది-ఆది-రాంతమంతములును ఒక్కొకటి కోట్యధిక ఫలము నిచ్చును. ఓం హ్రీం లతో పారంభమైన నమః అంతమునందుండు చతుర్థ్యంత ముంతములు సర్వకామపదములు.

నృసింహద్వాదశాష్ట్రార్ణమాలామమ్లోద్యమౌఘనుత్

ఆగ్నేయస్య పురాణస్య పఠనం శ్రవణాదికమ్.

 ద్వివిద్యారూపకో విష్ణురగ్ని రూపస్తుగీయతే

పరమాత్మా దేవముఖం సర్వవేదేషు గీయతే.

 ప్రవృతౌ తు నివృతౌ తు ఇజ్యతే భుక్తిముక్తిదః

 అగ్ని రూపస్య విష్ణో రి హవనం ధ్యానమర్చనమ్.

 జప్యం స్తుతిశ్చ ప్రణతిః శరీరస్థాద్యమౌమనుత్

 దశ స్వర్ణాని దానిని ధాన్యద్వాదశ మేవ చ.

తులాపురుషముఖ్యాని మహాదానాని షోడశ

 అన్నదానాని ముఖ్యాని సర్వాణ్యమహరాణి చ.

తిథివారర సంక్రాస్తి యోగమన్వాదికాల కే

వ్రతాదిసూర్యేశశ క్తిశ్రీశాదేరఘఘాతనమ్.

గజ్జోగయా ప్రయాగశ్చకాశ్యయోధ్యాహ్యవని కా

కురు క్షేత్రం పుష్కరం చ నైమిషం పురుషోత్తమః.

 తాలగ్రామప్రభాసాద్యం తీర్థం బొమౌఘఘాతకమ్

అహం బ్రహ్మ పరంజ్యోతిరితిధ్యానమమౌఘనుత్.

బ్రహ్మ చాగ్నేయం బ్రహ్మ విష్ణుర్మ హేశ్వరః

 అవతారాః సర్వపూజా ప్రతిష్టాప్రతిమాదికమ్.

 జ్యోతిః శాస్త్రపురాణాని స్మృతయస్తు తపో వ్రతమ్

అర్థశాస్త్రం చ సర్గాద్యా ఆయుర్వేదో ధనుర్మతి.

శిక్షా ఛశో వ్యాకరణం నిరుక్తం చాభిధానకమ్.

కల్పో న్యాయశ్చ మీమాంసా హ్యన్యత్సర్వం హరిః ప్రభుః.

 ఏకో ద్వయోర్యతో యస్మిన్యః సర్వమితి వేద యః

తం దృష్ట్వాన్యస్య పాపాని వినశ్యని హరిశ్చ స.

విద్యాష్టాదశ రూపశ్చ సూక్ష్మ స్థూలోఒపరో హరిః

జ్యోతిః స దక్షరం బ్రహ్మ పరం విష్ణుశ్చ నిర్మలః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ప్రాయశ్చిత్త నిరూపణం నామ చతుఃషష్ట్యధిక శతతమోధ్యాయః.

నృసింహద్వాడశాక్షరీ- అష్టాక్షరీ మంత్రముల జపము పాపసమూహమును నశింపచేయును. అగ్ని పురాణ మును చది వినను, విన్నను సకలపాపములు తొలగిపోవును. ద్వివిద్యారూపుడైన విష్ణువు అగ్ని రూపుడు గాను పరమాత్మ గాను, దేవతల ముఖముగను సర్వవేదములందును గానము చేయబడును. ప్రవృత్తి మార్గమునందును, నివృత్తి మార్గము నందును పూజించబడినవాడైన విష్ణువు యొక్క హవనము ధ్యానము ఆర్చనము జపము స్తుతి నమస్కారము శరీరము నందలి సకల పాపములను తొలగించును. పదిధములైన స్వర్ణదాకములు ద్వాదశ విధధాన దానములు తులా పురుష దానము మొదలైన షోడశ మహాదానములు అన్నదానములు ఇవి సర్వపాపములను తొలగించును. తిథివారనక్షత. సంకమణయోగ-మన్వంతరారంభాది కాలములందు సూర్య-శివ-శక్తి- శ్రీమహావిష్ణువంతాదులు పాపనాశ కములు. గంగ, గయ, ప్రయాగ కాశీ, అయోధ్య, అవంతి, కురుక్షేతము, పుష్కరము, నైమిషము, పురుషోత్తముడు, సాలగ్రామము ప్రభాసము, ఈ తీర్థములన్నియు సర్వపాప వినాశక ములు. నేనే జ్యోతిరూపమైన పరబ్రహ్మను అను ధ్యానము సకలపాప వినాశకము. బ్రహ్మ పురాణము ఆగ్ని పురాణము, బహ్మ-విష్ణుమహేశ్వరుల, అవతారము: పూజ దేవతా ప్రతిష్ట, ప్రతి మాదు, జ్యోతిక శాస్త్ర పురాణములు, స్మృతులు, తపస్సు, వతములు, అర్థశాస్త్రము, సృష్టితత్వము, ఆయుర్వేదధనుర్వేదములు, శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము అభిధానము కల్పము, న్యాయుము, మీమాంస ఇంకా ఇతర మైన అన్ని విద్యలను హరియే ఒకే విష్ణువు వ్యక్తావ్యక్తరూపములలో నున్నాడు. అతనివలననే ఈ జగము జనించి, ఆతని యందే ఉన్నది అని తెలిసికొనిన దానిని చూడగ నే పాపములన్ని “ము నశించును. శ్రీమహావిష్ణువే అష్టాదశ విద్యారూపుడు, సూక్ష్మ-స్థూల స్వరూపుడు అపరుడు జ్యోతీరూపుడు అక్షర పర బ్రహ్మము, నిర్మలుడు.

అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్త నిరూపణమను నూటడెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.