అగ్ని మహా పురాణము

240 - అథ పునః షాడ్గుణ్యమ్

శ్రీ రామ ఉవాచః

మండలం చింతయేన్ముఖ్యం రాజాద్వాదశ రాజకమ్

 ఆరిర్మిత్రమ రేర్మిత్రం మిత్రమిత్ర మతః పరమ్.

 తథారి మిత్ర మిత్రంచ విజిగీషో పురఃన్మృతా

పార్ష్ణిగ్రాహః స్మృతః పశ్చాదాక్రన్ద స్తదన న్తరమ్. 

ఆసారావనయో శ్చైవం విజిగీషోశ్చ మండలమ్

అరేశ్చ విజిగీషోశ్చ మధ్యమో భూమ్యనన్తరః.

  అనుగ్రహే సంహతయోర్ని గ్ర హేవ్య స్తయోః ప్రభుః

మండలాద్బహి రేతేషాముదాసినో బలాధికః.

 అనుగ్రహే సంహతానాం వ్యస్తానాంచ వధే ప్రభుః

శ్రీరాముడు చెప్పెను : రాజు ముఖ్యముగ ద్వాదశమండలములను గూర్చి ఆలోచించుచుండవలెను. విజిగీషువగు (జయింపనిచ్చగ) రాజునకు పురోభాగము నందు 1) అరి 2) మిత్రుడు 3) అరిమిత్రుడు 4) మిత్రమితుడు 5) ఆరిమిత్ర మిత్రుడు అను రాజులు (ఒకరితరువాత ఒకరు) ఉందురు. వెనుక భాగమున !) పార్ష్ణిగ్రాహుడు 2) ఆక్రందుడు, పార్ష్ణిగ్రాహాసారుడు 3) ఆక్రందాసారుడు అను రాజులు (ఒకరి వెనుక ఒకరు) ఉందురు. ఆవిజిగీషవుల రాజ్యసీమలతో కలియు రాజ్యసీమ కలవాడు మధ్యముడు. అరివిజిగీషవులు కలిసినచో మధ్యముడు కోశము, సైన్యాసాహాయ్యము చేసి వీరు రువుని అనుగ్రహింప సమర్థుడగును. కాని వీరిరువురును కలియకపోయినచో మధ్యమరాజు వీరిరువురిని వేరువేరుగాగాని క్రమమన గావి చంప సమర్థుడగును. వీరందరి మండలముల వెలుపలనున్న అధిక బలశాలియు ఆధిక సైన్య సంపన్నుడును అగు రాజు ఉదాసీనుడు. విజిగీషు - అరి - మధ్యములు కలిసినచో ఉదాసీనుడు వీరిపై అనుగ్రహము మాత్రము చూప గలుగును. వీరు కలియకపోయినచో వీరినందరిని పరిమార్చి వేయగలుగును.

సంధించ విగ్రహం యానమాసనాది వదామితే.

బలవద్వి గృహీతేన సంధిం కుర్యాచ్ఛివాయ చ

కపాల ఉపహారశ్చ సన్ తానః సంగతస్తథా.

ఉపన్యాసః ప్రతీకారః సంయోగః పురుషాన్తరః

అదృష్టనర ఆదిష్ట ఆత్మామి ష ఉపగ్రహః.

పరిశ్రయస్తథో చ్ఛిన్నస్తథా చ పర దూషణమ్

స్కంధోపనేయః సంధిశ్చ సంధయః షోడ శేరితాః.

పరస్పరోపకారశ్చ మైత్రః సంబంధకస్తథా

ఉపహరాశ్చ చత్వారః తేమ ముఖ్యాశ్చ సంధయః.

బాలో వృద్ధో దీర్ఘ రోగస్తథా బంధుబహిష్కృతః

భీరుకో భీరుకజనో లుబ్దోలుబ్ద జనస్తథా.

విరక్త ప్రకృతిశ్చైవ విషయేష్వతి శక్తి మాన్

అనేక చిత్తమంత్రశ్చ దేవ బ్రాహ్మణ నిందకః.

దైవోపహతకశ్చైవ దైవనిన్దక ఏవ చ

దుర్భిక్ష వ్యసనోపేతో బలవ్యసన సంకులః.

స్వదేశస్థో బహురిపుర్ముక్తః  కాలేనయశ్చహ

 సత్యధర్మ వ్యపేతశ్చ వింశతిః పురుషా అమీ.

