అగ్ని మహా పురాణము

182 - అథ సప్తమీవ్రతాని

అగ్ని రువాచః -

సప్తమీ వ్రతకం వక్ష్యే సర్వేషాం భుక్తిము క్తిదమ్

మాఘమాసే బ్దకే శుక్లే సూర్యం ప్రార్చ్య విశోకభాక్ .

సర్వావా క్రీస్తు సప్తమ్యాం మాసి థాదేఒక్కపూజనాత్

పౌషే మాసి సిల్మేనశ్నన్పొర్చ్యారం పాపనాశనమ్.

కృష్ణపక్షే తు మాఘస్య సర్వావా ప్రీస్తు సప్తమీ

ఫాల్గునే తు సితే నన్దాసప్తమీ చారపూజనాత్.

మార్గశీర్షే సితే ప్రార్చ్య నస్తమీ చాపరాజితా

మార్గశీర్షేసితే చాబ్దం పుత్రీయా సప్తమి శ్రియాః

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సప్తమీవ్రతాని నామ ద్వ్యశీత్యధిక శతతమో ధ్యాయః.

అగ్ని దేవుడు చెప్పెను: అందరికిని భుక్తిముక్తిప్రద మగు సప్తమీ వ్రతమును చెప్పెదను. మాఘశుక్ల సప్తమీతిథియందు కమలమును నిర్మించి దాని పై సూర్యుని పూజించినవాడు శోకరహితు డగును. భాద్రపదశుక్ల సప్తమి యందు సూర్యుని పూజించినచో సకలాభీష్టవస్తువులు లభించును. పౌషశుక్ల సప్తమియందు ఉపవాసము చేసి సూర్యుని ఆరాధించినచో సకలపాపములను నశించును. మాఘకృష్ణసప్తమినాడు ‘సర్వాప్తిసప్తమీ’ వ్రతము చేసినచో అభీస్ట-వస్తువులు లభించును. ఫాల్గునకృష్ణపక్షమునందు నందస ప్తమీవ్రతమును చేయవలెను. మార్గశీర్ష శుక్ల పక్షమున పుత్రీయసప్తమీ వ్రతము ఒక సంవత్సరము పాటు చేయు స్త్రీలకు పుత్రులు కలుగుదురు.

            అగ్ని మహాపురాణమునందు సప్తమీవ్రతవర్ణన మను నూటఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.