ధన్వన్తరి రువాచః
గోవిప్ర పాలనం కార్యం రాజ్ఞా గోశాంతి మావదే ।
గావం పవిత్రా మాంగళ్యా గోషు లోకాః ప్రతిష్ఠితాః.
శకృన్మూత్రం పరం తాసామలక్ష్మీ నాశనం పరమ్ ।
గవాం కండూయనం వారి దానం శృంగస్య మర్దనమ్.
గోమూత్రం గోమయం క్షీరం దధిసర్పిశ్చరోచనా ।
షడంగం పరమం పానే దుఃస్వప్నాద్య నివారణమ్.
రోచనా విషరక్షోఘ్నీ గ్రా సదః స్వర్గగోగవామ్ ।
యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకం నరః.
పరగో గ్రాసదః స్వర్గీ గోహితో బ్రహ్మలోక భాక్ ।
గోదానాత్కీర్తనా ద్రక్షాం కృత్వాచోద్ధరతేకులమ్.
గవాం శ్వాసా త్పవిత్రా భూః స్పర్శనాత్కిల్బి షక్షయః ।
గోమూత్రం గోమయం క్షీరం దధిసర్పి: కుశోదకమ్.
ఏక రాత్రోపవాసశ్చ శ్వపాక మపిశోధ యేత్ !
సర్వాశుభ వినాశాయ పురాచరిత మీశ్వరైః.
ప్రత్యేకంచ త్ర్యహాభ్యస్తం మహాసాన్తపనం స్మృతమ్ ।
సర్వకామప్రదం చై తత్సర్వాశుభ విమర్దనమ్.
కృచ్చ్రాతి కృచ్చ్రం పయసా దివసానేక వింశతిమ్ ।
నిర్మలాః సర్వకామాప్త్యా స్వర్గగాః స్యుర్నరోత్తమాః.
త్ర్యహముష్ణం పిబేన్మూత్రం త్ర్యహముష్ణం ఘృతం పిబేత్ ।
త్ర్యహముష్ణం పయః పిత్వా వాయుభక్షః పరంత్ర్యహమ్.
త ప్తకృచ్చ్రవ్రతం సర్వపాపఘ్నం బ్రహ్మలోకదమ్ ।
శీతైస్తు శీతకృచ్చ్రం స్యాద్భహ్మో క్తం బ్రహ్మలోకదమ్.
ధన్వంతరి చెప్పెను. రాజు గోవులను బ్రాహ్మణులను పాలించవలెను. ఇపుడు గోశాంతిని చెప్పెదను. గోవులు పవిత్రమైనవి మంగళ ప్రదమైనవి. లోకము లన్నియు గోవులలో ప్రతిష్ఠితములై యున్నవి. గోమయము గోమూత్రము, అలక్ష్మీ నాశకములు. వాటి శరీరమును గోకుట, కొమ్ముల మర్దించు, నీళ్ళు త్రాగించుట ఇవి కూడ అలక్ష్మీ నివారకములు. గోమూత్రము గోమయము, క్షీరము, దధి, ఘృతము, గోరోచన, ఇవి ఆరును సేవించుటకు ఉత్తమమైనవి దుస్స్వప్నాదలను తొలగించును. గోరోచన విషమును రాక్షసులను నశింప చేయును. గోవునకు గ్రాసమిచ్చు వాడు స్వర్గమును పొందును. ఎవని యింటిలో గోవులు దుఃఖించు చుండునో, ఆతడు నరకమునకు పోవును. ఇతరుల గోవుకు గ్రాసము నిచ్చువాడు స్వర్గమును పొందును. గోహితము కోరువాడు, బ్రహ్మ లోకమును పొందును. గోదానము, గోమాహాత్మ్య కీర్తనము, గోరక్షణము చేసిన వాడు తన కులమును ఉద్దరించును. గోవుల శ్వాస తగిలి భూమి పవిత్ర