ఏతైః సంధిం నకుర్వీత విగృహ్ణీయాత్తు కేవలమ్

లక్ష్మణా ! నీకిపుడు సంధి - విగ్రహ - యాన - ఆసనాదుల విషయమును చేప్పెదను. బలవంతుడగు రాజుతో యుద్దము వచ్చినపుడు తన పరిస్థితి శోచనీయముగ నున్నచో అపుడు సంధి చేసికొనుటయే మంచిది. కపాల - ఉపహార - సంతాన - సంగత - ఉపన్యాస - ప్రతీకార - సంయోగ - పురుషాంతర - అదృష్టనర - ఆదిష్ట - ఆత్మా మిష - ఉపగ్రహ - పరిశ్రయ - ఉచ్ఛిన్న - పరదూషణ - స్కంధోపగేయములని సంధిలో పదునారు భేదము లున్నవి. ఎవరితో సంధి చేసుకొనుచున్నారో అతడు సంధేయుడు. అభియోక్త అనభియో క్తఅని సుధేయుడు రెండు విధములు. ఆనభియో క్తతో (ఆక్రమణము చేయని వానితో) ఉపన్యాస - ప్రతీకార - సంయోగములను మూడు సంధులు చేసికొనవలెను. మిగిలినవి అభియోక్త (ఆక్రమణకారి)తో చేసికొనవలెను. కొందరి అభిప్రాయము ప్రకారము పరస్పరోపకారము, మైత్రము, సంబంధజము, ఉపహారము అని నాలుగు మాత్రమే సంధి భేదములు, బాలకుడు, వృద్ధుడు, చిరకాలరోగి, బంధుసోదరాది బహిష్కృతుడు, పిరికివాడు, పిరికిపందలైన సైనికులు గలవాడు, దురాశాపరులగు సేవకులు గలవాడు, అమాత్యాడిప్రకృతుల అనురాగము కోల్పోయినవాడు, అత్యంత విషయాసక్తుడు, ఆస్థిరచిత్తుడై అనేకుల ఎదుట మంత్రమును ప్రకటించువాడు, దేవతాబ్రాహ్మణనిందకుడు, దైవహతుడు, దైవమే సంపద్విపత్తులకు కారణమని నమ్మి పురుష ప్రయత్నము  చేయనివాడు, దుర్భిక్షక్లేశములో నున్న వాడు, కారాగారమునందుంచబడిన లేదా శత్రువుచే చుట్టుముట్టబడిన సైన్యముకలవాడు, అయోగ్య ప్రదేశమునందున్న వాడు, చాలమంది శత్రువులు కలవాడు, యుద్ధమునకు తగిన సమయమున తన సేనను నియమించని వాడు, సత్యధర్మభ్రష్టుడు - ఈ ఇరువది రకముల రాజుతో సంధి చేసికొనగూడదు; విగ్రహము మాత్రమే చేయవలెను.

పరస్పరాప కారేణ పుంసాం భవతి విగ్రహః.

ఆత్మనోఽభ్యుదయా కాంక్షీ పీడ్యమానః పరేణవా

దేశకాల బలోపేతః ప్రారభేతేహ విగ్రహమ్.

రాజ్యస్త్రీ స్తాన దేశానాం జ్ఞానస్య చ బలస్య చ

అపహారో మదోమానః పీడావైషయికీ తథా.

జ్ఞానాత్మశక్తి ధర్మాణాం విఘాతో దైవమేవ చ

మిత్రార్థం చాపమానం చ తథా బంధువినాశనమ్.

 భూతానుగ్రహవిచ్ఛేద స్తథా మండల దూషణమ్

ఏకార్థాభినివేశిత్వమితి విగ్రహయోనయః.

 సాపత్న్యం వాస్తుజం స్త్రీజం వాగ్జాతమపరాధజమ్

వైరం పంచవిధం ప్రోక్తం సాధనైః ప్రశంనయేత్.

 కించిత్ఫలం నిష్ఫలంవా సందిగ్దఫలమేవచ

తదాత్వేదోష జననమాయత్యాం చైవ నిష్ఫలమ్.

ఆయత్యాంచ తదాత్వే చ దోషసంజననం తథా

అపరిజ్ఞాతవీర్యేణ పరేణస్తోభితోఽపివా.

