అగ్ని మహా పురాణము

137 - అథ మహామారీవిద్యా

ఈశ్వర ఉవాచః-

మహామారీం ప్రవక్ష్యామి విద్యాం శత్రువిమర్దినీమ్.

ఓం హ్రీం మహామారి, రక్తాక్షి, కృష్ణవర్జీ, యమస్యాజ్ఞాకారిణి, సర్వభూతసంహార కారిణి, ఆముకం హనహన్ ఓం దహ దహ ఓం పచ పచ, భిన్ల ఖిన్ద, ఓం మారయ మారయ, ఓం ఉత్సాదయ ఉత్సాదయ, ఓం సర్వవశంకరి, సర్వకామి కే హూం ఫట్ స్వాహేతి. ఓం మారి హృదయాయ నమః, ఓం మహామారి శిర సే స్వాహా, ఓం కాలరాత్రి శిఖాయై నౌషట్. ఓం కృష్ణవర్లే ఖః కవచాయ

హూం. ఓం తారకాకి విద్యుజిహ్వే సర్వసత్త్వభయజ్కరి రక్ష రక్ష సర్వకార్యేషు హ్రాం త్రినేత్రాయ వషట్. ఓం మహామారి సర్వభూతదమని మహాకాలి అస్త్రాయ హుం ఫట్.

ఏష న్యాసో మహాదేవి కర్తవ్యః సాధ కేన తు

 శవాదివస్త్రమాదాయ చతురస్రం శ్రీహస్తకమ్

కృష్ణవర్ణాం త్రివక్షాం చ చతుర్బాహుం సమాలిఖేల్.

పటే విచిత్రవర్ణాశ్చ ధనుః శూలం చ కర్తృకామ్ 1

ఖట్వాజం ధారయ స్త్రీం చ కృష్ణాభం పూర్వమాననమ్.

8 తస్య దృష్టినిపాతేన భక్షయేదగ్రతో నరమ్

ద్వితీయం యామ్యభాగే తు రక్తజిహ్వం భయానకమ్.

లేలిపోనం కరాలం చ దంష్టోత్కటభయానకమ్

తస్య దృష్టినిపాతేన భక్షమాణం హయాదికమ్.

తృతీయం చ ముఖం దేవ్యాః శ్వేతవర్ణం గజాదినుతే

గన పుష్పాది మధ్వాజ్యైః పశ్చిమాభిముఖం యజేత్ .

మనస్మృతేర కిరోగశిరోరోగా నశ్యతి

వశ్యాః స్యుర్యక్షరజాంసి నాశమాయా ని శత్రవః.

సమిధో నిమ్బవృక్షస్య హ్యజార కవిమి శ్రితాః !

మారయేత్రోధసంయుక్తో హోమాదేవ న సంశయః.

పర సైన్యముఖో భూత్వా సప్తాహం జుహుయాద్యది

వ్యాధిభిర్గృహ్యతే సైన్యభణో భవతి వైరిణః .

సమిధోష్ణసహస్రం తు యస్య నామ్నా తు హోమయేత్

అచిరాగ్ర్మియతే సోపి బ్రహ్మణా యది రక్షితః.

ఉన్మ తసమిధో రక్తవిషయుక్త సహస్రకమ్

దినత్రయం ససైన్యశ్చ నాశ యాయాతి వై రిపు.

రాజికాలవ జైర్ఘమాద్భజ్జిఒరేః స్యాద్దీనత్రయాత్

ఖరరక్తసమాయుక్తహోమాదుచ్చాటయే దీపుమ్.

కాకర కసమాయోగాట్టోమాదుచ్చాటనం హరేః

వధాయ కురుతే సర్వం యత్కిక్చాన్మన సేప్సితమ్.

అథ సంగ్రామ సమయే గజారూఢస్తు సాధకః

కుమారీద్వయసంయుక్తో మనసన్నద్ధవిగ్రహః.

దూరశంఖాధివాద్యాని విద్యయా హ్యభివశ్రయేత్

మహామాయాపటం గృహ్య ఉచ్చేత్తవ్యం రణాజిరే.

పర సైన్యముఖో భూత్వా దర్శయేత్రం మహాపటమ్

కుమారీ రోజయేత్తత్ర పశ్చాత్పిణీం చ మయేత్ .

సాధకశ్చిన్తయేలైన్యం పాషాణమివ నిశ్చలమ్

నిరుత్సాహం విభగ్నం చ ముహ్యమానం చ భావయేత్.

ఏష సమ్భో మయా ప్రోకో న దేయో యస్య కస్యచిత్

త్రైలోక్యవిజయా మాయా దుర్గి వం భైరవీ తథా.