మగును. వాటి స్పర్శచే పాపములు నశించును. ఒక దివమున గోమూత్ర గోమయ, క్షీర, దధి, మృత, కుశోదకములను, ఉపవాసము చేసినచో చండాలుడు కూడ పరిశుద్దుడగును. పూర్వము దేవతలు కూడ అశుభము లన్నింటిని తొలగించు కొనుటకు ఈ విధ ముగ చేసిరి. పైన వస్తువులను వేరువేరుగా మూడేసి రోజులు భక్షించినచో దానికి “మహాసాంతపన” వ్రతము యని పేరు. ఇది సర్వ కొమములను సిద్ధిప చేసి పాపములను తొలగించును. పాలు మాత్రము త్రాగి ఇరువది యొక్క దినములున్నచో అని కృచ్చ్రని వ్రతము. దీనినాచరించిన నరోత్తములు పాపరహితులై సర్వ కామములను పొంది స్వర్గమునకు పోవుదురు. మూడు దినములు ఉష్ణ గోమూత్రమును, మూడు దినములు ఉష్ణఘృతమును, మూడు దినములు ఉష్ణ క్షీరమును, పిదప మూడు దినములు వాయువును మాత్రము భక్షించుటకు తప్త కృచ్చ్ర వ్రతమని పేరు. ఇది సమస్త పాపములను తొలగించి బ్రహ్మ లోకమును ఇచ్చును. ఈ వస్తువులను చల్లగా చేసి, భుజించినచో దానికి శీతకృచ్చ్ర మని పేరు. బ్రహ్మ చెప్పిన ఈ వ్రతము బ్రహ్మ లోక ప్రదము.
గోమూత్రేణా చరేత్స్నానం వృత్తిం కుర్యాచ్చగోర సైః ।
గోభిర్ర్వజేచ్చ భుక్తాసు భుంజీతాభచ గోవ్రతీ.
మాసేనై కేన నిష్పాపో గోలోకి స్వర్గగో భవేత్ ।
విద్యాంచ గోమతీం జప్త్వా గోలోకం పరమం వ్రజేత్.
గీతైర్నృత్యై రప్సరోభిర్విమానే తత్రమోదతే ।
గావః సురభయో నిత్యంగావో గుగ్గులగంధికాః.
గావః ప్రతిష్ఠాభూతానాం గావః స్వస్త్యయనం పరమ్ ।
అన్న మేవ పరంగావో దేవానాం హవిరు త్తమమ్.
పావనం సర్వధూతానాం క్షరంతి చవహన్తి చ ।
హవిషా మంత్రపూతేన తర్పయ న్త్యమరాన్దివి.
ఋషీణామగ్నిహోత్రేషు గావోహోమేషు యోజితాః ।
సర్వేషా మేవ భూతానాం గావః శరణము త్తమమ్.
గావః పవిత్రం పరమంగావో మాంగల్యముత్తమమ్ ।
గావః స్వర్గస్వ సోపానం గావోధన్యాః సనాతనాః .
నమోగోభ్యః శ్రీ మతీభ్య: సౌర భేయీభ్య ఏవచ ।
నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యోనమో నమః.
బ్రాహ్మణ శ్చైవ గావశ్చకులమేకం ద్విధాతృతమ్ ।
ఏకత్ర మంత్రా స్తిష్ఠన్తి హవిరేకత్ర తిష్ఠతి.
దేవబ్రాహ్మణ గోసాధు సాధ్వీభిః సకలం జగత్ ।
ధార్యతేవై సదా తస్మాత్సర్వే పూజ్వతమామతాః.
పిబ న్తియత్ర తత్తీర్థం గంగాద్యాగావ ఏవహి ।
గవాం మాహాత్మ్యం ము క్తంహి చికిత్సాంచ తథాశృణు.