పరార్ద స్త్రీ నిమిత్తంచ దీర్ఘ కాలం ద్విజైః  సహ

 అకాలదై వయు క్తేన బలోద్దతసఖేన చ.

 తదాత్వే ఫలసంయుక్తమాయత్యాం పలవర్జితమ్

ఆయత్యాం ఫలశంయుక్తం తదాత్వే నిష్ఫలం తథా.

 ఇతీమం షోడశ విధం నకుర్యాదేవ విగ్రహమ్

తదాత్వాయతి సంశుద్ధం కర్మరాజాసదాచరేత్.

ఒకరికొకరు అపకారము చేసికొనుటచే మనుష్యులలో పరస్పరము కలహమేర్పడును. అభ్యుదయము కోరు రాజు శత్రుపీడితుడైనపుడు దేశకాలముల అనుకూలత్వమును, సైనిక శక్తిని చూచుకోని విగ్రహము ప్రారంభింపవలెను. సప్తాంగ రాజ్యము, స్త్రీలు, జనపదమునందలి స్థానవిశేషము, రాష్ట్రములోని ఒక భాగము, జ్ఞానప్రదులగు ఉపాధ్యాయాదులు, సేన - వీటిలో దేనినైన అపహరించుటచే విగ్రహము ఏర్పడును. ఈ కారణములేగాక, మదము, అహంకారము, జనపదపీడ, జనమును నశింపచేయుట, ధనమునకు విఘాతము కలిగించుట, శక్తులకు విఘాతము, ధర్మవిఘాతము, దైవము, మిత్రకార్యసాధనము, మాననీయుల ఆవమానము, బంధువర్గ వినాశము, ప్రాణులకు తానిచ్చిన ఆభయమును విచ్చేదిఁచుట, మండలదూషణము ఒకే ప్రయోజనమును ఇరువురు ఆపేక్షించుట ఈ ఇరువది కూడ విగ్రహాహేతువులు. కొందరు విగ్రహము, సాపత్నము (సవతి సోదరుల మధ్య ఉండునది), వాస్తుజము (భూసువర్ణాది హేతుకము), స్త్రీ హేతుకము, కటువచన జనిత క్రోధహేతుకము, అపరాధజనిత ప్రతిక్రియా బుద్దిచే ఏర్పడునది అని ఐదు విధములని చెప్పిరి. ఫలితము చాల తక్కువ ఉండునది, నిష్ఫలము, ఫలప్రాప్తి విషయమున సందేహమున్నది, వెంటనే దోషములను కలిగించునది, భవిష్యత్తులో కూడ నిష్ఫలమైనది, వర్తమాన భవిష్యత్తులందు రెండింటి యందును దోషజనకమైనది, ఎంత బలపరాక్రమములున్నవాడో తెలియని శత్రువుతో ఏర్పడినది, ఇతరులచే రెచ్చగొట్టబడినది, ఇతరుల స్వార్థ సిద్ది కొర కై గాని. ఏదైన ఒక సాధారణ స్త్రీని పొందుటకు గాని ఏర్పడినది, సుదీర్ఘ కాలము సాగునట్లు కనబడునది, శ్రేష్ఠులైన ద్విజులతో ఏర్పడినది. సుదీర్ఘ కాలము సాగునట్లు కనబడునది, శ్రేష్ఠులైన ద్విజులలో ఏర్పడినది, దేవతావరములను పొంది ఆకస్మాత్తుగా బలవంతుడైన వానితో ఏర్పడినది, అధిక బలశాలుగు మిత్రులు కలవానితో సంభంచినది, వర్తమానమునందు ఫలమునిచ్చి నను భవిష్యత్తునందు నిష్ఫలమైనది. భవిష్యత్తునందు ఫలప్రదమైనను వర్తమాన మున నిష్ఫలమైనది-- ఈ పదునారు విధములగు విగ్రహములలో ఎన్నడును చిక్కుకొనరాదు. వర్తమానమునందును భవిష్యత్తునందును గూడ పూర్ణఫలము నీయగలుగు విగ్రహమును మాత్రమే రాజు ఆవలంబింపవలెను.

హృష్టం పుష్టం, బలం మత్వా గృహ్ణీయాద్విపరీతకమ్

మిత్రమాక్రంద ఆసారో యదాస్యుర్ధృఢభక్తయః.

 పరస్య విపరీతంచ తదావిగ్రహమాచరేత్

విగృహ్య సంధాయ తథా సంభూయాథ ప్రసఙ్గతః.

