అగ్ని మహా పురాణము

65 - అథ సభాది స్థాపన కథనమ్

శ్రీ భగవానువాచః

సభాదిస్థాపనం వక్ష్యే తథై తేషాం ప్రవర్తనమ్

 భూమౌ పరీక్షితాయాం చ వాస్తుయాగం సమాచరేత్.

స్వేచ్ఛయా తు సభాం కృత్వా స్వేచ్ఛయా స్థాపయేత్సురాన్

చతుష్పథే చ గ్రామాగౌ న శూన్యే కార యేత్సభామ్.

నిర్మలః కుల ముద్ధృత్య కర్తా స్వర్గో విమోదతే

అనేన విధినా కుర్యాత్స ప్రభౌమం హరేర్గృహమ్.

యథా రాజ్ఞాం తథాన్యేషాం పూర్వాద్యాశ్చ ధ్వజాదయః

కోణభుజాన్వర్జయిత్యా చతుఃశాలం తు వర్తయేత్.

త్రిశాలం వా ద్విశాలం వా ఏక శాలమథాపి వా

వ్యయాధిక న కుర్వీత వ్యయదోషకరం హి తత్.

ఆయాధి కే భ వేప్పాడా తస్మాతుర్యాద్వ్యయం సమమ్

కర శిం సమస్తం తు కుర్యాద్వసుగుణం గురుః.

సప్తార్చిషా హతే భాగే గర్గ విద్యావిచక్షణ:

అష్టదా భాజితే తస్మినచ్చేషం స వ్యయోమతః.

అథవా కరరాశిం తు హన్యాత్సప్తార్చిషా బుధః

వసుభి సంహతే భాగే ధ్వజాది పరికల్పయేత్.

ధ్వజో ధూమ్ర స్తథా సింహః శ్వా వృషస్తు ఖరో గజః

ద్వాంక్షశ్చతి క్ర మేణైవ మాయాష్టక ముదాహృతమ్.

హయగ్రీవుడు చెప్పెను; ఇపుడు సభాదులను స్థాపించు విధానము చెప్పెదను. భూమి పరీక్ష చేసి అచట వాస్తుపరీక్ష చేయవలెను. ఇచ్చానుసారముగ దేవసభా నిర్మాణము చేసి, ఇచ్ఛానుసారముగ దేవతా స్థాపన చేయపలెను. సభా నిర్మాణము నగర చతుష్పథమునందు గాని, గ్రామాదులలో గాని చేయవలెను. జనశూన్య ప్రదేశ ములందు చేయరాదు. దేవసభా నిర్మాణము చేసినవాడు పాపరహితుడై తన వంశము నంతను ఉద్దరించి స్వర్గమునందు ఆనందమనుభవించును. రాజసౌధము నిర్మించిన విధముగ శ్రీహరికి ఏడు అంతస్తుల దేవాలయమును నిర్మింపవలెను. ఇతర దేవతలకు కూడ అట్లే పూర్వాది దిక్కులందు ఏర్పడు ధ్వజాధ్యాయములలో వాటిలో విదిక్కుల ఆయమును విడువలేను. నాలుగు, మూడు, రెండు లేదా ఒకటి కాల లుండు గృహము నిర్మింపవలెను. వ్యయము ఆధికముగ నుండు పదముపై గృహము నిర్మింపరాదు. అచట నిర్మించిన గృహమునందు వ్యయ మధికముగ నుండును. ఆయ మధికముగ నున్న పీడ కలుగదు. అందుచే ఆయవ్యయములు సమభావములో నుండు నట్లు చూచు కొనవలెను. ఇంకి పొడవు వెడల్పులు ఎన్ని హస్తములుండునో వాటిని ఒక దానితో ఒకటి గుణింపగా వచ్చిన సంఖ్యకు ‘కరరాశి' అని పేరు. గర్గాచార్యుని జ్యోతిశ్శాస్త్రమునందు నిపుణు డగు ఆచార్యుడు దానిని ఎనిమిది రెట్లు చేయవలెను. దానిని ఏడు చేతభాగించగా వచ్చిన శేషము ‘వ్యయము'. లేదా కరరాశిని ఏడుచేత గుణించి దానిని మరల ఎనిమిదిచేత భాగించగా వచ్చిన శేషమును బట్టి ధ్వజాద్యాయములను కల్పించవలేను. ధ్వజము, ధూమము, సింహము, శ్వానము, వృషభము, ఖరము, గజము, ధ్వాంక్షము అను ఎనిమిది ఆయములు పూర్వాది దిక్కులందు ఏర్పడును.