ఒక మాసము గోమూత్రముతో స్నానము చేయుచు గోరసము పై జీవించుచు, గోవులను అనుసరించుచు, అవి భుజించిన పిమ్మట భుజించవలయును జట్లు గోవ్రతముచేసిన వాడు పాపరహితుడై గో లోకమును చేరును. గోమతీ విద్యా జపముచేత కూడ గోలోకము లభించును. ఆ లోకము నందు మానవుడు విమానమున ఆప్సర సరితో కలసి. నృత్య గీత ములతో సేవింపబడుచు ఆనందించును. గోవులు సురభి స్వరూపములు గగ్గులు గంధము కలవి అవి సమస్త ప్రాణులకు ఆధార భూతములు. పరమ మంగళ మయములు. గోవులే శ్రేష్ఠమైన యన్నముగను ఉత్తమ హవిస్సు గను దేవతలకు ఉపకరించును. అవి సకల ప్రాణు: ను పవిత్రింప చేయు మూత్ర క్షీరాదికమును గ్రహించి వాటిని స్రవించు చుండును. మంత్ర పూత మగు హవిస్సుతో స్వర్గము నందున్న దేవతలను తృప్తి పరచును, ఋషులు తమ అగ్ని హోత్రము లందు గోవులను హోమము నందు ఉపయోగింతురు. సమస్త భూతములకును గోవులు ఉత్తమ శరణము. గోవు-> చాల పవిత్ర మైనవి, మంగళకరమైనవి. స్వర్గ సోపానములు, ధన్యములు, సనాతనములు సురభి కుమార్తెలగు లక్ష్మీ ప్రదములైన గోవులకు నమస్కారము. బ్రహ్మసుతులకు, నషస్కారము. ఒకే కులము బ్రాహ్మణులు, గోవులు యని రెండు విధము లుగా చేయబడినది. ఒక దాని యందు మంత్రములు, మరియొక దాని యందు హవిస్సు ఆధారపడి యున్నవి. ఈ జగ తంతయు దేవ, . బ్రాహ్మణ, గోసాధు, పతివతల పై నిలిచి యున్నది. . ఆందుచే వారందరును పూజ్యతములు. గోవులు వీరు త్రాగు స్థానము తీర్థము. గంగా దినదులు గోస్వరూపములు. గోమాహాత్మ్యమును చెప్పితిని. ఇపుడు వాటి చికి త్సను వినుము.
శృంగామయేషు ధేనూనాంతై లం దద్యాత్స సైంధవమ్ ।
శృంగవేర బలామాంసకల్క సిద్దం సమాక్షికమ్.
కర్ణశూలేషు సర్వేషు మంజిష్ఠా హింగు సైంధవైః ।
సిద్దం తైలం ప్రదాతవ్యం రసోనేనాథ వాపునః.
బిలమూల మఫామార్గం ధాతకీ చ సపాటలా ।
కుటజం దంతమూలేషు లేపాత్తచ్చూల నాశనమ్.
దంతశూల హరైర్ద్ర వ్యైర్ఘృతం రామవిపాచితమ్ !
ముఖరోగహరం జ్ఞేయం జిహ్వారో గేషు సైంధవమ్.
శృంగ వేరం హరిద్రేద్వే త్రిఫలాచ గల గ్రహే !
హృచ్చూలే బస్తిశూలేచ వాతరోగే క్షయేతథా.
త్రిఫలా ఘృతమిశ్రాచ గవాం పానే ప్రశస్యతే ।
ఆతీసారే హరిద్రేద్వే పాఠాంచైవ ప్రదాపయేత్.
సర్వేషు కోష్టరోగేషు తథాశాఖాగదేషుచ ।
శృంగవేరం చ భార్గీంచ కాసేశ్వాసే ప్రదాపయేత్.
దాతవ్యా భగ్నసంధానే ప్రియంగుర్ల వణాన్వితా ।
తైలం వాతహరం పిత్తే మధుయష్టీ విపాచితమ్.
క ఫేవ్యోషంచ సమధు సపుష్టకరణోఽస్రజే !
తై లాజ్యం హరితాలంచ భగ్నక్షతే శృతందదేత్.
మాసా స్తిలాః సగోధూమాః పశుక్షీరం ఘృతం తథా ।
ఏషాంపిండీ సలవణా వత్సానాం పుష్టిదాత్వియమ్ .
బలప్రదా విషాణాం స్యాద్గ్రహనాశాయ ధూపకః ।
దేవదారు వచామాంసీ గుగ్గులుర్హింగుసర్షపాః.
గ్రహాది గదనాశాయ ఏషధూపోగవాం హితః ।
ఘంటా చైవ గవాంకార్యా ధూ పేనానేన ధూపితాః.
అశ్వగంధాతిలైః శుక్లంతేనగౌః క్షీరిణీ భవేత్ ।
రసాయనంచ పిణ్యాకం మత్తోయో ధార్యతేగృహే.
