అగ్ని మహా పురాణము

32 - అథ సంస్కార కథనమ్

 అగ్ని రువాచః-

నిర్వాణాదిషు దీక్షాసు చత్వారింశత్త థాష్ట చ

 సంస్కారాన్కారమేద్దిమాళ్ఛృణు తాన్యైః సురో భవేత్.

గర్భాధానం చ యోన్యాం వై తతః పుంసవనం చరేత్

సీమన్తోన్నయనం చైవ జాతకర్మ చ నామ చ.

అన్నా శనం తతశ్చూడా బ్రహ్మచర్యం వ్రతాని చ

 చత్వారి వైష్ణవి పార్టీ భౌతికీ శాంతికీ తథా.

గోదానం స్నాతకత్వం చ పాకయజ్ఞాశ్చ సప్త తే

అష్టకా పార్వణశాద్ధం శావణ్యాగయణీతిచ.

చైత్రీ చాశ్వయుజీ సప్త హవిర్యజ్ఞాశ్చ త్ఛాృణు

 ఆధానం చాగ్నిహోతం చ దరో వై పౌర్ణమాసక.

 చాతుర్మాస్యం పర్బన్దః సౌతామణిర థాపరః

సోమసంస్థాః సప్త శృణు చాగ్నిష్టోమః కతూత్తమః.

అత్యగ్ని షోమ ఉక్తశ్చ షోడశివాజపేయకః

అతిరాతారామశ్చ సహసౌః సవాఇమే.

హిరణ్యాక్టిరణ్యాక్షో హిరణ్యమిత ఇత్యతః

హిరణ్యప్రాణి క్షేమావో హేమాణో హేమసూతకః.

 హిరణ్యాస్యో హిరణ్యాణో హేమజిహ్వా హిరణ్యవాన్

అశ్వమేధో హి సర్వేతో గుణాశ్చాష్టాథ తాజ్ఛృణు.

దయా చ సర్వభూతేషు క్షానిశ్చైవ తథార్ణవమ్ కౌచం

 చైవ మనాయాసో మజలం చాపరో గుణః.

చాస్పృహా చ మూలేన జుహుయాచ్చతమ్

సౌరశాక్తేయ విష్వైశదీ స్వేతే సమాః స్మృతాః.

సంస్కారైః సంస్కృత శ్చైతైర్భుక్తిం ముక్తిమవాప్నుయాత్

సర్వరోగాదినిర్ముక్రో దేవవద్వర్తతే నరః.

జప్యాద్దోమాత్పూజనాచ్చ ధ్యానాద్దేవస్య చేష్టభాక్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అష్టచత్వారింశత్సంస్కారకథనం నామ ద్వాత్రింశోధ్యాయః.

అగ్ని దేవుడు చెప్పెను : బుద్ధిమంతు డగు పురుషుడు నిర్వాణాడిదీక్షలలో నలబదియెనిమిది సంస్కారములు చేసికొనవలెను. ఆ సంస్కారములను గూర్చి వినము. వీటిచే మనుష్యుడు దేవతాతుల్యు డగును. మొట్టమొదట యోనిలో, గర్భాధానము. పిమ్మట (2) పుంసవన సంస్కారము చేయవలెను: పిమ్మట (3) సీమంతోన్నయనము, ఆ జాతకర్మ (6) నామకరణము (6) అన్నప్రాశనము (7) చూడాకర్మ (8) బ్రహ్మచర్యము (8) వైష్ణవి (10) పార్థి (11) భౌతికి (12) శ్రాతికి అను నాలుగు బ్రహ్మచర్యవ్రతములు, (13) గోదానము (14) సమావర్తనము (15) అష్టక (16) అన్వష్టక (17) పార్వణశ్రాద్ధము (18) శ్రావణి (19) ఆగ్రహాయణి. (20). చైత్రి (21) ఆశ్వయుజ అను ఏడు పాకయజ్ఞములు, (22) ఆధానము (23) అగ్నిహోత్రము (24) దర్శము (25) పౌర్ణమాసము (26) చాతుర్మాస్యము (27) పశుబంధము (28) సౌత్రామణి అను ఏడు హవిర్యజ్ఞములు (29) యజ్ఞములలో శ్రేష్ట మైన దగు. అగ్నిష్టోమము (30) ఆత్యగ్నిష్టోమము (31) ఉర్థ్యము - (32) షోడశి (33)  వాజపేయము (34) అతిరాత్రము (35) . ఆప్తోర్యామము అను ఏడు - సోమసంస్థలు, (36) హిరణ్యాంఘి (37) హిరణ్యాక్షము (38) హిరణ్యమిత్రము (39) హిరణ్యపాణి (40) హేమాక్షము (41) హేమాంగము (42) హేమసూత్రము (43) హిరణ్యాస్యము (44) హిరణ్యాంగము (45) హేమజిహ్వము (46) హిరణ్య వత్తు (47) అన్ని యజ్ఞములకును ఆధిపతి యైన (1) అశ్వమేధము అను సహ సేకయజ్ఞములు, సర్వభూతదయ, క్షమ, ఋజుత్వము శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను ఎనిమిది గుణములు. ఈ సంస్కారములను చేయవలెను. ఇష్టదేవతామూలమంత్రమున నూరు ఆహుతు లివ్వవలెను. సౌర శాక్త - వైష్ణవ - శైవ దీక్షలలో అన్నింటియందును ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతు డగు పురుషుడు భోగములను, మోక్షమును కూడ పొందును. సమస్తరోగములచే విముక్తుడై దేవతాపురుషుడు వలె నుండును. మనుష్యునకు ఇష్టదేవతామంత్ర జపహోమ-పూజా-ధ్యానములచే ఆభీష్టప్రాప్తి కలుగును.

ఆగ్నేయమహాపురాణమునందలి సంస్కార వర్ణన మను ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.