త్రిశాలకగృహం శ స్తముదక్పూర్వవివర్జితమ్

యామ్యాం పరగృహో పేతం ద్విశాలం లభ్యతే నదా.

యామ్యే శా లైక శాలం తు ప్రత్యకాలమథాపి వా

ఏక శాలద్వయం శ స్తం శేషా స్వన్యే భయావహాః.

చతుఃకాలం సదా శ స్తం సర్వదోషవివర్జితమ్

ఏక భౌమాది కుర్వీత భవనం సప్తభౌమకమ్.

ద్వార వేధాదిరహితం పూరణేన వివర్జితమ్

దేవగృహం దేవతాయాః ప్రతిష్ణావిధినా సదా.

సంస్థాప్య మనుజానాం చ సముదాయోక్తకర్మణా

ప్రాతః సర్వౌషదీస్నానం కృత్వా శుచిరతస్త్రాతః.

మధురై స్తు ద్విజాన్ భోజ్య పూర్ణకుమ్భాదిశోభితమ్

సతోరణం స్వస్తి వాచ్య ద్వి జన్మా పృష్ఠహస్తకః.

గృహే గృహం ప్రవి శేచ్చ దైవజ్ఞానార్చ్య సంది శేత్

గృ హే పుష్టికరం మస్త్రం పఠేచ్చేమం సమాహితః.

ఓం వన్దే నన్షయ వాసిషే వసుభిః ప్రజయా సహ

జయే భార్గవదాయాదే ప్రజానాం విజయావ హీ.

పూర్ణే జీర సదాయాడే పూర్ణ కామం కురుష్వ మామ్

భదే కాశ్యపదాయాదే కురు భద్రాం మతం మమ.

సర్వబీజౌషధీయుక్తం సర్వరత్నాషధీవృతే

రుచిరే నన్దనే ననే వాసిషే రమ్యతామిహ.

ప్రజాపతిసుతే దేవి చతుర సే మహీయసి

సుభగే సువతే దేవి గృహే కాశ్యపి రమ్యతామ్.

 పూజితే పరమాచార్యైర్గనమాల్యైరలంకృతే

భవభూతిక రే దేవి గృహే భార్గవి రమ్యతామ్.

 అవ్య క్తే వ్యాకృతే పూర్ణ మునేరళ్లిరసః సుతే

ఇష్ట కే త్వం ప్రయచ్ఛేష్టం ప్రతిష్టాం కారయామ్యహమ్.

 దేశ స్వామి పురస్వామి గృహస్వామి పరిగ్ర హే

మనుష్యధనహ స్త్యశ్వపశువృద్ధికరి భవ.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సభాగృహస్థాపనం నామ పఞ్చషష్టితమోధ్యాయః.