కుబ్జకా భైరవీ రుద్రో నారసింహ పటాదినా

ఇత్యాదిమహాపురాణే యుద్ధజయార్ణవే మహామారీవిద్యా నామ సప్తత్రింశ దధిక శతత మోధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను : దేవీ; ఇపుడు నేను శత్రుమర్దని యగు మహామారీవిద్యను గూర్చి చెప్పెదను. “ఓం హ్రీం మహామారి...హూం ఫట్ స్వాహా” అనునది మూలో కమంత్రము) మహామారీమంత్రము. (మూలోక్తము లైన) “ఓం మహామారి హృదయాయనమః...అస్త్రాయహుంఫట్” అనునవి అంగన్యాసాదులు. సాధకుడు ఈ అంగన్యాసమును తప్పక చేయవలెను. శవముపై కప్పిన వస్త్రము తీసికొని వచ్చి చతురశ్రముగా ఖండించవలెను. దాని పొడవు వెడల్పులు మూడేసి హస్తము లుండవలెను. ఆ వస్త్రముపై అనేక విధములైన రంగులతో నల్లని దేవీఆకారము చిత్రించవలెను. మూడు ముఖములు, నాలుగు భుజములు ఉండవలెను. హస్తములలో ధనస్సు, శూలము, కర్తరి, మంచము కోడు ధరించియుండును. ఆ దేవి ప్రథమముఖము పూర్వాడిశాభిముఖమై తన కాంతిచే ప్రకాశింపచేయుచు, దృష్టి పడగనే ఎదుట నున్న మనుష్యుని తినివేయునట్లు ఉండవలెను. రెండవ ముఖము దక్షిణభాగమునం దుండవలెను. ఆమె నాలుక ఎట్టిగా, చూచుటకు భయం కరముగా నుండవలెను. వికృతమైన ఆమె ముఖము కోరలతో భయంకరముగా నుండవలెను. నాలుకతో చెక్కిళ్ళు నాకు చుండవలెను. దృష్టి పడగానే ఎదుట నున్న గుఱ్ఱములు మొదలగు వాటిని తినివేయు నట్లు ఉండవలెను. దేవి మూడవ ముఖము పశ్చిమాభిముఖమై తెల్లగా ఉండవలెను. దృష్టి పడగనే ఏనుగలు మొదలైనవాటిని తినివేయు నట్లు ఉండవలెను. గంధపుష్పాదులతోను, తేనె నెయ్యి మొద లగు నైవేద్యములతోను దానిని పూజించవలేను, పూర్వో క్ర మంత్రమును స్మరించి నంతమాత్రముననే నేత్రశిరోరోగాదులు నశించును. యక్షరాక్షసులు కూడ వశ మగుదురు. శత్రువులు నశింతురు. మను ష్యుడు క్రోధముతో వేపచెట్టు పుల్లలు హోమము చేసినచో తన శత్రువులను చంపగలడు; ఇందు సందేహము లేదు. శత్రు సేవాభిముఖుడై ఒక సప్తాహము ఈ సమిధలతో హోమము చేసినచో శత్రుసైన్యము నానావిధరోగ పీడితమై నశించును. ఎవని పేరు పెట్టి వెయ్యి సమిధల హోమము చేయబడునో వాడు బ్రహ్మ రక్షించినను మరణించక తప్పదు. వెయ్యి దత్తూర సమిధలను, ర క్తము, విషము కలిపి మూడు దినములు హోమము చేసినచో శత్రువు సైన్యనమేతముగ నశించును. ఆవాలు ఉప్పు హోమము చేయగా శత్రు సైన్యమునందు కలవరము పెట్టి శత్రువు పారిపోవును. దానిని గాడిదరక్తముతో కలిపి హోమము చేసినచో శత్రువును పారద్రోలును. పారిపోవలే నని ఆతని మనస్సునందు తీవ్రముగ కోరిక పుట్టును. కాకి రక్తము కలిపి హోమము చేసినచో శత్రువును పెకలించివేయవచ్చును. సాధకుడు ఆతనిని చంపుటకు సమర్థు డగును. సాధకుని మనస్సులో కలుగు కోరిక లన్నియు సఫల మగును. సాధకుడు యుద్ధసమయమున ఇరువురుకన్యలతో గజము నెక్కి, పూర్వోక్త మంత్రముచే ఆభిమంత్రించి, మహామాయాప్రతిమ ఉన్న వస్త్రమును, యుద్ధరంగమునందు, ఎత్తునుండి ఎగుర వేసి, శత్రు సేనాభిముఖుడై ఆ పటమును వారికి చూపవలెను. పిదప ఆ కన్యలకు భోజనము పెట్టవలెను. పిదప మరల పిండిని త్రిప్పుచు శత్రుసైన్యము శిల వలె నిశ్చల మైపోయి నట్లు భావన చేయవలెను. శత్రుసైన్యమున యుద్ధము చేయు ఉత్సాహము పోయి నట్లును, భయముతో పారిపోవుటకు సిద్ధముగా నున్నట్లును కూడ భావన చేయవలెను. ఇట్లు చేయుట చే శత్రు సేనా స్తంభనము కలుగును. నేను చెప్పిన ఈ స్తంభనప్రయోగమును ప్రతివానికిని ఉపదేశించరాదు. ఈమె మూడు లోకముల పైనను విజయము నిచ్చు 'మాయ', ఈమె ఆకారముచే చిత్రిత మైన పటము “మాయాపటము” దుర్గా-భైరవీ-కుబ్జకా-రుద్రదేవ-నృసింహుల మూర్తులను గూడ ఈ విధముగనే వస్త్రము పై చిత్రించవచ్చును. ఇట్టి పటము లచే గూడ స్తంభనప్రయోగము చేయవచ్చును.

అగ్ని మహాపురాణమునందు మహామారీవిద్యావర్ణన మను నూట ముప్పదియేడవ అధ్యాయము సమాప్తము.