ఉపేక్షయాచ నిపుణై ర్యానం పంచవిధంస్మృతమ్

 పరస్పరస్య సామర్థ్యవిఘాతాదాససం స్మృతమ్.

ఆరేశ్చ విజిగీషోశ్చయానవత్పంచధాస్మృతమ్

బలినోర్ధ్విషతోర్మధ్యే వాచాత్మానం సమర్పయన్.

ద్వైదీభావేన తిష్ఠేత కాకాక్షివదలక్షితః

ఉభయోరపి సంపాతే సేవేతబలవత్తరమ్.

యదాద్వావపివేచ్చేతాం సంశ్లేషం జాతసంవిదౌ

తదోపసర్చేత్తచ్చత్రుమధికం వాస్వయం వ్రజేత్.

ఉచ్చిద్యమానో బలినా నిరుపాయ ప్రతిక్రియః

కులోద్దతం సత్యమార్యమాసేవేతబలోత్కటమ్.

 తద్దర్శనోపాస్తికతా నిత్యం తద్భావభావితా

తత్కారితప్రశ్రయితావృత్తం సంశ్రయిణః శ్రుతమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే షాఢ్గుణ్యం నామచత్వారింశదధిక ద్విశతతమోఽధ్యాయః

తన సేన హృష్టపష్టమై ఉత్సాహముతో ఉన్నట్లును, శత్రుసేన ఇందుకు విపరీతముగా నున్నట్లును నమ్మకము ఏర్పడిన పిదప రాజు శత్రువును నిగ్రహించుటకై విగ్రహము నవంబింపవలెను. మిత్ర - ఆక్రంద - ఆక్రందాసారులకు తనపై దృఢభక్తి యుండి శత్రువు పరిస్థితి దీనికి భిన్నముగా నున్నపుడు విగ్రహము ప్రారంభింపవలెను. విగృహ్యగమ నము, సంధాయగమనము, సంభూయగమనము, ప్రాసంగిక గమనము, ఉపేక్షాపూర్వకగమనము అని యానము ఐదు విధములని నీతిజ్ఞులు చెప్పుదురు. శత్రువు, విజిగీషువు కూడ ఒకరినోకరు ఏమియు చేయజాలక పోపుటచే ఆక్రమణము చేయక కూర్చుండుట “ఆసనము”, యానము నందువలె దీనియందు కూడ విగృహ్యాసవము, సంధాయాసనము, సంభూ యాసనము, ప్రసంగాసనము, ఉపేక్షాసనము అని ఐదు భేదములున్నవి. బలవంతులగు ఇద్దరు శత్రువుల వద్దకు రహస్య ముగా “నేను నారాజ్యము కూడ నీకు చెందినవే” ఆని రహస్యముగా వార్త పంపి తాను దుర్గమునందు ఓదాగియుండుట “ద్వైదీభావము”, ఆ శత్రువు లిద్దరును కలిసి ఆక్రమణము చేసినచో వారిలో ఆధిక బలశాలిని శరణు పొందవలెను. వారిరువురును తనతో, ఎట్టిషరతుపైనను గూడ, సంధిచేసికొనుటకు నిరాకరించినచో వారిరువురికిని శత్రువైన మరొక రాజును గాని, అధిక బలశాలియగు రాజును గాని ఆశ్రయించవలెను. బలవంతుడై న శత్రువు ఆక్రమించగా ఆకష్టమునుండి తప్పించుకొను ఉపాయాంతర మేదియులేనపుడు కులీనుడును, సత్యవాది యు, సదాచారవంతుడును, శత్రువు కంటె ఆధిక బలవంతు డును అగు వేరొక రాజును ఆశ్రయించవలెను. ఇట్లు ఆశ్రయము కోరువారు ఆశ్రయదాత దర్శనము కొరకై వానిని ఆరా ధించవలెను. సర్వదా ఆతని అభిప్రాయమునకు అనుకూలముగ ప్రవర్తించవలెను. ఆతని కార్యములు చేయవలెను. సర్వదా ఆతని విషయమున ఆదరము చూపవలెను. ఇది ఆశ్రయించువాని కర్తవ్యము.

ఆగ్ని మహాపురాణము నందు షాఢ్గుణ్యకథనమను రెండువందల నలుబదవ అధ్యాయము సమాప్తము.