            త్రిశాలాగృహమున కున్న అనేక భేదములలో మొదటి మూడును ఉత్తమ మైనవి. వీటిని ఈశాన్యమునందు నిర్మింపరాదు. దక్షిణమున అన్యగృహములతో గూడిన ద్విశాలాగృహము సర్వదా శ్రేష్టము. దక్షిణమున అనేక శాలా గృహము, ఏకకాలాగృహము గూడ ఉత్తమము. నైరృతిదిక్కునందు ఏక శాలాగృహము శ్రేష్టము. ఏక శాలాగృహములో మొదటి రెండు భేదములును (ధ్రువము, ధాన్యము అనునవి) ఉత్తమములు. మిగిలినవి, అనగా పంచమ-నవమ-దశమ-ఏకాదశ-త్రయోదశ-చతుర్దశ భేదములు భయ హేతువులు, చతుఃఖాలాగృహము సర్వదా ఉత్తమము; సర్వదోషరహితము, దేవతలకు ఒక అంతస్తు మొదలు, ఏడు అంతస్తు లుండునట్లు ఏర్పరుపవలెను. దానికి ద్వారవేధాది దోషములుగాని, ప్రాచీన వస్తువులు గాని ఉండకూడదు. దానిని మానవులకు చెప్పిన కర్మలు, ప్రతిష్ణా విధానము, అనుసరించి స్థాపించవలెను. గృహప్రవేశము చేయ నున్న గృహస్థుడు, సోమరితనము లేనివాడై, ఉదయముననే లేచి, సర్వౌషధులు కలిపిన జలముతో స్నానము చేసి, పవిత్రుడై, దైవజ్ఞులైన బ్రాహ్మణులకు నమస్కరించి, వారికి మధుర పదార్థములు భుజింప చేసి, వారిచే స్వస్తివాచనాదికము చేయించి, నడ్డిపై చేతులు పెట్టుకొని, పూర్ణకలశాదులతో సుశోభిత మగు తోరణములు గల గృహము ప్రవేశించవలెను. పిమ్మట ఏకాగ్రచిత్తుడై గోవు ఎదుట చేతులు జోడించి, ఈ పుష్టికారక మంత్రములు పఠింపవలెను. “ఓం వసిష్ఠునిచే పాలింపబడిన ఓ నందా! ధనసంతానాదుల నొసగి నా ఆనందమును వృద్ధిపొందింపుము. ప్రజలకు విజయము నిచ్చు భార్గవనందిని యైన జయా! నన్ను ధనసంపదలతో ఆనందింపచేయుము. అంగిరసుని పుత్రి యైన ఓ పూర్ణా! నా మనోరథములను ఈడేర్పుము. నన్ను పరిపూర్ణకాముని చేయుము. కాశ్యపకుమారి యైన భద్రా! నా బుద్దిని కల్యాణమయము చేయుము. అందరికిని ఆనందము నిచ్చు వసిష్ఠనందిని యైన నందా! నీవు సమస్త బీజములతో, ఓషధులతో కూడి, సకలరత్నాషధి పూర్ణురాలవై ఈ సుందర భవనమునందు ఆనలదపూర్వకముగ నివసింపుము. కశ్యప ప్రజాపతిపుత్రి వేన ఓ భద్రా! నీవు సర్వవిధముల సుందర మైనదానవు, మహత్వము కలదానవు. సౌభాగ్యశాలినివి. ఉత్తమ వ్రతమును పాలించుదానవు. నా ఇంటిలో ఆనందపూర్వకముగ నివసింపుము. దేవీ ! భార్గవీ! జయా! సర్వశ్రేష్టు లైన ఆచార్యులు నిన్ను పూజించిరి. చందనపుష్పమాలాలంకృతురాల వైన నీవు ప్రపంచమునందలి సకలైశ్వర్యములను ఇచ్చుదానవు. నా గృహమునందు ఆనందపూర్వకముగ విహరింపుము. అంగిరసుని పుత్రి పైన పూర్ణా! నీవు ఆవ్యక్త రూపిణివి. ఓ ఇష్టకాదేవీ! నీవు నాకు ఆభీష్టవస్తువుల నిమ్ము నా ఇంటిలో ఉండు మని కోరుచున్నాను. నీవు దేశ ప్రభువును గ్రామనగర ప్రభువులను, గృహప్రభువును అనుగ్రహించుదానవు. నా గృహమునందు జన - ధన - గజ-అశ్వ – గో-మహిష్యాదివృద్ధి కలుగు నట్లు చేయుము.

శ్రీ అగ్ని మహాపురాణమునందు సభాగృహస్థాపన మను అరువదియైదవ అధ్యాయము సమాప్తము.