కొమ్ములకు రోగము వచ్చునపుడు శృంగ వేర బలా మాసి, కల్కముతో సిద్ధము చేయబడిన సైంధవము చేర్చిన తైలమును తేనె కలిపి ఉపయోగించవలయును. కర్ణరోగమునందు మంజిష్ఠా హింగు, సైంధవములతో సిద్ధమగు- తైలం మును ఉపయోగించవలయును లేదా వెల్లుల్లి వేసి కాచిన తై లము ఉపయోగించవలయును. దంత శూలమునందు బిల్వమూల అపామార్గధాతకీ, పాటల. కుటజముల లేపము చేయవలయును. ఇవి దంతశూలమును పోగొట్టును. దంతశూలమును హరించు ద్రవ్యములను ఘృతమునందు ఉడికించి ఇచ్చినచో ముఖరోగమును తొలగించును. జిహ్వారోగములందు సైంధవము ప్రశస్తము. గల గ్రహరోగమున శుంఠి ద్వివిధ హరిద్ర, త్రిఘ, మంచిది. హృద్రోగ వస్తిరోగ, పాతరోగ క్షయరోగములందు, గోవులకు ఘృతమిశ్ర త్రిఫలాను పానము ప్రశస్తము. అతిసారమున ద్వివిధ హరిద్ర పాఠ ఇవ్వవలెను. అన్ని విధముల కోష్టరోగములందును. ఇతరావయవ రోగములందును కాసశ్వాసాది సాధారణరోగము లందును. శుతి బారంగీలను ఇవ్వవలెను. విరిగిన ఎముక అతుకులకు లవణ యుక్తమగు ప్రియంగువును. పూయ వలయును. తైలము వాతరోగముహరించు పిత్త రోగమున తైరిపక్వమగు మధు యష్టిని, కఫరోగమున మధు సహిత యోషమును, రక్త వికారమున దృఢమైన నఖమూల భస్మము హితకరములు. భగ్న క్షతమునందు తైల మృతములందు వేయించిన హరితాళము ఇవ్వవలెను. మాషములు తిలలు, గోధుమలు. పాలు, మృతము, వీటిని లవణము కలిపి పిండముగా చేసి, లేగ దూడలకు ఇచ్చినచో, పుష్టి కలుగును. విషాణి బలప్రవము, గ్రహ భాధనివృత్తికి ధూపమును ప్రయోగించవలయును. గ్రహజనిత రోగ నివృత్తి కి, దేవదారు వచా' మాంసీ, గగ్గులు, హింగు, సర్షపముల ధూపము హితకరము ఈ ధూపమువేసిన ఘంట గోవుల కంఠమునందు కట్టవలయును అశ్వగంధ తిలలతో నవనీత భక్షణము చేయించుటచే ఆవుపాల నిచ్చును. ఇంటిలో మదమత్తమగు వృషభమునకు తెలక పిండి ఉత్తమమైన రసాయనము.
గవాంపురీ షే పంచమ్యాం నిత్యం శాంత్యై శ్రియం యజేత్ ।
వాసుదేవంచ గంధాద్యైరపరా శాంతిరుచ్యతే.
ఆశ్వయుక్ఛుక్ల పక్షస్య పంచదశ్యాం యజేద్దరిమ్ ।
హరింరుద్ర మజం సూర్యం శ్రియమగ్నిం ఘృతేనచ.
దధిసం ప్రాశ్యగాః పూజ్యకార్యం వహ్ని ప్రదక్షిణమ్ ।
వృషాణాం యోజయేద్యుద్ధం గీత వాద్యరవై ర్బహిః.
గవాంతులవణం దేయం బ్రాహ్మణానాంచ దక్షిణాః ।
నైమిత్తికే మాకరాదౌ యజేద్విష్ణం సహశ్రియా.
స్థండిలేఽబ్జే మధ్యగతే దిక్షు కేసర గాన్సురాన్ ।
సుభద్రాజో రవిః పూజ్యో బహురూపో బలిర్బహిః.
