అగ్ని మహా పురాణము

340 - అథ రీతి నిరూపణమ్

అగ్ని రువాచః

వాగ్విద్యా సంప్రతి జ్ఞానేరీతిః సాపిచతుర్విధా

పాంచాలీ గౌడ దేశీయ వైదర్భీలాటజాతథా.

ఉపచారయుతామృద్దీ పాంచాలీ హ్రస్వవిగ్రహా

అనవస్థిత సందర్భా గౌడీయా దీర్ఘవిగ్రహా.

ఉపచారైర్న బహుభిరుపచారై ర్వివర్జితా

 నాతికోమల సందర్భా వైదర్భీ ముక్తి విగ్రహా.

లాటీయాస్ఫుట సందర్బా నాతివిస్ఫుర విగ్రహా

పరిత్యక్తాపి భూయోభిరుపచారై రుదాహృతా.

క్రియాన్వ విషమవృత్తిర్భారత్యార భటీతథా

కౌశికీ సాత్వతీచేతిసా చతుర్ధా ప్రతిష్ఠితా.

వాక్ప్రధానానరప్రాయా స్త్రీయు క్తా ప్రకృతో క్తితా

భర తేన ప్రణీతత్వాద్భారతీ రీతిరుచ్యతే.

చత్వార్యంగాని భార త్యావీథీ ప్రహసనం తథా

 ప్రస్తావనా నాటకాదేర్వీథ్యంగాశ్చ త్రయోదశ .

ఉద్ఘాతకం తథైవస్యాల్లపితం స్యాద్ద్వితీయకమ్

అసత్ప్రలాపో వాక్చ్రేణీ నాలికా విషణం తథా.

వ్యాహారస్త్రిమతం చైవ ఛలావస్కందితే తథా

గండోఽథ మృదవ శైవ త్రయోదశ మథోచితమ్.

తాపసోదేః ప్రహసనం పరిహాసపరం వచః

మాయేన్ద్ర జాలయుద్ధాది బహులార భటీస్మతా.

 సంక్షిప్తకార పాతౌచ వస్తూత్థాపన మేవచ.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రీతినిరూపణంనామ చత్వారింశదధిక త్రిశతతమోఽధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను. కావ్యశాస్త్ర జ్ఞాన నిమిత్తమై ఉపయోగించు రీతి పాంచాలీ, గౌడదేశీయ, వైదర్భీ, లాటజాయని నాలుగు విధములు. ఉపచార యుతమైనది హ్రస్వసమాసములు కలిది మృదువుగా వున్నది పాంచాలి. దీర్ఘ సమాసములతో, అనవస్థిత సందర్భము కలది ఆధికోపచార యుక్తరహితమైనది గౌడి. ఉపచార రహితము మిక్కిలి కోమలముగాని కూర్పుకల సమాస వర్జితమగు రీతి వైదర్భి. స్పుటసందర్భము కలది నాతి దీర్ఘ సమాసములు కలదియగు రీతి లాటి. చాలమంది విద్వాంసులు పరిత్యజించినను ఆధికోపచార యుక్తమగు ఈలాటి లభించుచున్నది. క్రియలలో వైషమ్యమును పొందని వాక్యరచనకు వృత్తి యని పేరు. భారతీ, ఆరభటీ, కైశికీ, సాత్వతీ, యవి ఆది నాలుగు విధములు. వాక్ప్రధానమైనది, ఎక్కువ పురుషుల నాశ్రయించినది. స్త్రీల చేతకూడ ప్రాకృతమునందు ఉపయోగింపబడి నది యగు రీతి భరత రచితమగుటచే భారతీయనీ చెప్పబడును. దీనికి వీథి ప్రహసనము. ఆముఖము నాటకాది ప్రరోచన, యని, భారతికి నాలుగు ఆంగ ములు. ఉద్ఘాతుక, లపిత, అసత్ప్రలాప, నాక్చ్రేణీనాలికా, విషణవ్యవహార, త్రిగత, ఛల, అవసంత, గండ, మృదవ ఉచితములు యని వీథికి పదమూడు అంగములు. పరిహాస యుక్తమగు తాపసాది వచనము ప్రహసనము. ఆర భటి యందు మాయ ఇంద్రజాలము యుద్దము మొదలగునవి వుండును. సంక్షిప్తకారము, పాతము, వస్తూత్థాపనము యని ఆరథటి భేదములు.

ఆగ్ని మహాపురాణమున రీతి నిరూపణమను మూడువందల నలుబదియవ అధ్యాయము సమాప్తము.