ఖం విశ్వరూపా సిద్దిశ్చబుద్ది: శాంతిశ్చ రోహిణీ ।
ది గ్ధేనవో హిపూర్వాద్యాః కేసరైశ్చంద్ర ఈశ్వరః.
ది క్పాకాః పద్మ పత్రేషు కుంభేష్వగ్నౌ చ హోమయేత్ ।
క్షీర వృక్షస్య సమిధః సర్షపాక్షత తండులాన్ .
శతం శతం సువర్ణం చ కాంస్యాదికం ద్విజేద దేత్ ।
గావః పూజ్యా విమోక్తవ్యాః శాంత్యై క్షీరాది సంయుతాః.
అగ్ని రువాచః
శాలిహోత్రః సుశ్రుతాయ హయాయుర్వేద ముక్తవాన్ ।
పాలకాప్యోంఽగ రాజాయ గజాయుర్వేదమ బ్రవీత్.
ఇత్యాది మహా పురాణే ఆగ్నేయే గవాయుర్వేద కథనం నామ ద్వినవత్యధిక శతతమోఽ ధ్యాయః.
శాంతికొదకై పంచమినాడు గోపురీషముపై లక్ష్మిని వాసుదేవుని, గంధాదులతో పూజించవలయును. దీనికి అపరాశాంతియని పేరు. ఆశ్వీయుజ, శుక్ల పూర్ణిమనాడు, శ్రీహరిని పూజించవలయును. హరిరుద్ర బ్రహ్మ సూర్య అగ్ని లక్ష్ములను ఘృతముతో పూజించవలయును. దధితిని గోవులను పూజించి అగ్ని ప్రదక్షిణము చేయవలయును. గృహ బహిర్భాగమువ గీతవాద్య ధ్వనులతో వృషభ యుద్ధమును ఏర్పరచవలయును. గోవులకు లవణమును బ్రాహ్మణు లకు దక్షిణలను ఇవ్వవలెను. మకరసంక్రాంత్యాది పర్వములందు లక్ష్మి సహితుడగు శ్రీ మహా విష్ణువును స్థండిలము పై నిర్మించిన పద్మ మధ్యమున పూజించవలయును. దిక్కులందు కవుల కేసర ముల పై దేవతలను పూజించవలయును. కమల బహిర్భాగమున మంగలమయులగు బ్రహ్మసూర్య, బహురూప, బలిఆ కాళ, విశ్వరూపులను రుద్దిసిద్దిశాంతి, రోహిణ్యాది దిగ్గేసువులను చంద్రశివులను, పులగముతో పూజించవలయును, కలశ సపద్మపత్రములపై దిక్పాలురను పూజించవలయును. అగ్నియందు సర్షప, ఆక్షత, తండుల, క్షీరవృక్ష సమిధలను హోమముచేసి బ్రాహ్మణులకు సూరేసిసువర్ణములను కంచు మొదలగు దానిని దానము చేయవలయము. పిదప క్షీరాదులతో గూపిన గోవులను పూజించి శాంతి నిమిత్తమై వాటిని విడువలయును. అగ్ని దేవుడు పలికెను. శాలిహోత్రుడు సుశ్రుతునకు ఆశ్వ ఆయుర్వేదమును పాలకాప్యుడు అంగరాజునకు గజాయ్వరేదమును ఉపదేశించెను.
అగ్ని మహాపురాణమున గవాయుర్వేద కథనమను రెండవందల తొంబది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 292 of the Agni Mahā Purana is as follows:
Cow medicine and the cow's sacred nature are narrated by Dhanvantari. The six sacred products of the cow — go-mūtra (urine), go-maya (dung), kṣīra (milk), dadhi (curd), sarpi (ghee), and go-rocanā (bezoar) — are declared the most purifying substances. The pañcagavya ritual uses all five non-solid cow products for internal and external purification. The go-vrata lasts one month and prescribes bathing in go-mūtra and subsisting on go-rasa. The Mahāsāntapana vrata (pañcagavya for three days each), the Taptakṛcchra vrata, and the Kṛcchrātikṛcchra vrata (twenty-one days on milk alone) are prescribed. The chapter includes the Gomatī vidyā japa for attaining Goloka and the cow eulogy "Namo gobhyaḥ śrīmatībhyaḥ."